ఓటీస్ షరతులకు అంగీకరించని భారత్!

జాతిపిత మహాత్మాగాంధీ వాడిన అమూల్యమైన వస్తువులు కలిగిన అమెరికా వస్తు సేకరణకర్త జేమ్స్ ఓటిస్ విధించిన షరతులను భారత్ తోసిపుచ్చింది. దీంతో గాంధీజీ వస్తువుల కైవసంలో మళ్లీ చిక్కులు ఉత్పన్నమయ్యాయి. గాంధీజీ వాడిన వివిధ రకాల వస్తువులు అమెరికాకు చెందిన జేమ్స్ ఓటిస్ దగ్గర ఉన్నాయి. ఆంటీ కోరం ఆక్షనర్స్ అనే సంస్థ ఈ వస్తువులను గురువారం వేలం వేయనున్నట్టు ప్రకటించిన విషయం తెల్సిందే.
Source: జాతీయ | 5 Mar 2009 | 12:43 pm

భాజపా తీర్థం పుచ్చుకున్న నిర్మలా వెంకటేష్

మంగళూరు పబ్‌లో మహిళలపై దాడి సంఘటనకు సంబంధించి ఖచ్చితమైన నివేదికను సమర్పించనందుకు బాధ్యురాలిని చేస్తూ.. జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన నిర్మలా వెంకటేష్ గురువారం భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
Source: జాతీయ | 5 Mar 2009 | 12:25 pm

రాజకీయాలా... అవేమంత కష్టం కాదు: అజహర్

రాజకీయాలా... అవేమంత కష్టమైనవి కావంటున్నాడు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజహరుద్దీన్. కాంగ్రెస్ అధిష్టానం తనను పోటీకి ఆదేశిస్తే దేశంలోని ఏ నియోజవర్గం నుంచైనా పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గురువారం విలేకరులతో మాట్లాడుతూ... ఫలానా నియోజకవర్గం నుంచే పోటీ చేయాలనే నిర్దుష్టమైన అభిప్రాయామేదీ తనకు లేదన్నాడు. ఒకవేళ అధిష్టానం ఇండోర్ నుంచే పోటీ చేయమని ఆదేశిస్తే... పోటీ చేయడానికి సిద్ధమేనని తెలిపాడు.
Source: జాతీయ | 5 Mar 2009 | 12:24 pm

"మడోన్నా" సౌందర్య రహస్యమేమిటో తెలుసా..?

ప్రముఖ పాప్ గాయని మడోన్నా సౌందర్య రహస్యమేమిటో ఈ మధ్యనే వెలుగులోకి వచ్చింది. 50 ఏళ్ళు దాటుతున్న ప్రపంచం యావత్తూ పాప్ గాయనిగానూ, అందాల రాశిగానూ అందరినీ ఆకట్టుకున్న ఈ అమ్మడు శరీరం నిగనిగలాడేందుకు కారణం..
Source: వినోదం | 5 Mar 2009 | 12:06 pm

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ గురువారం నష్టాలతో ముగియడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 249 పాయింట్లు కోల్పోయి 8,198 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 69 పాయింట్లు నష్టపోయి 2,577 వద్ద ముగిసింది. వాస్తవానికి గురువారం ఉదయం 89...
Source: Yahoo! Telugu: News | 5 Mar 2009 | 11:42 am

లాహోర్ దాడిలో మా హస్తం లేదు: ఎల్టీటీఈ

లాహోర్‌లో శ్రీలంక క్రికెటర్లపై జరిగిన తీవ్రవాద దాడిలో తమ హస్తం లేదని తమిళ వేర్పాటువాద తీవ్రవాద సంస్థ ఎల్టీటీఈ పేర్కొంది. లాహోర్ ఘటనలో ఎల్టీటీఈ హస్తం ఉండే అవకాశం ఉందని శ్రీలంక విదేశాంగ మంత్రి పేర్కొన్న తరుణంలో ఈ ప్రకటన...
Source: Yahoo! Telugu: News | 5 Mar 2009 | 11:06 am

మార్చి 15లోగా అభ్యర్థుల జాబితా: మొయిలీ

మార్చి 15లోగా పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ ప్రకటించారు. ఎన్నికల కమిటి విధి విధానాలను అనుసరించి అభ్యర్థులను ఖరారు చేసుకున్న అనంతరం సమగ్ర జాబితాను వెల్లడిస్తామని...
Source: Yahoo! Telugu: News | 5 Mar 2009 | 11:04 am

దాన్నెందుకు బలిచెయ్యడం..?

