|
సోమ్‌నాథ్ ఓ రోల్ మోడల్: ప్రధానిలోక్సభ స్పీకర్ సోమ్‌నాథ్ చటర్జీ ఓ రోల్ మోడల్ అని ప్రధాని మన్మోహన్ సింగ్ కొనియాడారు. సోమ్‌నాథ్ నిష్పక్షపాతంగా వ్యవహరించడమే కాక చాలా హుందాగా ఉంటారన్నారు. 14వ లోక్‌సభ ఆఖరు రోజు సందర్భంగా ప్రధానమంత్రి తన సందేశాన్ని ప్రణబ్ ముఖర్జీకి అందజేశారు. ఈ సందేశాన్ని ప్రణబ్ లోక్‌సభలో చదివి వినిపించారు.Source: జాతీయ | 26 Feb 2009 | 2:29 pm బాల్‌థాకరేకు స్వల్ప అస్వస్థత: ఆస్పత్రిలో చేరికశివసేన అధినేత బాల్‌థాకరే గురువారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన ముంబయిలోని లీలావతి ఆస్పత్రికి చేర్చారు. అధిక జ్వరంతో బాధపడుతున్న కారణంగానే బాల్‌థాకరేను ఆస్పత్రికి తరలించినట్టు శివసేన వర్గాలు తెలిపాయి.Source: జాతీయ | 26 Feb 2009 | 1:44 pm కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కరువుభత్యం పెంపుకేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కరువుభత్యాన్ని ఆరు శాతం పెంచుతూ గురువారం మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 16 శాతం నుంచి కరువుభత్యాన్ని 22 శాతానికి పెంచే ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం తాజా సమావేశంలో ఆమోదించింది. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి పి.చిదంబరం వెల్లడించారు.Source: జాతీయ | 26 Feb 2009 | 12:20 pm "రావణ"కోసం ఓ పార్కులో ఐశ్వర్యారాయ్రావణ చిత్రం కోసం ఐశ్వర్యారాయ్ పూర్తిగా ఇంటికి దూరంగా గడుపుతోంది. రావణుని పాత్రలో నటిస్తున్న అభిషేక్ బచ్చన్ మాత్రం షూటింగ్ సమయాల్లో ముంబయి నుంచి షూటింగ్ లొకేషన్లకు నేరుగా వస్తున్నాడట. ఈ చిత్రం ముగిసిన తర్వాత...Source: వినోదం | 26 Feb 2009 | 12:18 pm రోజుకొకటి జడలో గుచ్చుకో..!"పిసినారితనానికి ఓ హద్దూ అదుపూ ఉండాలి.... మూరెడు మల్లెపూలు తెమ్మంటే పావలా పెట్టి పది విడి పూలు తెస్తారా..?" కోపంతో బుసకొడుతూ...Source: వినోదం | 26 Feb 2009 | 11:39 am జలగ రక్తం సరిపోయింది"నన్ను ఏడిపించి తీసుకున్న స్కూటర్‌ను నడుపుతూ... మా అల్లుడు యాక్సిడెంట్ చేశాడు. బోలెడంత రక్తం పోయింది. ఎవరి రక్తం వాడికి సూట్ కాలేదు"...Source: వినోదం | 26 Feb 2009 | 11:38 am ముగిసిన 14వ లోక్‌సభ సమావేశాలులోక్సభ చివరి సమావేశాలు గురువారం ముగిశాయి. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 14వ లోక్‌సభ సమావేశాలు గురువారంనాటి చివరి సమావేశాలతో నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఇదిలావుండగా సభ చివరిరోజున కేవలం 6వ వంతు ఎంపీలు మాత్రమే సభకు హాజరైయ్యారు.Source: జాతీయ | 26 Feb 2009 | 11:15 am మద్రాసు హైకోర్టు ఘర్షణ: విచారణ కమిటీ ఏర్పాటుమద్రాసు హైకోర్టులో పోలీసులకు, లాయర్లకు మధ్య ఏర్పడిన ఘర్షణపై విచారించేందుకు సుప్రీంకోర్టు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ ఆదేశాల మేరకు ఈ కమిటీ ఏర్పడింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో నియమించనున్న ఈ కమిటీ 15రోజుల్లో తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించనుంది.Source: జాతీయ | 26 Feb 2009 | 10:15 am బంగ్లాతో ఉన్న సరిహద్దు ప్రశాంతంగా ఉంది: