విధుల కోసం 40 లక్షల మంది సిబ్బంది

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. సోమవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రధాన ఎన్నికల అధికారి ఎన్.గోపాలస్వామి వెల్లడించారు. ఎన్నికల నిర్వహణ కోసం సుమారు 40 లక్షల మంది సిబ్బందిని వినియోగించనున్నట్టు చెప్పారు. అలాగే భద్రత కోసం 21 లక్షల మంది పోలీసులను నియమించనున్నట్టు తెలిపారు. ప్రస్తుత 14వ లోక్‌సభ పదవీకాలం జూన్ ఒకటో తేదీతో ముగుస్తుందన్నారు.
Source: జాతీయ | 2 Mar 2009 | 11:12 am

ఎన్నికల "నగారా"ను మోగించిన ఈసీ

15వ లోక్‌సభ ఎన్నికల నగారా మోగింది. లోక్‌సభ ఎన్నికలతో సహా మూడు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు నిర్వహించనుంది. ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. తొలి దశ ఎన్నికలు ఏప్రిల్ 16న తొలి దశ ఎన్నికలు జరుగుతాయి. చివరి దశ ఎన్నికలు మే 13వ తేదీన జరుగుతాయి. దేశంలోని 523 పార్లమెంట్ స్థానాల్లో ఫోటో గుర్తింపు కార్డుల ద్వారా పోలింగ్ నిర్వహిస్తారు.
Source: జాతీయ | 2 Mar 2009 | 11:09 am

చెన్నైలో పోలీసు కుటుంబ సభ్యుల ఆందోళన

మద్రాసు హైకోర్టు ప్రాంగణంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై దాడులకు దిగిన న్యాయవాదులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసు కుటుంబాలకు చెందిన వందలాది మంది సభ్యులు ఆందోళన నిర్వహించారు. స్థానిక చెప్పాక్కంలోని ప్రభుత్వ అతిథి గృహం ఎదుట సోమవారం ఈ ధర్నా జరిగింది. పోలీసు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాకు సుమారు ఐదు వందల మందికిపైగా పాల్గొన్నారు. దీనికి మాజీ పోలీసు ఉన్నతాధికారులు, పలువురు పోలీసు కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
Source: జాతీయ | 2 Mar 2009 | 11:06 am

రాజకీయ కుట్ర వల్లే తొలగించారు నిర్మల

జాతీయ మహిళా సంఘం నుంచి ఉద్వాసనకు గురైన సభ్యురాలు నిర్మల వెంకటేశ్ సోమవారం కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తనను జాతీయ మహిళా సంఘం నుంచి తొలగించడం రాజకీయ కుట్ర దాగుందని ఆరోపించారు. దీనికి సంబంధించి తనపై రాజకీయ కుట్ర జరిగిందని పేర్కొన్నారు.
Source: జాతీయ | 2 Mar 2009 | 8:25 am

ఎన్డీయే కూటమిలో చేరిన ఆర్.ఎల్.డి

కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరింది. ఎన్డీయే కూటమితో కలిసి వచ్చే లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగనున్నట్టు ఆ పార్టీ అధినేత అజిత్ సింగ్ ప్రకటించారు. భారతీయ జనతా పార్టీతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ రీజియన్‌లో ఏడు లోక్‌సభ స్థానాల్లో ఆర్.ఎల్.డి పోటీ చేస్తుంది. మిగిలిన 73 ఎంపీ సీట్లలో భాజపా అభ్యర్థులు బరిలోకి దిగుతారు.
Source: జాతీయ | 2 Mar 2009 | 8:00 am

నాలుగైదు రోజుల్లో రాజకీయ నిర్ణయం: మంద కృష్ణ

ఎస్సీ రిజర్వేషన్ విషయంలో ప్రభుత్వం తాత్సారం చేస్తున్న నేపథ్యంలో మరో నాలుగైదు రోజుల్లో రాజకీయ నిర్ణయం తీసుకోనున్నట్టు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఉద్యమ నాయకులు చట్టసభల్లో ప్రవేశించే మాదిరిగా తాను రాజకీయ నిర్ణయం తీసుకోనున్నట్టు ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
Source: ఏపీ న్యూస్ | 2 Mar 2009 | 5:31 am

