|
వైఎస్‌పై చర్యకు గవర్నర్‌కు వినతిపత్రంఅధికార దుర్వినియోగానికి పాల్పడిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతూ మహాకూటమి నేతలు శుక్రవారం గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సర్పించింది. జగతి పబ్లికేషన్ పేరుతో ప్రజాధనాన్ని ఆయన కుమారుని వ్యాపార సంస్థలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. అందువల్ల వైఎస్, అతని అనుచరులపై అవినీతి నిరోధక చట్టం 1988 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.Source: ఏపీ న్యూస్ | 13 Feb 2009 | 11:24 am ఎన్నికల తాయిలాలు: మంత్రిమండలి నిర్ణయంమరో రెండు నెలల్లో ఎన్నికల జరుగనున్న తరుణంలో శుక్రవారం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న 692 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. వీటితో పాటు కొత్త విశ్వవిద్యాలయాల కోసం ఉన్నత విద్యా శాఖలో ఉన్న 126 పోస్టులను భర్తీ చేశారు.Source: ఏపీ న్యూస్ | 13 Feb 2009 | 11:10 am పాక్ ప్రేరేపిత తీవ్రవాదంతో ముప్పు: ప్రణబ్పాక్ ప్రేరేపిత తీవ్రవాదం/ఉగ్రవాదం నుంచి భారత్‌కు ముప్పు పొంచివుందని కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. 26/11 దాడులపై పాకిస్థాన్ చేసిన ప్రకటనపై ఆయన శుక్రవారం పార్లమెంట్‌లో ఒక ప్రకటన చేశారు. తీవ్రవాదాన్ని అరకట్టేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోందన్నారు.Source: జాతీయ | 13 Feb 2009 | 10:28 am అవును... దాడిలో మా వాళ్ల హస్తం ఉంది: గఫూర్గత నవంబరులో ముంబయి ఉగ్రవాద దాడుల్లో భారతీయుల ప్రమేయం కూడా ఉందని ముంబయి పోలీస్ కమిషనర్ గఫూర్ సంచలన ప్రకటన చేశారు. టేప్ రికార్డ్ సందేశంలో మాట్లాడుతూ... దాడిలో 16మంది భారతీయుల సహాయసహకారాలున్నట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఈ 16 మందిలో ఇప్పటికే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.Source: జాతీయ | 13 Feb 2009 | 10:12 am నిఠారి వరుస హత్యలు: దోషులకు మరణశిక్షదేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిఠారీ వరుస హత్యల కేసులో దోషులకు ఘజియాబాద్ సిబీఐ ప్రత్యేక కోర్టు మరణశిక్షలు విధించింది. ఈ కేసులో ప్రధాన ముద్దాయి సురేందర్ కోలీ కాగా, అతనికి సహకరించిన మణీందర్ సింగ్ పంథేర్‌లకు మరణశిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చింది. రింపా హల్దార్ అనే 14 ఏళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన కేసులో వీరిద్దరిని దోషులుగా కోర్టు తేల్చింది.Source: జాతీయ | 13 Feb 2009 | 10:07 am ప్రేమికులకు భద్రత కల్పించండి: చిదంబరంకర్ణాటక రాష్ట్రంలో వాలెంటైన్స్ డే సందర్భంగా బయటతిరిగే వారికి పెళ్లిల్లు చేస్తామని కొన్ని అతివాద సంస్థలు హెచ్చరికలు పంపడంతో... శనివారం శాంతి, భద్రతలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కేంద్ర హోం శాఖ మంత్రి పి.చిదంబరం వాలెంటైన్స్ డే సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.Source: జాతీయ | 13 Feb 2009 | 8:06 am రైల్వే బడ్జెట్: రాష్ట్రానికి రెండు కొత్త రైళ్లుకేంద్ర రైల్వే శాఖామంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ రైలు బండి ఈ దఫా రాష్ట్రం మీదుగా ప్రయాణించింది. శుక్రవారం ఆయన ప్రకటించిన మధ్యంతర రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి రెండు రైళ్లు ప్రకటించారు. అలాగే బుల్లెట్ రైలు కోసం అధ్యయనం చేస్తారు. కాగా, కొత్తగా ప్రకటించిన రెండు రైళ్లలో ఒకటి ముంబై - మచిలీపట్నంల మధ్య వారానికి రెండు