ఎన్నికల జోతిష్యానికి కమీషన్ బ్రేక్

ఎన్నికల ముందు నిర్వహించే ఎగ్జిట్ పోల్స్‌పై ఆంక్షలు విధించారు. దీని ఫలితంగా సార్వత్రిక ఎన్నికలకు ముందే వివిధ పత్రికలు, మీడియాలు విరగబడి ఎన్నికల ఫలితాలపై సర్వే చేస్తే ఎన్నికల కమీషన్ చర్య తీసుకుంటుంది. ఈ నిషేధం ఎన్నికల్లో పోలింగ్‌కు రెండు రోజుల ముందు నుంచి ఎన్నికల చివరిదశ పూర్తయ్యే వరకు ఉంటుందని అధికారవర్గాలు వెల్లడించాయి.
Source: జాతీయ | 18 Feb 2009 | 12:21 pm

వామపక్షాలు మళ్లీ వస్తాయి: లాలూ

మతతత్వ శక్తులను అడ్డుకునేందుకు వామపక్షాలు తిరిగి యూపీఏ కూటమిలోకే మరోసారి వస్తాయని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అభిప్రాయపడ్డారు. అమెరికాతో కుదుర్చుకున్న అణు ఒప్పందం విషయంలో అధికార యూపీఏకు నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్‌కు, వామపక్షాలకు మధ్య ఇటీవల సంబంధాలు తెగిపోయిన సంగతి తెలిసిందే.
Source: జాతీయ | 18 Feb 2009 | 11:17 am

వారఫలాలంటే చాలా ఇష్టం

అభిమాన హీరోయిన్‌ను ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్ళాడు కుర్ర జర్నలిస్టు... "మేడం.. మీకు ఏ ఫలాలంటే ఇష్టం..?" అని అడిగాడు..
Source: వినోదం | 18 Feb 2009 | 11:09 am

అంతసేపు పట్టిందా..?

"ఏరా బన్నీ..! ఎందుకలా వున్నావ్..?" అడిగాడు సురేష్ "గంటసేపు మాట్లాడిన తరువాత నన్ను తిక్కలోడు అన్నాడు"..
Source: వినోదం | 18 Feb 2009 | 11:08 am

రామలింగరాజు సోదరులకు బెయిల్ నో

సత్యం కంప్యూటర్స్ నిధుల మళ్లింపు కుంభకోణంలో కీలక సూత్రధారులైన రామలింగరాజు సోదరులు వడ్లమానిల బెయిల్ పిటిషన్‌ను బుధవారం నాంపల్లి కోర్టు తోసిపుచ్చింది. అంతేగాకుండా రామలింగరాజు వద్ద విచారణ జరిపేందుకు ఆదాయపన్ను శాఖకు కోర్టు అనుమతి నిచ్చింది. ఈ నెల 21వ తేదీన ప్రత్యేకంగా నియమించిన న్యాయవాది సమక్షంలో ఆదాయ పన్నుశాఖ అధికారులు రాజును ప్రశ్నించనున్నారు.
Source: ఏపీ న్యూస్ | 18 Feb 2009 | 10:37 am

ఉగ్రవాదులు అణ్వాయుధాలతో రావచ్చు: నేవీ చీఫ్

భారతదేశ వ్యతిరేక శక్తులు ప్రమాదకర అణ్వాయుధాలను సముద్ర మార్గం ద్వారా మన దేశంలోకి చేరవేసే ప్రమాదం ఉందని భారతీయ నౌకాదళ చీఫ్ అడ్మిరల్ సురేష్ మెహతా హెచ్చరించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రవాణా నౌకల ద్వారా దొంగతనంగా మన భూభాగానికి అణు ఆయుధాలను కొన్ని శక్తులు చేరవేసే అవకాశాన్ని కొట్టివేయలేమన్నారు.
Source: జాతీయ | 18 Feb 2009 | 10:30 am

అసెంబ్లీని పవిత్రం చేస్తాం: చిరంజీవి

ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి వస్తే అసెంబ్లీని పవిత్రం చేస్తుందని ఆ పార్టీ అధినేత చిరంజీవి హామీ ఇచ్చారు. పూర్వం నీలం సంజీవరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య వంటి మహా నేతలు గడిపిన దేవాలయం లాంటి అసెంబ్లీని నేటి రాజకీయ పార్టీలు అపవిత్రం చేశాయని చిరు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ప్రజా అంకిత యాత్రలో భాగంగా ఆ జిల్లా డోన్‌లో జరిగిన రోడ్‌ షోలో చిరంజీవి ప్రజలనుద్దేశించి పైవిధంగా మాట్లాడారు.
Source: ఏపీ న్యూస్ | 18 Feb 2009 | 9:00 am

