|
యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో "కరెంట్"నటసామ్రాట్ అక్కినేని మనుమడు, "కింగ్" నాగార్జున మేనల్లుడు, యువకథానాయకుడు సుశాంత్ హీరోగా, స్నేహా ఉల్లాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం "కరెంట్". అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రీనాగ్ కార్పొరేషన్ పతాకంపై చింతలపూడి శ్రీనివాసరావు, ఎ. నాగసుశీల...Source: వినోదం | 27 Feb 2009 | 12:48 pm మా నాన్నలా ఉండకూడదు"మనమ్మాయికి మంచి అందగాడిని, తెలివితేటలు గల వాడిని, ఆస్తిపరుడిని వరునిగా తేవాలనుకుంటున్నాను" భార్యతో చెప్పాడు...Source: వినోదం | 27 Feb 2009 | 12:00 pm శనగపిండి ఎంతండి..?"మా షాపులో ఏది కొన్నా ఒక రూపాయి తగ్గించి అమ్ముతాం" చెప్పాడు షాపతను "ఏభై గ్రాముల శనగపిండి ఎంత..?"Source: వినోదం | 27 Feb 2009 | 11:59 am మహాకూటమి వస్తే తెలంగాణ ఇస్తుంది : ఎర్రబెల్లిమహాకూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్నిఏర్పాటు చేస్తుందని టీడీపీ పొలిట్‌బ్యూరో, ఎంపీ ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తొలి శాసనసభ సమావేశాల్లోనే తెలంగాణా ఏర్పాటును కోరుతూ తీర్మానం చేస్తామని ఎర్రబెల్లి హామీ ఇచ్చారు. మూడో కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడేనని, ఆయన నేతృత్వంలోనే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటవుతుందని ఎర్రబెల్లి వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 27 Feb 2009 | 11:52 am మళ్లీ కాంగ్రెస్‌కే అధికారం : వైఎస్సార్ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలను అందించే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాటుపడిందని అందుకు ప్రతిఫలంగా.. మరోసారి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన గిరిజన సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ఇందిరమ్మ రాజ్యమంటే ఇంటింటా సౌభాగ్యమని పునరుద్ఘాటించారు. గిరిజనుల అభివృద్ధే లక్ష్యంగా సోనియాగాంధీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం విశేష కృషి చేసిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.Source: ఏపీ న్యూస్ | 27 Feb 2009 | 10:46 am యూపీఏ ప్రభుత్వంపై ములాయం గుర్రుకేంద్రంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (యూపీఏ) ప్రభుత్వంపై సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ) అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ శుక్రవారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీబీఐ సాయంతో తనను జైలుకు పంపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందనీ ఆయన ఆరోపించారు. ఎటావాలో చరణ్ సింగ్ పీజీ కాలేజీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ములాయం మాట్లాడుతూ... భారత్ అమెరికా అణు ఒప్పందంపై సంక్షోభం నెలకొన్న సమయంలో.. బయటినుంచి తాము మద్ధతు ఇచ్చిన ప్రభుత్వమే.. ఇప్పుడు తనను జైలుకు పంపే ప్రయత్నంలో బిజీగా ఉందని ఆరోపణాస్త్రాలు సంధించారు.Source: జాతీయ | 27 Feb 2009 | 10:13 am సోమనాథ్ సుదీర్ఘ రాజకీయ జీవితానికి తెరలోక్సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ సుదీర్ఘ రాజకీయ, పార్లమెంటరీ జీవితానికి గురువారంతో తెరపడింది. పార్లమెంట్ చరిత్రలోనే అత్యంత అసాధారణ సంఘటనలకు సాక్ష్యంగా నిలిచిపోయిన 14వ లోక్‌సభకు కూడా ఇదే రోజు ముగింపు లభించింది. పార్లమెంట్ విలువలను కాపాడటం