|
విదేశాంగ శాఖ కంప్యూటర్ల సమాచారం హైక్భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యలయంలోని కంప్యూటర్లను ఆదివారంనాడు కొంతమంది అజ్ఞాత వ్యక్తులు హైక్ చేశారు. కాని అత్యంత రహస్యమైన ఫైళ్ళకేవీ నష్టం కలగలేదని ఆ శాఖాధికారులు తెలిపారు.Source: జాతీయ | 16 Feb 2009 | 1:03 pm విద్యాబాలన్ పర్సనల్ టచ్భారతీయ ఆడపడుచును పోలిన అందచందాలతో బాలీవుడ్‌లో అగ్రహీరోయిన్‌గా ముద్రవేసుకున్న అందాల భామ విద్యాబాలన్. యువతను ఇట్టే ఆకర్షించే అందాలతో పాత్రకు అన్ని విధాలా న్యాయం చేసే ఈమె, తాను పరిస్థితికి అనుగుణంగా నడుచుకుంటానంటోంది. నటిగా నాకు పరిధులంటూ లేవని...Source: వినోదం | 16 Feb 2009 | 10:56 am అనారోగ్యంతోనే లొంగిపోయాను: సాంబశివుడుఅనారోగ్యం కారణంగానే తాను ప్రభుత్వానికి లొంగి పోయినట్టు మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి సాంబశివుడు వెల్లడించాడు. గత 16 సంవత్సరాలుగా పార్టీకి ఎంతే సేవ చేశానని, అయితే ప్రస్తుతం పార్టీకి సేవ చేసే శక్తి తనకు లేదన్నారు. దీనికి ప్రధాన కారణాలు రెండేనన్నారు. ఒకటి.. ఆరోగ్యం సహకరించక పోవడం. రెండోది.. కుటుంబ సభ్యులతో గడపాలని నిర్ణయించుకోవడమని ఆయన చెప్పుకొచ్చారు.Source: ఏపీ న్యూస్ | 16 Feb 2009 | 10:19 am సత్యం కేసు సీబీఐకు: ప్రభుత్వ జోవో జారీసత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసు దర్యాప్తును సీబీఐకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది. ఈ మేరకు జోవో కాపీ ప్రతిని హైకోర్టుకు ప్రభుత్వం అడ్వకేట్ సమర్పించారు. దేశ కార్పొరేట్ రంగానికే మాయని మచ్చగా నిలిచిన సత్యం కుంభకోణంపై కేంద్రం సీరియస్‌గా పరిగణించిన విషయం తెల్సిందే. సత్యం సంస్థ లెక్కల్లో చోటు చేసుకున్న అంకెల గారడి వెల్లడి కాగానే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం కేసును సీబీసీఐడీకి అప్పగించింది.Source: ఏపీ న్యూస్ | 16 Feb 2009 | 9:06 am 'మెగాస్టార్'పై భాజపా తరపున నరేష్ పోటీ!ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిపై భారతీయ జనతా పార్టీ తరపున సినీ నటుడు నరేష్ పోటీ చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ సూచన ప్రాయంగా వెల్లడించారు. ఆయన తిరుపతిలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 16 Feb 2009 | 8:51 am మందిర నిర్మాణంతో రుణం తీర్చుకుంటాం: అద్వానీవచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా రామమందిరం నిర్మిస్తామని భారతీయ జనతా పార్టీ అగ్రనేత, ఎన్డీయే ప్రధానమంత్రి అభ్యర్థి అద్వానీ స్పష్టం చేశారు. మందిరం నిర్మాణానికి తమ పార్టీ కట్టుబడి ఉందని అద్వానీ పునరుద్ఘాటించారు. మందిరం అంశమే గతంలో కూడా తమకు కేంద్రంలో అధికారాన్ని కట్టబెట్టిందని గుర్తు చేశారు.Source: జాతీయ | 16 Feb 2009 | 7:44 am రక్షణ రంగానికి రూ.1,41,703 కోట్లు: ప్రణబ్ముంబైపై ఉగ్రవాదుల దాడి అనంతరం దేశ అంతర్గత, సరిహద్దు భద్రతపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా దేశ రక్షణ వ్యవస్థను మరింత పటిష్ట పరిచేందుకు కృషి చేస్తోంది. ఇందులోభాగంగా సోమవారం దాఖలు చేసిన మధ్యంతర వార్షిక బడ్జెట్ (2009-10)లో రక్షణ రంగానికి 1,41,703 కోట్ల రూపాయలను కేటాయించినట్టు మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రకటించారు.Source: జాతీయ | 16 Feb 2009 | 7:18 am కసబ్‌ను అప్పగించేది లేదు: భారత్ముంబయి ఉగ్రవాద దాడుల్లో పాల్గొంటూ పట్టుబడిన అజ్మల్ కసబ్‌ను అవసరమైతే తమకు అప్పగించాల్సి ఉంటుందని పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యను భారత్ తోసి పుచ్చింది. కసబ్ అప్పగింత సాధ్యమయ్యే పనికాదని తేల్చి చెప్పింది. ఉగ్రవాద దాడులు జరిగింది భారత్‌లో కనుక నిందితుడు కసబ్‌ను