|
గోపాలస్వామి సిఫార్సును తోసిపుచ్చిన రాష్ట్రపతికేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ప్రధాన కమిషనర్ ఎన్.గోపాలస్వామి చేసిన సిఫార్సులను రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఆదివారం తోసిపుచ్చారు. ఈసీ నుంచి సహచర కమిషనర్ నవీన్ చావ్లాను తొలగించాలని ఇటీవల గోపాలస్వామి రాష్ట్రపతికి లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే ఈ సిఫార్సులను రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ తోసిపుచ్చారు. దీంతో నవీన్ చావ్లా ఎన్నికల సంఘం కమిషనర్‌గా కొనసాగేందుకు మార్గం సుగమమైంది. నవీన్ చావ్లా పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని గోపాలస్వామి జనవరిలో రాష్ట్రపతికి రాసిన లేఖలో ఫిర్యాదు చేశారు.Source: జాతీయ | 1 Mar 2009 | 11:56 am విజయశాంతి నా పదో సోదరి: కేసీఆర్ప్రముఖ నటి విజయశాంతి, తెరాస నేత విజయశాంతి తన పదో సోదరి అని తెరాస అధినేత కె. చంద్రశేఖర్ రావు అన్నారు. తల్లి తెలంగాణ పార్టీని తెరాసలో విలీనం చేసిన విజయశాంతి ఆదివారం కేసీఆర్ ఆధ్వర్యంలో తెరాస సెక్రటరీ జనరల్‌గా నియమితులయ్యారు. టీఆర్ఎస్ సభ్యత్వం స్వీకరించిన అనంతరం విజయశాంతి పదవీ ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేసీఆర్ మాట్లాడుతూ.. గత 2004వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తానని వాగ్ధానమిచ్చి, మోసం చేసిందని ధ్వజమెత్తారు. తెరాసను మోసం చేసిన "కాంగ్రెస్ పార్టీ పోవలె-తెలంగాణ రావలె"నని కేసీఆర్ ఉద్ఘాటించారు.Source: ఏపీ న్యూస్ | 1 Mar 2009 | 9:21 am నేరాలకు పాల్పడినవారిపై పొగడ్తలా: బాబు ప్రశ్నరాష్ట్రంలో అవినీతి పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని పొగడ్తల్లో ముంచెత్తడం ద్వారా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విశ్వసనీయత కోల్పోయారని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. వైఎస్ అవినీతి ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నా.. సోనియా మాత్రం రాష్ట్రానికి వచ్చి ఆయనను పొగుడుతున్నారని విమర్శించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు అవినీతిపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, కేసు నమోదు చేయాలని ఏసీబీ కోర్టు చెప్పింది.Source: ఏపీ న్యూస్ | 1 Mar 2009 | 7:58 am తెలంగాణ అంశంపై రోశయ్య అధ్యక్షతన కమిటీప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అంశంపై రాష్ట్ర ప్రభుత్వం శనివారం రాత్రి కమిటీని ఏర్పాటు చేసింది. రోశయ్య అధ్యక్షతన పనిచేసే ఈ కమిటీలో ఎనిమిది మంది సభ్యులు ఉంటారు. కాంగ్రెస్, మస్లిజ్ పార్టీలకు చెందిన ఎనిమిది మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఏడుగురు కాంగ్రెస్‌కు చెందిన మంత్రులు, శాసనమండలి సభ్యులుకాగా, మరొకరు ఎంఐఎంకు చెందిన ఎమ్మెల్యే. రోశయ్యతోపాటు, వాణిజ్యపన్నుల శాఖ మంత్రి కొణతాల రామకృష్ణ, భారీ పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డి, శాసనసభ్యులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మండలి సభ్యులు పద్మరాజు, షేక్‌హుస్సేన్, ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీలు ఈ కమిటీలో ఉంటారు.Source: ఏపీ న్యూస్ | 1 Mar 2009 | 7:56 am రాష్ట్రం పచ్చనోట్ల పరిశ్రమగా మారింది: చిరుముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి పాలనలో రాష్ట్రం పచ్చనోట్ల పరిశ్రమగా మారిపోయిందని ప్రజారాజ్యం వ్యవస్థాపకుడు చిరంజీవి ధ్వజమెత్తారు. దేశంలో ఏ ప్రాంతంలో ఎన్నికలు జరిగినా నిధులు ఇక్కడ నుంచి వెళుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం అక్షయ పాత్రలాగా కనిపిస్తోందని, ఆ పార్టీకి రాష్ట్ర పచ్చనోట్ల పరిశ్రమ అని తీవ్రంగా విమర్శించారు.Source: ఏపీ న్యూస్ | 1 Mar 2009 | 7:54 am బాపూజీ వాడిన వస్తువులను రక్షించుకుందాం: భారత్మహాత్మా మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ(బాపూజీ)కి చెందిన వ్యక్తిగత వస్తువులు వేలం ద్వారా అమెరికాలో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళకుండా చేసేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మహాత్మా గాంధీ వాడిన మెటల్‌తో తయారు చేసిన అపురూపమైన కళ్ళద్ధాలు, పాదరక్షలు, పాకెట్ గడియారంతోబాటు అనేక వస్తువులను అమెరికాలో వేలానికి పెట్టిన విషయం విదితమే.Source: జాతీయ | 1 Mar 2009 | 7:52 am సురేందర్ మృతికి సర్కారే బాధ్యత: మందకృష్ణగాంధీభవన్లో దాడికి పాల్పడి మరణించిన ఎమ్మార్పీఎస్ కార్యకర్త సురేందర్ మాదిగ మృతికి వైఎస్ సర్కారే బాధ్యత వహించాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. కార్యకర్త మృతిపై కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. సురేందర్ మృతికి వారంరోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించాలని మందకృష్ణ కార్యకర్తలకు మందకృష్ణ పిలుపు నిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ వాడల్లో కాంగ్రెస్ జెండాలు తొలగించి నల్లజెండాలు ఎగురవేస్తామని ఆయన అన్నారు.Source: ఏపీ న్యూస్ | 1 Mar 2009 | 7:38 am బీహార్‌లో వీరంగం సృష్టించిన నక్సల్స్బీహార్ రాష్ట్రంలోని ముంగేర్ ప్రాంతంలో అర్థరాత్రి నక్సల్స్ వీరంగం సృష్టించారు. ముంగేర్ ప్రాంతంలోని రతన్‌పూర్ రైల్వేస్టేషన్‌ను అర్థరాత్రి నక్సల్స్ పేల్చి వేశారు. ఈ సంఘటనలో పూర్తిగా రైల్వే సంచార, సిగ్నలింగ్, లైన్- క్లియర్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. దీంతో పాట్నా-హౌరా రైలు మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని రైల్వే అధికారులు తెలిపారు. బీహార్ ప్రాంతానికి చెందిన పోలీసు ఉన్నతాధికారి నీలమణి మాట్లాడుతూ... ఈ సంఘటనా స్థలానికి పోలీసు బలగాలతోబాటు ఇతర ఉన్నతాధికారులు చేరుకుని పరిస్థితిని సమీక్షించినట్లు ఆయన తెలిపారు.Source: జాతీయ | 1 Mar 2009 | 7:32 am వైఎస్సార్ మోసం చేశారు: మందకృష్ణరాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి మాదిగలను మోసం చేశారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. కాంగ్రెస్ పార్టీని ఓడించడమే తమ ప్రధాన ఎజెండా అని, త్వరలోనే తమ రాజకీయ ప్రణాళికను ప్రకటిస్తామని వెల్లడించారు. హింసా రాజకీయాల్ని ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ నేతలేనని, వారి హింసతో పోల్చుకుంటే తమది చాలా తక్కువేనని మందకృష్ణ సమర్థించుకున్నారు. ఎస్సీ వర్గీకరణ సాధించడానికి ఇక రాజకీయ సమరం ప్రారంభం అయ్యిందని మందకృష్ణ తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 1 Mar 2009 | 6:49 am ఎమ్మార్పీఎస్ కార్యకర్త మృతిహైదరాబాద్లోని గాందీభవన్‌లో శనివారం జరిగిన దాడి ఘటనలో గాయపడ్డ ఎమ్మార్పీఎస్ కార్యకర్త సురేందర్ మాదిగ చికిత్స పొందుతూ ఆదివారం ఇమేజ్ ఆసుపత్రిలో మృతి చెందాడు. అలాగే దామోదర్ పరిస్థితి మరింత విషమంగావుందనికూడా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ సమాచారం అందుకున్న ఎమ్మార్‌పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మేము చనిపోయినాకూడా మీరు ఉద్యమం నడపాలని సురేందర్ తదితరులు కోరినట్లు ఆయన ఆవేదన చెందారుSource: ఏపీ న్యూస్ | 1 Mar 2009 | 6:19 am అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడినుంచైనా పోటీ: పురంధరేశ్వరీరానున్న సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ అధిష్టానం ఎక్కడినుంచి పోటీ చేయమని చెబితే అక్కడినుంచి ఎవరిపైనానా తాను పోటీకి సద్ధమని మాజీ ముఖ్యమంత్రి తనయురాలు, కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. ప్రస్తుతానికైతే అధిష్టానం తనకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, నేను