|
లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కండి: ప్రియాంకా గాంధీత్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీ పిలుపు నిచ్చారు. తన సోదరుడు రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహిస్తోన్న అమేథీ నియోజక వర్గంలో మంగళవారం ప్రియాంకా గాంధీ పర్యటించారు. గౌరీగంజ్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సేవాదళ్ సమావేశంలో పాల్గొన్నారు.Source: జాతీయ | 3 Mar 2009 | 11:27 am ఉమ్మడి గుర్తుపై మరోసారి కోర్టుకు : చిరుప్రజారాజ్యం పార్టీ తరపున పోటీచేసే అభ్యర్థులందరికీ ఉమ్మడి గుర్తు అంశంపై మరోసారి హైకోర్టును ఆశ్రయించాలని తాము నిర్ణయించినట్లు... ఆ పార్టీ అధినేత, సినీ నటుడు మెగాస్టార్ కొణిదెల చిరంజీవి వెల్లడించారు. ఈ విషయంలో న్యాయపరంగా ఉన్న అన్ని అంశాలను పరిశీలించే ఉద్దేశ్యంతో న్యాయనిపుణులతో భేటీ అయిన మెగాస్టార్... గుర్తుపై చివరిదాకా పోరాడతామని స్పష్టం చేశారు. కాగా, ఎన్నికలు సజావుగా సాగటానికి ప్రజారాజ్యం పార్టీ సహకరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నిఘా వేదిక ప్రతినిధులు మాజీ ఎన్నికల కమిషనర్ కెజే రావు, మాజీ ప్రధాన న్యాయమూర్తి అంబటి లక్ష్మణరావు మంగళవారం నాడు.. పీఆర్పీ ప్రధాన కార్యాలయంలో చిరును కలిశారు. ఈ ప్రతినిధి బృందం సుమారు అరగంట సేపు చిరంజీవితో భేటీ అయ్యారు.Source: ఏపీ న్యూస్ | 3 Mar 2009 | 10:58 am లంక క్రికెట్ జట్టుపై దాడి: భారత్ దిగ్భ్రాంతిశ్రీలంక క్రికెట్ జట్టుపై లాహోర్‌లో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిపై భారత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఉగ్రవాదులు బరితెగించి శ్రీలంక క్రికెట్ జట్టుపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదుల కాల్పుల నుంచి ఆరుగురు శ్రీలంక క్రికెటర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే వారికి రక్షణగా ఉన్న ఐదుగురు భద్రతా సిబ్బంది దాడిలో ప్రాణాలు కోల్పోయారు.Source: జాతీయ | 3 Mar 2009 | 10:30 am పాపం ఈపాటికి చచ్చుంటాయ్..!"ఏవండీ... నిన్న చేసిన మైసూర్ పాక్ ఎక్కడండీ..?" అడిగింది భార్య "అటక మీద పెట్టాను చూడు.. పాపం ఈపాటికి వాటిని ఎలుకలు తిని చచ్చుంటాయ్..!"...Source: వినోదం | 3 Mar 2009 | 10:20 am చీరల కొట్టుకి వెళ్తోందిలే..!"ఏమండీ... వేళకి సరిగా భోజనం చేయండి.. వారానికోసారి తలస్నానం చేయండి.." జాగ్రత్తలు చెబుతోంది గిరీశం భార్య...Source: వినోదం | 3 Mar 2009 | 10:20 am గాంధీ వస్తువులు భారత్‌కు ఇచ్చేందుకు సిద్ధంజాతిపతి మహాత్మ గాంధీకి చెందిన వస్తువులను భారత్‌కు అందజేసేందుకు వాటి యజమాని సంసిద్ధత వ్యక్తం చేశారు. తాను కూడా మహాత్మా గాంధీకి గొప్ప ఆరాధకుడినని చెప్పారు. దేశ స్థూలజాతీయోత్పత్తిలో ఐదు శాతాన్ని పేదల కోసం ఖర్చు చేయాలని నిర్ణయిస్తే, గాంధీకి చెందిన వస్తువులను భారత ప్రభుత్వానికి తాను ఉచితంగానే అందజేస్తానని తెలిపారు.Source: జాతీయ | 3 Mar 2009 | 7:54 am ఎస్సీ వర్గీకరణ జరిగి తీరుతుంది: కోనేరుఎస్సీల వర్గీకరణ జరిగి తీరుతుందని, దీన్ని ఎవరూ ఆపలేరని మంత్రి కోనేరు రంగారావు పేర్కొన్నారు. ఎస్సీల వర్గీకరణ కోసం తాము చేయాల్సిందంతా చేశామని, అయితే జాప్యం జరిగిందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయమై సోమవారం ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత ఎంపీ నంది ఎల్లయ్య, మాజీ ఎంపీ మంద జగన్నాథం, ఎమ్మెల్యేలు మాణిక్య వరప్రసాద్, గంగారాంలతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.Source: ఏపీ న్యూస్ | 3 Mar 2009 | 7:51 am కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యం: మాయావతిసార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. త్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికలు తమ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమైనవిగా ఆమె పేర్కొన్నారు. అందువల్ల పార్టీ శ్రేణులు విభేదాలను పక్కన పెట్టి కలిసి పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలుపొందేందుకు తీవ్ర కృషి చేయాలని కోరారు.Source: జాతీయ | 3 Mar 2009 | 7:44 am త్వరలో పెళ్లి కూతురు కాబోతున్న "మంజీర"రుక్మిణి, ఈశ్వర్, మంజీర వంటి చిత్రాల ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన వర్ధమాన