వచ్చే లోక్‌సభ ఎన్నికలలో యూపీఏ ప్రభుత్వంలోని పార్టీలన్నీ ఒకే గొడుగు కిందకు చేరి పోటీ చేయబోవడంలేదని కాంగ్రెస్ పార్టీ చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ ఓ పెద్ద అవకాశవాద పార్టీ అని తేటతెల్లమైందని సీపీఐ నేత ప్రకాష్ కారత్ విమర్శించారు. కాంగ్రెస్ చేతిలో మోసపోయిన యూపీఎ భాగస్వామ్య పార్టీలతో తాము మంతనాలు జరిపుతున్నామన్నారు. ప్రతి రాష్ట్రంలోనూ మారుతున్న రాజకీయ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామన్నారు. Source: జాతీయ | 27 Feb 2009 | 2:38 pm