|
వైఎస్‌ను ప్రాసిక్యూట్ చేయాలి: మహాకూటమిముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకుని పలు ఆర్థిక చట్టాల నిబంధనలను ఉల్లంఘించి పెద్ద ఎత్తున ఆర్థిక నేరాలకు పాల్పడిన వైఎస్.రాజశేఖర రెడ్డిని కేంద్ర ప్రభుత్వం తక్షణం ప్రాసిక్యూట్ చేయాలని మహాకూటమి నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు శుక్రవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. సాక్షి దినపత్రికలో, వైఎస్ కుటుంబంలో అనేక ఆర్థిక నేరాలు జరిగాయని వారంతా ముక్తకంఠంతో ఢిల్లీ స్థాయిలో తమ వాణిని వినిపించారు.Source: ఏపీ న్యూస్ | 20 Feb 2009 | 11:46 am సొంతంగా గుడి కట్టించుకున్న నయనతార!సాధారణంగా సినీ నటులకు అభిమానులు గుడులు కట్టించి పూజలు చేస్తుంటారు. ఈ కోవలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, తమిళ, తెలుగు నటి ఖుష్బూకు అభిమానులు స్వయంగా ఆలయాలు నిర్మించి పూజలు చేశారు. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే.Source: వినోదం | 20 Feb 2009 | 11:15 am రెండు స్థానాల నుంచి చిరు పోటీ: అల్లు అరవింద్వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్య పార్టీ అధినేత చిరంజీవి రెండు స్థానాల నుంచి పోటీ చేస్తారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, చిరు బావమరిది అల్లు అరవింద్ స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ చిరంజీవి పోటీ చేసే అసెంబ్లీ స్థానాల్లో ఒకటి తిరుపతి కాగా, మరొకదాన్ని ఎంపిక చేయాల్సి వుందన్నారు. ఈ స్థానాన్ని ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఎంపిక చేస్తామన్నారు.Source: ఏపీ న్యూస్ | 20 Feb 2009 | 10:46 am ఒక్కసారి చూస్తే అర్థం కాదా?!"నా అభిమాన హీరో నటించిన సిన్మాలన్నీ కనీసం నాలుగైదు సార్లు చూస్తాను తెలుసా..?" గొప్పగా చెప్పాడు సిద్ధూ...Source: వినోదం | 20 Feb 2009 | 8:41 am కథ వింటూ నిద్రలోకి..!"రాత్రిపూట వెళ్లి నిర్మాతకు కథ చెప్పడం తప్పయిపోయిందిరా..!" బాధగా చెప్పాడు సుందరం "ఏమయ్యిందిరా.. అలా...Source: వినోదం | 20 Feb 2009 | 8:40 am ఢిల్లీలో పోటా పోటీగా రాష్ట్ర రాజకీయాలుదేశ రాజధాని న్యూఢిల్లీలో రాష్ట్ర రాజకీయాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి, ఆయన తనయుడు వైఎస్.జగన్ అవినీతిపై జాతీయ స్థాయిలో మహాకూటమి నేతలు యుద్ధభేరీ మోగించారు. వైఎస్ కుటుంబ అవినీతిపై పుస్తకాలు ముద్రించి, సీడీలు రూపొందించి దేశ రాజధానిలో పంపిణీలు చేస్తున్నారు.Source: ఏపీ న్యూస్ | 20 Feb 2009 | 7:45 am ఆస్తుల కేసు: దోషిగా తేలిన మాజీ మంత్రి సుఖ్రామ్అక్రమ ఆస్తుల కేసులో కేంద్ర సమాచార శాఖ మాజీమంత్రి సుఖ్‌రామ్ దోషిగా తేలాడు. ఈ మేరకు ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు ఆయన్ను ముద్దాయిగా నిర్ధారించింది. 