|
జైలులో వాజ్‌పేయి వంటచేసేవారు: అద్వానీభారత దేశంలో ఎమర్జెన్సీ విధించిన కాలంలో జైలులో బందీగావున్న మాజీ ప్రధానమంత్రి, ప్రముఖ బీజేపీ నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయి అక్కడ వంట చేసేవారని ఆ పార్టీ సీనియర్ నాయకుడు ప్రధాన మంత్రి అభ్యర్థి లాల్ కృష్ణ అద్వానీ తెలిపారు. మాజీ ప్రధాన మంత్రి వాజ్‌పేయి గురించి తన బ్లాగులో అద్వానీగారు ఇలా రాసుకున్నారు. వాజ్‌పేయి స్వయంగా వంట చేసేవారని, దానికి సంబంధించిన పనులన్నీ చూసేవారని ఆయన వివరించారు. ఆయనకు వంట చేయడం అంటే చాలా ఇష్టమని,Source: జాతీయ | 4 Mar 2009 | 12:22 pm కొత్త సీఈసీగా నవీన్ చావ్లా నియామకంపాలకులు అండ ఉంటే ఎలాంటి ఆరోపణలు వచ్చినా ఉన్నత పదవులు అధిరోహించేందుకు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాబోవని మరోమారు సుస్పష్టమైంది. కేంద్ర ఎన్నికల సంఘానికి తదుపరి ప్రధానాధికారిగా నవీన్ చావ్లాను నియమించడమే ఇందుకు ఉదారహణ. గత కొన్నేళ్ళుగా ఆయనపై పలు విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ పలు సందర్భాల్లో ఆరోపించింది.Source: జాతీయ | 4 Mar 2009 | 12:22 pm అధునాతన బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతంఅధునాతన బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ పరీక్షను రాజస్థాన్ రాష్ట్రంలోని పోఖ్రాన్ ప్రాంతంలో భారత్ బుధవారం విజయవంతంగా నిర్వహించింది. తాజా బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతమైనట్లు డీఆర్‌డీవో (డిఫెన్స్ రీసెచ్ అండ్ డెవెలెప్‌మెంట్ ఆర్గనైజేషన్) అధికారులు వెల్లడించారు.Source: జాతీయ | 4 Mar 2009 | 11:45 am దర్యాప్తు ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పండి: కోర్టుసత్యం కంప్యూటర్స్ సంస్థలో చోటు చేసుకున్న ఆర్థిక కుంభకోణంపై దర్యాప్తును ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలంటూ సీబీఐని రాష్ట్ర హై కోర్టు కోరింది. ఎందుకంటే సత్యం సంస్థకు సంబంధించి సీబీఐ చేస్తున్న దర్యాప్తును రోజువారీ పరిశీలించడం సాధ్యం కాదని హైకోర్టు పేర్కొంది.Source: ఏపీ న్యూస్ | 4 Mar 2009 | 11:01 am పార్టీ మ్యానిఫెస్టోలో వర్గీకరణకు స్థానం: బీజేపీబీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మ్యానిఫెస్టోలో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని చేరుస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అలాగే రాష్ట్ర బీజేపీ మ్యానిఫెస్టోలో సైతం ఈ అంశాన్ని చేరుస్తామని ఆ పార్టీ పేర్కొంది. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగను కలిసిన సందర్భంగా బీజేపీ నేతలు ఈ హామీ ఇచ్చారు.Source: ఏపీ న్యూస్ | 4 Mar 2009 | 11:00 am గాంధీభవన్ దాడి: సుబ్రమణ్యరాజు మృతిగాంధీభవన్లో దాడిలో గాయపడ్డ ఎస్పీవో సుబ్రమణ్యరాజు బుధవారం కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి బుధవారం విషమించడంతోనే మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. రాజు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడేందుకు అన్ని విధాలా చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయిందని వైద్యులు తెలిపారు. సుబ్రమణ్యరాజు మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.Source: ఏపీ న్యూస్ | 4 Mar 2009 | 10:32 am ప్రధానమంత్రి పదవికి అద్వానీ "యావరేజ్": ఆజాద్భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, ప్రధానమంత్రి అభ్యర్ధి లాల్ కృష్ణ అద్వానీ ప్రధాన మంత్రి పదవికి "యావరేజ్" అని అఖిల భారతీయ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్ అభిప్రాయపడ్డారు. ప్రధాన మంత్రి పదవి అభ్యర్ధిగా ఆయన అనర్హుడని, కాని దీనిపై