రామసేనకు పింక్ చడ్డీలు

వాలెంటైన్స్‌డే రోజున రామ్ సేన అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్‌కు పింక్ చడ్డీలు బహుమానంగా అందనున్నాయి. గత వారం ఫిబ్రవరి-5న మంగళూరులోని ఒక పబ్‌లో అమ్మాయిలను ఇది మన సాంప్రదాయం కాదని తరిమికొట్టిన రామసేన, ఆ తర్వాత రాబోయే వాలెంటైన్స్‌డేను నిషేధిస్తూ ప్రకటనలు జారీ చేసింది. ఈ వాలెంటైన్స్ డే జరుపుకుంటే వారికి తగిన బుద్ధి చెబుతామనికూడా వారు హెచ్చరికలు జారీ చేశారు.
Source: జాతీయ | 11 Feb 2009 | 2:09 pm

కేంద్ర మంత్రి మహవీర్‌‌పై హత్యకేసు

ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర గ్రామీణ చిన్నతరహా పరిశ్రమల శాఖా మంత్రి మహావీర్ ప్రసాద్‌పై బుధవారం హత్యాభియోగాలు నమోదయ్యాయి. ఈ మేరకు బుధవారం ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ పోలీసులు మంత్రితో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. తన భర్త హత్య కేసులో నిందితుల్ని కాపాడేందుకు మంత్రి ప్రయత్నిస్తున్నారంటూ శుభావతి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి పలుకుబడితో తన భర్త హత్యకేసును పోలీసులు రోడ్డు ప్రమాదం కేసుగా నమోదు చేశారని ఆమె ఆరోపించారు.
Source: జాతీయ | 11 Feb 2009 | 1:48 pm

ఐక్యతలేని పార్టీలు అధికారం కోసం ప్రాకులాట : వైఎస్

సిద్ధాంత ఐక్యతలేని పార్టీలు అధికారం కోసం అడ్డదారులు తొక్కుతున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైస్ రాజశేఖర రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని ఒంటరిగా ఓడించే ధైర్యంలేని తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్రసమితి, వామపక్ష పార్టీలు కూటమి పేరుతో కలిశాయనీ, అయితే ఏ పార్టీ కూడా కాంగ్రెస్‌ను ఓడించే దమ్ము లేదని ఘాటుగా స్పందించారు.
Source: ఏపీ న్యూస్ | 11 Feb 2009 | 1:45 pm

కరుణానిధికి జరిగిన శస్త్రచికిత్స సక్సెస్

గత కొద్దిరోజులుగా వెన్ను నొప్పితో బాధపడుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధికి బుధవారం వెన్నెముకకు శస్త్రచికిత్స జరిగింది. శస్త్రచికిత్స ఫలప్రదమైనట్లు, ప్రస్తుతం ఆయన క్షేమంగావున్నట్లు అధికారులు తెలిపారు.
Source: జాతీయ | 11 Feb 2009 | 12:07 pm

సభాపతిగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ: సురేష్ రెడ్డి

రాష్ట్ర శాసనసభలో బుధవారం చోటు చేసుకున్న పరిణామాలకు సభాపతిగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెపుతున్నట్టు అసెంబ్లీ స్పీకర్ కె.ఆర్.సురేష్ రెడ్డి తెలిపారు. సభను సజావుగా నిర్వహించేందుకు తాను ఎంతో సహనంతో ప్రయత్నించానని అన్నారు. అయినప్పటికీ సభలో విపక్ష సభ్యుల వ్యవహారశైలిలో ఏమాత్రం మార్పు రాలేదని, అందువల్లే వారిని సస్పెండ్ చేశామని చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 11 Feb 2009 | 9:57 am

శాసనసభ గౌరవాన్ని మంటగలిపారు: రోశయ్య

రాష్ట్ర శాసనసభ గౌరవ మర్యాదలను విపక్ష సభ్యులు దిగజార్చారని ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖామంత్రి కె.రోశయ్య ఆరోపించారు. బుధవారం ఉదయం శాసనసభ ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష సభ్యులు సభా కార్యక్రమాలను సజావుగా సాగనివ్వకుండా పదే పదే అడ్డు తగులుతూ ఆటంకం కలిగించారు. దీంతో స్పీకర్ సభను రెండు సార్లు వాయిదా వేశారు.
Source: ఏపీ న్యూస్ | 11 Feb 2009 | 9:26 am