ఎక్కడినుంచి పోటీ చేయాలనేది అధిష్టానానికి బాగా తెలుసునని ఆమె అన్నారు.Source: ఏపీ న్యూస్ | 1 Mar 2009 | 5:15 am బీజేపీలో ముస్లిం నాయకులుండకూడదు: విహెచ్పీషాహ్నవాజ్ హుస్సేన్, ముఖ్తార్ అబ్బాస్ నక్వీ లాంటి ముస్లిం నేతలు బీజేపీలోనున్న విషయం విదితమే. కాని వీరంటే విశ్వహిందూ పరిషత్‌కు అస్సలు గిట్టడంలేదు. ముఖ్యంగా ఏ ముస్లిం నాయకులుకూడా భారతీయ జనతా పార్టీలో వుండడానికి వీలులేదని స్పష్టం చేసింది. వీరిని మేము ఎట్టి పరిస్థితులలోనూ ఒప్పుకోమని విశ్వహిందూ పరిషత్ నాయుకుడు గిరిరాజ్ కిషోర్ స్పష్టం చేశారు.Source: జాతీయ | 1 Mar 2009 | 4:37 am తీరప్రాంత భధ్రత నావికాదళానికే: ఆంటోనిదేశం చుట్టూవున్న తీరప్రాంత రక్షణకు సంబంధించి భారత నావికాదళానికే బాధ్యతలు అప్పగించామని దేశ రక్షణ శాఖ మంత్రి ఎకే. ఆంటోని తెలిపారు. నావికాదళానికి తీరప్రాంత రక్షక దళం సహకరిస్తుందని ఆయన తెలిపారు. కోస్తా ప్రాంతంలోనున్న పలు కేంద్ర సంస్థలుకూడా నావికాదళానికి సహకరిస్తాయని ఆయన తెలిపారు. తీరప్రాంత రక్షణ వ్యవహారాలలో పలు సంస్థలు నిమగ్నమైవున్నందున వాటికి నాయకత్వం వహించేందుకు నావికాదళానికి బాధ్యతలు ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.Source: జాతీయ | 1 Mar 2009 | 3:45 am రాజకీయాలలోనూ నేను రాణిస్తా: అజహరుద్దీన్భారత క్రికెట్ జట్టుకు ఉత్తమ కెప్టెన్‌గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నట్లే రాజకీయాలలోనూ రాణిస్తానని మాజీ క్రికెట్ కెప్టెన్ అజహరూద్దీన్ తెలిపాడు. రాజకీయ నాయుకులకు కావలసిన అన్ని అర్హతలు తనకు ఉన్నాయన్నాడు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన అజహర్ విద్య, ఆరోగ్య రంగాలలో గణనీయమైన మార్పులు తీసుకురావడానికి తనవంతు కృషి చేస్తానని చెపుతున్నాడు. క్రికెట్ ఆటలో సిక్సర్లు కొట్టలేకపోయి ఉండవచ్చు కానీ, రాజకీయాలలో తనవైపు వచ్చిన ప్రత్యర్థి బంతులను సమర్థవంతంగా ఎదుర్కొనగల సత్తా తనకు ఉందని అజహర్ ధీమా వ్యక్తం చేశాడు.Source: జాతీయ | 28 Feb 2009 | 3:11 pm గాంధీభవన్‌లో ఎమ్మార్పీఎస్ కార్యకర్తల విధ్వంసంకాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రాకను నిరసిస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) కార్యకర్తలు విధ్వంసానికి పాల్పడ్డారు. శనివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్‌కు నిప్పంటించారు. భవనం అంతా మంటలు వ్యాపించాయి. ఇంతటితో ఆపకుండా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.Source: ఏపీ న్యూస్ | 28 Feb 2009 | 2:01 pm తెలంగాణాకు కాంగ్రెస్ అనుకూలమే: డీఎస్ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కాంగ్రెస్ పార్టీ అనుకూలమేనని పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి శాసనసభలోనే ప్రకటించారని చెప్పారు. దేశంలోనే వైఎస్సార్ ఉత్తమ ముఖ్యమంత్రి అని పెరేడ్ గ్రౌండ్స్‌లో శనివారం జరిగిన బహిరంగ సభలో డీఎస్ కొనియాడారు.Source: ఏపీ న్యూస్ | 28 Feb 2009 | 1:46 pm షాక్ దర్శకుడితో "ఎన్టీఆర్"..!రవితేజ హీరోగా రామ్‌గోపాల్ వర్మ నిర్మించిన "షాక్" చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ చిత్రంలో యువ హీరో ఎన్టీఆర్ నటించనున్నారు. "కొంచెం ఇష్టం కొంచెం కష్టం" నిర్మాత నల్లమలుపు బుజ్జి ఈ చిత్రానికి నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.Source: వినోదం | 28 Feb 2009 | 12:26 pm మంగళూరు పబ్ కేసు: ఎన్‌సీడబ్ల్యూ సభ్యురాలి తొలగింపుమంగళూరు పబ్ దాడి వివాదంపై జాతీయ మహిళా సంఘం (ఎన్‌సీడబ్యూ) సభ్యురాలు నిర్మల వెంకటేశ్‌ను ప్రభుత్వం శుక్రవారం తొలగించింది. శ్రీరామ సేన కార్యకర్తలు ఇటీవల మంగళూరులోని ఓ పబ్‌పై దాడి చేసి, మహిళలతోపాటు, అందులోనివారిపై వేధింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే.Source: జాతీయ | 28 Feb 2009 | 12:22 pm
|