|
వంద రోజుల్లో తెలంగాణా: మోడీ పునరుద్ఘాటనవచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి రావడం తథ్యమని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఆ తర్వాత సరిగ్గా వందరోజుల్లో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఆవిర్భావం కావడం తథ్యమని ఆయన జోస్యం చెప్పారు. వచ్చే ఆగస్టు 15న జరిగే స్వాతంత్ర్య సంబరాలతో పాటు తెలంగాణా ఆవిర్భావ ఉత్సవాలను ఈ ప్రాంత వాసులు జరుపుకుంటారని ఆయన తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 21 Feb 2009 | 1:13 pm పప్పూ యాదవ్‌కు టికెట్ నో: లాలూవచ్చే లోక్‌సభ ఎన్నికలలో పప్పూ యాదవ్‌కు టిక్కెట్టు ఇవ్వడం లేదని రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ స్పష్టం చేశారు. నిందితుడుగా ఉన్న ఒక వ్యక్తికి తమ పార్టీ తరపున పోటీ చేసే అర్హత లేదని వ్యాఖ్యానించారు. మధేపురా లోక్‌సభ స్థానం నుంచి తాను పోటీ చేయడానికి సమ్మతి తెలపాలని పప్పూ యాదవ్ అభ్యర్థించగా లాలూ కుదరదని చెప్పారు. నిర్దోషిగా రుజువైన తర్వాతే తాను ఆలోచిస్తానని పప్పూకు తెలిపినట్లు సమచారం. మొన్నటి వరకూ తీహార్ జైలులో ఉన్న పప్పూ యాదవ్ బెయిల్‌పై ఇటీవల బయటకొచ్చారు.Source: జాతీయ | 21 Feb 2009 | 1:11 pm "16డేస్"లో ఏం జరిగింది?తారాగణం.. అరవింద్, ఛార్మీ, కోటశ్రీనివాసరావు, ధర్మవరపు, రామిరెడ్డి తదితరులు. కెమేరా.. సుకుమార్, సంగీతం.. ధరణ్, దర్శకత్వం.. ప్రభు సాల్మన్. పాయింట్.. 16 రోజుల్లోనే పగ తీర్చుకోవడం. టాలీవుడ్‌లో అంకెలమీద చిత్రాలు రావడం చాలా తక్కువ. అలనాడు చిరంజీవి "47 రోజులు" చిత్రం ఒక ఎత్తయితే..Source: వినోదం | 21 Feb 2009 | 1:07 pm ఇంకో మూడేళ్లు ఆపకుండా..!"మన సీరియల్ మొదలెట్టి నూరేళ్ళు దాటింది సార్..! ఇక ముగించేద్దామా...!" అడిగాడు నిర్మాత "అప్పుడేనా...? ఇప్పుడే కదా... అవార్డ్ వచ్చింది.Source: వినోదం | 21 Feb 2009 | 11:28 am మళ్ళీ మొదలవుతుంది"నాకు ప్రతిరోజూ సీరియల్ కల వస్తోంది డాక్టర్ గారూ...!" చెప్పాడు పేషెంట్ "కొన్ని సమయాల్లో...Source: వినోదం | 21 Feb 2009 | 11:28 am స్కూల్లో "హలో..." అంటే రూ.100 ఫైన్: మహారాష్ట్రరాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లో 10వ తరగతి వరకూ చదివే పిల్లలూ, ఆ పిల్లలకు చదువు చెప్పే ఉపాధ్యాయులు మొబైల్ ఫోన్లను ఉపయోగించరాదంటూ మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. పాఠశాలల ఆవరణలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపాధ్యాయులు, పిల్లలు సెల్ ఫోన్లను ఉపయోగించరాదని తెలిపింది.Source: జాతీయ | 21 Feb 2009 | 10:18 am మంత్రి రేణుకపై ఎఫ్ఐఆర్ దాఖలుకేంద్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖా మంత్రి రేణుకా చౌదరిపై మంగళూరు పోలీసులు శనివారం ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. మంగళూరులోని ఓ పబ్‌లో శ్రీరామసేన కార్యకర్తలు మహిళలపై దాడి చేయడాన్ని తప్పుబట్టిన సందర్భంగా ఆమె మంగళూరును తాలిబన్ల స్థావరంలాగా చేస్తున్నారంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మంత్రి రేణుక చేసిన పోలిక తమ పట్టణాన్ని కించపరిచేదిగా ఉందంటూ మంగళూరు మేయర్ గణేష్ హొసబెట్టు, మరో 15 మంది ఆమెపై క్రిమినల్ కేసు పెట్టారు. ఈ కేసులకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ను దాఖలు చేయాల్సిందిగా మంగళూరులోని మూడవ జె.ఎం.ఎఫ్.