ఏవండోయ్ శుభవార్త

"ఏవండోయ్ మీకో శుభవార్త... మీరు తండ్రి కాబోతున్నారు.. నేను తల్లిని కాబోతున్నాను.." భర్తతో చెప్పింది సుశీల...
Source: వినోదం | 24 Feb 2009 | 11:50 am

అయితే డబ్బు ఇచ్చేస్తారా..?

"రేపు మీకు కుట్లు విప్పుతున్నాం" చెప్పాడు డాక్టర్ "పదివేలు పుచ్చుకుని కుట్లు వేశారు కదా...
Source: వినోదం | 24 Feb 2009 | 11:50 am

సేవా పన్ను తగ్గింపు: ప్రణబ్ ముఖర్జీ

అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం ప్రభావంతో కుదేలవుతున్న పరిశ్రమకు ఊరటనిస్తూ, కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఎక్సైంజ్, సేవా పన్నును తగ్గించింది. ఎక్సైంజ్ సుంకం, సేవా పన్నులను రెండు శాతం మేర తగ్గించాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ బాధ్యతల నిర్వహిస్తున్న విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ లోక్‌సభలో మంగళవారం వెల్లడించారు.
Source: జాతీయ | 24 Feb 2009 | 11:23 am

మౌలిక సదుపాయాలు విధ్వంసం చేయాలి: కేంద్రం

పాకిస్థాన్ ప్రభుత్వం వారి భూభాగంలోని తీవ్రవాద మౌలిక సదుపాయాలను పూర్తిగా ధ్వంసం చేసే దిశగా మరిన్ని చర్యలు చేపట్టాలని విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ కోరారు. భారత్‌తో శాంతి ప్రక్రియ పునరుద్ధరించాలనుకుంటే, పాక్ ప్రభుత్వం ముందుగా తీవ్రవాద మౌలిక సదుపాయాలు నాశనం చేయాలని ప్రణబ్ షరతు పెట్టారు.
Source: జాతీయ | 24 Feb 2009 | 11:22 am

మాజీ నక్సల్స్‌పై కేసుల ఎత్తివేతకు హామీ: పవన్

ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి వస్తే మాజీ నక్సలైట్లపై నమోదై ఉన్న కేసులను ఎత్తివేసేందుకు యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. మంగళవారం పలువురు మాజీ నక్సలైట్లు ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారినుద్దేశించి మాట్లాడుతూ, మాజీ నక్సలైట్ల పిల్లలకు అండగా ప్రజారాజ్యం ఉంటుందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 24 Feb 2009 | 10:48 am

కోస్తా-రాయలసీమల్లో కాంగ్రెస్‌కు పట్టం: వైఎస్

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ 150 సీట్లను గెలుచుకుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం రాష్ట్ర కేబినెట్ ఆఖరి సమావేశం ఆయన అధ్యక్షతన సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో సీఎం మూడు రకాల సర్వేలను తన మంత్రులకు వివరించారు. సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని సీఎం చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 24 Feb 2009 | 10:37 am

కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సినీ నటి శారద

తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ, ప్రముఖ సినీ నటి ఊర్వశి శారద మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి తనకు చాలా ఆనందం కల్గిందని, బలహీన బడుగు వర్గాల వారికి ఎంతో మేలు చేస్తున్నారన్నారు.
Source: ఏపీ న్యూస్ | 24 Feb 2009 | 10:03 am

'ఆస్కార్ విజేత'లకు పార్లమెంట్ "జయహో"

భారత కీర్తిని అంతర్జాతీయ సంగీత యవనికపై రెపరెపలాడించిన సంగీత సామ్రాట్‌ ఏఆర్‌.రెహ్మాన్‌, గీత రచయిత గుల్జర్, సౌండ్‌ ఇంజనీర్‌ రసూల్‌ పూకుట్టిలపై మంగళవారం పార్లమెంట్‌ ప్రశంసల జల్లు కురిపించింది. అలాగే స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ చిత్రం యూనిట్‌ సభ్యులను, నటీనటులను కూడా ప్రశంసల వర్షంలో ముంచెత్తింది. సైమల్‌ పింకీ చిత్రంలో నటించిన పింకీకి, ఆ చిత్ర యూనిట్‌ను కూడా పార్లమెంట్‌ అభినందించింది.
Source: జాతీయ | 24 Feb 2009 | 8:25 am