కోసం అనేక కఠిన నిర్ణయాలు తీసుకున్న సోమనాథ్ చటర్జీ రాజకీయాలకు పూర్తిగా దూరం అయ్యారు.Source: జాతీయ | 27 Feb 2009 | 9:28 am చాచాజీ కలలు నిజం చేద్దాం : సోనియారెండు రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్ విచ్చేసిన కాంగ్రెస్ అధినేత్రి శ్రీమతి సోనియాగాంధీ.. అభయహస్తం పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం మెదక్ పర్యటనకు బయల్దేరారు. జిల్లాలోని కంది గ్రామంలో నూతనంగా ప్రారంభించనున్న ఐఐటీ కళాశాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సోనియాగాంధీ మాట్లాడుతూ... దేశానికి శాస్త్ర సాంకేతిక పౌరుల ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ కలలను విద్యార్థులు సాకారం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు కంది ఐఐటీ బాటలు వేయాలని సోనియా ఆకాంక్షించారు.Source: ఏపీ న్యూస్ | 27 Feb 2009 | 8:16 am తిరుమలేశుని సేవలో యడ్యూరప్పకర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన 67వ జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పద్మావతి అతిథి గృహాల వద్ద తిరుమల ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. యడ్యూరప్ప కుటుంబం మరియు ఇతర కర్ణాటక మంత్రులకు కలిపి ఆలయ ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి, డిప్యూటీ ఈవో సిద్ధయ్యలు స్వామివారి దర్శనం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను యడ్యూరప్పకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం అన్నిరంగాల్లోనూ పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. రానున్న ఎన్నికలలో భారతీయ జనతాపార్టీ విజయం సాధించటం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.Source: జాతీయ | 27 Feb 2009 | 8:03 am మీతో ప్రస్తుతం మాట్లడలేము: భారత్ముంబయి దాడుల అనంతరం ఇరుదేశాల మధ్య నిలిచిపోయిన సంక్షిష్ట చర్చల ప్రక్రియను తిరిగి ప్రారంభించాలనే పాక్ ప్రభుత్వం ప్రతిపాదనను భారత్ తోసిపుచ్చింది. ఈ దాడుల అనంతరం ఇరుదేశాల ఉన్నతాధికారులు తొలిసారి కొలంబోలో సమావేశమయ్యారు. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శివశంకర్ మీనన్, పాక్ విదేశాంగ శాఖ కార్యదర్శి సల్మన్ బషీర్ మధ్య గురువారం జరిగిన చర్చల్లో పై ప్రతిపాదనను భారత్ తోసిపుచ్చింది. పాక్ ప్రభుత్వం ఉగ్రవాదంపై విశ్వసనీయ చర్యలు తీసుకునే వరకు ఈ చర్చల పునరుద్ధరణకు భారత్ ససేమిరా అంది.Source: జాతీయ | 27 Feb 2009 | 7:24 am ఆంధ్ర మహిళలు దేశానికే ఆదర్శం : సోనియాఏఐసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియాగాంధీ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి శుక్రవారం ఉదయం చేరుకున్నారు. రెండు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విచ్చేసిన ఆమెకు.. బేగంపేట విమానాశ్రయంలో పలువురు ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. అనంతరం... రాష్ట్రంలో దాదాపు 350 కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభించిన అభయహస్తం కార్యక్రమాన్ని సోనియా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా "అభయ హస్తం" లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న కాంగ్రెస్ అధినేత్రి ఈ పథకం లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత అభయహస్తం బాండ్ పేపర్లను మహిళలకు సోనియా అందించారు.Source: ఏపీ న్యూస్ | 27 Feb 2009 | 7:23 am నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతినెల్లూరు జిల్లాలో శుక్రవారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతులతో పాటు మరో 10మంది గాయపడ్డారు. ట్రాక్టరును లారీ ఢీ కొట్టిన ఘటనలో ఈ ప్రమాదం సంభవించింది.Source: ఏపీ న్యూస్ | 27 Feb 2009 | 7:00 am ఎన్సీపి సోనియా వ్యతిరేకతపై కాంగ్రెస్ అసంతృప్తినేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తన పత్రికలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై వ్యతిరేక విమర్శలు చేయడంపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. పత్రికలో వచ్చిన వార్తలు అసంబద్ధమైనవిగా ఏఐసిసి అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ పేర్కొన్నారు. ఎన్సీపి వ్యాఖ్యలతో ఇరు పార్టీల మధ్య ఉన్న సంబంధాలు తెగిపోయే ప్రమాదం ఏర్పడిందని ఆయన వ్యాఖ్యానించారు.Source: జాతీయ | 27 Feb 2009 | 6:48 am మదనపల్లెకు రానున్న అద్వానీచిత్తూరు జిల్లాలోని మదనపల్లెకు శుక్రవారం భాజపా సీనియర్ నాయకుడు, ప్రధాని అభ్యర్థి అద్వానీ రాకకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అద్వానీ రాకను పురస్కరించుకుని నగరమంతా భారీ కటౌట్లు, కాషాయ జెండాలతో దర్శనమిస్తోంది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాలకు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా.. మదనపల్లెలో ఏర్పాటు చేసిన సభలో భాజపా సీనియర్ నేత ఎల్.కె. అద్వానీ ప్రసంగించనున్నట్లు ఆ పార్టీ శ్రేణుల సమాచారం.Source: ఏపీ న్యూస్ | 27 Feb 2009 | 6:04 am నేటి నుంచి చిరు పాలమూరు యాత్రప్రజా రాజ్యం పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి శుక్రవారం నుంచి నాలుగు రోజులపాటు మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. కాగా, పీఆర్పీ స్థాపించిన తర్వాత ప్రజా అంకిత యాత్రలో భాగంగా ఆ పార్టీ అధినేత చిరంజీవి తొలిసారిగా ఈ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని కొడంగల్ నుంచి ప్రజా అంకిత యాత్రను ప్రారంభించనున్న చిరంజీవి, ఆ జిల్లాలోని 13 నియోజక వర్గాలలోని మారుమూల ప్రాంతాలలో పర్యటిస్తారు. ఈ సందర్భంగానే జిల్లా స్థాయి కార్యకర్తల శిక్షణా శిబిరాన్ని కూడా ఆయన ప్రారంభించనున్నారు. చిరు తమ జిల్లాలో పర్యటించడంవల్ల పీఆర్పీకి మంచి ఊపు వస్తుందని అక్కడి నేతలు ఆశిస్తున్నారు.Source: ఏపీ న్యూస్ | 27 Feb 2009 | 5:48 am లోక్‌సభలో చర్చకు రాని తెలంగాణ అంశంరాష్ట్రంలో పెనుదుమారం రేపుతున్న ప్రత్యేక తెలంగాణ అంశం 14వ లోక్‌సభలో చర్చకు రాలేదు. లోక్‌సభ సమావేశాల్లో చివరి రోజైన గురువారం తెలంగాణ అంశం చర్చకు రాకుండా అడ్డుకోవడంతో యూపీఏ ప్రభుత్వం విజయం సాధించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. గుజరాత్ భాజపా సభ్యుడు పి.ఎస్. గదావి తెలంగాణపై ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ తీర్మానం షెడ్యూల్ ప్రకారం గురువారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు తెలంగాణ అంశం చర్చకు రావాల్సి ఉండగా, సరిగ్గా ఆ సమయానికి ప్రభుత్వం 14వ లోక్‌సభ వీడ్కోలు కార్యక్రమాన్ని ప్రారంభించి తెలంగాణ అంశం చర్చకు తెరవేసింది.Source: ఏపీ న్యూస్ | 27 Feb 2009 | 5:46 am జయప్రద, రాజ్‌బబ్బర్‌లు మళ్ళీ పోటీకి సిద్ధంప్రముఖ సినీనటులు, లోక్‌సభ సభ్యులు జయప్రద, రాజ్‌బబ్బర్‌లు మరోసారి లోక్‌సభలో పాగావేసేందుకు ప్రయత్నాలు ముమ్నరం చేస్తున్నారు. దీనికోసం రాబోయే సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసేందుకు