|
రాష్ట్ర వ్యాప్తంగా మహాకూటమి ధర్నాలుముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిపై వస్తున్న అవినీతి ఆరోపణలపై తక్షణం విచారణ జరిపించాలని కోరుతూ మహాకూటమికి చెందిన నాలుగు పార్టీల నేతలు ఆదివారం ధర్నా నిర్వహించారు. స్థానిక హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఈ ధర్నా జరిగింది. ఇందులో తెలుగుదేశం, తెలంగాణా రాష్ట్ర సమితి, సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.Source: ఏపీ న్యూస్ | 15 Feb 2009 | 10:56 am పార్లమెంట్ సమావేశాలకు ప్రధాని హాజరు!ఇటీవల ప్రారంభమైన 14 లోక్‌సభ చివరి సమావేశాలకు ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరుకానున్నారు. ప్రస్తుతం బైపాస్ సర్జరీ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న ప్రధాని చివరి సమావేశాల్లో కనీసం ఒక్క రోజైనా హాజరుకావాలని పరితపిస్తున్నారు. కాగా, ప్రస్తుతం జరుగుతున్న సమావేశాలు ఈనెల 26వ తేదీ వరకు జరుగుతాయి.Source: జాతీయ | 15 Feb 2009 | 10:04 am జనవాసంపై ఐఎఎఫ్ బాంబులు: కేసు నమోదుఇండో-పాక్ సరిహద్దు ప్రాంతమైన రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మార్ అనే గ్రామంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన యుద్ధ విమానాలు బాంబులను జార విడిచాయి. దీనివల్ల ఆ గ్రామానికి చెందిన దోస్త్ ఆలీ అనే రైతుకు చెందిన ఐదు ఎకరాల పొలంలో సాగు చేసిన పంట ధ్వంసమైంది. అలాగే ఆయన నివాసం కూడా పాక్షికంగా దెబ్బతింది. దీనిపై రైతు మోహన్‌గర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.Source: జాతీయ | 15 Feb 2009 | 9:47 am ఎన్నికలకు ముందు ఉమ్మడి అజెండా లేదు: సీపీఐసార్వత్రిక ఎన్నికలకు ముందు మహాకూటమి తరపున ఉమ్మడి అజెండా ఉండబోదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ స్పష్టం చేశారు. ఆయన ఆదివారం నల్గొండలో జరిగిన పార్టీ ఎగ్జిక్యూటివ్ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహాకూటమిలో సీట్ల సర్దుబాటు తెలుగుదేశం పార్టీ చేయాలని కోరారు. సీట్ల పంపిణీపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 15 Feb 2009 | 9:15 am పారిపోలేదు.. అరెస్టు చేసుకోండి: కోడెలతాను ఎక్కడికీ పారిపోలేదని, దమ్ముంటే తనను అరెస్టు చేసుకోవచ్చని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కొడెల శివప్రసాద్ పోలీసులకు సవాల్ విసిరారు. ప్రస్తుతం ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్‌ను కోర్టు జారీ చేసింది. దీనిపై ఆయన ఆదివారం గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ తాను ఎక్కడికి పారిపోలేదన్నారు. గంటూరులోనే, ఈ రాష్ట్రంలోనే ఉన్నానని ప్రకటించారు.Source: ఏపీ న్యూస్ | 15 Feb 2009 | 9:03 am యూపీఏ ఆర్థిక విధానాలు భేష్: సోనియా గాంధీకేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం గత నాలుగున్నర సంవత్సరాలుగా అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు భేషుగ్గా ఉన్నాయని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రశంసించారు. అందువల్లే అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం ప్రభావం పెద్దగా లేదని ఆమె వ్యాఖ్యానించారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన తొలి అంతర్జాతీయ విమానయాన సర్వీసులకు ఆమె శనివారం పచ్చజెండా ఊపారు.Source: జాతీయ | 15 Feb 2009 | 6:59 am రైతులను ఓటు అడిగే హక్కు బాబు లేదు: వైఎస్తొమ్మిదేళ్ళ అధికారంలో ఉన్నపుడు వ్యవసాయం దండగ అంటూ ప్రకటనలు చేసిన చంద్రబాబు ఇపుడు రైతులను ఓటు అడిగే హక్కు లేదని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి అన్నారు. తమ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి, పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకించిన సిపిఎం, తెరాసతో జత కట్టిన చంద్రబాబుకు గోదావరి జిల్లాల్లో రైతుల ఓటు అడిగే హక్కులేదన్నారు.Source: ఏపీ న్యూస్ | 15 Feb 2009 | 6:45 am ప్రత్యక్ష ప్రసారాలను సమర్థించిన సోమనాథ్చట్ట సభల సమావేశాల సందర్భంగా జరిగే కార్యకలాపాలను ప్రజలు వీక్షించే విధంగా ప్రత్యక్ష ప్రసారాలు ఉండాలని లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే ప్రప్రథమంగా పార్లమెంట్‌కు ప్రత్యేక ఛానల్‌ను ప్రారంభింపచేసి లోక్‌సభ గ్యాలరీని ప్రజల ముంగిటకు తీసుకు వెళ్లిన ఘనత కూడా ఆయదే.Source: ఏపీ న్యూస్ | 15 Feb 2009 | 5:44 am మా ప్రధాని అభ్యర్థి.. మన్మోహనుడే: రాహుల్తమ పార్టీ ప్రధానంత్రి అభ్యర్థి మన్మోహన్ సింగేనని కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి పదవి రేసులో తాను లేనని స్పష్టం చేశారు. మా అభ్యర్థి మన్మోహన్‌సింగ్. ఆయన బొమ్మతోనే ప్రజల వద్దకు వెళుతామన్నారు. మూడు రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ శనివారం సూరత్‌లో విలేఖరులతో మాట్లాడారు.Source: జాతీయ | 15 Feb 2009 | 5:21 am నా ప్రధానమంత్రి అభ్యర్థి మన్మోహన్: రాహుల్వచ్చే ఎన్నికలలో తమ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి మన్మోహన్ సింగేనని కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి రాహుల్ గాంధీ మరోమారు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తాను ఎన్నోసార్లు చెప్పానని సూరత్‌లో విలేకరుల సమావేశంలో ఆయన తెలియజేశారు. ప్రధానమంత్రి పదవి రేసులో తాను లేననీ, దేశంలోని యువతకు తాను చేయాల్సింది ఎంతో ఉందని అన్నారు.Source: జాతీయ | 14 Feb 2009 | 2:57 pm వేర్పాటువాదులకు సోనియా పిలుపుజమ్మూ- కాశ్మీర్ వేర్పాటువాదులు ప్రజాస్వామ్య స్రవంతిలో కలిసి పోవాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపునిచ్చారు. కాశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు అధిక సంఖ్యలో ఓటింగ్ పాల్గొని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టారని ప్రశంసించారు. ఈ విషయాన్ని వేర్పాటువాదులు గుర్తు పెట్టుకోవాలన్నారు.Source: జాతీయ | 14 Feb 2009 | 2:14 pm "ప్రేమ జంట"లకు బలవంతపు పెళ్ళిళ్లుప్రేమికుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రేమ జంటలకు భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ వంటి సంఘ్ పరివార్ సంస్థలు బలవంతపు పెళ్లిళ్లు చేశాయి. దీంతో జంట నగరాలతో సహా, నిజామాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ప్రధాన పార్కుల్లో ముందుజాగ్రత్త చర్యగా 144 సెక్షన్ విధించారు.Source: ఏపీ న్యూస్ | 14 Feb 2009 | 10:33 am
|