|
వైఎస్సార్ విధానాలు నచ్చాయి: రాజశేఖర్రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి విధానాలు నచ్చడంతోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టామని ప్రముఖ సినీ నటుడు డాక్టర్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. పదవులను ఆశించి తాను రాజకీయాల్లో రాలేదని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం తిరుమలేశునిని రాజశేఖర్ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో రాజశేఖర్ మాట్లాడుతూ.. ఇటీవల విడుదలైన "సత్యమేవజయతే" సక్సెస్ కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చామని చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 17 Feb 2009 | 1:30 pm సాధారణ జీవితం గడుపుతా: సాంబశివుడుతన తల్లిదండ్రులతో కలిసి సాధారణ పౌరునిగా సామాన్య జీవితం గడుపుతానని మావోయిస్టు మాజీ నేత సాంబశివుడు చెప్పారు. ఆరోగ్యం సహకరించక మావోయిస్టు ఉద్యమం నుంచి బయటకు వచ్చానని, ఇక సామాన్య పౌరుడిగా జీవిస్తానని ఆయన తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి సాంబశివుడిని నాలుగు రోజుల పాటు విడిచిపెడుతున్నట్లు అధికారులు తెలిపారు. కుటుంబసభ్యులను కలుసుకోవడానికి సాంబశివుడికి అనుమతి లభించడంతో నగరంలోని వనస్థలిపురంలోని తన బంధువుల ఇంటికి మంగళవారం సాయంత్రం వెళ్లారు. ఈ సందర్భంగా మంగళవారం ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాంబశివుడు మాట్లాడుతూ.. ప్రభుత్వం తనపై చూపే సానుభూతిని చూస్తుంటే సామాన్య మానవుడిగా జీవించాలని ఉందని చెప్పారు. ఇకపై ఏ రాజకీయ పార్టీలో చేరనని ఆయన స్పష్టం చేశారు.Source: ఏపీ న్యూస్ | 17 Feb 2009 | 1:18 pm స్థానికుల సహకారంతోనే ముంబై దాడులు: అద్వానీస్థానికుల సహాయ సహకారాలు లేనిదే ముంబై దాడులు జరిగేవి కావని నాగపూర్‌లో జరిగిన భాజపా జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలను భాజపా సీనియర్ నేత, ప్రధానమంత్రి అభ్యర్థి లాల్ కృష్ణ అద్వానీ సమర్థించారు.Source: జాతీయ | 17 Feb 2009 | 12:31 pm గంగూలీకి సమాజ్‌వాదీ పార్టీ గాలంరానున్న లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని పోటీకి నిలబెట్టడానికి సమాజ్ వాదీ పార్టీ(ఎస్.పి) టిక్కెట్ ఆశ చూపించి పార్టీలోకి ఆహ్వానించింది.Source: జాతీయ | 17 Feb 2009 | 12:05 pm బాబు క్షమాపణ చెప్పాలి : మంత్రులుఉద్యోగుల మనోభావాలు, విశ్వసనీయత దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, బొత్సా సత్యనారాయణలు డిమాండ్ చేశారు. మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ... అనేక ఒత్తిళ్ల నడుమ ఉన్న చంద్రబాబు.. తానేమి మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావటం లేదని ఎద్దేవా చేశారు.Source: ఏపీ న్యూస్ | 17 Feb 2009 | 10:44 am ఆలస్యం మాట వాస్తవమే : రాఘవులుమహాకూటమిలో సీట్ల సర్దుబాటు ఆలస్యం అవుతుందన్న మాట వాస్తవమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అంగీకరించారు. అయితే ఇది అత్యవసరమైన విషయమేమి కాదనీ, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. మంగళవారం హైదరాబాదులో జరిగిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశాల్లో పాల్గొన్న రాఘవులు మాట్లాడుతూ... పై విధంగా స్పందించారు. కాగా, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి, రాజకీయ ప్రచారం తదితర అంశాలపై ఈరోజు జరిగిన సమావేశంలో చర్చించినట్లు ఆయన తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 17 Feb 2009 | 10:32 am ఖమ్మం ఏజెన్సీలో పవన్ పర్యటనయువరాజ్యం అధినేత పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 19 నుంచి మూడు రోజుల పాటు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన దాదాపు అంతా ఖమ్మం ఏజెన్సీ ప్రాంతంలోనే సాగనుంది. తొలిరోజున హెలికాప్టర్లో భద్రాచలం చేరుకున్న అనంతరం, ఎర్రంపేటలో పపన్ తన యాత్రను ప్రారంభిస్తారు. ఆ తరువాత చింతూరులో జరగబోయే బహిరంగ సభలో పవన్ ప్రసంగిస్తారు. అనంతరం పోలవరం ముంపు గ్రామాల ప్రజలను కలిసి వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకుంటారు.Source: ఏపీ న్యూస్ | 17 Feb 2009 | 10:11 am మరో తిమింగలాన్ని పట్టిన ఏసీబీయాంటీ కరప్షన్ బోర్డు(ఏసీబీ) అధికారులు అవినీతి అధికారుల భరతం పడుతున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా అవినీతి తిమింగలం అధికారుల చేతికి చిక్కింది. వివరాలలోకి వెళితే...