ఇద్దరూ వివిధ పార్టీల నుంచి టిక్కెట్ కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఈ సారి కూడా సమాజ్‌వాదీ తరఫున రాంపూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని జయప్రద భావిస్తున్నారు.Source: జాతీయ | 27 Feb 2009 | 5:30 am సోనియా రాష్ట్రానికి వస్తున్నారుఏఐసీసీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ శుక్రవారం రాష్ట్రానికి వస్తున్నారు. రెండు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆమె ప్రత్యేక విమానంలో ఉదయం గం. 11.15లకు హైదరాబాద్ చేరుకుంటారు. ఈ సందర్భంగా విమానాశ్రయ ప్రాంగణంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అభయ హస్తం కార్యక్రమంలో మహిళలతో ముచ్చటించనున్నారు. తదనంతరం మెదక్ జిల్లాలోని కంది ఐఐటీ భవనాలకు సంకుస్థాపన చేయనున్నారు. అటుపిమ్మట ఖమ్మం జిల్లా పర్యటనకు బయలుదేరి వెళతారుSource: ఏపీ న్యూస్ | 27 Feb 2009 | 4:23 am పాక్ ప్రశ్నలకు తగిన సమయంలో స్పందిస్తాం: ప్రణబ్ముంబయి ఉగ్రవాద దాడులకు సంబంధించి జరుపుతున్న దర్యాప్తు కోసం పాకిస్థాన్ ప్రభుత్వం అడిగిన ప్రశ్నలకు భారత్ తగిన సమయంలో సమాధానమిస్తుందని విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. మేము ఎప్పుడైతే సమాధానమిచ్చే పరిస్థితిలో ఉంటామో, అప్పుడే పాకిస్థాన్‌కు సమాచారం అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు.Source: జాతీయ | 27 Feb 2009 | 4:00 am వచ్చే ఎన్నికల్లో అధికారం కాంగ్రెస్‌దే: రోశయ్యవచ్చే ఎన్నికల్లో అధికారం కాంగ్రెస్‌దేనని రాష్ట్ర ఆర్థిక మంత్రి రోశయ్య జోస్యం చెప్పారు. ఎన్ని కూటములు వచ్చినా వచ్చే ఎన్నికల్లో అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారం చేపట్టడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. ఒంగోలు పర్యటన సందర్భంగా గెస్ట్‌హౌస్‌లో ఆయన మీడియా సమవేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను పదవిలోకి తెచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 26 Feb 2009 | 2:34 pm సోమ్‌నాథ్ ఓ రోల్ మోడల్: ప్రధానిలోక్సభ స్పీకర్ సోమ్‌నాథ్ చటర్జీ ఓ రోల్ మోడల్ అని ప్రధాని మన్మోహన్ సింగ్ కొనియాడారు. సోమ్‌నాథ్ నిష్పక్షపాతంగా వ్యవహరించడమే కాక చాలా హుందాగా ఉంటారన్నారు. 14వ లోక్‌సభ ఆఖరు రోజు సందర్భంగా ప్రధానమంత్రి తన సందేశాన్ని ప్రణబ్ ముఖర్జీకి అందజేశారు. ఈ సందేశాన్ని ప్రణబ్ లోక్‌సభలో చదివి వినిపించారు.Source: జాతీయ | 26 Feb 2009 | 2:29 pm బాల్‌థాకరేకు స్వల్ప అస్వస్థత: ఆస్పత్రిలో చేరికశివసేన అధినేత బాల్‌థాకరే గురువారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన ముంబయిలోని లీలావతి ఆస్పత్రికి చేర్చారు. అధిక జ్వరంతో బాధపడుతున్న కారణంగానే బాల్‌థాకరేను ఆస్పత్రికి తరలించినట్టు శివసేన వర్గాలు తెలిపాయి.Source: జాతీయ | 26 Feb 2009 | 1:44 pm కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కరువుభత్యం పెంపుకేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కరువుభత్యాన్ని ఆరు శాతం పెంచుతూ గురువారం మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 16 శాతం నుంచి కరువుభత్యాన్ని 22 శాతానికి పెంచే ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం తాజా సమావేశంలో ఆమోదించింది. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి పి.చిదంబరం వెల్లడించారు.Source: జాతీయ | 26 Feb 2009 | 12:20 pm
|