1991-96 మధ్యకాలంలో ప్రభుత్వ అధికారికా ఉన్న సమయంలో సుఖ్‌రామ్ ఆదాయానికి మించి ఆస్తులు, ఫామ్‌హౌస్‌లు సంపాదించినట్టు సీబీఐ కేసు నమోదు చేసింది.Source: జాతీయ | 20 Feb 2009 | 7:38 am మాజీ మావోయిస్టు సాంబశివుడు అరెస్టుఇటీవల పోలీసులకు లొంగి పోయిన మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాంబశివుడు అలియాస్ కోనపురి ఐలయ్యను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పలు హత్య, దాడి కేసుల్లో సాంబశివుడికి సంబంధం ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయని అందువల్ల ఆయనను అరెస్టు చేసినట్టు పోలీసులు చెపుతున్నారు.Source: ఏపీ న్యూస్ | 20 Feb 2009 | 6:50 am ప్రజా అంకిత రథంలోనే చిరు పెళ్లి వేడుకలుసినీ యాక్టర్ నుంచి పొలిటికల్ లీడర్‌గా మారిన చిరంజీవి క్షణం తీరిక లేకుండా జీవితం గడుపుతున్నారు. దీంతో ఆయన జీవితంలో వచ్చే బర్త్‌డే వంటి ముఖ్యమైన రోజులను కూడా తన ప్రజా అంకిత రథంలోనే జరుపుకోవడం ప్రారంభించారు. శుక్రవారం చిరంజీవి పెళ్లి రోజు. సాధారణంగా ఈ వేడుకలను ఆయన తన నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య జరుపుకుంటారు.Source: ఏపీ న్యూస్ | 20 Feb 2009 | 6:38 am బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం వాయిదాబ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం మరోమారు వాయిదా పడింది. శుక్రవారం నిర్వహించ తలపెట్టిన ఈ సూపర్‌సోనిక్ మిస్సైల్ ప్రయోగం వాయిదాకు గల కారణాలను మాత్రం రక్షణ శాఖ వర్గాలు వెల్లడించలేదు. తదుపరి ప్రయోగ తేదీ, సమయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఉపరితలం నుంచి ఉపరితలంపై గల లక్ష్యాలను చేధించే బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి ప్రయోగం ఫోఖ్రాన్ మైదానంలోని ఫైరింగ్ రేంజ్ నుంచి శుక్రవారం ఉదయం పది గంటలకు నిర్వహించాల్సి ఉంది.Source: జాతీయ | 20 Feb 2009 | 6:23 am తమిళనాడు అసెంబ్లీని కుదిపేసిన హైకోర్టు ఘర్షణలుమద్రాసు హైకోర్టులో చేటు చేసుకున్న ఘర్షణలు తమిళనాడు రాష్ట్ర శాసనసభను ఓ కుదుపు కుదిపాయి. శుక్రవారం సభ ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష సభ్యులు దీనిపై చర్చకు పట్టుబట్టాయి. అయితే స్పీకర్ అవుడియప్పన్ ఇందుకు తిరస్కరించడంతో ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేతో సహ ఇతర ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.Source: జాతీయ | 20 Feb 2009 | 5:47 am తెరాస అధినేతకు అధికార దాహం: వైఎస్తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావుకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై శ్రద్ధ లేదని, కేవలం అధికార దాహమే ఆయన ప్రధాన ఎజెండాగా మారిందని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా రాజకీయాల్లోకి వచ్చిన కేసీఆర్, కాలక్రమంలో తన పంథాను మార్చుకున్నారని విమర్శించారు. తెలంగాణ వ్యతిరేక శక్తులతో జత కలవడమే ఆ పార్టీ, కేసీఆర్ నిజాయితీని శంకించడానికి అవకాశం కల్పించిందన్నారు.Source: ఏపీ న్యూస్ | 20 Feb 2009 | 5:44 am సాక్షి పెట్టుబడులపై విచారణ: చంద్రబాబుతాము అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి వైఎస్ తనయుడు వైఎస్.జగన్ సొంత సంస్థల్లో పెట్టిన పెట్టుబడులపై విచారణ జరిపిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ విచారణలో వారు ఎలాంటి చట్టాన్ని ఉల్లంఘించినా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన గురువారం న్యూఢిల్లీలో వెల్లడించారు. ఇదే విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్న ప్రణబ్ ముఖర్జీ కూడా హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 20 Feb 2009 | 5:43 am కోర్టు శిక్షించింది.. ప్రజలు