అప్పగింత ఆచరణ సాధ్యం కాని పని అనీ, ఆ ఆలోచన మానుకోవాలని పాక్‌కు హితవు పలికింది.Source: జాతీయ | 16 Feb 2009 | 6:13 am ఆరవ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన యూపీఏకేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం సోమవారం ఆరోసారి సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. తొలి ఐదు సార్లు కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మంత్రి చిదంబరం ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఆయన మంత్రిత్వ శాఖను మార్చారు. దీంతో ఆర్థిక శాఖను ప్రధాని మన్మోహన్ సింగ్ నిర్వహిస్తున్నారు. అయితే బైపాస్ సర్జరీ చేయించుని విశ్రాంతి తీసుకుంటున్న మన్మోహన్ ప్రస్తుతం జరుగుతున్న 14వ లోక్‌సభ చివరి సమావేశాలకు దూరంగా ఉన్నారు.Source: జాతీయ | 16 Feb 2009 | 5:59 am కేంద్రంలో భాజపా ప్రభుత్వం: వెంకయ్య జోస్యంవచ్చే సాధారణ ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆ పార్టీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు జోస్యం చెప్పారు. ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ అద్వానీ నాయకత్వంలో తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. తాము దక్షిణాదిరాష్ట్రాలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించామన్నారు.Source: ఏపీ న్యూస్ | 16 Feb 2009 | 5:31 am ఏప్రిల్-మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు: ఐవిఎస్శాసన సభ ఎన్నికలు వచ్చే ఏప్రిల్-మే నెలల్లో జరుగవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఐ.వి.సుబ్బారావు సూచన ప్రాయంగా వెల్లడించారు. అన్నవరం ఆలయ అతిధి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మొత్తం 5.60 కోట్ల మంది ఓటర్లలో 80 శాతం మేరకు ఫోటో గుర్తింపు కార్డులను జారీ చేసినట్టు చెప్పారు. మిగిలిన వారికి కూడా త్వరలోనే అందజేస్తామని చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 16 Feb 2009 | 5:13 am ఆయుధాలు వీడితేనే చర్చలు: చిదంబరందేశంలోని ఉగ్రవాద సంస్థలతో ఆయుధాలు వీడేంత వరకు ఎలాంటి చర్చలు జరుపబోమని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం స్పష్టం చేశారు. అలాగే.. శ్రీలంకలో ప్రత్యేక దేశం కోసం పోరాటం చేస్తున్న ఎల్టీటీఈ కూడా ఆయుధాలు విడి శాంతి చర్చలకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. లంకలో ప్రస్తుత పరిస్థితికి ఎల్టీటీఈ తీవ్రవాదులే ప్రధాన కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.Source: జాతీయ | 16 Feb 2009 | 3:55 am మావోయిస్టు సాంబశివుడు లొంగుబాటుగతంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని ముప్పతిప్పలు పెట్టించిన మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి సాంబశివుడు అలియాస్ కోనవూరి ఐలయ్య ఆదివారం పోలీసులకు లొంగి పోయాడు. అలిపిరి వద్ద అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జరిగిన దాడి కేసులో సాంబశివుడు కీలక సూత్రధారి. ఎస్‌ఐబీ డీఐజీ శశిధర్‌రెడ్డి సమక్షంలో కటుంబసభ్యులతో సహా ఆయన లొంగిపోయాడు.Source: ఏపీ న్యూస్ | 16 Feb 2009 | 3:30 am నేడు ప్రణబ్ మధ్యంతర "జనాకర్షక" బడ్జెట్ప్రధాని మన్మోహన్ సింగ్ గైర్హాజరుతో, ఆ బాధ్యతలను నిర్వహిస్తున్న కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ సోమవారం తాత్కాలిక సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రిత్వ బాధ్యతలను మన్మోహన్ నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న తరుణంలో ప్రణబ్ ముఖర్జీ ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్‌కు అత్యంత ప్రాధాన్యత చేకూరింది.Source: జాతీయ | 16 Feb 2009 | 3:24 am
|