|
వినూత్న తరహా ప్రచారానికి భాజపా శ్రీకారంప్రచారంలో ఎప్పుడూ కొత్త పుంతలు తొక్కే భారతీయ జనతాపార్టీ ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారానికి కూడా సరికొత్త మార్గాలను అన్వేషిస్తోంది. అందులో భాగంగా... భారతీయ జనతాపార్టీ యువజన విభాగం "అద్వానీ ఎట్ ద రేట్ ఆఫ్ క్యాంపస్" అనే కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా... భాజపా అధ్యక్షుడు ఎల్.కే అద్వానీ దేశంలోని ఐఐఎంలను, ఇతర ప్రముఖ బిజినెస్ స్కూల్స్‌ను సందర్శించి తమ పార్టీ విధానాలు, ప్రణాళికను వివరించి యువ ఎంబీఏల మద్ధతును కోరతారు. పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తమ పార్టీ గెలిచినట్లయితే చేసే పనులను ఆయన వివరిస్తారు.Source: జాతీయ | 7 Mar 2009 | 1:44 pm అద్వానీకి పెరుగుతున్న ఆదరణప్రపంచవ్యాప్తంగా యువకులు యంగిస్థాన్ అంటూ భారతదేశాన్ని యువతగా చూడాలనుకుంటున్నారు యువకులు. అలాంటి యువకులు బీజేపీ తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా లాల్ కృష్ణ అద్వానీని యువకులు తమ ఇంటర్నెట్ ద్వారాకూడా యువకులు అతనిని ఆరాధించేవారు అధికమైనారని సర్వేలు తెలుపుతున్నాయి. 81 సంవత్సరాల వయసు కలిగిన అద్వానీ గత కొన్ని నెలల క్రితం తన సొంత వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంలో ఇంటర్నెట్ అనేది మానవ సభ్యసమాజాన్ని మార్చే యంత్రంగా ఆయన ఇంటర్నెట్‌ను అభివర్ణించారు.Source: జాతీయ | 7 Mar 2009 | 10:52 am దలైలామాకు ఎవరూ ఆతిథ్యం ఇవ్వద్దు: చైనాటిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ఎవరూ ఆతిథ్యమివ్వొద్దని ప్రపంచ దేశాలను చైనా హెచ్చరించింది. చైనా నియంత్రణ నుంచి టెబెట్‌ను వేరు చేసేందకు ప్రయత్నిస్తున్న దలైలామా అందుకోసం మరో దేశపు భూభాగాన్ని ఉపయోగించుకుంటున్నారని...Source: Yahoo! Telugu: News | 7 Mar 2009 | 10:49 am ఇంటర్‌పోల్‌కు సమాచారం ఇచ్చేందుకు పాక్ సిద్ధంముంబాయి దాడులకు సంబంధించి తాము చేసిన దర్యాప్తు వివరాలను, డీఎన్ఏ ప్రొఫైళ్లను ఇంటర్‌పోల్‌కు ఇచ్చేందుకు పాకిస్థాన్ సమ్మతించింది. ముంబాయి దాడుల్లో అంతర్జాతీయ సంబంధాలు విస్తృతంగా ఉండే అవకాశాలున్నాయనే దిశగా పరిశోధన చేయాలని...Source: Yahoo! Telugu: News | 7 Mar 2009 | 10:48 am రెండు చిత్రాల నిర్మాణానికి నాయుడు సన్నాహాలుప్రముఖ నిర్మాతగా పేరు తెచ్చుకున్న డా.డి. రామానాయుడు తన సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై త్వరలో రెండు చిత్రాలు నిర్మించేందుకు సిద్దమవుతున్నారు. ఇందులో ఒకటి ఇ.వి.వి. డైరెక్షన్‌లోది కాగా మరొకటి జయ దర్శకత్వంలోనిది. ఇ.వి.