మన పెళ్ళామే...!

"ఈ ఇల్లు మనదేనా..?" అడిగాడు రాజా "అవును" చెప్పాడు తేజ...
Source: వినోదం | 25 Feb 2009 | 11:21 am

ఏ ఊరెళ్ళాలి..?

"ఎక్కడికెళ్ళాలి...?" ఓ పల్లెటూరు వ్యక్తిని అడిగాడు కండక్టర్ "ఏడకి..." అన్నాడు ఆ వ్యక్తి...
Source: వినోదం | 25 Feb 2009 | 11:20 am

రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టులో సీబీఐ ఫిర్యాదు

సత్యం కేసు విచారణలో రాష్ట్ర ప్రభుత్వం తమకు సరిగా సహకరించడం లేదంటూ సీబీఐ ఆరోపించింది. సత్యం కేసు విచారణకు విచ్చేసిన తమకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమాత్రం సహకారం లభిచడం లేదని పేర్కొంటూ సీబీఐ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది.
Source: ఏపీ న్యూస్ | 25 Feb 2009 | 9:39 am

మాజీ మంత్రి సుఖ్‌రామ్‌కు మూడేళ్ళ జైలుశిక్ష

అక్రమ ఆస్తుల సంపాదన కేసులో కేంద్ర సమాచార శాఖ మాజీమంత్రి సుఖ్‌రామ్‌కు మూడేళ్ళ జైలుశిక్ష విధిస్తూ తీస్‌హజారీ కోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది. అలాగే రెండు లక్షల రూపాయల జరిమానా విధిస్తూ ఢిల్లీ కోర్టు తన తీర్పులో పేర్కొంది. ఆదాయానికి మంచి, అక్రమంగా ఆస్తులు సంపాదించారన్న ఆరోపణలపై సీబీఐ దాఖలు చేసిన పిటీషన్‌ను విచారణ జరిపిన కోర్టు సుఖ్‌రామ్‌ను ఈనెల 20వ తేదీన దోషిగా తేల్చిన విషయం తెల్సిందే.
Source: జాతీయ | 25 Feb 2009 | 9:39 am

మద్రాసు హైకోర్టు ఘర్షణలపై సుప్రీం కన్నెర్ర

మద్రాసు హైకోర్టు ప్రాంగణంలో చోటు చేసుకున్న ఘర్షణలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు బుధవారం కన్నెర్ర జేసింది. హైకోర్టు ప్రాంగణంలోకి పోలీసులను ఎవరు అనుమతించారని ప్రశ్నించారు. అలాగే, కోర్టు ప్రాంగణంలో ఉన్న పోలీసు స్టేషన్‌ను తక్షణం తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాకుండా, ఈ ఘర్షణలపై జ్యుడీషియల్ విచారణ జరుపనున్నట్టు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కేజీ.బాలకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది.
Source: జాతీయ | 25 Feb 2009 | 9:03 am

యువత పట్ల పార్టీల చిన్నచూపు: పవన్

రాజకీయ పార్టీలు యువతను పట్టించుకోనందువల్లే యువత రాజకీయాలకు దూరమయ్యారని యువరాజ్యం అధినేత పవన్‌కళ్యాణ్ విమర్శించారు. అయితే తమ ప్రజారాజ్యం పార్టీ వెలుగులోకి వచ్చాక యువత తమ వైఖరి మార్చుకున్నారని ఆయన పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 25 Feb 2009 | 7:51 am

నదిలో పడిన బస్సు: 30 మంది దుర్మరణం

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొంతమంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి నదిలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికుల్లో కనీసం 30 మంది మృత్యువాత పడ్డారు. అలాగే మరో 20 మందికి పైగా గాయపడ్డారు. పర్వత లోయలతో ఉండే ఈ జిల్లాలో ప్రయాణికుల బస్సు ఒకటి నదిలో పడిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది.
Source: జాతీయ | 25 Feb 2009 | 7:26 am