చిదంబరంభారత్- బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో భద్రత పటిష్టంగానే ఉందని హోం శాఖా మంత్రి చిదంబరం తెలిపారు. బంగ్లాదేశ్‌తో ఉన్న 4,095 కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతానికి ఎటువంటి ముప్పు లేదని ప్రశాంతంగా ఉందని వెల్లడించారు. బంగ్లాదేశ్ రైఫిల్స్ (బీడీఆర్)లో తిరుగుబాటు చోటుచేసుకున్న నేపథ్యంలో చిదంబరం మాట్లాడుతూ.. దేశ సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయని చెప్పారు.Source: జాతీయ | 26 Feb 2009 | 10:11 am ఏఆర్.రెహ్మాన్, రతన్ టాటాలకు డి.లిట్స్లమ్ డాగ్ మిలినియర్ సంగీత దర్శకుడు రెండు ఆస్కార్ అవార్డులను గెలుచుకోగా, దేశంలోనే అతి తక్కువ ధరకు అందించనున్న నానో కారు యజమాని రతన్ టాటాలకు డి.లిట్ పురస్కారంతో సన్మానించడానికి అలీగఢ్‌కు చెందిన అలీగఢ్ ముస్లిం యూనివర్శిటి(ఏఎమ్‌యూ) సిద్ధమైంది. దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన అంశం ఆస్కార్ అవార్డును పొందడం. అలాంటి అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకున్న ఏఆర్. రెహ్మాన్‌ను డి. లిట్ బిరుదుతో సత్కరించాలని తమ విశ్వవిద్యాలయం నిర్ణియించిందని అలీగఢ్ ముస్లిం యూనివర్శిటి ప్రతినిధి రాహత్ అబరార్ తెలిపారు.Source: జాతీయ | 26 Feb 2009 | 9:26 am విద్యార్థిపై కేసునమోదుతన గర్ల్‌ఫ్రెండ్‌కి చెందిన అసభ్యకర చిత్రాలను తీసి వాటిని ఇంటర్నెట్, మొబైల్‌ఫోన్‌ల్లో ప్రసారం చేసిన బిజినెస్ స్కూల్ విద్యార్థిపై హర్యానా పోలీసులు ఐటి చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా నిందితుడిని బిజినెస్ స్కూల్ నుంచి సంబంధిత ప్రిన్సిపాల్ సస్పెండ్ చేశారు. నోయిడాలో ఉంటున్న కోల్‌కతాకు చెందిన ఈ విద్యార్థి ప్రస్తుతం పరారీలో ఉన్నట్ల సమాచారంSource: జాతీయ | 26 Feb 2009 | 7:18 am గెలుస్తామనే గుడ్డి నమ్మకంలో కాంగ్రెస్: ఎన్సీపీనేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ)కి చెందిన పత్రిక "రాష్ట్రవాదీ" కేంద్రంలో యూపీఏ కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగింది. ఇప్పటికే ఇరుపార్టీల మధ్య రాజకీయ వాతారణం బాగా వేడెక్కి ఉన్న సంగతి తెలిసిందే. దీనికి తాజా విమర్శలు ఆజ్యం పోయనున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకోవడం కాంగ్రెస్ పార్టీ గుడ్డి నమ్మకమని ఎన్‌సీపీ పత్రిక దుయ్యబట్టింది. గాంధీ కుటుంబం రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకుంటామనే అంధ విశ్వాసంతో ఉందని పేర్కొంది. యూపీఏ కూటమి ప్రభుత్వం సాధించిన అతికొద్ది విజయాలను చూసి కాంగ్రెస్ మితిమీరిన విశ్వాసంతో ఉందని వ్యాఖ్యానించింది.Source: జాతీయ | 26 Feb 2009 | 7:09 am 26/11 ఉగ్రవాదులు 284 ఫోన్ కాల్స్ చేశారు26/11 ఉగ్రవాద దాడులకు పాల్పడ్డ తీవ్రవాదులు దాడుల సమయంలో పాకిస్తాన్‌లోని లష్కరే గ్రూపు సభ్యులతో 284 ఫోన్ కాల్స్ చేసినట్లు ముంబయి క్రైం బ్రాంచ్ కనుగొంది. దాడులలో పాల్గొన్న పదిమంది తీవ్రవాదులు ఉపయోగించిన సెల్ ఫోన్ కాల్ వివరాలను కాల్ ఫోనెక్స్ అకౌంట్ ద్వారా ముంబయి క్రైం బ్రాంచ్ తెలుసుకున్నది. సుమారు 60 గంటలపాటు దాడులను ఏకధాటిగా కొనసాగించిన ఉగ్రవాదులు పాకిస్తాన్‌లోని