"ఏవండోయ్... ఈ రోజుకు మన పెళ్లై సంవత్సరం నిండింది. వచ్చేప్పుడు కోడిని పట్టుకురండి. పులావు చేసుకుందాం" అంది భర్తతో సుమతి...
Source: వినోదం | 5 Mar 2009 | 10:42 am

గుర్రం బరువు తగ్గింది

"ఏమే లీలా...! ఈ మధ్య బరువు తగ్గాలని నెల రోజుల నుంచీ గుర్రపు స్వారీ చేస్తున్నావటగా..? ఏమైనా బరువు తగ్గావా?" అడిగింది పుష్ప...
Source: వినోదం | 5 Mar 2009 | 10:40 am

చివరి దశ షూటింగ్‌లో 'అధినేత'

జగపతిబాబు హీరోగా వి. సముద్ర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం అధినేత. రవి (న్యూజెర్సీ) సమర్పకుడిగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 5 Mar 2009 | 10:17 am

షూటింగ్ పూర్తి చేసుకున్న 'సరే నీ ఇష్టం'

తమిళ హీరో భాగ్యరాజ్ తనయుడు శాంతన్ భాగ్యరాజ్ హీరోగా మహేష్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సరే నీ ఇష్టం. ఈ చిత్రం కొంత ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి చక్రి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం లోగో...
Source: Yahoo! Telugu: Entertainment | 5 Mar 2009 | 10:16 am

త్వరలో ప్రారంభం కానున్న ప్రభాస్ చిత్రం

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా హిట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకునిగా కొత్త చిత్రం ఒకటి త్వరలో షూటింగ్ జరుపుకోనుంది. ఈ చిత్రాన్ని ఆదిత్యరామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ ఆదిత్యరామ్ తమ ఆదిత్య రామ్ మూవీస్ పతాకంపై నిర్మించనున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 5 Mar 2009 | 10:16 am

ఐపీఎల్‍‌కు అదనపు భద్రత కల్పించలేం: కేంద్రం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీకి అదనపు భద్రత కల్పించలేమని భారత క్రికెట్ నియంత్రణ సంస్థ (బీసీసీఐ)కు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఏక కాలంలో 15వ విడత లోక్‌సభ ఎన్నికలు, అదే సమయంలో ఐపీఎల్...
Source: Yahoo! Telugu: News | 5 Mar 2009 | 10:07 am

పీఆర్పీకి ఉమ్మడి గుర్తు: ఈసీకి హైకోర్టు నోటీసులు

ప్రజారాజ్యం పార్టీకి ఉమ్మడి గుర్తు కేటాయించే విషయంలో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఈసీకి హైకోర్టు నోటీసులు జారీచేసింది. తమకు ఉమ్మడి గుర్తు కేటాయించాలని కోరుతూ ప్రజారాజ్యం పార్టీ హై కోర్టు గడప తొక్కిన నేపథ్యంలో కోర్టు ఈ నోటీసులు జారీచేసింది.
Source: Yahoo! Telugu: News | 5 Mar 2009 | 9:51 am

మూడేళ్లలో 10లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు: పీఆర్పీ

తాము అధికారంలోకి వస్తే రానున్న మూడేళ్లలో 10లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పిస్తామని ప్రజారాజ్యం పార్టీ ప్రకటించింది. దీంతోపాటు పేదలు, ధనవంతుల మధ్య అంతరాన్ని తగ్గించి సామాజిక న్యాయాన్ని సాధిస్తామని ఆ పార్టీ పేర్కొంది.
Source: Yahoo! Telugu: News | 5 Mar 2009 | 9:34 am

పాక్‌లో స్క్వాష్ టోర్నీ వాయిదా వేసిన పీఎస్ఏ

పాకిస్థాన్‌లో వచ్చే నెలలో జరగాల్సిన స్క్వాష్ టోర్నీని వాయిదా వేసినట్లు ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) ప్రకటించింది. శ్రీలంక క్రికెట్ జట్టుపై ఉగ్రవాదుల దాడి జరిగిన కారణంగానే ఈ టోర్నీని వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఈ...
Source: Yahoo! Telugu: News | 5 Mar 2009 | 8:58 am

