|
కాంగ్రెస్-ఎస్పీల మధ్య పెరుగుతున్న అగాధం!కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి ప్రాణవాయువు లాంటి సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య అగాధం నానాటికీ పెరుగుతోంది. ఫలితంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో ఎస్పీ జతకట్టే విషయం అనుమానాస్పదంగా మారింది. అదేసమయంలో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కలిసి పోటీ చేసే విషయంపై శరద్ పవార్ సమ్మతించాలని ఎస్పీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ విజ్ఞప్తి చేశారు.Source: జాతీయ | 12 Feb 2009 | 12:23 pm వచ్చే ఎన్నికల్లో విజయం మాదే: చంద్రబాబుత్వరలో జరుగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థులు విజయ ఢంకా మోగించడం ఖాయమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. బుధవారం అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలకు నిరసనగా గురువారం మహాకూటమి సభ్యులు అంబేద్కర్ విగ్రహం నుంచి సచివాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు.Source: ఏపీ న్యూస్ | 12 Feb 2009 | 12:02 pm ఆ దాడి దేశ ఆర్థిక వ్యవస్థపై దాడే: రాష్ట్రపతిదేశ వాణిజ్య రాజధాని ముంబైపై ఉగ్రవాదులు జరిపిన దాడిని దేశ ఆర్థిక వ్యవస్థపై జరిపిన దాడిగా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అభిప్రాయపడ్డారు. 14వ లోక్‌సభ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆమె ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకే ఉగ్రవాదులు ముంబైపై దాడి చేశారని ఆమె నొక్కివక్కాణించారు.Source: జాతీయ | 12 Feb 2009 | 9:45 am నిరవధికంగా వాయిదా పడిన 12వ శాసనసభరాష్ట్ర 12వ శాసనసభ చివరి సమావేశాలు గురువారంతో ముగిశాయి. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదంటూ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి చేసిన ప్రకటన అనంతరం సభాపతి కె.ఆర్.సురేష్ రెడ్డి సభను నిరవధికంగా వాయిదా వేశారు.Source: ఏపీ న్యూస్ | 12 Feb 2009 | 9:14 am తెలంగాణా ఏర్పాటుకు అభ్యంతరం లేదు: వైఎస్రాష్ట్రాన్ని రెండుగా చీల్చి, ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు తమ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ ఆఖరి సమావేశాల చివరి రోజున గురువారం ముఖ్యమంత్రి వైఎస్సార్ సభలో ఒక ప్రకటన చేశారు.Source: ఏపీ న్యూస్ | 12 Feb 2009 | 8:17 am భాజపాకు గోపాలస్వామి అనుకూలం: కాంగ్రెస్కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఎన్.గోపాలస్వామి ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. సిడిల పంపిణీ కేసు, ఉచిత చీర పంపిణీ కేసుల్లో గోపాలస్వామి భాజపాకు మద్దతుగా వ్యవహించారని ఆ పార్టీ పేర్కొంది. ఈ విషయాన్నే తాము ప్రస్తుతం మళ్లీ చెపుతున్నట్టు ఆ పార్టీ అధికార ప్రతినిధి మనీష్ తివారీ మీడియాకు వెల్లడించారు.Source: జాతీయ | 12 Feb 2009 | 6:49 am సైబర్ ప్రపంచంలో అద్వానీ ప్రభంజనంభారతీయ జనతా పార్టీ తమ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి ఎల్‌కె అద్వానీని ఉత్తమ ప్రధానమంత్రి అభ్యర్థిగా వర్ణిస్తూ... ఆన్‌లైన్‌లో ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఇందుకుగానూ ఢిల్లీలోని అద్వానీ కార్యాలయంలో వందమంది ఇంటర్నెట్ నిపుణులు అహర్నిశలు శ్రమపడుతున్నారు. రెండు వేల పాపులర్ వెబ్‌సైట్ల ద్వారా భాజపా ప్రధానమంత్రి అభ్యర్థి అద్వానీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీకి చెందిన ఐటీ నిపుణులు సూచించారట.Source: జాతీయ | 12 Feb 2009 | 6:48 am తెలుగుదేశానికి మరో ఎమ్మెల్యే గుడ్బైప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి మరో శాసనసభ్యుడు గుడ్‌బై చెప్పారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే, తెదేపా బహిష్కృత నేత జి.వీరశివారెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రస్తుత శాసనసభ చివరి రోజు సమావేశాలు గురువారంతో ముగియనున్నాయి. ఈ సమావేశాలు ముగిసిన తర్వాత ఆయన స్పీకర్ కేఆర్.