క్షమించారు: సంజయ్తనకు కోర్టు ఆరేళ్ళ శిక్ష విధించగా, ప్రజలు మాత్రం అన్ని విధాలుగా గౌరవించి, క్షమించారని రాజకీయనేతగా మారిన బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ అభిప్రాయపడ్డారు. గురువారం పాట్నాలో శ్రీకృష్ణ మెమోరియల్ హాల్‌లో జరిగిన సుఖ్‌దేవ్ నారేన్ క్రికెట్ టోర్నమెంట్ పోటీ విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో "మున్నభాయ్" పాల్గొని ఉద్వేగపూరితంగా ప్రసంగించారు.Source: జాతీయ | 20 Feb 2009 | 5:34 am రాష్ట్ర ఎన్నికల కమిటీకి ప్రణబ్ ముఖర్జీ సారథ్యంఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా స్వల్ప మార్పులు చేర్పులు చేసింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఎంతో కీలకమైన రాష్ట్ర శాఖ ఎన్నికల కమిటీ సారథ్య బాధ్యతలను పార్టీ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీకి అప్పగించింది. అలాగే ప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా వీరప్ప మొయిలీని కొనసాగించనుంది. జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.Source: జాతీయ | 20 Feb 2009 | 4:47 am మద్రాసు హైకోర్టు ఘర్షణలపై సీబీఐ విచారణమద్రాసు హైకోర్టులో గురువారం పోలీసులకు, లాయర్లకు మధ్య చోటు చేసుకున్న ఘర్షణలపై సీబీఐ దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ కేసులో వివరణ ఇవ్వాలని ఇప్పటికే సుప్రీం కోర్టు మద్రాసు హైకోర్టుతో పాటు పోలీసులకు, న్యాయవాదులకు నోటీసులు జారీ చేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఈ ఘర్షణలపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.Source: జాతీయ | 20 Feb 2009 | 4:01 am చెన్నై హైకోర్టు, న్యాయవాదుల సంఘాలకు "సుప్రీం" నోటీసులుచెన్నై హైకోర్టు, తమిళనాడులోని న్యాయవాదుల సంఘాలకు సుప్రీంకోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది. శ్రీలంకలోని తమిళుల సంక్షేమాన్ని కోరుతూ భారత్‌లో క్రిమినల్ చట్టాలను మార్చాలని డిమాండ్ చేస్తూ ప్రస్తుతం కొనసాగుతున్న సమ్మెపై వివరణ ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టు ఈ నోటీసులు ఇచ్చింది.Source: జాతీయ | 19 Feb 2009 | 2:56 pm చెన్నై హైకోర్టులో లాయర్లు-పోలీసుల ఘర్షణచెన్నై హైకోర్టులో న్యాయవాదులు, పోలీసుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు చెలరేగాయి. ఇవి శృతి మించిపోవడంతో పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. వీరిలో న్యాయమూర్తి ఆరుముగ పెరుమాల్ ఆదిత్యన్ కూడా ఉన్నారు. జనతా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామిపై రెండు రోజుల క్రితం కోడిగుడ్ల దాడి జరిగిన విషయం తెల్సిందే.Source: జాతీయ | 19 Feb 2009 | 1:55 pm లోక్‌సభలో "జగతి" పబ్లికేషన్స్ రభసలోక్సభలో గురువారం జగతి పబ్లికేషన్ అవినీతి కుంభకోణంపై మహాకూటమికి చెందిన సభ్యులు చర్చకు పట్టుబట్టారు. ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి, ఆయన తనయుడు వైఎస్.జగన్ సొంత పత్రిక జగతి పబ్లికేషన్స్‌లో చోటు చేసుకున్న అక్రమాలపై సభలో చర్చ జరపాలంటూ మహాకూటమికి చెందిన ఎంపీలు పట్టుబట్టారు. ఇతర పార్టీల ఎంపీల సహకారం తీసుకుని, స్పీకర్ పోడియంను చుట్టిముట్టి నినాదాలు చేశారు.Source: ఏపీ న్యూస్ | 19 Feb 2009 | 1:53 pm
|