నటి శ్రీదేవి త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది. ప్రముఖ తమిళ నటుడు విజయ్ కుమార్, నటి మంజుల దంపతుల చిన్న కుమార్తె అయిన శ్రీదేవికి ఈ నెల 15వ తేదీన నిశ్చితార్థం వైభవంగా జరుగనుందని...Source: వినోదం | 3 Mar 2009 | 7:33 am ఆటో లారీ ఢీ: ఎనిమిది మంది మృతిచిత్తూరు జిల్లా గంగవరం మండలంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఒక ఆటో డ్రైవర్ కూడా ఉన్నాడు. బెంగుళూరు-చెన్నై జాతీయ రహదారిపై ఈ ఘోర ప్రమాదం జరిగింది. కొంత మంది ప్రయాణికులతో వెళుతున్న ఆటోను కంటైనర్ లారీ ఢీకొంది. దీంతో ఆటోలో ఉన్న డ్రైవర్‌తో సహా ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు.Source: ఏపీ న్యూస్ | 3 Mar 2009 | 7:08 am క్రికెటర్లపై దాడి విభ్రాంతికర పరిణామం: చిదంబరంపాకిస్థాన్లోని లాహోర్‌లో శ్రీలంక క్రికెటర్లపై మంగళవారం దుండగులు జరిపిన దాడిని కేంద్ర హోం శాఖామంత్రి పి.చిదంబరం తీవ్రంగా ఖండించారు. ఇది విభ్రాంతికర పరిణామంగా ఆయన పేర్కొన్నారు. రెండో టెస్టు మూడో రోజు ఆట కోసం లాహోర్‌లోని గడాఫీ స్టేడియానికి వస్తున్న శ్రీలంక టెస్ట్ క్రికెటర్లపై 12 మంది తీవ్రవాదులు తుపాకీతో కాల్పులు జరుపుతూ, గ్రెనైడ్‌ల దాడి జరిగిన విషయం తెల్సిందే. ఈ దాటిలో ఆరుగురు క్రికెటర్లు గాయపడగా, ఆరుగురు భద్రతా సిబ్బంది మృత్యువాత పడ్డారు.Source: జాతీయ | 3 Mar 2009 | 6:59 am కాంగ్రెస్- టీసీ పొత్తుపై సోనియాదే తుది నిర్ణయంపశ్చిమబెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ (టీసీ)తో కుదిరిన పొత్తుకు సంబంధించి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీనే తుది నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ సీనియర్ నేత, విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ సోమవారం పేర్కొన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలను రెండు పార్టీలు కలిసి ఎదుర్కోవాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.Source: జాతీయ | 3 Mar 2009 | 5:55 am నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: సుబ్బారావుఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎన్నికల కోడ్ గురించి వివరించింది. అదేసమయంలో ఎన్నికల కోడ్‌ను ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం హెచ్చరికలు జారీచేసింది.Source: ఏపీ న్యూస్ | 3 Mar 2009 | 5:49 am ప్రచారంలో మాత్రమే కాంగ్రెస్ అభివృద్ధి: బాబుగత ఐదేళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో మాత్రమే అభివృద్ధి కనిపిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. స్వప్రయోజనాలకోసం భూములను అన్యాక్రాంతం చేస్తూన్న వైఎస్ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి ఇదేనా అంటూ ఆయన ప్రశ్నించారు.Source: ఏపీ న్యూస్ | 3 Mar 2009 | 5:47 am ప్రభుత్వ జీవోలపై మహాకూటమి ఫిర్యాదుఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ప్రభుత్వం తన ఇష్టానుసారం జీవోలను జారీచేసిందని పేర్కొంటూ ఎన్నికల ప్రధాన అధికారి ఐవీ సుబ్బారావుకు మహాకూటమి నేతలు ఫిర్యాదు చేశారు. కేవలం ఒకే రోజులో 389 జీవోలు జారీచేయడం ప్రభుత్వ అవినీతికి అద్దం పడుతోందంటూ వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 3 Mar 2009 | 5:45 am భారత్‌లో నేడు ఎఫ్‌బీఐ ఛీఫ్ పర్యటనఅమెరికాకు చెందిన నేర పరిశోధన విభాగం ఎఫ్‌బీఐ ఛీఫ్ రాబర్ట్ ముల్లెర్ మంగళవారం భారత్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి పి చిదంబరం, ఇతర ప్రధాన అధికారులతో కీలక చర్చల్లో పాల్గొననున్నారు. భారత్ చేరిన తర్వాత ముందుగా ముల్లెర్ 26/11 ముంబాయి ఉగ్రవాద దాడులకు చెందిన సమాచారాన్ని, పరిశోధన వివరాలను తెలుసుకుంటారు. ఆ తర్వాత చిదంబరం నేతృత్వంలో జాతీయ భద్రతా సలహాదారు ఎంకే నారయణన్ మరియు ఇంటలిజెన్స్ బ్యూరో ఛీఫ్ రాజీవ్ మథుర్‌లతో జరిగే సమావేశంలో ముల్లెర్ పాల్గొంటారు.Source: జాతీయ | 3 Mar 2009 | 5:08 am గత ఎన్నికల్లో అతి విశ్వాసం వల్లే ఓడాం: అద్వానీగత పార్లమెంట్ ఎన్నికల్లో అతి విశ్వాసం వల్లే తాము ఓటమి పాలైనట్టు ఎన్డీయే కూటమి ప్రధాని అభ్యర్థి, భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ అభిప్రాయపడ్డారు. సోమవారం జరిగిన ఆ పార్టీ వాణిజ్య విభాగం సమావేశంలో ప్రసంగించిన