సి. న్యాయమూర్తి పోలీసుల్ని ఆదేశించారు. అంతేగాకుండా, దర్యాప్తు నివేదికను మార్చి 20 లోగా సమర్పించాల్సిందిగా జడ్జి సూచించారు. దీంతో పోలీసులు రేణుక పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.Source: జాతీయ | 21 Feb 2009 | 10:04 am ప్రపంచదేశాలకు "ఆరోగ్యశ్రీ" రోల్మోడల్ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "రాజీవ్ ఆరోగ్యశ్రీ" పథకం ప్రపంచదేశాలన్నింటికీ రోల్‌మోడల్‌గా నిలిచిందని ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేర్కొన్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన హెల్త్ సిటీలో అపోలో ఆసుపత్రి భవనానికి శనివారం శంకుస్థాపన చేసిన సీఎం పై విధంగా స్పందించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ మాట్లాడుతూ... విశాఖతో పాటు చుట్టుప్రక్కల ఉండే అన్ని ప్రాంతాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలన్న లక్ష్యంతోనే హెల్త్ సిటీని ఏర్పాటు చేశామని వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 21 Feb 2009 | 9:45 am కూటమిని నమ్మబోరు : వెంకయ్యఇప్పటిదాకా ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటూ గడిపేసిన రాజకీయ పార్టీలు, ఇప్పుడు మహాకూటమి పేరుతో ఎన్నికల్లో ప్రజల ముందుకు వచ్చినట్లయితే... ప్రజలు నమ్మే పరిస్థితి లేదని భారతీయ జనతా పార్టీ అగ్రనేత వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. విజయవాడలో మీడియా ప్రతినిధులతో వెంకయ్య మాట్లాడుతూ... దేశం ఆర్థికంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో కనీసం ఆర్థికమంత్రిని కూడా నియమించలేని దుస్థితిలో యూపీఏ ప్రభుత్వం ఉందంటూ విమర్శించారు. సార్వత్రిక బడ్జెట్లో ప్రభుత్వ డొల్లతనం బయటపడిందని ఆయన ఆరోపించారు.Source: ఏపీ న్యూస్ | 21 Feb 2009 | 9:29 am యువకుల్లారా... సైన్యంలో చేరండి: కపిల్మాజీ క్రికెట్ ఆటగాడు కపిల్‌దేవ్ భారతదేశంలోని యువకులు సైన్యంలో చేరాలని పిలుపునిచ్చాడు. దేశం కోసం ప్రతి యువకుడు సైనికుడుగా మారాలని ఉద్వేగభరితంగా మాట్లాడారు. పంజాబ్‌లోని ఓ సైనిక శిక్షణ శిబిరంలో పాల్గొన్న కపిల్ పాత్రికేయులతో మాట్లాడుతూ... " నాకు భారత సైన్యం అంటే ఎంతో ఇష్టం. అలాగే నా ప్రజలంటే కూడా. సైన్యంలో చేరేందుకు మనవంటివారి ముందుకు రాకపోతే ఇంకెవరు వస్తారు. నా ఆలోచన ప్రకారం ప్రతి యువకుడు సైన్యంలో చేరాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ భారతదేశ సైన్యం మనవంటి వారికోసం ఎదురు చూస్తోంద"ని చెప్పారు.Source: జాతీయ | 21 Feb 2009 | 8:40 am ఇద్దరూ ఇద్దరే.. : మెగాస్టార్రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడులు ఇద్దరూ.. ఇద్దరేనని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి శనివారం ధ్వజమెత్తారు. కర్నూలు పర్యటనలో ఉన్న చిరు మాట్లాడుతూ... మహాకూటమి ఢిల్లీకి వెళ్లి అనవసరమైన రాద్ధాంతం చేస్తోందనీ.. వైఎస్సార్, బాబులు మాత్రం అవినీతిపరులు కాదా... వీరిపైన కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెదేపా, కాంగ్రెస్ పార్టీల పాలనలతో విసుగెత్తిన ప్రజలు మూడో ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు.Source: ఏపీ న్యూస్ | 21 Feb 2009 | 8:35 am మా తెలుగు తల్లికి మల్లెపూదండ"మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళారతులు.." అంటూ... అంతర్జాతీయ భాషా దినోత్సవం సందర్భంగా తెలుగుతల్లిని ప్రణమిల్లి నమస్కరిద్దాం. మాతృభాషను కళ్లల్లో పెట్టి కాపాడుకుందామని తెలుగు అధికార భాష సంఘం అధ్యక్షుడు ఏబీకే ప్రసాద్ అన్నారు. మాతృభాషా దినోత్సవం సందర్భంగా సచివాలయంలోని తెలుగుతల్లి విగ్రహానికి ప్రసాద్ పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు భాష పటిష్టత కోసం అందరూ తమ వంతు కృషి చేయాలని పిలుపు నిచ్చారు.Source: ఏపీ న్యూస్ | 21 Feb 2009 | 8:34 am పదవులకు అమ్ముడు పోయిన వామపక్షాలు: పవన్సిద్ధాంతాల కంటే.. అధికారం, పదవులపైనే వామపక్షాల నేతలు మొగ్గు చూపుతున్నారని యువరాజ్యం అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో, ఇప్పుడు తెలుగుదేశంతో కలిశారు. సంపద