సిట్టింగ్ జడ్జీతో విచాణ జరిపించాలి: బాబు

ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి కుమారుడు, వైఎస్.జగన్మోహన రెడ్డికి చెందిన వ్యాపార సంస్థల్లో జరిగిన అవకతవకలపై సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. బుధవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో సభా కార్యక్రమాల నుంచి సస్పెండ్ అయిన తర్వాత మీడియాతో మాట్లాడారు.
Source: ఏపీ న్యూస్ | 11 Feb 2009 | 9:14 am

ప్రత్యక్ష ప్రసారాలను నిలిపి వేయాలి: సీఎం

రాష్ట్ర శాసనసభ జరిగే సమయంలో ప్రత్యక్ష ప్రసారాలను నిలిపి వేయాలని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి సూచించారు. అసెంబ్లీ గౌరవ మర్యాదలు మంటకలిపే విధంగా విపక్ష సభ్యులు ప్రవర్తించడం సిగ్గుచేటని ఆయన అభిప్రాయపడ్డారు. బుధవారం శాసనసభలో జరిగిన పరిణామాలకు మీడియా ప్రత్యక్ష ప్రసారాలు కూడా ఒక కారణమని అందువల్ల ఈ ప్రసారాలను నిలిపి వేసే విషయాన్ని పరిశీలించాలని వైఎస్ సూచించారు.
Source: ఏపీ న్యూస్ | 11 Feb 2009 | 9:03 am

సమచారాన్ని నేరుగా అడగండి: భారత్

ముంబయి దాడులకు సంబంధించి మీడియా ద్వారా తమకు మరింత సమచారం కావాలంటూ పాకిస్తాన్ ప్రభుత్వం పదేపదే చెప్పడంపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. పాక్ ప్రభుత్వానికి ఏ రకమైన సమాచారం కావాలన్నా తమను నేరుగా సంప్రదించాలని కోరింది. అంతేగానీ చీటికి మాటికి అది కావాలీ, ఇది కావాలీ అని పత్రికలకు తలో మాట చెప్పడం సరైన పద్ధతి కాదని హితవు పలికింది.
Source: జాతీయ | 11 Feb 2009 | 7:22 am

అన్ని స్థానాల్లో ఎల్.జె.పి పోటీ: మంత్రి పాశ్వాన్

యూపీఏతో సీట్ల పంపిణీ కుదరకపోతే తమ పార్టీ బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలలోని అన్ని పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుందని కేంద్ర మంత్రి, లోక్‌జనశక్తి పార్టీ అధినేత రామ్ విలాశ్ పాశ్వాన్ స్పష్టం చేశారు. ఆయన పనాజీలో మీడియాతో మాట్లాడుతూ మార్చి మొదటి వారంలో సమావేశమై, భవిష్యత్ ప్రణాళికను ఖరారు చేస్తామన్నారు.
Source: జాతీయ | 11 Feb 2009 | 7:06 am

ప్రత్యామ్నాయ మార్గంలో సేతు పూర్తి: బాలు

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సేతు సముద్ర ప్రాజెక్టును ప్రత్యామ్నాయ మార్గంలో పూర్తి చేసేందుకు కేంద్రం సిద్దంగా ఉందని కేంద్ర నౌకాయాన, ఉపరితల రవాణాశాఖామంత్రి టీఆర్.బాలు స్పష్టం చేశారు. ఆయన మంగళవారం రాత్రి మదురైలో మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ప్రాజెక్టును ఆరు లేదా 12 నెలల కాలంలో ప్రాజెక్టును పూర్తి అవుతుందన్నారు.
Source: జాతీయ | 11 Feb 2009 | 6:47 am

నేడు ఆసియా ఎయిర్‌ షో-2009 ప్రారంభం

ఆసియాలో అతిపెద్ద ఎయిర్‌షో - 2009 బుధవారం నుంచి కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో ప్రారంభంకానుంది. యెలహంకాలో ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో ఈ షో ఐదు రోజుల పాటు సాగుతుంది. భారత్‌లో ఉన్న మార్కెట్ అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు, మల్టీ బిలియన్ డాలర్ల ఒప్పందాలను కుదుర్చుకునేందుకు అంతర్జాతీయ విమానయాన సంస్థలకు ఈ ఎయిర్‌ షో ఎంతో దోహదపడనుంది.
Source: జాతీయ | 11 Feb 2009 | 6:33 am

రేపటి నుంచి పార్లమెంట్ ఆఖరి సమావేశాలు

పార్లమెంట్ ఆఖరి సమావేశాలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ప్రసంగంతో తొలి రోజు సమావేశాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత శుక్రవారం మధ్యంతర రైల్వే, సాధారణ బడ్జెట్‌లను ప్రవేశపెడుతారు. దేశ సార్వత్రిక ఎన్నికలకు మరో రెండు మూడు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో చివరి దఫా సమావేశాలు ప్రారంభంకానుండటం ఇటు అధికార, అటు ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
Source: జాతీయ | 11 Feb 2009 | 6:20 am