లష్కరే తోయిబా ఉగ్రవాదులతో 284సార్లు మాట్లాడినట్లు తేలింది. దాడుల సమయంలో ఉగ్రవాదులకు బయట నుంచి సమాచారం అందుతోందన్న అనుమానంతో ముంబయి నగరంలోని ఫోను కనెక్షన్లన్నిటినీ సీజ్ చేసేవరకూ వారు సంభాషించుకున్నట్లు తేలింది.Source: జాతీయ | 26 Feb 2009 | 6:28 am "కావ్యాస్ డైరీ" ట్రైలర్ఛార్మి, మంజుల (సూపర్‌స్టార్ కృష్ణ కుమార్తె), శశాంక్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం "కావ్యాస్ డైరీ". ఇందిర ప్రొడక్షన్స్ పతాకంపై మంజుల భర్త సంజయ్ స్వరూప్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వి.కె.ప్రకాష్ దర్శకుడు. ఈ సినిమాలో టైటిల్ పాత్రలో ఛార్మి నటించింది. కుటుంబ అనుబంధాలను ప్రధాన కథా వస్తువుగా ఎంచుకుని ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. కుటంబ విలువలతో పాటు ఆసక్తి కలిగించే ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దామని దర్శకుడు తెలిపారు.Source: వినోదం | 25 Feb 2009 | 1:40 pm "ద్రోణ" ట్రైలర్నితిన్, ప్రియమణి జంటగా, కరుణకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న తాజా చిత్రం "ద్రోణ". సాయికృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై డి.ఎస్. రావు నిర్మిస్తున్న ఈ చిత్రం లవ్లీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరిదశలో ఉందని, తండ్రీకొడుకుల అనుబంధాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందించారని చిత్ర యూనిట్ వెల్లడించింది.Source: వినోదం | 25 Feb 2009 | 1:34 pm "ఆకాశమంత" ట్రైలర్ప్రకాష్, ఐశ్వర్య, త్రిష నటిస్తోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ "ఆకాశమంత". ఈ చిత్రం తెలుగు వర్షన్ షూటింగ్ ఇటీవలే ఫిలింసిటీలో జరిగింది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు బాధ్యతలు చేపట్టిన ఈ చిత్రానికి రాధా మోహన్ దర్శకుడు. దీనికి "ఐ లవ్ మై డాటర్" అనే కాప్షన్ జోడించారు. తమిళంలో "అభియుమ్ నానుమ్"గా డిసెంబరులో ఈ సినిమా రిలీజ్ అయింది. దీన్ని ప్రకాష్ రాజ్ నిర్మించారు. ఇదే చిత్రం తెలుగు వర్షన్‌ను దిల్‌రాజు తీసుకుని తెలుగు నేటివిటికి సరిపడా సెకండ్ ఆఫ్‌ను మార్చి చిత్రీకరిస్తున్నారు. ఇందులో జగపతిబాబు ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.Source: వినోదం | 25 Feb 2009 | 1:32 pm "16 డేస్" ట్రైలర్ మీకోసం..అరవింద్, ఛార్మీ హీరోహీరోయిన్లుగా ప్రభు సాలమన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం "16 డేస్". పి. మహేష్‌బాబు డి.వై. చౌదరిల సంయుక్త నిర్మాణ సారథ్యంలో, కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై విడుదలైన "16 డేస్" ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ చిత్రాన్ని తమిళంలో "లాడమ్" అనే పేరుతో తీశారు. తెలుగులో దీనిని అనువదించి, కొన్ని కామెడీ సన్నివేశాలు మాత్రమే చిత్రీకరించారు. ఇందులో ఛార్మీ ప్రధాన పాత్రగా ప్రచారం చేశారు. కానీ కథంతా హీరో అరవింద్ చుట్టూ తిరుగుతుంది. వ్యాపారరీత్యా ఛార్మీని ఎక్స్‌పోజింగ్‌కు ఉపయోగించుకున్నారు. దానికి ఆమె తగిన పారితోషికం కూడా పుచ్చుకుంది.Source: వినోదం | 25 Feb 2009 | 1:22 pm
|