|
కాంగ్రెస్‌దే విజయం: వైఎస్.రాజశేఖర రెడ్డివచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం తథ్యమని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆయన నల్గొండలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయకుంటే పాపం చుట్టుకుంటుందని ప్రజలు అనుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ఎన్ని మహా, మెగాకూటములు వచ్చినా, విజయం మాత్రం తమదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.Source: ఏపీ న్యూస్ | 22 Feb 2009 | 10:07 am రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడదు: చిరంజీవివచ్చే ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోదని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అభిప్రాయపడ్డారు. కర్నూలు జిల్లా ప్రజా అంకిత యాత్రలో భాగంగా ఆయన ఆదివారం ఉదయం విలేకరులతో మాట్లాడుతూ తనను ఎన్టీఆర్‌తో పోల్చవద్దని, ఆయనకు సాటి మరొకరు లేరన్నారు. తాను మృదు స్వభావిననే విషయం అందరికీ తెలుసన్నారు.Source: ఏపీ న్యూస్ | 22 Feb 2009 | 9:33 am ముంబై రైల్వే స్టేషన్లకు బాంబు బెదిరింపుదేశ వాణిజ్య నగరమైన ముంబైలో గత ఏడాది నవంబర్‌లో జరిగిన తీవ్రవాదుల దాడులనుంచి ఇంకా తేరుకోకముందే.. ముంబై ప్రధాన రైల్వే స్టేషన్లలో బాంబులున్నాయన్న వార్త ప్రజలను భయాందోళనకు గురిచేసింది. ఈ వార్తతో ముంబై వాసులు ఉలిక్కిపడ్డారు. ముంబైలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో బాంబులు ఉన్నాయంటూ అగంతకులనుంచి ఫోన్లు రావడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. బెదిరింపు ఫోన్ల నేపథ్యంలో... ముంబైలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలోనూ తనిఖీలు నిర్వహించడంతోపాటు భద్రతను కట్టుదిట్టం చేశారు. బోరివిల్లి, బాంద్రా, దహిసర్ రైల్యే స్టేషన్లకు ఆచూకీ తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చాయని పోలీసులు తెలిపారు.Source: జాతీయ | 22 Feb 2009 | 8:47 am గుజరాత్‌లో పెరిగిన హెపటైటిస్ మృతుల సంఖ్యగుజరాత్లోని సబర్‌కంత జిల్లాలో హెపటైటిస్ బాధితుల మృతుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. దీంతో సబర్‌కంథ ప్రాంతవాసులు విపరీతమైన భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో హెపటైటిస్ వల్ల మృతి చెందినవారి సంఖ్య ఆదివారం నాటికి 40కి పెరిగిందని తెలిసింది. అదేసమయంలో మరో వెయ్యిమంది వరకు హెపటైటిస్ వల్ల అనారోగ్యానికి గురైనట్టు సమాచారం. కలుషితమైన సిరంజిలు వాడడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తుండడంతో... అందుకు కారణమైన వైద్యులపై గుజరాత్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే కొందరు డాక్టర్లును అదుపులోకి తీసుకున్న పోలీసులు శనివారం మరో వైద్యున్ని అరెస్టు చేశారు.Source: జాతీయ | 22 Feb 2009 | 7:34 am నెల్లూరు జిల్లా ప్రజారాజ్యం పార్టీ నేత హత్యనెల్లూరు జిల్లా ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఓ నేత దారుణంగా హత్యకు గురయ్యారు. కొద్దిరోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన ఈ నేత మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఇప్పటికే అందిన సమాచారం ప్రకారం... నెల్లూరు జిల్లా ప్రాజారాజ్యం పార్టీ కో- కన్వీనర్‌గా ఉన్న ఉలవపాటి రమేష్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ఇటీవల కిడ్నాప్ చేశారు. రమేష్‌తోపాటు ఆయన కుమారుడ్ని సైతం అగంతకులు కిడ్నాప్ చేశారు. అయితే రమేష్ కుమారుడు మాత్రం కిడ్నాపర్ల చెరనుంచి క్షేమంగా బయటపడ్డాడు.Source: ఏపీ న్యూస్ | 22 Feb 2009 | 7:10 am తాజ్‌కు ఉగ్రవాద ముప్పు: భద్రత పటిష్టంప్రపంచంలో ఎనిమిదో వింతగా పేరెన్నికగన్న అద్భుత కట్టడం తాజ్‌మహల్‌కు ఉగ్రవాదుల నుంచి ప్రమాదం పొంచివుందన్న సమాచారం అందింది. దీంతో అధికారులు గట్టి భద్రతను కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు తాజ్‌మహల్‌తో పాటు పలు చారిత్రక కట్టడాలకు తాలిబన్ల నుండి ముప్పు పొంచి ఉందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అంబికా సోని వెల్లడించారు. చారిత్రాత్మక కట్టడాల రక్షణ కోసం ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు.Source: జాతీయ | 22 Feb 2009 | 5:01 am వంద రోజుల్లో తెలంగాణా: మోడీ పునరుద్ఘాటనవచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి రావడం తథ్యమని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఆ తర్వాత సరిగ్గా వందరోజుల్లో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఆవిర్భావం కావడం తథ్యమని ఆయన జోస్యం చెప్పారు. వచ్చే ఆగస్టు 15న జరిగే స్వాతంత్ర్య సంబరాలతో పాటు తెలంగాణా ఆవిర్భావ ఉత్సవాలను ఈ ప్రాంత వాసులు జరుపుకుంటారని ఆయన తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 21 Feb 2009 | 1:13 pm పప్పూ యాదవ్‌కు టికెట్ నో: లాలూవచ్చే లోక్‌సభ ఎన్నికలలో పప్పూ యాదవ్‌కు టిక్కెట్టు ఇవ్వడం లేదని రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ స్పష్టం చేశారు. నిందితుడుగా ఉన్న ఒక వ్యక్తికి తమ పార్టీ తరపున పోటీ చేసే అర్హత లేదని వ్యాఖ్యానించారు. మధేపురా లోక్‌సభ స్థానం నుంచి తాను పోటీ చేయడానికి సమ్మతి తెలపాలని పప్పూ యాదవ్ అభ్యర్థించగా లాలూ కుదరదని చెప్పారు. నిర్దోషిగా రుజువైన తర్వాతే తాను ఆలోచిస్తానని పప్పూకు తెలిపినట్లు సమచారం. మొన్నటి వరకూ తీహార్ జైలులో ఉన్న పప్పూ యాదవ్ బెయిల్‌పై ఇటీవల బయటకొచ్చారు.Source: జాతీయ | 21 Feb 2009 | 1:11 pm "16డేస్"లో ఏం జరిగింది?తారాగణం.. అరవింద్, ఛార్మీ, కోటశ్రీనివాసరావు, ధర్మవరపు, రామిరెడ్డి తదితరులు. కెమేరా.. సుకుమార్, సంగీతం.. ధరణ్, దర్శకత్వం.. ప్రభు సాల్మన్. పాయింట్.. 16 రోజుల్లోనే పగ తీర్చుకోవడం. టాలీవుడ్‌లో అంకెలమీద చిత్రాలు రావడం చాలా తక్కువ. అలనాడు చిరంజీవి "47 రోజులు" చిత్రం ఒక ఎత్తయితే..Source: వినోదం | 21 Feb 2009 | 1:07 pm
|