శెహభాష్ ప్రణబ్: అద్వానీ

యూపీఏ ప్రభుత్వంలో అన్నీ తానై వ్యవహరిస్తున్న సీనియర్‌ మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ లేకపోతే యూపీఏ కూటమి పరిస్థితి ఏమిటని బీజేపీ సీనియర్ నేత, ప్రధాని అభ్యర్థి అద్వానీ ప్రశ్నించారు. లోక్‌సభలో రాష్టప్రతి ప్రతిభాపాటిల్‌ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం
Source: జాతీయ | 18 Feb 2009 | 7:42 am

ఆధునిక భారతావనికి అతడే అధిపతి: సిబాల్

పార్లమెంటు ఎన్నికలు ముంచుకొస్తున్నకొద్దీ కాంగ్రెస్ సీనియర్ నేతల్లో గుబులు పట్టుకున్నట్లు కనబడుతోంది. సమయం వచ్చినప్పుడల్లా రాహుల్ నామ జపం చేస్తున్నారు. రాహుల్ గాంధీ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని శాస్త్ర సాంకేతిక శాఖా మంత్రి కపిల్ సిబాల్ పేర్కొనడం ఇందులో భాగమే. కపిల్ సిబాల్ ఢిల్లీలో విలేకరలతో మాట్లాడుతూ... ఆధునిక భారతావనికి అధిపతి కాగల అర్హతలన్నీ రాహుల్ గాంధీకి ఉన్నాయన్నారు. అయితే వచ్చే లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి మాత్రం మన్మోహన్ సింగేనని తెలిపారు.
Source: జాతీయ | 18 Feb 2009 | 7:36 am

మళ్లీ కెమెరా ముందుకొచ్చిన మెగాస్టార్

ప్రజారాజ్యం పార్టీ అధినేత, సినిమా నటుడు మెగాస్టార్ చిరంజీవి మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. మళ్లీ ఆయన సినిమాల్లో నటిస్తున్నారా అని ఆలోచిస్తున్నారా..? అదేం కాదండోయ్..! సినిమా షూటింగ్ కోసం కాదుగానీ.. తాను నెలకొల్పిన ప్రజారాజ్యం పార్టీ తరపున రూపొందిస్తున్న ఓ ప్రకటనలో నటించేందుకు ఆయన కెమెరా ముందుకొచ్చారంతే..! పీఆర్పీ పబ్లిసిటీ విభాగం ఛైర్మన్ మూర్తి శ్రీనివాసులు నేతృత్వంలో తయారవుతున్న టీవీ ప్రకటనకు సంబంధించిన షూటింగ్‌లో దాదాపు గంటన్నరపాటు చిరు పాల్గొన్నారు. ప్రజా సమస్యలు, పార్టీ లక్ష్యాలు, సిద్ధాంతాలు గురించి వివరించేందుకు రూపొందిస్తున్న ఈ ప్రకటన త్వరలో అన్ని టీవీ ఛానళ్లలోనూ ప్రసారం కానుంది.
Source: ఏపీ న్యూస్ | 18 Feb 2009 | 7:32 am

పంచాయతీ ఉద్యోగుల ఆందోళన

తమ సమస్యలను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోక పోవడంతో... బుధవారం నుంచి దశలవారీగా ఆందోళనా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు గ్రామపంచాయతీ ఆఫీసర్లు, ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి ప్రకటించారు. ఈ విషయమై సుబ్బారెడి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... పార్ట్ టైం ఉద్యోగులను పంచాయతీ కార్యదర్శి ఫీడర్ కేటగిరీగా మార్చాలని, కాంట్రాక్టు పద్ధతిని రద్దు చేయాలనే ప్రధానమైన డిమాండ్లపైనే తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 18 Feb 2009 | 7:23 am