పెంచుకోవడమే వారి ధ్యేయంగా మారిందని ఆయన దుయ్యబట్టారు.Source: ఏపీ న్యూస్ | 21 Feb 2009 | 6:42 am హైకోర్టు ఘర్షణలు: కనిపిస్తే కాల్చివేతకు ఆదేశంమద్రాసు హైకోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు, పోలీసుల మధ్య చెలరేగిన ఘర్షణలు రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు ప్రాకాయి. దీంతో ఆందోళనకారులు, అల్లరిమూక రోడ్లపైకి వచ్చి విధ్వంసం సృష్టించినా, ప్రభుత్వ, ప్రజా ఆస్తులకు నష్టం కలిగించే చర్యలకు పాల్పడినా, అలాంటివారిని కాల్చి వేయాల్సిందిగా తమిళనాడు రాష్ట్ర పోలీసు డిజిపి జైన్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.Source: జాతీయ | 21 Feb 2009 | 5:41 am చివరి సమావేశానికి ప్రధాని హాజరు?ప్రస్తుతం జరుగుతున్న 14వ లోక్‌సభ ఆఖరి సమావేశాలకు చివరి రోజున ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరుకావాలని ఉవ్విళ్లూరుతున్నారు. బైపాస్ సర్జరీ అనంతరం ఇపుడిపుడే కోలుకుంటున్న ప్రదాని ఈ పార్లమెంట్ సమావేశాల చివరి రోజైన ఈనెల 26న పార్లమెంట్‌కు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సమావేశాల చివరి రోజైనా హాజరుకావాలని ఆయన కోరుకుంటున్నారు. అయితే, పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్న ప్రధాని, ఇపుడిపుడే కోలుకుంటున్నారు.Source: జాతీయ | 21 Feb 2009 | 4:59 am పార్లమెంట్‌కు పోటీ చేయను: షెకావత్ స్పష్టీకరణవచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పార్లమెంట్‌కు పోటీ చేయబోనని మాజీ ఉపరాష్ట్రపతి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత భైరాన్ సింగ్ షెకావత్ స్పష్టం చేశారు. ఆయన జైపూర్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఇటీవలి కాలంలో తనకు ఆరోగ్యం అంతగా సహకరించడం లేదన్నారు. అందువల్ల వచ్చే ఎన్నికల ప్రత్యక్ష పోరులో పోటీ చేయలేనని తేల్చి చెప్పారు. షెకావత్ తాజా వ్యాఖ్యలతో భాజపాలో ప్రధాని అభ్యర్థిత్వానికి పోటీ తప్పి పోయింది.Source: జాతీయ | 21 Feb 2009 | 4:30 am గాంధీజీ అహింసా మార్గం అనుసరణీయం: లూథర్కొన్ని దశాబ్దాల క్రితం జాతిపిత మహాత్మాగాంధీ అనుసరించిన అహింసా మార్గం నేటికీ అనుసరణీయమేనని మార్టన్ లూథర్ కింగ్-3 అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న ఆయన శుక్రవారం గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలో భారత్ ఒక ప్రత్యేకమైన, క్లిష్టమైన దేశంగా వెలుగొందుతోందన్నారు.Source: జాతీయ | 21 Feb 2009 | 4:19 am పరువు ప్రతిష్టలు దిగజార్చుతున్న వైఎస్: బాబుముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకున్న వైఎస్.రాజశేఖర రెడ్డి రాష్ట్ర పరువు ప్రతిష్టలను మంటగలుపుతున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గత నాలుగున్నరేళ్ళ కాలంలో వైఎస్, ఆయన కుటుంబ సభ్యులు చేసిన అవినీతి అంతాఇంతా కాదన్నారు. తాము అధికారంలోకి వస్తే వైఎస్ సాగిస్తున్న అవినీతిపై ఎలాంటి చర్యలు తీసుకుంటామనే విషయాన్ని త్వరలో వెల్లడించనున్న మేనిఫెస్టోలో పేర్కొంటామని స్పష్టం చేశారు.Source: ఏపీ న్యూస్ | 21 Feb 2009 | 3:51 am కరీంనగర్‌కు రానున్న నరేంద్ర మోడీఉత్తర తెలంగాణా జిల్లా కరీంనగర్‌లో భారతీయ జనతా పార్టీ నిర్వహించతలపెట్టిన సంకల్ప యాత్రలో పాల్గొనేందుకు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ శనివారం జిల్లా కేంద్రానికి రానున్నారు. ఈ సంకల్ప యాత్రకు ఆయన ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఇందుకోసం మోడీ శనివారం మధ్యాహ్నం అహ్మాదాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి వస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో కరీంనగర్ వెళ్లి సభలో పాల్గొంటారు.Source: ఏపీ న్యూస్ | 21 Feb 2009 | 3:41 am
|