రోజుల పాటు నడుస్తుంది. అలాగే సికింద్రాబాద్ - మణుగూర్‌ల మధ్య సూపర్ ఫాస్ట్ రైలును ప్రవేశపెట్టారు.Source: ఏపీ న్యూస్ | 13 Feb 2009 | 7:59 am సోమిరెడ్డి దీక్ష భగ్నం: నెల్లూరు జిల్లాలో బంద్మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రశేఖరరెడ్డి తలపెట్టిన నిరాహరదీక్షను పోలీసులు భగ్నం చేయడంతో ఆయన అభిమానులు శుక్రవారం నెల్లూరు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ జిల్లా వర్గాల పిలుపు మేరకు ఈ బంద్ జరుగుతోంది. దీనికి వామపక్షాలు కూడా మద్దతు మద్దతు ప్రకటించాయి.Source: ఏపీ న్యూస్ | 13 Feb 2009 | 7:20 am ఐదేళ్లలో రూ.90 వేల కోట్లు మిగులు: లాలూకేంద్ర మంత్రి రైల్వే శాఖామంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఐదో సారి రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపట్టారు. 2009-10 సంవత్సరానికి గాను మధ్యంతర రైల్వే బడ్జెట్‌ను ఆయన శుక్రవారం దాఖలు చేశారు. గత ఐదేళ్లలో 90 వేల కోట్ల రూపాయల మిగులు సాధించి సరికొత్త రికార్డును సృష్టించినట్టు చెప్పారు. 2001 సంవత్సరంలో రైల్వే శాఖ నష్టాల్లో ఉండగా, ప్రస్తుతం డివిడెండ్ ఇచ్చే స్థాయిలో ఉందన్నారు.Source: జాతీయ | 13 Feb 2009 | 7:00 am షారుక్ ఇంటిపై కిరోసిన్ బాటిళ్లతో దాడిబాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఇంటిపై కొందరు గుర్తు తెలియని దుండగులు కిరోసిన్ బాటిళ్లతో దాడి చేశారు. ఈ దాడి శుక్రవారం వేకువ ఝామున జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రేమికుల రోజును సమర్థించినందుకే ఈ దాడి జరిగి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.Source: జాతీయ | 13 Feb 2009 | 6:48 am అధిష్టానం ఆదేశం మేరకే ప్రకటన: మొయిలీఅధిష్టానం ఆదేశం మేరకే తెలంగాణాపై స్పష్టమైన ప్రకటన చేసినట్టు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఈ అంశంపై ప్రజల్లో ఒక స్పష్టత తీసుకొచ్చేందుకే ముఖ్యమంత్రి వైఎస్సార్ అసెంబ్లీలో ప్రకటన చేశారని ఆయన వెల్లడించారు. సభా సంఘాన్ని ఏర్పాటు చేసి, ఆ సంఘం ఇచ్చే నివేదిక ఆధారంగా రాష్ట్ర ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు.Source: ఏపీ న్యూస్ | 13 Feb 2009 | 6:09 am రైలు చార్జీలు పెరగవు: లాలూరైలు చార్జీలను పెంచే ఆలోచన లేదని రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సూచనప్రాయంగా తెలియజేశారు. సామాన్యులపై భారం వేసే దిశగా తాము ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని ఆయన తెలిపారు. ఒక ప్రశ్నకు సమాధానం చెపుతూ, " పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టబోయేముందు వివరాలు చెపితే బావుండదు. అయితే సామాన్యులను, పేద బడుగు వర్గాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపకల్పన చేయడం జరిగింద"ని అన్నారు.Source: జాతీయ | 13 Feb 2009 | 5:55 am వీధి రౌడీలను తలపిస్తున్న నేతలు: చిరంజీవిరాష్ట్రంలోని రాజకీయ నేతలు వీధి రౌడీలు, గూండాలను తలపిస్తున్నారంటూ ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ధ్వజమెత్తారు. వీరివల్ల పవిత్రమైన శాసనసభ రణరంగాన్ని తలపిస్తుందని ఆవేదనను వ్యక్తం చేశారు. ఇలాంటి రాజకీయ నాయకులులేని పాతరోజులు రావాలని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.Source: ఏపీ న్యూస్ | 13 Feb 2009 | 5:38 am కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ : కోనేరుమునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఐదేళ్ల నుంచి పనిచేస్తున్న కాంట్రాక్టు, పార్ట్ టైం పనిచేసే ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని ఆ శాఖ మంత్రి కోనేరు రంగా రావు హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉత్తర్వులు 112 లోని నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని శాసన మండలి సభ్యులకు ఆయన హామీ ఇచ్చారు. స్పష్టమైన ఖాళీలు లేకపోవడంతో ఇప్పటివరకు పూర్తిస్థాయిలో ఈ నియామకాలు చేపట్టలేకపోయామని మంత్రి వివరణ ఇచ్చారు.Source: ఏపీ న్యూస్ | 13 Feb 2009 | 5:35 am తెలంగాణ ఏర్పాటు కోసమే కమిటీ: డీఎస్తెలంగాణ ఏర్పాటు చేసే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం కమిటీ వేసేందుకు సిద్దమైందని పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అడ్డుగా ఉన్న చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకునే దిశగా ఈ కమిటీ ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అంశంపై పరిశీలన జరపడానికి రెండు సభల సభ్యులతో సంయుక్త కమిటీ వేస్తామంటూ వైఎస్ పేర్కొన్న విషయంపై డీఎస్ మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుకు తమకు అభ్యంతరం లేదన్న ప్రభుత్వ వాదన వైఎస్ ప్రకటనతో తేలినట్టైందని డీఎస్ అన్నారు.Source: ఏపీ న్యూస్ | 13 Feb 2009 | 5:33 am సత్యంపై న్యాయ విచారణ: అద్వానీ డిమాండ్దేశ కార్పొరేట్ చరిత్రకే మాయని మచ్చగా మిగిలిన సత్యం కుంభకోణంపై న్యాయ విచారణ జరిపించాలని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ డిమాండ్ చేశారు. ఇది ఓ కార్పొరేట్ సంస్థ పాల్పడిన కుంభకోణం కాదు. ప్రభుత్వ కుంభకోణమని ఆయన ఆరోపించారు. పెద్ద ఎత్తున భూములు, ప్రభుత్వ కాంట్రాక్టుల ఆశచూపిన ప్రభుత్వం ఈ కుంభకోణానికి పాల్పడిందని ఆయన సందేహం వ్యక్తం చేశారు.Source: జాతీయ | 13 Feb 2009 | 5:30 am వైఎస్ తెలంగాణా నమ్మక ద్రోహి: కేసీఆర్ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తెలంగాణ ప్రజలకు నమ్మక ద్రోహం చేశారని తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు హామీ ఇచ్చిన వైఎస్.. దాన్ని నిలబెట్టుకోక పోవడమే కాకుండా దొంగ నాటకాలు ఆడుతున్నారని కేసీఆర్ దుయ్యబట్టారు.Source: ఏపీ న్యూస్ | 13 Feb 2009 | 3:36 am పోటీ ఆలోచన లేదు: రాజకీయ సన్యాసం: స్పీకర్వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదని 14వ లోక్‌సభ స్పీకర్‌గా సమర్థవతంగా బాధ్యతలు నిర్వహిస్తున్న కమ్యూనిస్టు కురువృద్ధుడు సోమనాథ్ ఛటర్జీ స్పష్టం చేశారు. ఇకపై రాజకీయ సన్యాయం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు ఆయన గురువారం తెలిపారు. తనకు క్రియాశీలక రాజకీయాల నుంచి వైదొలగే సమయం ఆసన్నమైందన్నారు.Source: జాతీయ | 13 Feb 2009 | 3:26 am నిఠారి వరుస హత్యల దోషులు ఖరారుఢిల్లీ సమీపంలోని నోయిడా శివార్లలోని నిఠారీ గ్రామంలో గతంలో జరిగిన 19హత్యలకు సంబంధించిన కేసులో మణీందర్‌సింగ్ పంథోర్, సురేందర్ సింగ్ కోహ్లీలను సీబీఐ ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్థారించిందిSource: జాతీయ | 12 Feb 2009 | 1:53 pm వచ్చే ఎన్నికల్లో విజయం మాదే: చంద్రబాబుత్వరలో జరుగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థులు విజయ ఢంకా మోగించడం ఖాయమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. బుధవారం అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలకు నిరసనగా గురువారం మహాకూటమి సభ్యులు అంబేద్కర్ విగ్రహం నుంచి సచివాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు.Source: ఏపీ న్యూస్ | 12 Feb 2009 | 12:02 pm
|