|
బస్సులకు నిప్పు పెట్టిన ఎమ్మార్పీఎస్మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు, కార్యకర్తలు సోమవారంనాడు రెండు బస్సులకు నిప్పంటించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల రైల్‌రోకో కార్యక్రమాలు నిర్వహించారు. నల్గొండ జిల్లా భువనగిరి మండలం రాయిగిరి రైల్వేస్టేషన్ సమీపంలో గోటు వద్ద సోమవారం ఉదయం ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు రెండు ఆర్టీసీ బస్సులకు నిప్పంటించారు.Source: ఏపీ న్యూస్ | 23 Feb 2009 | 1:18 pm ముంబై దాడి.. ఉమ్మడి దర్యాప్తుకు ప్రణబ్ నోముంబై దాడులకు సంబంధించి భారత్-పాకిస్థాన్ ఉమ్మడి దర్యాప్తునకు అంగీకరించబోమని కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. అయితే ముంబై దాడి దర్యాప్తులో సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని ఆయన పాక్ ప్రభుత్వానికి హామీ ఇచ్చారు. దర్యాప్తునకు సంబంధించి పాక్ అధికారులకు భారత్ సహకారం అందిస్తుందని ప్రణబ్ సోమవారం స్పష్టం చేశారు.Source: జాతీయ | 23 Feb 2009 | 12:09 pm చెన్నై హైకోర్టు ఘర్ణణలు: న్యాయవాదుల నిరాహారదీక్షఫిబ్రవరి 19న తమపై అక్రమంగా చెన్నై హైకోర్టు ఆవరణలో పోలీసులు దాడికి పాల్పడటంపై న్యాయవాదులు సోమవారంనాడు ఒకరోజు నిరాహారదీక్ష చేపట్టారు. దీక్షలో పాల్గొన్న 300 మంది న్యాయవాదులు పోలీసులకు వ్యతిరేకంగా పెద్దపెట్టుని నినాదాలు చేశారు. నిరాహార దీక్షలో మద్రాస్ హైకోర్టు న్యాయవాదుల సంఘంతోపాటు వివిధ న్యాయవాద సంఘాలు పాల్గొన్నాయి. మద్రాస్ హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యదర్శి ఎమ్ వేలుమురుగన్ మాట్లాడుతూ... నిరాహారదీక్ష ముగిసిన అనంతరం తదుపరి ఏమి చేయాలన్నదానిపై చర్చిస్తామన్నారు.Source: జాతీయ | 23 Feb 2009 | 11:17 am ఆమరణ దీక్షకు వెనుకాడను: కరుణానిధిమద్రాసు హైకోర్టులో చోటు చేసుకున్న ఘర్షణలకు సరైన పరిష్కారం కనుగొనక పోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి హెచ్చరించారు. హైకోర్టు న్యాయవాదులకు, నగర పోలీసులకు మధ్య జరిగిన హింసాకాండతో మనస్తాపం చెందిన ఆయన, ఆస్పత్రిలోనే నిరాహార దీక్ష చేస్తానని వెల్లడించారు. అయితే దీక్షు పూనుకునే తేదీని తర్వాత ప్రకటిస్తానని తెలిపారు.Source: జాతీయ | 23 Feb 2009 | 9:55 am తెలంగాణాకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు: వైఎస్తెలంగాణా ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు. ఆయన సోమవారం కరీంనగర్ జిల్లా పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరిఖనిలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. కేంద్రం సూచించిన రెండో ఎస్సార్సీకి తెలంగాణా రాష్ట్ర సమితి అంగీకరించి ఉంటే, తెలంగాణా సమస్య ఎపుడో పరిష్కారమై ఉండేదన్నారు.Source: ఏపీ న్యూస్ | 23 Feb 2009 | 9:28 am పీడకలలు ఆగేందుకు మార్గం"నాకు రాత్రుళ్లో పీడకలలొస్తున్నాయి డాక్టర్..!" చెప్పింది గౌరి "ఎలాంటి కలలు వస్తున్నాయి..?" ప్రశ్నించింది డాక్టర్...Source: వినోదం | 23 Feb 2009 | 8:15 am ఎవడా దుర్మార్గుడు...?"