తెలంగాణా ద్రోహి కాంగ్రెస్: కేసీఆర్

కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ప్రజల ద్రోహి అని తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెపితేనే తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. గతంలో వైఎస్‌ను నమ్మి తాము మోసపోయామని అందుకే ఈ ఎన్నికల్లో వారిని తరిమి కొట్టాలని ఆయన తెలంగాణ వాసులకు పిలుపునిచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 2 Mar 2009 | 5:29 am

మోసం చేయాలనే ఆలోచన లేదు: వైఎస్

ఎస్సీ వర్గీకరణ అంశంలో మాదిగలను మోసం చేయాలనే ఆలోచన తమకు ఏమాత్రం లేదని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ అంశంలో చొరవ తీసుకుంటే మరో వర్గం తమకు దూరమవుతుందని తెలిసినా తాము మాత్రం వర్గీకరణ వైపే మొగ్గు చూపామన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 2 Mar 2009 | 5:25 am

కాంగ్రెస్ డిమాండ్‌ను తోసిపుచ్చిన ఎస్పీ

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 25 లోక్‌సభ సీట్లను కేటాయించాలన్న కాంగ్రెస్ డిమాండ్‌ను సమాజ్‌వాదీ పార్టీ తోసిపుచ్చింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ఆదివారం సమావేశమైన ఎస్పీ అధినేత ములాయం సింగ్, ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్‌లు ఈ విషయాన్ని తేల్చి చెప్పినట్టు ఎస్పీ పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఎస్పీ-కాంగ్రెస్ పొత్తు మరోమారు సందిగ్ధంలో పడింది.
Source: జాతీయ | 2 Mar 2009 | 5:23 am

యాభై శాతం టిక్కెట్ల కోసం ఎన్.సి.పి పట్టు

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమకు యాభై శాతం టిక్కెట్లను కేటాయించాలని నేషనలిస్టు కాంగ్రెస్ అధినేత, కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తమతో కాంగ్రెస్‌కు పొత్తు పెట్టుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నందున తాము ఈ ప్రతిపాదన చేస్తున్నట్టు తెలిపారు. అంతేకాకుండా కాంగ్రెస్, ఎన్.సి.పిలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా పంచాలని ఆయన కోరారు.
Source: జాతీయ | 2 Mar 2009 | 5:16 am

బెంగాల్‌లో కాంగ్రెస్-తృణమూల్ కాంగ్రెస్ పొత్తు

కమ్యూనిస్టుల కంచుకోట పశ్చిమబెంగాల్‌లో పాగా వేసేందుకు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్‌లు చేతులు కలిపాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు ఈ రెండు పార్టీలు సమ్మతించాయి. ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రి, బెంగాల్ పిసిసి అధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీతో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మధ్య ఆదివారం జరిగిన సమావేశంలో అంగీకారానికి వచ్చారు.
Source: జాతీయ | 2 Mar 2009 | 3:58 am

ఎన్నికల తేదీల ఖరారుపై ఈసీ నేడు భేటీ

సార్వత్రిక ఎన్నికల తేదీలను ఖరారు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం సమావేశం సానుంది. లోక్‌సభ ఎన్నికలతో పాటే, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, సిక్కిం అసెంబ్లీలకు కూడా పలు విడతలుగా పోలింగ్‌ నిర్వహించనుంది. అందువల్ల ఈ అసెంబ్లీ ఎన్నికల తేదీలను కూడా లోక్‌సభ ఎన్నికల తేదీలతోనే ప్రకటించనున్నారు. షెడ్యూలు ఖరారుపై సోమవారం ఎన్నికల సంఘంలోని త్రిసభ్య కమిటీ భేటీ అవుతుందని ఈసీ వర్గాలు వెల్లడించాయి.
Source: జాతీయ | 2 Mar 2009 | 3:49 am

అందుకే.. రాష్ట్ర ప్రభుత్వ కమిటీ: రోశయ్య

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయితే, తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకే రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిందని ఆ కమిటీ ఛైర్మన్ రోశయ్య చెప్పారు. ఈ విషయమై రోశయ్య ఆదివారం మాట్లాడుతూ.. తెలంగాణ ఇవ్వాలా వద్దా అన్న అంశంతో తాజా కమిటీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు దిశగా మరో ముందడుగు వేసిందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 1 Mar 2009 | 12:40 pm