వి, జయ చెప్పిన...Source: Yahoo! Telugu: Entertainment | 7 Mar 2009 | 10:44 am ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌కు సిద్ధం: రైనాఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని సురైశ్‌రైనా పేర్కొన్నాడు. ప్రస్తుతం మూడోస్థానంలో బ్యాటింగ్‌కు దిగుతున్న తాను కేవలం ఆ స్థానంలోనే కాకుండా మరే స్థానం నుంచైనా బ్యాటింగ్‌కు దిగేందుకు సిద్ధమంటూ తెలిపాడు.Source: Yahoo! Telugu: News | 7 Mar 2009 | 10:35 am మార్కెట్లోకి త్వరలో శామ్‌సంగ్ కొత్త మొబైళ్లుప్రముఖ అంతర్జాతీయ మొబైల్‌ఫోన్ ఉత్పత్తి సంస్థ త్వరలో కొత్త హ్యాండ్‌సెట్‌లను మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. భారత మార్కెట్‌లో కంపెనీ మరిన్ని లాభాలను కైవసం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ కొత్త హ్యాండ్‌సెట్‌లను శామ్‌సంగ్ విడుదల చేయనుంది. జైపూర్‌లో...Source: Yahoo! Telugu: News | 7 Mar 2009 | 10:22 am రాజు కుటుంబాన్ని ఆదుకుంటాం : డీఎస్గాంధీ భవన్ సంఘటనలో మృతి చెందిన ఎస్పీవో సుబ్రహ్మణ్య రాజు కుటుంబాన్ని పార్టీపరంగానూ, ప్రభుత్వపరంగానూ.. అన్ని రకాలుగా ఆదుకుంటామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ హామీనిచ్చారు. శనివారం సుబ్రహ్మణ్య రాజు మృతికి డీఎస్, కేవీపీ శ్రద్ధాంజలి ఘటించిన సందర్భంగా పై విధంగా ప్రకటించారు. ఇదిలా ఉంటే... రాజు కుటుంబానికి ఎమ్మార్పీయస్ ప్రకటించిన ఐదు లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ఆయన కుటుంబం తిరస్కరించింది. తామే మందకృష్ణకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామనీ, తమ తండ్రిని తమకు తెచ్చివ్వమని సుబ్రహ్మణ్య రాజు కుమార్తె రమ్యశ్రీ ప్రశ్నించింది.Source: ఏపీ న్యూస్ | 7 Mar 2009 | 10:14 am సీపీఐ(ఎమ్) కేంద్ర కమిటీ సమావేశాలువచ్చే లోక్ సభ ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు సీపీఐ(ఎమ్) కేంద్ర కమిటీ శనివారం ఢిల్లీలో సమావేశమవుతోంది. భవిష్యత్తులో సీపీఐ అనుసరించబోయే విధివిధానాలు, ప్రజలకు చేయదలచిన మేలు తదితర అంశాలతో ఎన్డీఏ, యూపీఏలను తలదన్నే విధంగా మ్యానిఫెస్టోకు ఈ సమావేశంలో తుది మెరుగులు దిద్దనున్నారు.Source: జాతీయ | 7 Mar 2009 | 10:12 am తెరాస అధినేతతో మందకృష్ణ భేటిఎస్సీలను ఏబీసీడీ కేటగిరీలుగా వర్గీకరించాలంటూ ఉద్యమం చేపట్టిన ఎమ్మార్పీయస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ శనివారం తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె. చంద్రశేఖర రావుతో భేటీ అయ్యారు. కాగా, ఎస్సీ వర్గీకరణపై రాజకీయ నిర్ణయం తీసుకుంటామని కొద్ది రోజులుగా చెబుతోన్న కృష్ణమాదిగ ఈరోజు కేసీఆర్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎమ్మార్పీయస్ రాజకీయ ఎత్తుగడలో భాగంగానే ఆయన కేసీఆర్‌తో సమావేశమైనట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా... తమకు వచ్చే ఎన్నికల్లో మహాకూటమి నుంచి 30 అసెంబ్లీ స్థానాల్లు, నాలుగు లోక్ సభా స్థానాలు కేటాయించాలంటూ ఎమ్మార్పీయస్ బేరసారాలు నడుపుతున్న సంగతి తెలిసిందే. కాగా, మహాకూటమి వైపు అడుగులు వేస్తున్నట్లు కృష్ణ మాదిగ ఇంతకు ముందుగానే సంకేతాలు పంపించారు. అవసరమైతే మహాకూటమి తరపున పోటీ చేస్తామని