భారత్‌పై ఆరోపణలు తగవు: చిదంబరం

శ్రీలంక క్రికెటర్లపై జరిగిన తీవ్రవాదుల దాడిలో భారత్‌ హస్తముండే అవకాశముందంటూ పాక్ నేతలు చేస్తున్న ఆరోపణలను కేంద్ర హోం మంత్రి తీవ్రంగా ఖండించారు. తీవ్రవాదానికి, తీవ్రవాదులకు ఆశ్రయం కల్పించే అలవాటు భారత్‌కు లేదని...
Source: Yahoo! Telugu: News | 5 Mar 2009 | 8:27 am

కలెక్టర్లు, ఎస్పీలతో సుబ్బారావు వీడియో కాన్ఫరెన్స్

ఎన్నికల నియమావళి అమలు అవుతున్న తీరు గురించి చర్చించేందుకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుబ్బారావు వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారు. ఈ చర్చల్లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై ఎటువంటి చర్యలను...
Source: Yahoo! Telugu: News | 5 Mar 2009 | 8:23 am

సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంజయ్‌దత్

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో లక్నో పార్లమెంటు స్థానానికి పోటీ చేసేందుకు తనకు అవకాశం కల్పించాలని కోరుతూ బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలో 1993లో ముంబయిలో సంభవించిన పేలుళ్లతో సంబంధం ఉందన్న...
Source: Yahoo! Telugu: News | 5 Mar 2009 | 8:17 am

"జయహో" పాటను వాడుకోవడం పిల్లాటలు

ఆస్కార్ అవార్డు పొందిన పాట "జయహో"ను రానున్న సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి ఉపయోగించుకోవడాన్ని పిల్లాటలుగా భారతీయ జనతా పార్టీ అభివర్ణించింది. జాతీయ పార్టీ ఇలాంటి స్థితికి దిగజారడం శోచనీయమని ఇలాంటి సంఘటన పిల్లాటలుగా వున్నాయని ఆ పార్టీ ప్రముఖనాయకుడు అరుణ్ జైట్లీ పేర్కొన్నారు.
Source: జాతీయ | 5 Mar 2009 | 7:30 am

సుప్రీం కోర్టును ఆశ్రయించిన "మున్నాభాయ్"

రాజకీయ నేతగా మారిన బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 1993లో జరిగిన ముంబై వరుస పేలుళ్ళ కేసులో సంజయ్‌దత్‌ను ముంబై ప్రత్యేక కోర్టు (టాడా) దోషిగా నిర్ధారించిన విషయం తెల్సిందే. ఈ కేసులో ఆరేళ్ళ జైలుశిక్ష పడింది. ఈ శిక్షపై సుప్రీం కోర్టు స్టే విధించడమే కాకుండా, సంజయ్‌దత్‌కు బెయిల్ మంజూరు చేసింది.
Source: జాతీయ | 5 Mar 2009 | 7:27 am

నెగటివ్ పాత్రలు చేయడానికి సిద్ధం: శర్వానంద్

గమ్యం చిత్రం ద్వారా అఖిలాంధ్ర ప్రేక్షకులను మెప్పించిన శర్వానంద్ ఆ చిత్రానికి ముందే మరెన్నో చిత్రాల్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. వెన్నెల, అమ్మచెప్పింది, వీధి చిత్రాల్లో నటించిన శర్వానంద్ శంకర్‌దాదా ఎమ్‌బీబీఎస్ చిత్రంలో...
Source: Yahoo! Telugu: Entertainment | 5 Mar 2009 | 6:54 am

ఆత్మహత్యలు వద్దని చెప్పే 'కీ'

గతంలో సిరా చిత్రానికి దర్శకత్వం వహించి ఎన్నో అవార్డులు అందుకున్న తనికెళ్ల భరణి తాజాగా మరో చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆత్మహత్యలు వద్దని చెప్పే కథాంశంతో ఆయన రూపొందించిన చిత్రం కీ. ఈ చిత్రానికి నటి జయలలిత నిర్మాత.
Source: Yahoo! Telugu: Entertainment | 5 Mar 2009 | 6:53 am

ఐదు హైకోర్టులకు చీఫ్ జస్టీస్‌ల నియామకం

ఐదు రాష్ట్రాల హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజస్థాన్, అలహాబాద్, పాట్నా, సిక్కిం, కేరళ హైకోర్టుల్లో చీఫ్ జస్టీస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ కోర్టులకు ఇప్పటి వరకు తాత్కాలిక చీఫ్ జస్టీస్‌లు విధులు నిర్వహిస్తూ వస్తున్నారు.
Source: జాతీయ | 5 Mar 2009 | 6:48 am