సురేష్ రెడ్డిని కలిసి తన రాజీనామా లేఖను సమర్పించనున్నారు.Source: ఏపీ న్యూస్ | 12 Feb 2009 | 5:50 am పాక్‌తో మోడీకి ఉన్న కనెక్షన్ ఏమిటో: చిదంబరంశత్రుదేశం పాకిస్థాన్‌తో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ఉన్న కనెక్షన్ ఏమిటో వెల్లడించాలని కేంద్ర హోం మంత్రి చిదంబరం డిమాండ్ చేశారు. ముంబై మారణహోమంలో స్థానికులకే సంబంధం ఉన్నట్టు మోడీ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈ దాడులపై అటు పాకిస్థాన్, ఇటు నరేంద్ర మోడీలు ఒకే రకంగా మాట్లాడుతున్నారని, దీన్ని బట్టి ఆయనకు ఆ దేశంతో ఎలాంటి సంబంధం ఉందో ఎవరైనా ప్రశ్నించవచ్చన్నారు.Source: జాతీయ | 12 Feb 2009 | 4:44 am మహా కూటమిని నమ్మి మోసపోవద్దు: వైఎస్ విజ్ఞప్తిసిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి, మహా కూటమిగా అవతరించిన ఆ నాలుగు పార్టీల నేతల మాయమాటలు నమ్మి మోసపోవద్దని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీకి మరోసారి అవకాశం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే.. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి, ప్రజలకు మంచి పాలన అందిస్తామని హామీ ఇచ్చారు.Source: ఏపీ న్యూస్ | 12 Feb 2009 | 4:19 am నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు14వ లోక్‌సభ చివరి సమావేశాలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా శుక్రవారం మధ్యంతర రైల్వే బడ్జెట్‌ను, వచ్చే సోమవారం మధ్యంతర సాధారణ బడ్జెట్‌ను యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఈ 14 రోజుల పాటు సమావేశాలు జరుగుతాయి. ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ చివరి సమావేశాల్లో యూపీఏ ప్రభుత్వంపై ముప్పేట దాడి చెయ్యాలని విపక్షాలు భావిస్తున్నాయి.Source: జాతీయ | 12 Feb 2009 | 3:25 am వైఎస్ సర్కారుకు చరమ గీతం పాడండి: రోజారాష్ట్రంలోని వైఎస్ సర్కారుకు వచ్చే ఎన్నికల్లో చరమ గీతం పాడాలని తెలుగుదేశం మహిళా విభాగం అధ్యక్షురాలు, సినీ నటి రోజా పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం రౌడీలకు, గూండాల అడ్డాగా మారిపోయిందని ఆమె ఆరోపించారు. ప్రధానంగా, మహిళలకు రక్షణ పూర్తిగా కరువైందని ధ్వజమెత్తారు. ఆరేళ్ళ పసిపాప నుంచి అరవై ఏళ్ళ ముదుసలి వరకూ రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట అత్యాచారాలకు, హత్యలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.Source: ఏపీ న్యూస్ | 12 Feb 2009 | 3:24 am రామసేనకు పింక్ చడ్డీలువాలెంటైన్స్డే రోజున రామ్ సేన అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్‌కు పింక్ చడ్డీలు బహుమానంగా అందనున్నాయి. గత వారం ఫిబ్రవరి-5న మంగళూరులోని ఒక పబ్‌లో అమ్మాయిలను ఇది మన సాంప్రదాయం కాదని తరిమికొట్టిన రామసేన, ఆ తర్వాత రాబోయే వాలెంటైన్స్‌డేను నిషేధిస్తూ ప్రకటనలు జారీ చేసింది. ఈ వాలెంటైన్స్ డే జరుపుకుంటే వారికి తగిన బుద్ధి చెబుతామనికూడా వారు హెచ్చరికలు జారీ చేశారు.Source: జాతీయ | 11 Feb 2009 | 2:09 pm కేంద్ర మంత్రి మహవీర్‌పై హత్యకేసుఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర గ్రామీణ చిన్నతరహా పరిశ్రమల శాఖా మంత్రి మహావీర్ ప్రసాద్‌పై బుధవారం హత్యాభియోగాలు నమోదయ్యాయి. ఈ మేరకు బుధవారం ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ పోలీసులు మంత్రితో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. తన భర్త హత్య కేసులో నిందితుల్ని కాపాడేందుకు మంత్రి ప్రయత్నిస్తున్నారంటూ శుభావతి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి పలుకుబడితో తన భర్త హత్యకేసును పోలీసులు రోడ్డు ప్రమాదం కేసుగా నమోదు చేశారని ఆమె ఆరోపించారు.Source: జాతీయ | 11 Feb 2009 | 1:48 pm ఐక్యతలేని పార్టీలు అధికారం కోసం ప్రాకులాట : వైఎస్సిద్ధాంత ఐక్యతలేని పార్టీలు అధికారం కోసం అడ్డదారులు తొక్కుతున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైస్ రాజశేఖర రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని ఒంటరిగా ఓడించే ధైర్యంలేని తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్రసమితి, వామపక్ష పార్టీలు కూటమి పేరుతో కలిశాయనీ, అయితే ఏ పార్టీ కూడా కాంగ్రెస్‌ను ఓడించే దమ్ము లేదని ఘాటుగా స్పందించారు.Source: ఏపీ న్యూస్ | 11 Feb 2009 | 1:45 pm కరుణానిధికి జరిగిన శస్త్రచికిత్స సక్సెస్గత కొద్దిరోజులుగా వెన్ను నొప్పితో బాధపడుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధికి బుధవారం వెన్నెముకకు శస్త్రచికిత్స జరిగింది. శస్త్రచికిత్స ఫలప్రదమైనట్లు, ప్రస్తుతం ఆయన క్షేమంగావున్నట్లు అధికారులు తెలిపారు.Source: జాతీయ | 11 Feb 2009 | 12:07 pm
|