నీటిపారుదల శాఖ ఎస్ఈ ఎల్. రాజేశ్వర్ రెడ్డి ఇంటిపై అవినీతి నిరోధక శాఖాధికారులు మంగళవారం ఉదయం దాడులు ముమ్మరం చేశారు. హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్‌లోని అతని గృహాలపై అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు.Source: ఏపీ న్యూస్ | 17 Feb 2009 | 10:00 am చిరు సినిమా రాజకీయంసినిమాలను వదిలి రాజకీయాల్లోకి వెళ్లిన చిరు.. మళ్లీ శ్రీకాంత్ సినిమా ఓపినింగ్‌కు రావడం వెనుక చాలా రాజకీయం ఉందంటున్నారు జూబ్లిహిల్స్ సినీ వర్గాలు. చిరు వస్తాడో,రాడో.. వస్తే ఇది ఆనవాయితీ అవుతుందని.. రానంటాడేమోనన్న టెన్షన్‌తో... 15రోజులపాటు శ్రీకాంత్‌కు నిద్రపట్టలేదట. చివరికి చిరంజీవి సరే అనడానికి చిత్ర నిర్మాత ఆర్.మనోహర్ హస్తం కూడా ఉందట.Source: జాతీయ | 17 Feb 2009 | 10:00 am నోటీసులేమీ అందలేదు : రేణుకమంగళూరు ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖా మంత్రి రేణుకా చౌదరి... ఇప్పటివరకూ తనపై కేసు పెట్టినట్లుగా, ఎలాంటి నోటీసులు అందలేదనీ స్పష్టం చేశారు. కాగా, మంగళూరు తాలిబన్ల నిలయంగా మారిందంటూ వ్యాఖ్యానించిన మంత్రి రేణుకపై కర్ణాటక సర్కార్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే..! ఈ విషయమై రేణుక మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... ప్రస్తుతం కర్ణాటకలో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిన విషయమేననీ పేర్కొన్నారు. సమస్యను ప్రక్కదారి పట్టించేందుకే కర్ణాటక సర్కార్ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని రేణుక విమర్శించారు.Source: జాతీయ | 17 Feb 2009 | 9:57 am రేణుకపై కేసుపెట్టిన మంగళూర్ మేయర్మంగళూరు ఘటనపై కేంద్రశిశు సంక్షేమ శాఖామంత్రి రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు భారతీయులను కించపరిచేవిగా ఉన్నాయంటూ మంగళూరు మేయర్ గణేశ్ హోసబెట్టు విమర్శించారు. ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందున తాము రేణుకపై క్రిమినల్ కేసు పెట్టినట్లు తెలిపారు.Source: జాతీయ | 17 Feb 2009 | 9:54 am బాలయ్య కొత్త చిత్రం "మిత్రుడు"..?ఆదిత్య 369, వంశానికొక్కడు, భలేవాడివి బాసూ వంటి చిత్రాలను నిర్మించిన శివలెంకప్రసాద్ బాలకృష్ణ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాజమౌళి శిష్యుడు మహాదేవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన ప్రత్యేక సెట్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.Source: వినోదం | 17 Feb 2009 | 8:53 am వైభవంగా కేసీఆర్ జన్మదిన వేడుకలుతెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు 56వ పుట్టినరోజు వేడుకలు వైభవంగా జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ అభిమానులు ఆయన పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం ఉదయాన్నే తెలంగాణా భవన్‌కు తెరాస నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున చేరుకుని, ఆయన పుష్పగుచ్చాలతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.Source: ఏపీ న్యూస్ | 17 Feb 2009 | 8:38 am తూర్పుగోదావరిలో "గాలి నుంచి నీరు"తూర్పు గోదావరి జిల్లా మంగళవారంనాడు ఓ అరుదైన ప్రయోగానికి వేదిక కాబోతోంది. "గాలి నుంచి నీరు సృష్టించడం" అనే ఈ ప్రయోగం జరగడం బహుశా ప్రపంచంలోనే మొదటిసారి కావడంతో, దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జాలిమూడి గ్రామంలోని అందరి ఇళ్లకు, అన్నిరకాల అవసరాలకు స్వచ్ఛమైన మంచినీటిని గాల్లో నుంచి సృష్టించి ఇవ్వనున్నారు. నమ్మలేకపోయినా ఇది మాత్రం నిజం. నమ్మశక్యంకాని