రాజే ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ

రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చిన దరిమిలా రాజస్థాన్ ప్రభుత్వం ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల ఫోన్లను టాపింగ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. మంత్రులు, కీలక అధికారులతో సహా మొత్తం 100 మంది ఫోన్ల ట్యాపింగ్‌కు వసుంధరా రాజే పాల్పడ్డట్లు స్కానర్ రిపోర్టులలో తేలిందని సమాచారం. ఈ రిపోర్టుల్లో ప్రతిపక్ష నేతల ఫోన్లనే కాక స్వపక్ష మంత్రులు, ఎమ్మెల్యేల ఫోన్లను సైతం ట్యాప్ చేసినట్లు తెలిసింది.
Source: జాతీయ | 18 Feb 2009 | 7:11 am

హస్తిన చేరిన మహాకూటమి నేతలు

కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిపై జాతీయ స్థాయిలో తమ వాణిని వినిపించేందుకు బయలుదేరిన మహాకూటమి నేతలు బుధవారం దేశ రాజధాని నగరం న్యూఢిల్లీకి చేరుకున్నారు. రెండు రోజుల పర్యటనకుగానూ సుమారు 51 మంది కూటమి నేతలు శంషాబాద్ విమానాశ్రయం నుండి బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు, సీపీఐ కార్యదర్శి నారాయణ తదితరులు హస్తినకు చేరిన వారిలో ఉన్నారు.
Source: ఏపీ న్యూస్ | 18 Feb 2009 | 7:06 am

నడుముకు కింద నయన... నడుముకు పైన ఛార్మి

ఇటీవల ఓ సినిమా హాలులో ఛార్మి చిత్రాన్ని చూసిన కుర్రకారు ఛార్మి నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. నటలో ఆమె బాడీ లాంగ్వేజ్ అదిరిపోయిందట. ముఖ్యంగా నడుముకు పైన ఆమె చూపే హావభావాలకు ఎవరైనా చిత్తై పోవాల్సిందేనంటున్నారు. ఇదిలా ఉంటే నయనతార చిత్రాలన్నిటినీ చూసే మరో అభిమాన...
Source: వినోదం | 18 Feb 2009 | 6:41 am

కమలంతో పొత్తా..? ఛాన్సే లేదు..!

భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదుర్చుకునే ప్రసక్తే లేదని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తేల్చి చెప్పేశారు. జాతీయ స్థాయిలో మూడో కూటమి యోచన లేదని ఆయన స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా పర్యటనకు ముందు బుధవారం ఆయన బేగంపేట విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ.. తమది సెక్యులర్ పార్టీ అని, భాజపాతో పొత్తుపై పార్టీ నేతలు మాట్లాడితే అది వారి వ్యక్తిగతమన్నారు. మొత్తానికి బీజేపీతో పొత్తు కుదుర్చుకునే ప్రసక్తే లేదని చిరు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 18 Feb 2009 | 6:05 am

లక్నోలో "మున్నాభాయ్" కసరత్తు

వచ్చే పార్లమెంటు ఎన్నికలలో ఉత్తరప్రదేశ్‌లోని లక్నో లోక్‌సభ నియోజకవర్గానికి సమాజ్‌వాదీ పార్టీ తరపున పోటీకి దిగనున్న బాలీవుడ్ స్టార్ సంజయ్‌దత్ ఎన్నికల కసరత్తు ప్రారంభించాడు. నియోజకవర్గ పరిధిలో ఉన్న పార్టీ శ్రేణులతో బుధవారం మంతనాలు జరుపనున్నాడు. తన పర్యటనలో భాగంగా సమాజ్‌వాదీ పార్టీ ముఖ్య నాయకులతోనూ సంజయ్ సమావేశం కానున్నాడు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎస్పీ నాయకులతో భవిష్యత్ ఎన్నికలలో అనుసరించవలసిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చిస్తారని పార్టీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి తెలిపారు.
Source: జాతీయ | 18 Feb 2009 | 5:56 am

కాంగ్రెస్ తరపున ప్రచారం చేసేందుకు రెడీ: శ్రీహరి

టాలీవుడ్ రియల్ స్టార్ శ్రీహరి కూడా రాజకీయ గళం విప్పారు. రాష్ట్ర రాజకీయాల్లో సినీతారల హవా కొనసాగుతోన్న నేపథ్యంలో.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తానని సినీనటుడు శ్రీహరి బుధవారం వెల్లడించారు. బుధవారం ఉదయం తిరుపతి వెంకన్న స్వామిని దర్శించుకున్న ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి ఆదేశిస్తే ఎక్కడి నుంచి అయినా పోటీ చేసేందుకు రెడీ అని శ్రీహరి అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 18 Feb 2009 | 5:54 am