కూడా ఈ భేటీలో కృష్ణ మాదిగ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మాదిగలంతా కలసికట్టుగా ఉంటామని, కాంగ్రెస్ పార్టీని ఓడించి తీరుతామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 7 Mar 2009 | 10:12 am కూకట్‌పల్లినుంచి అసెంబ్లీ బరిలోకి జేపీలోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ కూకట్‌పల్లి నియోజకవర్గంనుంచి అసెంబ్లీ బరిలోకి దిగనున్నారు. నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో నిర్ణయించిన ఈ విషయాన్ని జేపీ స్వయంగా వెల్లడించారు. జేపీ ప్రకటనతో ఆయన ఎక్కడనుంచి బరిలో...Source: Yahoo! Telugu: News | 7 Mar 2009 | 9:33 am కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఎస్వీ సుబ్బారెడ్డితెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మేల్యే సీనియర్ నేత ఎస్పీ సుబ్బారెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు టీడీపీ పార్టీ తరపున బాధ్యతలు వహించిన సిట్టింగ్ ఎమ్మెల్యే పదవికి సుబ్బారెడ్డి శుక్రవారం సాయంత్రం రాజీనామా చేశారని పార్టీ శ్రేణులు వెల్లడించాయి. గత 2004 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ తరపున కర్నూలు జిల్లా ఎమ్మెల్యేగా సుబ్బారెడ్డి ఎంపికయ్యారు. ఐదుసార్లు కర్నూలు జిల్లా ఎమ్మెల్యేగా సుబ్బారెడ్డి ఎంపిక కావడం విశేషం.Source: ఏపీ న్యూస్ | 7 Mar 2009 | 8:51 am మేమొస్తే వంద రోజుల్లో తెలంగాణ: బీజేపీతాము అధికారంలోకి వస్తే వందరోజుల్లోనే ప్రత్యేక తెలంగాణ ఇస్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ మరోసారి ఉద్ఘాటించారు. తెలంగాణతో పాటు ఎస్సీ వర్గీకణకు చట్టబద్ధత కల్పిస్తామని బండారు స్పష్టం చేశారు. వరంగల్‌లో జరుగుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి శనివారం దత్తాత్రేయ హాజరయ్యారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ.. తెలంగాణకు మర్రి చెన్నారెడ్డి కన్నా కేసీఆరే ఎక్కువ ద్రోహం చేశారని ధ్వజమెత్తారు.Source: ఏపీ న్యూస్ | 7 Mar 2009 | 8:50 am పాకిస్థాన్ ప్రశ్నలకు సమాధానాలు సిద్ధంముంబై మారణహోమానికి సంబంధించి శత్రుదేశం పాకిస్థాన్ అధికారులు సంధించిన 30 రకాల ప్రశ్నలకు ముంబై పోలీసులు తగు రీతిలో సమాధానాలను సిద్ధం చేశారు. ఈ దాడుల్లో ప్రాణాలతో పట్టుబడిన ఏకైక ఉగ్రవాది అజ్మల్ అమీర్ కసబ్‌పై తయారు చేసి, కోర్టుకు సమర్పించిన చార్జిషీటు నకళ్లకాపీని కూడా కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు శనివారం పంపారు.Source: జాతీయ | 7 Mar 2009 | 8:50 am ఎన్‌సిపి గుర్తుపై పోటీ చేయం: చిరంజీవివచ్చే ఎన్నికల్లో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్.సి.