అద్వానీ.. ఆరేళ్ల పాటు వాజ్‌పేయి నేతృత్వంలో అధికారంలో ఉన్న తర్వాత, ఎన్నికల్లో గెలుస్తామన్న ధీమా వచ్చిందని చెప్పారు.Source: జాతీయ | 3 Mar 2009 | 4:04 am ఆ పొత్తువల్ల సీపీఎం బలం తగ్గుతుంది: జ్యోతిబసుకాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్‌లు ఒకటిగా చేరడం వల్ల కమ్యూనిస్టుల కంచుకోట పశ్చిమబెంగాల్‌లో తమ బలం తగ్గవచ్చని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్టు వృద్ధనేత జ్యోతిబసు అభిప్రాయపడ్డారు. ఇది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఆ పార్టీకి చెందిన పొలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరీ మాత్రం కాంగ్రెస్-తృణమూల్ కాంగ్రెస్‌లది అపవిత్ర పొత్తుగా అభివర్ణించారు.Source: జాతీయ | 3 Mar 2009 | 3:55 am కాంగ్రెస్‌కు చరమగీతం : చంద్రబాబుకేంద్రంలో, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని... తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సోమవారం వ్యాఖ్యనించారు. రాష్ట్రంలో రెండు విడతలుగా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం తీసుసున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆయన ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన అనంతరం చంద్రబాబు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... ఎన్నికల నిబంధనావళి తక్షణమే అమలులోకి రావడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం విడుదల చేస్తున్న అక్రమ జీవోలకు అడ్డుకట్టపడినట్లైందని హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేలోగానే మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తవుతుందని ఆయన తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 2 Mar 2009 | 2:22 pm కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : సుబ్బారావురాష్ట్రంలో అసెంబ్లీకి, లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమీషన్ ప్రకటన చేసిన తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఐవీ సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు ప్రభుత్వం కొత్త పథకాలను ప్రకటించరాదని, పార్టీల ప్రచారంలో నిబంధనలకు లోబడి వ్యవహరించాలని ఆయన గుర్తు చేశారు. రాజకీయ పార్టీల నాయకులు ఎలా మాట్లాడాలి, సభలు ఎలా నిర్వహించాలి, వారు పరస్పరం గౌరవప్రదంగా ఎలా ఉండాలి.. తదితర విషయాలను మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్‌లో వివరించినట్లు సుబ్బారావు ఈ సందర్భంగా వెల్లడించారు. రాజకీయ పార్టీల ప్రకటనల గూర్చి సుప్రీంకోర్టు ఓ ఆదేశాన్ని కూడా ఇచ్చినట్లు ఆయన తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 2 Mar 2009 | 2:22 pm బాబు జిమ్మిక్కులను నమ్మబోరు : పురంధరేశ్వరిఅవినీతి అంశాన్ని ఎజెండాగా చేసుకుని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు చేస్తున్న జిమ్మిక్కులను ప్రజలెవరూ నమ్మబోరని కేంద్ర మానవ వనరుల శాఖ సహాయమంత్రి శ్రీమతి పురంధరేశ్వరి విమర్శించారు. వంద కోట్ల రూపాయల ఖర్చుతో తన నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను సోమవారం పురంధరేశ్వరి ప్రజలకు అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా కారంచేడులోని ఆమె స్వగృహంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో విపరీతమైన ఆదరణ ఉందన్నారు. ఈ ఐదు సంవత్సరాల కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే మళ్లీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాయని పురంధరేశ్వరి ధీమా వ్యక్తం చేశారు.Source: ఏపీ న్యూస్ | 2 Mar 2009 | 2:21 pm రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలురాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరుగనున్నాయి. ఏప్రిల్ 16, 23 తేదీల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి. 16వ తేదీన తెలంగాణా, ఉత్తరాంధ్రలో పోలింగ్ జరుగుతుంది. 23వ తేదీన కోస్తాంధ్ర, రాయలసీమలో పోలింగ్ జరుగనుంది. మే 16వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతంది. కాగా, ఎన్నికల నియమావళి సోమవారం నుంచే అమలుకు వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఎన్.గోపాలస్వామి వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 2 Mar 2009 | 11:38 am
|