సవివరంగా చెప్పడానికి ఆయన నిరాకరించారు.Source: జాతీయ | 4 Mar 2009 | 8:24 am నిఘా సమాచారం పంచుకోండి: ఎఫ్‌బీఐ విజ్ఞప్తిప్రపంచవ్యాప్తంగా అన్ని భద్రతా సంస్థలు నిఘా సమాచారాన్ని పంచుకోవాలని అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) ఉద్ఘాటించింది. తీవ్రవాద ముప్పును భద్రతా సంస్థలన్నీ కలిసి ఎదుర్కోవాలని అభిప్రాయపడింది. తీవ్రవాదం స్థానిక సమస్య కాదని, ప్రపంచం మొత్తానికి ఇది ఆందోళనకర అంశమని పేర్కొంది.Source: జాతీయ | 4 Mar 2009 | 8:14 am పీఆర్పీ ప్రచార సీడీ ఆవిష్కరణప్రజారాజ్యం పార్టీ ప్రచార సీడీని యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బుధవారం ఆవిష్కరించారు. త్వరలోనే పర్యటన చేపడతానని పవన్ వెల్లడించారు. పీఆర్పీ మహిళా నేత శోభారాణి, తెదేపా తెలుగు మహిళా అధ్యక్షురాలు రోజాల మధ్య బూతుపురాణంపై అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ దాటవేశారు.Source: ఏపీ న్యూస్ | 4 Mar 2009 | 8:11 am నాకు రాజకీయ లక్ష్యాలేమీ లేవు: ప్రియాంకాఅమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాల్లో మంగళవారం పర్యటించిన ప్రియాంకా గాంధీ ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలతో మమేకమయ్యారు. వారికి ఎన్నికల్లో విజయం సాధించేందుకు కొన్ని సలహాలు ఇచ్చారు. ఇదిలా ఉంటే క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చే అవకాశాన్ని ప్రియాంకా గాంధీ ఈ సందర్భంగా తోసిపుచ్చారు.Source: జాతీయ | 4 Mar 2009 | 8:11 am ఉగ్రవాది కసబ్‌కు ఐటిబిపి సిబ్బందితో భద్రతముంబై మారణహోమంలో సజీవంగా పట్టుబడిన కరుడుగట్టిన ఉగ్రవాది అజ్మల్ అమీర్ కసబ్‌కు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసు (ఐటిబిపి) సిబ్బందితో భద్రత కల్పించనున్నారు. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దీనిపై నేడో రేపో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయవచ్చని ముంబై నగర పోలీసు జాయింట్ కమిషనర్ రాకేష్ మారియా వెల్లడించారు.Source: జాతీయ | 4 Mar 2009 | 8:11 am కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో జయహో గీతంప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌కు ఆస్కార్ అవార్డు సాధించిపెట్టిన "జయహో" గీతాన్ని వచ్చే లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఉపయోగించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రం కోసం ఏఆర్ రెహమాన్ ఈ గీతాన్ని స్వరపరిచిన సంగతి తెలిసిందే. ఈ గీతం ఇటీవల రెహమాన్‌కు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును అందించింది.Source: జాతీయ | 4 Mar 2009 | 8:08 am మ్యానిఫెస్టోలో ఫ్లోరైడ్ సమస్య: పవన్ ప్రకటననల్గొండ జిల్లాను వేధిస్తున్న ఫ్లోరైడ్ సమస్యను ప్రజారాజ్యం మ్యానిఫెస్టోలో పెడుతామంటూ ఆ పార్టీ యువరాజ్యం అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. కృష్ణా జలాలను తరలించడం ద్వారా నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యను రూపుమాపేందుకు ప్రయత్నించనున్నట్టు ఆయన హామీ ఇచ్చారు.Source: ఏపీ న్యూస్ | 4 Mar 2009 | 8:06 am నేర చరితులకు టికెట్లు వద్దు: ఎన్నికల నిఘా వేదికరానున్న ఎన్నికల్లో ఏ పార్టీ కూడా నేర చరితులకు టికెట్ ఇవ్వొదంటూ ఎన్నికల నిఘా వేదిక విజ్ఞప్తి చేసింది. ఒకవేళ నేర చరిత్రి ఉన్న అభ్యర్ధులను పార్టీలు బరిలోకి దించితే తాము చూస్తూ ఊరుకోబోమని, వారి చరిత్రను బయట పెడుతామని నిఘా వేదిక హెచ్చరించింది.Source: ఏపీ న్యూస్ | 4 Mar 2009 | 8:04 am కసుమూరు దర్గాను సందర్శించిన రెహ్మాన్ఇటీవల రెండు ఆస్కార్ అవార్డులను గెల్చుకుని యావత్ ప్రపంచాన్ని ఆకర్షించిన రెహ్మాన్ బుధవారం నెల్లూరు