పి) గుర్తుపై పోటీ చేయబోమని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి స్పష్టం చేశారు. అయితే, ఎన్నికల గుర్తుపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని తెలిపారు. ఉమ్మడి గుర్తు కోసం చివరి నిమిషం వరకు న్యాయ పోరాటం చేస్తామని ఆయన మరోమారు స్పష్టం చేశారు.Source: ఏపీ న్యూస్ | 7 Mar 2009 | 8:49 am హోం మంత్రి కర్ణాటక పర్యటన మళ్లీ వాయిదాభద్రతా ఏర్పాట్లపై సమీక్షిచేందుకుగాను కర్ణాటక రాష్ట్రంలో జరుపతలపెట్టిన కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం పర్యటన మళ్లీ వాయిదా పడింది. హోం మంత్రి అధ్యక్షతన జరిగే భద్రతా సమీక్షా సమావేశంలో పాల్గొనే సమయం తనకు లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప తెగేసి చెప్పడంతో చిదంబరం తన పర్యటనను వాయిదా వేసుకోక తప్పలేదు. చిదంబరం పర్యటన వాయిదా పడటం గత నాలుగు రోజుల్లో ఇది మూడోసారి కావడం గమనార్హం.Source: జాతీయ | 7 Mar 2009 | 8:11 am ప్రభుత్వం ప్రోత్సహించలేదు: విజయ్ మాల్యాజాతిపిత మహాత్మాగాంధీ వస్తువులను సొంతం చేసుకోవడం కోసం సొంతగానే బిడ్ దాఖలు చేశానని కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యా వెల్లడించారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహం, సూచనలు అందలేదని ఆయన స్పష్టం చేశారు గాంధీజీ వినియోగించిన అమూల్యమైన వస్తువులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వ ప్రోత్సాహంతోనే మాల్యా బిడ్ దాఖలు చేశారన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు.Source: జాతీయ | 7 Mar 2009 | 8:11 am టీడీపీతోనే ప్రజలకు మేలు జరుగుతుంది: బాబుటీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలోని ప్రజలకు మేలు జరుగుతుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. తాము ప్రకటించిన నగదు బదిలీ హామీని చూచి కాంగ్రెస్‌కు దిక్కు తోచడం లేదని అందుకే ఆ పార్టీ తమపై విమర్శలు గుప్పిస్తోందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.Source: ఏపీ న్యూస్ | 7 Mar 2009 | 8:10 am యూపీఏతో మహిళలకు ఒరిగిందేంలేదు: సుష్మాకేంద్రంలోని యూపీఏ ప్రభుత్వంతో మహిళలకు ఒరిగిందేంలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సుష్మా స్వరాజ్ ధ్వజమెత్తారు. అలాగే కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రాల్లోనూ మహిళల పరిస్థతి మెరుగ్గా లేదని ఆమె పేర్కొన్నారు. మహిళలపై వేధింపుల్లో ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానం సంపాదిస్తే నేరాల్లో ఢిల్లీ అగ్రస్థానాన్ని సాధించిందని అ తర్వాత విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ నగరాలు నిలిచాయని ఆమె వివరించారు.Source: ఏపీ న్యూస్ | 7 Mar 2009 | 8:09 am తెలంగాణపై విస్పష్టమైన ప్రకటన మాదే: చిరుప్రత్యేక తెలంగాణ అంశంలో విస్పష్టమైన ప్రకటన చేసింది తమ పార్టీ మాత్రమేనని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి పేర్కొన్నారు. అలాంటిది తెలంగాణపై ప్రజారాజ్యం పార్టీ ప్రకటనల్లో స్పస్టత లేదనడం ఎంతవరకు సమంజసం అంటూ ఆయన ప్రశ్నించారు. తమపై విమర్శలు గుప్పిస్తున్న మహాకూటమికి