బేబీ ఆయిల్‌తో మసాజ్ చేసుకుంటా: శ్రియ

రోజురోజుకూ సినీ పరిశ్రమలో పెరుగుతున్న పోటీ నేపధ్యంలో శ్రియ తన అందంపై మరింత శ్రద్ధ పెట్టిందట. వైద్యుల సలహా మేరకే తిండి తింటోందట. దీంతో ఒక్కసారిగా నెలలోపే తన అందం రెట్టింపయిందట. తమిళ సినిమా కుట్టి చిత్రం షూటింగ్ కు శ్రియ వస్తుంటే యూనిట్ సభ్యులందరూ ఆశ్చర్య పోయారట.
Source: వినోదం | 25 Feb 2009 | 6:45 am

నేడో.. రేపో లోక్‌సభకు రానున్న ప్రధాని

బైపాస్ సర్జరీ చేయించుకున్న ప్రధాని మన్మోహన్ సింగ్ నేడో రేపో లోక్‌సభకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న 14వ లోక్‌సభ చివరి సమావేశాలు ఈనెల 26వ తేదీతో ముగియనున్నాయి. ప్రస్తుతం ఈ సమావేశాలకు దూరంగా ఉన్న ఆయన సమావేశం ముగిసేలాగా ఒక్కసారైనా హాజరుకావాలని భావిస్తున్నారు. దీనిపై తాత్కాలిక ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం లోక్‌సభలో ప్రకటన చేస్తారు.
Source: జాతీయ | 25 Feb 2009 | 6:37 am

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా మేనిఫెస్టో: తెదేపా

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తమ ఎన్నికల మేనిఫెస్టో ఉంటుందని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. తమ మేనిఫెస్టోలో భాగంగా సమాజంలోని అన్ని వర్గాలవారి సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలు తమ మేనిఫెస్టోలో ఉంటుందని ఆ పార్టీ ప్రకటించింది. ఈ విషయమై తెలుగుదేశ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అన్ని వర్గాల మధ్య సమతుల్యం పాటించే దిశగా వివిధ వర్గాల ప్రతినిధులతో బుధవారం సాయంత్రం సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 25 Feb 2009 | 6:05 am

జగన్ సంస్థలపై ఎస్ఎఫ్ఐవో విచారణ: తెదేపా

ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్ నిర్వహిస్తున్న సంస్థల్లో పలు ఆర్థిక కుంభకోణాలు జరుగుతున్నాయని దీనిపై విచారణ జరిపించాలని తీవ్ర ఆర్థిక నేరాల కార్యాలయం (ఎస్ఎఫ్ఐవో)ను ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కోరింది. ఈ మేరకు ఎర్రన్నాయుడు, మైసూరారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ తదితరులతో కూడిన తెదేపా నేతల బృందం ఎస్ఎఫ్ఐవో డైరెక్టర్ అజయ్‌నాథ్‌ను కలిసి విజ్ఞప్తి పత్రాన్ని అందజేసింది.
Source: ఏపీ న్యూస్ | 25 Feb 2009 | 6:01 am

తెదేపాతో సీపీఎం దోస్తీపై చిరు విమర్శలు

ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీతో సీపీఎం పొత్తు పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రజారాజ్యం అధినేత చిరంజీవి మరోమారు ప్రశ్నించారు. ఒకప్పుడు చంద్రబాబుపై విమర్శలు గుప్పించి, ప్రపంచ బ్యాంకు జీతగాడిగా అభివర్ణించిన వామపక్షాలు నేడు ఆయనతో పొత్తుకు ఎలా సిద్ధమయ్యాయని ఆయన ప్రశ్నించారు. అసలు చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలన్నదే సీపీఎం నేత రాఘవుల రహస్య ఎజెండాగా ఉందంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 25 Feb 2009 | 5:11 am

నేటి నుంచి మోడీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచార సమర శంఖాన్ని బుధవారం నుంచి పూరించనున్నారు. పునర్విభజనతో కొత్తగా ఏర్పడిన దిండోరి లోక్‌సభ స్థానం నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. పింపల్‌గాన్ బస్వంత్ జిల్లాలో ఈ నియోజకవర్గం ఉంది. దిండోరిలో జరిగే ఒక బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు.
Source: జాతీయ | 25 Feb 2009 | 5:06 am