ఈ సంఘటన ప్రపంచంలోనే మొదటిసారిగా బూరుగుపూడి నియోజకవర్గంలోని జాలిమూడి గ్రామంలో జరుగబోతోంది.Source: ఏపీ న్యూస్ | 17 Feb 2009 | 7:47 am వేసవిలో విద్యుత్ కొరత ఉండబోదు : సీఎంరాబోయే వేసవికాలంలో విద్యుత్ కొరత లేకుండా చూసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే పరిశ్రమలకు విద్యుత్ కోత విధించి, గృహావసరాలకు విద్యుత్ సరఫరాను అందించాలని ఆయన సూచించారు. జూబ్లీహాలులో కలెక్టర్లతో జరిగిన రెండోరోజు సమీక్షా సమావేశంలో పాల్గొన్న ముఖ్యమమంత్రి పై విధంగా స్పందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో మరో ఐదు సంవత్సరాలపాటు రైతులకు ఉచిత విద్యుత్‌ను అందజేస్తామని స్పష్టం చేశారు.Source: ఏపీ న్యూస్ | 17 Feb 2009 | 7:29 am ఇండియన్ ముజాహిదీన్లపై చార్జిషీట్టెర్రరిస్ట్ గ్రూపులకు సంబంధించిన ఇండియన్ ముజాహిదీన్ సంస్థలోని 12మంది తీవ్రవాదులపై ముంబైలోని పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. వీరిని 2006నుంచి దేశవ్యాప్తంగా వివిధప్రాంతాలలో జరిపిన దాడులలో బాధ్యులుగా చూపిస్తూ మంగళవారం చార్జిషీటు దాఖలు చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.Source: జాతీయ | 17 Feb 2009 | 7:04 am ప్రశ్నార్థకంగా పెద్దపులుల ఉనికిదేశంలో పెద్దపులుల మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతోంది. ఈ ఏడాది రెండు నెలలు కూడా గడవకముందే దేశంలో పలుచోట్ల 6 పెద్ద పులులు వివిధ కారణాల వల్ల మృత్యువాత పడ్డాయి. ఎక్కువగా వేటగాళ్లు, పులివాత పడి ప్రాణాలు కోల్పోయినవారి బంధువుల చేతిలోనే పెద్దపులులు మరణిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద చూస్తే.... ఇక దేశంలో మిగిలి ఉన్న పెద్ద పులుల సంఖ్య కేవలం 1400 మాత్రమే అని భారత ప్రభుత్వం ప్రకటించింది.Source: జాతీయ | 17 Feb 2009 | 7:03 am ఢిల్లీకి మహాకూటమి నేతల ప్రయాణంమహాకూటమి నేతలు దేశరాజధాని ఢిల్లీకి బుధవారం ప్రయాణం కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని ఎండగట్టేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్న మహాకూటమి నేతలు, దేశ రాజధాని నగరంలోనూ తమ వాణిని వినిపించనున్నారు. మహాకూటమి నేతలంతా బుధవారం రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ను కలిసి, రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై వినతిపత్రం సమర్పించనున్నట్లు కూటమి శ్రేణులు వెల్లడించాయి. అనంతరం ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కూడా మహాకూటమి నేతలు కలిసి వినతిపత్రం సమర్పించనున్నారు.Source: ఏపీ న్యూస్ | 17 Feb 2009 | 6:23 am నన్ను తోసేస్తుందేమోనని...!"నాకూ, మా ఆవిడకూ ఏదైనా గొడవయితే నేను వెంటనే మా ఇంట్లో బావిని చెక్కతో మూసేస్తాను తెలుసా..?" చెప్పాడు పుల్లయ్య...Source: వినోదం | 17 Feb 2009 | 6:01 am కాదని ఎవరన్నారు..?భార్యాభర్తలిద్దరూ గంటసేపు పోట్లాడుకున్న తరువాత... "ఛీ.. ఛీ.. నీతో వాదించడం కంటే ఆ గోడతో వాదించటం మేలు.Source: వినోదం | 17 Feb 2009 | 5:56 am కేరళ రోడ్డు ప్రమాదంలో 11మంది తెలుగువారు మృతిపశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని విస్సాకోడేరునుంచి దక్షిణ భారత దేశ యాత్రకు బస్సు బయలుదేరింది. కేరళలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 11మంది తెలుగువారు మృతి చెందారు.Source: జాతీయ | 17 Feb 2009 | 5:39 am భద్రతాదళంలో చేరిన జెట్ టెక్నాలజీ నౌకలుఅత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన జెట్ నౌకలు భారత నౌకా దళంలో చేరాయి. ఈ నౌకలను తమిళనాడు గవర్నర్ సూర్జిత్ సింగ్ బర్నాలా సోమవారం ప్రారంభించారు.Source: జాతీయ | 17 Feb 2009 | 3:41 am విదేశాంగ శాఖ కంప్యూటర్ల సమాచారం హైక్భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యలయంలోని కంప్యూటర్లను ఆదివారంనాడు కొంతమంది అజ్ఞాత వ్యక్తులు హైక్ చేశారు. కాని అత్యంత రహస్యమైన ఫైళ్ళకేవీ నష్టం కలగలేదని ఆ శాఖాధికారులు తెలిపారు.Source: జాతీయ | 16 Feb 2009 | 1:03 pm
|