కర్నూలులో పీఆర్పీ ప్రజా అంకిత యాత్ర

కర్నూలు జిల్లాలోని నంద్యాల, కర్నూలు లోక్‌సభ స్థానాల పరిధిలోని, 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పీఆర్పీ అధినేత చిరంజీవి పర్యటించనున్నారు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రజా అంకిత యాత్ర ఐదు రోజుల పాటు కొనసాగుతోందని పీఆర్పీ నేతలు వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 18 Feb 2009 | 4:54 am

కాంగ్రెస్‌తో పొత్తుకు అవకాశం: జయప్రద

కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల మధ్య పొత్తుపై వస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ ఆ పార్టీ ఎంపీ జయప్రద ఓ ప్రకటన చేసింది. జాతి ప్రయోజనాల రీత్యా తప్పనిసరైతే పొత్తుకు సిద్ధపడే అవకాశాన్ని తోసిపుచ్చలేమని వ్యాఖ్యానించింది. రానున్న లోక్‌సభ ఎన్నికలలో ఇరు పార్టీల పొత్తు అవకాశంపై తాను పూర్తి విశ్వాసంతో ఉన్నానని తెలిపింది. తను గెలుపొందిన రాంపూర్ నియోజకవర్గం నుంచి బాలీవుడ్ నటుడు ఒకరు పోటీచేయనున్నారనే వార్తలపై స్పందిస్తూ... అటువంటి నిర్ణయాలేవీ ఇంతవరకూ తీసుకోలేదన్నారు.
Source: జాతీయ | 17 Feb 2009 | 3:17 pm

వైఎస్సార్ విధానాలు నచ్చాయి: రాజశేఖర్

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి విధానాలు నచ్చడంతోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టామని ప్రముఖ సినీ నటుడు డాక్టర్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. పదవులను ఆశించి తాను రాజకీయాల్లో రాలేదని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం తిరుమలేశునిని రాజశేఖర్ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో రాజశేఖర్ మాట్లాడుతూ.. ఇటీవల విడుదలైన "సత్యమేవజయతే" సక్సెస్ కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చామని చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 17 Feb 2009 | 1:30 pm

సాధారణ జీవితం గడుపుతా: సాంబశివుడు

తన తల్లిదండ్రులతో కలిసి సాధారణ పౌరునిగా సామాన్య జీవితం గడుపుతానని మావోయిస్టు మాజీ నేత సాంబశివుడు చెప్పారు. ఆరోగ్యం సహకరించక మావోయిస్టు ఉద్యమం నుంచి బయటకు వచ్చానని, ఇక సామాన్య పౌరుడిగా జీవిస్తానని ఆయన తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి సాంబశివుడిని నాలుగు రోజుల పాటు విడిచిపెడుతున్నట్లు అధికారులు తెలిపారు. కుటుంబసభ్యులను కలుసుకోవడానికి సాంబశివుడికి అనుమతి లభించడంతో నగరంలోని వనస్థలిపురంలోని తన బంధువుల ఇంటికి మంగళవారం సాయంత్రం వెళ్లారు. ఈ సందర్భంగా మంగళవారం ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాంబశివుడు మాట్లాడుతూ.. ప్రభుత్వం తనపై చూపే సానుభూతిని చూస్తుంటే సామాన్య మానవుడిగా జీవించాలని ఉందని చెప్పారు. ఇకపై ఏ రాజకీయ పార్టీలో చేరనని ఆయన స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 17 Feb 2009 | 1:18 pm

స్థానికుల సహకారంతోనే ముంబై దాడులు: అద్వానీ

స్థానికుల సహాయ సహకారాలు లేనిదే ముంబై దాడులు జరిగేవి కావని నాగపూర్‌లో జరిగిన భాజపా జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలను భాజపా సీనియర్ నేత, ప్రధానమంత్రి అభ్యర్థి లాల్‌ కృష్ణ అద్వానీ సమర్థించారు.
Source: జాతీయ | 17 Feb 2009 | 12:31 pm

గంగూలీకి సమాజ్‌వాదీ పార్టీ గాలం

రానున్న లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని పోటీకి నిలబెట్టడానికి సమాజ్ వాదీ పార్టీ(ఎస్.పి) టిక్కెట్ ఆశ చూపించి పార్టీలోకి ఆహ్వానించింది.
Source: జాతీయ | 17 Feb 2009 | 12:05 pm