రేపు మాజీ మంత్రి సుఖ్‌రామ్‌కు శిక్ష ఖరారు

ఆదాయానికి మించి ఆస్తుల సంపాదించిన కేసులో దోషిగా తేలిన కేంద్ర మాజీ మంత్రి సుఖ్‌రామ్‌కు సీబీఐ కోర్టు శిక్షను ఖరారు చేయనుంది. ఈ కేసులో మాజీ మంత్రికి గరిష్ట శిక్ష పడాలని సీబీఐ భావిస్తోంది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ప్రభుత్వంలో కేంద్రం మంత్రిగా పని చేసిన సుఖ్‌రామ్ ఆదాయానికి మించి 4.25 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు కూడగట్టుకున్నారని ఆరోపణలు వచ్చాయి.
Source: జాతీయ | 24 Feb 2009 | 6:57 am

చంద్రబాబుకు నైతిక అర్హత లేదు సీఎల్పీ

అవినీతిలో పుట్టి పెరిగిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డిపై విమర్శలు చేసే నైతిక అర్హత లేదని కాంగ్రెస్ శానససభా పక్షం (సీఎల్పీ) అభిప్రాయపడింది. తొమ్మిదేళ్ళ పాటు అధికారంలో ఉన్న చంద్రబాబు కోటాను కోట్ల రూపాయలు స్వాహా చేసి హెరిటేజ్ సంస్థలో పెట్టుబడిగా పెట్టుకున్నారని రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఆరోపించారు.
Source: ఏపీ న్యూస్ | 24 Feb 2009 | 6:37 am

"లాల్లిపప్" భావన స్కిన్ షో

మలయాళంలో దుమ్ము లేపుతున్న బక్కపలచని భామ భావన తెలుగులోనూ ఓ పట్టు పట్టడానికి బయలుదేరింది. మలయాళంలో తాను నటించిన "లాల్లిపప్"లో నటించిన పాత్ర అంటే ఎంతో ఇష్టమని చెప్పే భావన ట్వంటీ-20లో స్కిన్ షోకు సై అంది. ఆ చిత్రంలో భావన ఓ పాటలో చేసిన నృత్య రీతులు...
Source: వినోదం | 24 Feb 2009 | 6:19 am

సరానా లోక్‌సభ స్థానం నుంచి రైల్వే మంత్రి పోటీ

నియోజకవర్గాల పునర్విభజన ఫలితంగా సిట్టింగ్ ఎంపీలకు స్థానభ్రంశం తప్పడం లేదు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి మంత్రి, ఆర్జేడీ అధినేత, కేంద్ర రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రాతినిథ్యం వహించే చాప్రా నియోజకవర్గం పునర్విభజన ఫలితంగా రద్దు అయింది. దీంతో ఆయన వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సరానా పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయనున్నట్టు వెల్లడించారు.
Source: జాతీయ | 24 Feb 2009 | 5:29 am

హైకోర్టు ఘర్షణలపై రేపు సుప్రీం విచారణ

శ్రీలంక తమిళులకు సంఘీభావం ప్రకటిస్తూ మద్రాసు హైకోర్టు న్యాయవాదులు జరుపుతున్న సమ్మెపై దాఖలైన పిటీషన్‌పై ఈనెల 25వ తేదీన విచారణ జరపాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. ఈ పిటీషన్‌పై ఈనెల 27వ తేదీన విచారణ జరగాల్సి వుంది. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పిటీషన్‌పై ముందుగానే విచారణ జరపాలని భారత అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించింది.
Source: జాతీయ | 24 Feb 2009 | 5:21 am