పాపం ఆ సుభద్రకి కడుపు వచ్చిందంట..!" అన్నాడు ఈశ్వరరావు "అలాగా... ఎవడా దుర్మార్గుడు...?" అడిగాడు సుందరరావు..Source: వినోదం | 23 Feb 2009 | 8:14 am మార్చి 8 నుంచి బాలకృష్ణ "కోస్తా" రోడ్ షోటీడీపీ పార్టీని బలపరిచే దిశగా ఆ పార్టీ నేత, సినీ హీరో బాలకృష్ణ ఇటీవల రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఇదే కోవలో కోస్తా జిల్లాల్లోనూ మార్చి నెల 8 నుంచి బాలకృష్ణ తన పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. కొద్ది నెలల క్రితం యువగర్జన ద్వారా కోస్తా ప్రాంతంలోని గుంటూరులో పర్యటించిన బాలకృష్ణ అనంతరం పార్టీ ప్రచారాన్ని మాత్రం రాయలసీమ నుంచి ప్రారంభించారు. అలాగే రాయలసీమ పర్యటన అనంతరం తెలంగాణ ప్రాతంలో కూడా ఆయన తన పర్యటన నిర్వహించారు. ఇక ఇప్పుడు కోస్తాలో పార్టీ ప్రచారాన్ని నిర్వహించడానికి బాలకృష్ణ సిద్ధమయ్యారు.Source: ఏపీ న్యూస్ | 23 Feb 2009 | 7:50 am కాంగ్రెస్‌లో చేరనున్న "భోజ్‌పురి" స్టార్ రవికృష్ణన్భోజ్పురి వెండితెర హీరో రవికృష్ణన్ త్వరలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ విషయాన్ని ఆయన సోమవారం స్వయంగా వెల్లడించారు. కాంగ్రెస్ నుంచి మాత్రమే కాకుండా.. బీఎస్పీ, భాజపా వంటి పార్టీల నుంచి తనకు ఆహ్వానం అందిందని, అయితే కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తిపై లోతుగా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. 'బిగ్ బాస్' ఫైనల్ విజేతగా నిలిచిన ఈ భోజ్‌పురి స్టార్.. రాజకీయాలకు దూరంగా ఉంటానని గతంలో ప్రకటించారు.Source: జాతీయ | 23 Feb 2009 | 7:26 am రెహ్మాన్‌ను చూసి దేశం గర్వపడుతోంది: ప్రధానిభారతీయ చలన చిత్రం "స్లమ్ డాగ్ మిలియనీర్" ఆస్కార్ అవార్డులతో చరిత్ర సృష్టించడంపై ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్ర బృందానికి తన ప్రత్యేక అభినందనలు తెలిపారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్‌ను చూసి భారతదేశం గర్వపడుతోందన్నారు. ఆస్కార్ అవార్డులను కైవసం చేసుకున్న విజేతలకు ప్రధాని పేరుపేరునా అభినందనలు తెలియజేశారు. లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ స్లమ్ డాగ్ బృందం భారతదేశ చిత్ర పరిశ్రమకు అంతర్జాతీయ స్థాయి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిందని కొనియాడారు.Source: జాతీయ | 23 Feb 2009 | 7:22 am ఎన్నికల షెడ్యూల్ ఖరారుపై ఈసీ బిజీ.. బిజీసార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఖరారు కసరత్తుపై కేంద్ర ఎన్నికల సంఘం తలమునకలై ఉంది. లోక్‌సభ ఎన్నికలతో సహా, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒరిస్సా, జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీలకు కూడా ఎన్నికలకు కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఈసీ ప్రధానాధికారి ఎన్.గోపాలస్వామితో సహా ఇతర కమిషనర్లు నవీన్ చావ్లా, ఖురేషీలు ఎన్నికల షెడ్యూలు, నిర్వహణ ఏర్పాట్లపై తర్జనభర్జనలు పడుతున్నారు.Source: జాతీయ | 23 Feb 2009 | 6:47 am నిధులన్నీ కాంగ్రెస్ నేతల జేబుల్లోకే: చిరంజీవిప్రాజెక్టుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల్లో సగభాగం పర్సెంటేజీల రూపంలో కాంగ్రెస్ నేతల జేబుల్లోకే వెళ్తున్నాయని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 175 లక్షల కోట్లు ప్రాజెక్టుల కోసం కేటాయించి అందులో రూ. 