హింసతో ఉద్యమానికి చెడ్డపేరు: మారెప్ప

హింసాత్మక ధోరణులు అవలంభిస్తే ఉద్యమానికి చెడ్డపేరు వస్తుందని ఎమ్మార్పీఎస్‌కు మాజీ మంత్రి మారెప్ప హితవు పలికారు. అందుకే ఎమ్మార్పీఎస్ చేస్తున్న ఆందోళన కార్యక్రమాలను ఆపివేయాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా బుధవారం మంత్రి విలేకరులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 5 Mar 2009 | 6:00 am

భారత్‌పై ఆరోపణలు అర్థరహితం: చిదంబరం

ఉగ్రవాదుల వ్యవహారంలో భారత్‌పై పాకిస్థాన్ చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం అన్నారు. ప్రపంచ దేశాల దృష్టిని మరల్చేందుకే పాక్ ఇలాంటి అసత్య ప్రచారానికి దిగుతోందని ఆయన ధ్వజమెత్తారు. భారత్ ఎట్టిపరిస్థితుల్లోనూ తీవ్రవాదులకు ఆశ్రయం ఇవ్వబోదని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు.
Source: జాతీయ | 5 Mar 2009 | 5:19 am

కాంగ్రెస్-ఎన్సీపీల మధ్య ఎన్నికల సయోధ్య

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్రలో కలిసి పోటీ చేసేందుకు కాంగ్రెస్, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీలు సమ్మతించాయి. రాష్ట్రంలోని 48 ఎంపీ సీట్లకు గాను 41 సీట్లపై ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదిరినట్టు ఆ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మాణిక్‌రావ్‌ ఠాక్రే బుధవారం రాత్రి విలేకరలకు వెల్లడించాయి. అయితే, సీట్ల పంపిణీపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని చెప్పారు.
Source: జాతీయ | 5 Mar 2009 | 4:00 am

గాంధీ స్మారకాలను కైవసం చేసుకుంటాం: కేంద్రం

జాతిపిత మహాత్మాగాంధీకి చెందిన అపురూపమైన వస్తువులను సాధించేందుకు తాము కట్టుబడి ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గురువారం అమెరికాలో గాంధీ వస్తువుల వేలం జరుగనుంది. గాంధీ వాడిన వివిధ రకాల వస్తువులు గాంధీ స్మారక చిహ్నాలు సేకరించే జేమ్స్ ఓటిస్ దగ్గర ఉన్నాయి. ఆంటీ కోరం ఆక్షనర్స్ అనే సంస్థ ఈ వస్తువులను వేలం వేస్తోంది.
Source: జాతీయ | 5 Mar 2009 | 3:42 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 5 Mar 2009 | 3:15 am

మార్చి 05, 2009 కార్యక్రమాలు

ఈటీవీ 06:00 ఆరాధన, 06:30 అన్నదాత, 07:00 ఈటీవీ న్యూస్, 07:30 ప్రియమైన నీకు, 08:00 టాలీవుడ్ టైమ్, 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి, 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 బాలచందర్ కథాంజలి 14:30 శ్రీ కృష్ణ లీలలు 15:00 ప్రేమ మందిరం ...
Source: Yahoo! Telugu: Entertainment | 5 Mar 2009 | 3:14 am

కుళ్లు రాజకీయాల వల్లే ఎస్పీతో పొత్తు కట్: కాంగ్రెస్

ములాయంతో ఉత్తరప్రదేశ్ ఎన్నికల పొత్తుకు కాంగ్రెస్ పార్టీ 99శాతం కట్ కొట్టినట్లు తెలుస్తోంది. ములాయం సింగ్ లేకుండానే యూపీలో 24 మంది అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేయడం దీనికి మరింత ఊతమిస్తోంది. తాము ఎస్పీని ప్రక్కన పెట్టడానికి సమాజ్‌వాదీ పార్టీ కుళ్లు రాజకీయాలే కారణమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు ఆరోపించారు. 80 స్థానాలకు గాను 64మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించడం ద్వారా కాంగ్రెస్‌ను చిన్నచూపు చూసిందన్నారు.
Source: జాతీయ | 4 Mar 2009 | 2:35 pm