సోనియా గాంధీ పర్యటనలో మళ్లీ మార్పులు

కాంగ్రెస్ అధినేత్రి, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ ఈనెలలో జరుపతలపెట్టిన రాష్ట్ర పర్యటనలో మళ్లీ స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ పర్యటనలో భాగంగా ఈనెల 17వతేదీన ఆమె విజయవాడకు రావాల్సి వుంది. అయితే, ఈ పర్యటన రద్దు అయింది. విజయవాడకు బదులు ఆమె నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఢిల్లీ నుంచి ఆమె ప్రత్యేక విమానంలో బేగంపేటకు ఉదయం 10.15 చేరుకుంటారు.
Source: ఏపీ న్యూస్ | 24 Feb 2009 | 5:17 am

ఎన్నికల్లో బలహీన వర్గాలకు ప్రాధాన్యత: వెంకయ్య

రాబోయే ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్రాల్లో బలహీన వర్గాల వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు చెప్పారు. నెల్లూరులో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ భాజపా సర్వ, ధర్మ, సమభావన కలిగిన పార్టీ అని, వచ్చే ఎన్నికల బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. అలాగే రాష్ట్ర స్థాయిలో ఏ పార్టీ కోసం పొత్తులకు వెంపర్లాడటం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ నేతలు తమపై విమర్శలు గుప్పించడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 24 Feb 2009 | 3:34 am

రామనామ స్మరణకు జేడీయు దూరం

భారతీయ జనతా పార్టీ ప్రధాన ఎన్నికల ఎజండా అయిన రామమందిర నిర్మాణానికి జనతాదళ్ (యు) దూరంగా ఉంటుందని ఆ పార్టీ నాయకత్వం ప్రకటించింది. ఎన్డీయే కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్నప్పటికీ, మందిర నిర్మాణ అంశానికి ఎలాంటి సంబంధం ఉండబోదని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పష్టం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అభివృద్ధి.. న్యాయం అంశాలతోనే ప్రజల వద్దకెళతామని ఆయన వెల్లడించారు.
Source: జాతీయ | 24 Feb 2009 | 3:34 am

పాకిస్తాన్ ప్రశ్నలపై భారత్ స్పందిస్తుంది: ప్రణబ్

ముంబయి ఉగ్రవాద దాడులకు సంబంధించి ఎటువంటి సమాచారాన్నైనా అందించేదుకు భారతదేశం సిద్ధంగా ఉందనీ, అయితే అది అధికారికంగా మాత్రమే రావాలనీ విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. ఈ సందర్భంగా ప్రణబ్ మాట్లాడుతూ... పాకిస్తాన్‌కు అవసరమైన సమాచారం అందించడానికి భారత్ ఎప్పుడూ సిద్ధమేనన్నారు. పాకిస్తాన్ నుంచి తాము పొందిన సమాచారాన్ని అనుసరించి తమ స్పందన ఉంటుందన్నారు. అయితే ఉమ్మడి దర్యాప్తుకు మాత్రం అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే తాము దర్యాప్తు చేస్తూనే ఉన్నామనీ, ఈ పరిస్థితులలో పాకిస్తాన్ జోక్యం అవసరం లేదన్నారు.
Source: జాతీయ | 23 Feb 2009 | 2:17 pm

బస్సులకు నిప్పు పెట్టిన ఎమ్మార్పీఎస్

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు, కార్యకర్తలు సోమవారంనాడు రెండు బస్సులకు నిప్పంటించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల రైల్‌రోకో కార్యక్రమాలు నిర్వహించారు. నల్గొండ జిల్లా భువనగిరి మండలం రాయిగిరి రైల్వే‌స్టేషన్ సమీపంలో గోటు వద్ద సోమవారం ఉదయం ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు రెండు ఆర్టీసీ బస్సులకు నిప్పంటించారు.
Source: ఏపీ న్యూస్ | 23 Feb 2009 | 1:18 pm