40 వేల కోట్లు మంజూరు చేసింది అందుకోసమేనని ఆయన పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 23 Feb 2009 | 6:37 am చిరంజీవి రాకతో తెదేపా నేతల్లో నైరాశ్యం: దత్తన్నసినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో తెలగుదేశం పార్టీ నేతల్లో పూర్తిగా నైరాశ్యం అలముకుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొని సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంతో తెలుగుదేశం పార్టీ కోమా దశలోకి వెళ్లిందన్నారు.Source: ఏపీ న్యూస్ | 23 Feb 2009 | 6:36 am కాంగ్రెస్‌తో పొత్తుపై రేపు సోనియాతో ములాయం భేటీయూపీఎకు మద్దతు తెలిపిన సమాజ్‌వాదీ పార్టీ కాంగ్రెస్‌తో తన సంబంధాలను మరింత పటిష్టపరుచుకునేందుకు కసరత్తు మొదలు పెట్టింది. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్, అమర్ సింగ్ ఇద్దరూ సోనియాగాంధీతో మంగళవారం సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఇరు పార్టీలకు చెందిన సీనియర్ నేతలు పాల్గొంటారని సమాచారం.Source: జాతీయ | 23 Feb 2009 | 6:31 am ఎయిమ్స్ స్థాయికి నిమ్స్ వైద్య సేవలు: ముఖ్యమంత్రిదేశ రాజధాని న్యూఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)కు ధీటుగా నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ టెక్నాలజీ ఆస్పత్రిలో వైద్య సేవలను మెరుగు పరచనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి వెల్లడించారు. నల్గొండ జిల్లా బీబీనగర్ మండలంలోని రంగాపురం గ్రామ సమీపంలో 161 ఎకరాల స్థలంలో నిర్మించిన నిమ్స్ ఆస్పత్రి అవుట్ పేషెంట్ బ్లాక్‌ను ముఖ్యమంత్రి ఆదివారం ప్రారంభించారు.Source: ఏపీ న్యూస్ | 23 Feb 2009 | 5:45 am విధులకు హాజరుకానున్న ప్రధాని మన్మోహన్బైపాస్ సర్జరీ చేయించుకున్న ప్రధాని మన్నోహన్ సింగ్ పూర్తిగా కోలుకున్నారు. ఆయన మరో రెండు మూడు రోజుల్లో పూర్తి స్థాయి విధులకు హాజరుకానున్నారు. ఈనెల 26వ తేదీతో ముగియనున్న 14వ లోక్‌సభ ఆఖరి సమావేశాల చివరి రోజు సభా కార్యక్రమాలకు హాజరుకావాలని ఆయన భావిస్తున్నారు.Source: జాతీయ | 23 Feb 2009 | 5:37 am సంగీత్ సామ్రాట్ రెహ్మాన్‌కు భారత్ జయహో...భారత సంగీత సామ్రాట్ రెహ్మాన్‌కు కోట్లాదిమంది భారతీయులు జయహో అంటున్నారు. అయితే తాను మాత్రం అమ్మ అశీస్సులతోనే ఇంతిటివాడినయ్యానంటూ ఆస్కార్ అవార్డు వేడుకల వేదికపై నుంచి వినమ్రయంగా చెప్పుకొచ్చారు. ఈ లోకంలో దైవానికి మంచిన గొప్పది లేదన్నారు.Source: వినోదం | 23 Feb 2009 | 5:09 am అద్వానీకి మద్దతు ప్రశ్నేలేదు: చంద్రబాబుభారతీయ జనతా పార్టీ అగ్రనేత, ఎన్డీయే కూటమి తరపున ప్రధాని అభ్యర్థి అద్వానీ ప్రధాని అయ్యేందుకు తెలుగుదేశం మద్దతు ఇవ్వబోదని ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కేంద్రంలో భాజపా ఏర్పాటు చేసే ఏ ప్రభుత్వానికీ మద్దతివ్వబోమనీ, తమకిప్పుడు ఆ పార్టీతో ఎలాంటి సంబంధాలు లేవనీ చంద్రబాబు తేల్చి చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 23 Feb 2009 | 3:51 am
|