నా రాజకీయ ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారు: నటి కవిత

తాను రాజకీయాల్లోకి రాకుండా ఉండేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని తెదేపా మహిళా నేత, సినీ నటి కవిత ఆరోపించారు. తన ఇంట్లో పని చేసే పని మనుషులను ఎవరినీ తాను ఏనాడూ చులకనభావంతో చూడలేదని ఆమె స్పష్టం చేశారు. ఆమె ఇంట్లో పని చేస్తున్న బాలికలను హింసిస్తూ వారిని వేధింపులకు గురి చేసిందన్న ఆరోపణలపై కవితపై ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదైన విషయం తెల్సిందే.
Source: ఏపీ న్యూస్ | 11 Feb 2009 | 6:15 am

అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మార్షల్స్ తోపులాట

రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో భాగంగా బుధవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే వాయిదా తీర్మానాలపై ప్రతిపక్ష సభ్యులు చర్చకు పట్టుబట్టారు. దీనికి స్పీకర్ సురేష్ రెడ్డి అనుమతి నిరాకరించారు. విపక్ష సభ్యులు మాత్రం ఏమాత్రం బెట్టుసడలించక పోవడంతో వారిని సస్పెండ్ చేయాల్సిందిగా రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖామంత్రి రోశయ్య తీర్మానాన్ని ప్రవేశపెట్టడంతో స్పీకర్ పలువురు ప్రతిపక్ష సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు.
Source: ఏపీ న్యూస్ | 11 Feb 2009 | 5:25 am

దామాషా పద్దతిలో సీట్ల కేటాయింపు: చిరంజీవి

వచ్చే ఎన్నికల్లో దామాషా పద్దతిలో సీట్లను కేటాయించి, అన్ని వర్గాల వారికి సామాజిక న్యాయం జరిగేలా చూస్తామని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తెలిపారు. గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ప్రసంగిస్తూ రాజకీయాల్లో పురుషులు ఉన్నంత సంఖ్యలో మహిళలు లేరని, అందువల్ల వారికి యాభై శాతం సీట్లు కేటాయించడం కష్టమన్నారు.
Source: ఏపీ న్యూస్ | 11 Feb 2009 | 4:38 am

పొత్తుల మధ్యవర్తిగా యూపీ గవర్నర్: అమర్

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ కాంగ్రెస్‌ పార్టీకి, రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలకు మధ్య పొత్తులు కుదుర్చే మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారని సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ ఆరోపించారు. ఆయన ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ సంచనల వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీల మధ్య ఒప్పందం కుదర్చడంలో గవర్నర్ టి.వి.రాజేశ్వర్ మధ్యవర్తిగా వ్యవహరించారని స్పష్టం చేశారు.
Source: జాతీయ | 11 Feb 2009 | 3:56 am

మరో వివాదంలో కమిషనర్ నవీన్ చావ్లా!

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ నవీన్ చావ్లా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల సంఘం నుంచి నవీన్ చావ్లాను తొలగించాలని ఈసీ ప్రధానాధికారి ఎన్.గోపాలస్వామి చేసిన సిఫార్సు వివాదం సద్దుమణగక ముందే నవీన్ చావ్లా భూ వివాదంలో చిక్కుకున్నారు. దీంతో ఆయన మరోమారు తెరపైకి వచ్చారు.
Source: జాతీయ | 11 Feb 2009 | 3:56 am

ప్రతిపక్ష సభ్యుల ఒక రోజు సస్పెన్షన్

మేటాస్, సత్యం సంస్థలపై చర్చ బుధవారం ప్రశ్నోత్తరాల సమయం తరువాత చర్చిద్దామని స్పీకర్ చేసిన ప్రతిపాదనను తెలుగుదేశం, తెరాస, వామపక్ష సభ్యులు పెడచెవిన పెట్టడంతో... సురేష్ రెడ్డి వారిని ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. మధ్యాహ్నం వాయిదా పడిన శాసనసభ తిరిగీ సాయంత్రం ఐదు గంటలకు సమావేశమైంది. సభలో మేటాస్, సత్యం సంస్థలపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఈ అంశాన్ని బుధవారం ప్రశ్నోత్తరాల సమయం తరువాత చర్చిద్దామని స్పీకర్ చేసిన విజ్ఞప్తిని వారు తలకెక్కించుకోలేదు.
Source: ఏపీ న్యూస్ | 10 Feb 2009 | 2:27 pm