జిల్లాలోని కసుమూరు దర్గాను సందర్శించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో సందడి నెలకొంది. తల్లితో సహా కసమూరు దర్గాను సందర్శించిన రెహ్మాన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.Source: ఏపీ న్యూస్ | 4 Mar 2009 | 8:04 am ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలురాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైనాయి. ఈ పరీక్షలు మార్చి నెల 24వ తేదీవరకు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షల కోసం మొదటి సంవత్సరం విద్యార్థులు 8,60,568 మందికాగా, రెండవ సంవత్సరం విద్యార్థులు 8,94,934మంది విద్యార్థులు హాజరు కానున్నారు. మొత్తం 17,55,502మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. ఈ పరీక్షలకోసం రాష్ట్రవ్యాప్తంగా 2,204 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.Source: ఏపీ న్యూస్ | 4 Mar 2009 | 6:09 am ఆంధ్రప్రదేశ్ అంటే నాకెంతో ఇష్టం: రెహ్మాన్ఆంధ్రప్రదేశ్ అంటే తనకెంతో ఇష్టమని సంగీత మాంత్రికుడు ఎ.ఆర్. రెహ్మాన్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన "స్లమ్‌డాగ్ మిలియనీర్" చిత్రానికి సంగీతం సమకూర్చి రెండు ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకున్న ఎ.ఆర్. రెహ్మాన్ బుధవారం నెల్లూరు జిల్లాలోని కసుమూరు మస్తాన్...Source: వినోదం | 4 Mar 2009 | 5:58 am ఆరు నుంచి చిరు ఆదిలాబాద్ జిల్లా పర్యటనప్రజారాజ్యం పార్టీ అధినేత మెగాస్టార్ చిరంజీవి ఈనెల ఆరో తేదీ నుంచి ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. నాలుగు రోజుల పాటు సాగే ఈ జిల్లా పర్యటనకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను జిల్లా పార్టీ నేతలు చేస్తున్నారు. ఈ పర్యటన తర్వాత రెండు రోజుల తర్వాత కృష్ణా జిల్లాలో పర్యటిస్తారని పార్టీ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.Source: ఏపీ న్యూస్ | 4 Mar 2009 | 5:24 am ప్రజా మద్దతు కోల్పోతున్న సీపీఎం: సోమనాథ్భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) ప్రజా మద్దతును నానాటికీ కోల్పోతోందని ఆ పార్టీ బహిష్కృత నేత, లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ అభిప్రాయపడ్డారు. ఇందుకు పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని బిష్ణూపూర్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి ఓటమి చెందడమే ఇందుకు నిదర్శనమని ఆయన గుర్తు చేశారు.Source: జాతీయ | 4 Mar 2009 | 4:00 am నేటి నుంచి విధులకు ప్రధాని హాజరుప్రధాని మన్మోహన్ సింగ్ బుధవారం నుంచి విధులకు హాజరుకానున్నారు. గుండె ఆపరేషన్ చేయించుకుని గత ఐదు వారాలుగా విశ్రాంతి తీసుకుంటున్న మన్మోహన్ సింగ్ బుధవారం నుంచి తొలిసారి తన విధులను నిర్వహించనున్నారు. తన విధుల్లో భాగంగా భారత్‌కు వచ్చే బెనిన్ దేశ అధ్యక్షుడు బోనీ యాయీతో మన్మోహన్ సమావేశమై, వివిధ అంశాలపై చర్చిస్తారు.Source: జాతీయ | 4 Mar 2009 | 3:47 am మమ్మల్ని చూసి ఓర్వలేకే ఆ విమర్శలు: పవన్తమ ఎదుగుదలను చూసి ఓర్వలేకే తెలుగుదేశం మహిళ అధ్యక్షురాలు రోజా తమపై విమర్శల వర్షం కురిపిస్తున్నారని యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మంగళవారం నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్, ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు దగ్గరవడం, రాజకీయాల్లో మార్పు తేవాలని పీఆర్పీ కృషిని రాజకీయ పార్టీలు సహించలేకపోతున్నాయని పవన్ దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో తాను పోటీచేయబోనని పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు.Source: ఏపీ న్యూస్ | 3 Mar 2009 | 1:33 pm
|