ఓసీ విద్యార్ధులకూ ఫీజు రాయితీ: వైఎస్ తాయిలం

ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరో ఎన్నికల తాయిలాన్ని ప్రకటించారు. వచ్చే జూన్ నుంచి ఓసీ విద్యార్ధులకు సైతం ప్రభుత్వం ఫీజు రాయితీ కల్పించనుందని ఆయన తెలిపారు. మంగళవారం నిర్వహించిన నెల్లూరు జిల్లా రోడ్‌షో సందర్భంగా ముఖ్యమంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 25 Feb 2009 | 4:43 am

వైఎస్ అధికార దుర్వినియోగం: సీపీఐ ధ్వజం

ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతుండడం వల్లే ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన సంస్థల్లో ఇతరులు ఎక్కువ సంఖ్యలో పెట్టుబడులు పెడుతున్నారంటూ సీపీఐ ఆరోపించింది. వైఎస్‌ నుంచి ఏం ఆశించకుండానే ఆయన కుటుంబానికి చెందిన విద్యుత్ ప్రాజెక్టుల్లో, జగతి పబ్లికేషన్స్‌ల్లో ఇతరులు పెట్టుబడులు పెట్టారా? అని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ ప్రశ్నించారు.
Source: ఏపీ న్యూస్ | 25 Feb 2009 | 4:40 am

ముంబై దాడులపై నేడు ఛార్జీషీటు దాఖలు

గత యేడాది నవంబరు 26వ తేదీన దేశ వాణిజ్య రాజధాని ముంబైపై ఉగ్రవాదులు జరిపిన దాడి కేసులో ముంబై పోలీసులు బుధవారం ఛార్జిషీటు దాఖలు చేయనున్నారు. మొత్తం ఐదు వేల పేజీలతో కూడిన ఈ నివేదికను మెట్రోపాలిటన్ కోర్టు మేజిస్ట్రేట్‌కు సమర్పిస్తామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెల్లడించారు. ఇందులో దాడుల్లో పట్టుబడిన ఏకైక ఉగ్రవాది అజ్మల్ కసబ్‌పై హత్య, హత్యాయత్న కేసులతో సహా, పలు అభియోగాలు మోపినట్టు తెలుస్తోంది. అలాగే మరో 20 మంది ఉగ్రవాదుల పేర్లను కూడా ఇందులో పొందుపరచినట్టు ఆయన సూచన ప్రాయంగా వెల్లడించారు.
Source: జాతీయ | 25 Feb 2009 | 4:05 am

శివసేన మా పాత మిత్రపక్షం: అద్వానీ

భారతీయ జనతా పార్టీ, శివసేనల పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేలని ఎన్డీయే కూటమి ప్రధాని అభ్యర్థి ఎల్కే అద్వానీ స్పష్టం చేశారు. శివసేన పార్టీ 1984 నుంచి తమకు మిత్రపక్షమని ఆయన గుర్తు చేశారు. అందువల్ల తమమధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన మంగళవారం ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో స్పష్టం చేశారు. అలాగే, వచ్చే ఎన్నికల కోసం సీట్ల పంపకాల విషయంలో తమ రెండు పార్టీల మధ్య విభేదాలు వచ్చాయన్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు.
Source: జాతీయ | 25 Feb 2009 | 4:00 am

హోమ్ శాఖ అధికారులతో ఎన్నికల సంఘం భేటీ

సాధారణ ఎన్నికల సమయం సమీపిస్తున్న నేపధ్యంలో ముగ్గురు సభ్యులతో కూడిన ఎన్నికల అధికారులు మంగళవారం హోమ్ మంత్రిత్వ శాఖతో భేటీ అయింది. ఈ సమావేశంలో వచ్చే ఎన్నికలకు అవసరమైన భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. ఏప్రిల్- మే నెలల్లో జరిగే ఎన్నికలలో సమస్యాత్మక కేంద్రాలలో భద్రతా బలగాల సంఖ్యను పెంచాల్సిన ఆవశ్యకతపై చర్చించినట్లు ఎన్నికల కమిషన్ అధికారి ఒకరు చెప్పారు. సుమారు గంటన్నర సేపు జరిగిన ఈ సమావేశంలో హోమ్ శాఖ తమ అభిప్రాయాలను ఎన్నికల సంఘం ముందు ఉంచినట్లు తెలుస్తోంది.
Source: జాతీయ | 24 Feb 2009 | 2:47 pm