కనీసం ఉమ్మడి మేనిఫెస్టో కూడా లేదని ఆయన ఎద్దేవా చేశారు.Source: ఏపీ న్యూస్ | 7 Mar 2009 | 8:09 am పార్టీల విధానాలపై ఆంక్షలు పెట్టలేం: ఈసీపార్టీల విధానాలపై ఆంక్షలు పెట్టలేమని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఐవీ సుబ్బారావు తేల్చి చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేయదల్చుకున్నామో చెప్పే హక్కు ప్రతి పార్టీకీ ఉందని, అందుకే మేనిఫెస్టోలను నియంత్రించడం సాధ్యం కాదని ఆయన అన్నారు. అయితే పార్టీలు చేసే ఎలాంటి ప్రకటనైనా ఓటరును ప్రలోభపెట్టడం కిందకే వస్తుందని ఆయన వివరించారు.Source: ఏపీ న్యూస్ | 7 Mar 2009 | 8:09 am ఎన్నికల సమరం: కాంగ్రెస్-ఎస్పీ పొత్తు విచ్ఛిన్నంసార్వత్రిక ఎన్నికల సమరం దగ్గర పడుతున్న కొద్దీ కేంద్రలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల మధ్య పొత్తు బెడిసికొట్టింది. ఫలితంగా ఈ రెండు పార్టీల మధ్య స్నేహంబంధం తెగిపోయినట్టు ఎస్పీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ ప్రకటించారు.Source: జాతీయ | 7 Mar 2009 | 8:07 am దత్ శిక్షపై కేంద్రం వివరణ కోరిన సుప్రీంబాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌కు ముంబై టాడా కోర్టు విధించిన శిక్ష రద్దుపై దేశ అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని కోరుతు సుప్రీం శుక్రవారం ఆదేశించింది. ముంబై వరుస పేలుళ్ళ కేసులో ఆయుధ చట్టం కింద సంజయ్‌దత్‌కు టాడా కోర్టు ఆరేళ్ళ జైలు శిక్ష విధించిన విషయం తెల్సిందే.Source: జాతీయ | 7 Mar 2009 | 8:07 am ఎన్సీపీ గుర్తుతో పోటీచేయబోం: చిరు స్పష్టంరానున్న ఎన్నికల్లో ఎన్సీపీ గుర్తుతో ప్రజారాజ్యం బరిలో దిగుతుందన్న వార్తలను పీఆర్పీ అధినేత చిరంజీవి ఖండించారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఎన్సీపీ గుర్తుతో పోటీ చేయబోమని ఆయన స్పష్టం చేశారు.Source: Yahoo! Telugu: News | 7 Mar 2009 | 7:23 am తెలంగాణా వాదులకు వైఎస్ పరమశత్రువు: కేసీఆర్ప్రత్యేక తెలంగాణా వాదులకు రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పరమశత్రువని తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు ఆరోపించారు. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నపుడు 20 లక్షల ఎకరాలకు నీరు అందేదని, ఇప్పుడేమో నీటి కొరత...Source: Yahoo! Telugu: News | 7 Mar 2009 | 6:51 am కొత్తవారితో 'టు-లెట్' షూటింగ్ ప్రారంభంశ్రీఆంజనేయ ప్రొడక్షన్స్ పతాకంపై ఒజెజా రాజశేఖర్‌రెడ్డి సమర్పణలో ప్రారంభమైన చిత్రం టు-లెట్. ఆధవన్, పవన్‌లు హీరోలుగా సైబా హీరోయిన్‌గా పరిచయమవుతున్న ఈ చిత్రానికి వి. రవికాంత్ దర్శకునిగా పరిచయమవుతున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 7 Mar 2009 | 6:27 am తిరుమలలో ఘనంగా ప్రారంభమైన తెప్పోత్సవాలుపుణ్యక్షేత్రమైన తిరుమలలో శుక్రవారం శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా తొలిరోజున సకల మర్యాదలతో సీత, రామ, లక్ష్మణులు తిరువీధుల్లో ఊరేగారు. మహాప్రదాక్షిణ మార్గం ద్వారా పుష్కరిణి చేరుకుని అక్కడ...Source: Yahoo! Telugu: News | 7 Mar 2009 | 6:23 am మహిళల వరల్డ్ కప్: భారత్ శుభారంభంఆస్ట్రేలియాలో ప్రారంభమైన మహిళల వరల్డ్ కప్ క్రికెట్‌లో జులన్ గోస్వామి నేతృత్వంలోని భారత జట్టు శుభారంభం చేసింది. గ్రూప్-బిలో భాగంగా తమ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడిన భారత జట్టు ఘన విజయం సాధించి టోర్నీలో తొలి...Source: Yahoo! Telugu: News | 7 Mar 2009 | 6:12 am సెహ్వాగ్ అంటే భయపడుతున్న కీవీస్ బౌలర్లుభారత జట్టు ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అంటే న్యూజిలాండ్ బౌలర్లు భయపడుతున్నారు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ కెప్టెన్ డేనియల్ వెటోరీ స్వయంగా అంగీకరించాడు. అతని భీకరమైన బ్యాటింగ్ తమ బౌలర్లను కొంత వరకు కలవరపాటుకు గురి...Source: Yahoo! Telugu: News | 7 Mar 2009 | 5:40 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 7 Mar 2009 | 3:22 am మార్చి 07, 2009 కార్యక్రమాలుఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:30 షో రీల్ 09:00 టాలీవుడ్ టైమ్ 10:00 స్టార్‌తో సరదాగా 10:30 ఫన్‌టాస్టిక్ 11:00 రంగుల పల్లకిలో 11:30 న్యూ సినిమా స్పెషల్ 12:00 ఈనాడు సినిమా ...Source: Yahoo! Telugu: Entertainment | 7 Mar 2009 | 3:19 am కూలిన విమానం: ముగ్గురు పైలెట్లు దుర్మరణంబెంగళూరులో శుక్రవారం జరిగిన విమాన ప్రమాదంలో ముగ్గురు పైలెట్లు మృతి చెందారు. పరీక్ష నిమిత్తం సారాస్ అనే విమానం హెచ్ఎఎల్ విమానాశ్రయం నుంచి శుక్రవారం మధ్యాహ్నం గం.2.55 నిమిషాలకు బయలుదేరింది. సుమారు 4 గంటల ప్రాంతంలో బెంగుళూరుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిదాది వద్ద కూలిపోయింది.Source: జాతీయ | 6 Mar 2009 | 2:13 pm బాబు హామీలన్నీ"నేతి బీరకాయలే" : వైఎస్తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు చేస్తోన్న హామీలు, వాగ్ధానాలన్నీ... "నేతి బీరకాయ"ల్లాంటివేననీ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎద్దేవా చేశారు. ఆచరణ సాధ్యంకాని వాగ్ధానాలతో ప్రజలను మోసం చేసేందుకు బాబు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. శుక్రవారం ముఖ్యమంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... ఉచిత విద్యుత్ గురించి చంద్రబాబు ఇస్తున్న హామీలు నమ్మశక్యంగా లేవని అన్నారు. పేదలకు ఆర్థిక సహాయం బడ్జెట్ ప్రకారం ఆచరణ సాధ్యం కాదనీ, తొమ్మిదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన బాబుకు ఈ విషయం తెలియదనుకోవటం లేదని ఆయన వ్యాఖ్యానించారు. బాబు హామీలన్నీ ఆయన నిరాశా, నిస్పృహలకు సంకేతాలుగా నిలుస్తున్నాయని వైఎస్సార్ పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 6 Mar 2009 | 12:45 pm
|