భారీ భద్రత నడుమ ప్రేమికుల దినోత్సవం

ప్రేమికుల దినోత్సవ వేడుకలకు విఘాతం కలుగకుండా బెంగళూరు పోలీసులు శ్రీరామ్‌‌సేనకు తీవ్రమైన హెచ్చరికలు పంపారు. ఇటీవలే జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రేమికుల దినోత్సవ వేడుకలపై ప్రత్యేక దృష్టి సారించామని బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు.
Source: జాతీయ | 10 Feb 2009 | 1:01 pm

నారా కోడూరులో పీఆర్పీ, టీడీపీ వర్గాల ఘర్షణ

ప్రజారాజ్యం అధినేత చిరంజీవి గుంటూరు జిల్లా పర్యటన వేళ ఆ పార్టీ కార్యకర్తలకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య స్పల్ప ఘర్షణ చెలరేగింది. అయితే సమయానికి పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఘర్షణ కాస్తా సద్దుమణిగింది.
Source: ఏపీ న్యూస్ | 10 Feb 2009 | 11:45 am

ఎటువంటి ముప్పునైనా ఎదుర్కొంటాం: ఆంటోనీ

భద్రతాపరంగా ఎటువంటి ముప్పునైనా ఎదుర్కొనే సామర్థ్యం భారత్‌కు ఉందని రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ తెలిపారు. భద్రతకు ఎటువైపు నుంచి వచ్చే ముప్పునైనా తిప్పికొడతామన్నారు. పాకిస్థాన్‌పై భారత్ దాడికి దిగితే ముంబయి తరహా దాడులు మరిన్ని జరుగుతాయని అల్- ఖైదా కమాండర్ చేసిన హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఆంటోనీ మాట్లాడుతూ.. పైవాఖ్యలు చేశారు.
Source: జాతీయ | 10 Feb 2009 | 11:36 am

సీబీఐ కేసులో మొత్తం 288 తప్పులు: అమర్ సింగ్

యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ ఆస్తుల కేసుపై సుప్రీంకోర్టుకు సీబీఐ సమర్పించిన నివేదికలో మొత్తం 288 తప్పులు ఉన్నాయని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ విమర్శించారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ కూటమి ప్రభుత్వానికి సీబీఐ తొత్తుగా వ్యవహరిస్తుందని ఆరోపించారు.
Source: జాతీయ | 10 Feb 2009 | 11:36 am

తిరుమలవాసునికీ తప్పని బెదిరింపులు

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరునికి సైతం బెదిరింపు లేఖలు తప్పడం లేదు. తమ మాట వినకుంటే అది పేల్చేస్తాం, ఇది పేల్చేస్తాం అంటూ లేఖలు రాసే బెదిరింపుదార్లు తాజాగా తిరుమల శ్రీవారికి సైతం ఓ బెదిరింపు లేఖ రాశారు.
Source: ఏపీ న్యూస్ | 10 Feb 2009 | 11:35 am

యూపీ అసెంబ్లీలో గందరగోళం: గవర్నర్‌పై కాగితాలు

ఉత్తరప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజునే సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. గవర్నర్ టీవీ రాజేశ్వర్ ప్రసంగిస్తుండగా ప్రతిపక్ష సభ్యులు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఆయన ప్రసంగానికి పదేపదే అడ్డుతగులుతూ నానా రబస చేశారు. ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్ దళ్, కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వ వ్యతిరేక బ్యానర్లు పట్టుకొని, మాయావతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగిలారు. అయినా గవర్నర్ తన ప్రసంగాన్ని ముగింపుచుకొని అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు.
Source: జాతీయ | 10 Feb 2009 | 11:31 am

కాంట్రాక్టు కార్మికులచే విద్యుత్‌సౌధ ముట్టడి

చాలా ఏళ్లుగా పనిచేస్తున్న తమతోనే శాఖలో ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టు కార్మికులు మంగళవారం హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధను ముట్టడించారు.
Source: ఏపీ న్యూస్ | 10 Feb 2009 | 10:55 am

కేంద్రానికి వంతపాడుతున్న సీబీఐ: సుప్రీంకోర్టు

సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ ఆస్తులపై విచారణ కేసులో కేంద్ర ప్రభుత్వానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) వంత పాడుతోందని సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. కేంద్ర ప్రభుత్వానికి, న్యాయ శాఖకు మీరు (సీబీఐ) వంత పాడుతున్నారు. స్వతంత్రంగా వ్యవహరించడం లేదని సుప్రీంకోర్టు కోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
Source: జాతీయ | 10 Feb 2009 | 10:55 am

సంభాషణల కేంద్రంగా మారిన అసెంబ్లీ: చిరు

ప్రజా సమస్యలపై చర్చించాల్సిన రాష్ట్ర శాసన సభ ప్రస్తుతం ఎమ్మెల్యేలకు సంభాషణల కేంద్రంగా మారిందని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అభిప్రాయపడ్డారు. ఏ సభ్యుడు కూడా ప్రజా సమస్యలపై చర్చించేందుకు ఆసక్తి చూపించడం లేదని ఆయన ఆరోపించారు. దేశ కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణమైన సత్యం కంప్యూటర్స్ అవినీతిపై చర్చను పక్కదారి పట్టిస్తూ, పరస్పర విమర్శలకే అన్ని పార్టీల సభ్యులు పరిమితమయ్యారని ఆయన విమర్శించారు.
Source: ఏపీ న్యూస్ | 10 Feb 2009 | 9:46 am

సత్యంపై సీబీఐ విచారణకు అభ్యతరంలేదు: వైఎస్

సత్యం కుంభకోణంలో నిజానిజాలను తేల్చేందుకు ఆ కేసును సీబీఐకి అప్పగించడానికి సంబంధించి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి వైఎస్ పేర్కొన్నారు. సత్యం కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఇప్పటికే తాము ప్రధానికి లేఖ రాశామని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
Source: ఏపీ న్యూస్ | 10 Feb 2009 | 9:41 am

భీంరావ్‌బాడ వద్ద మహాకూటమి ఆందోళన

భీంరావ్‌బాడ తొలగింపుపై అసెంబ్లీలో చెలరేగిన ఆందోళన అంతటితో ముగిసిపోలేదు. ఈ విషయంలో ప్రభుత్వంనుంచి సంతృప్తికరమైన సమాధానం లభించలేదని అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి విపక్షాలు భీంరావ్‌బాడకు చేరుకుని ఆందోళనకు దిగాయి. భీంరావ్‌బాడ ప్రదేశానికి చేరుకున్న మహాకూటమి నేతలకు బీజేపీ నేతలు సైతం జతచేరారు.
Source: ఏపీ న్యూస్ | 10 Feb 2009 | 7:25 am

తప్పిన ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించిన డీజీసీఏ

ముంబయి విమానాశ్రయంలో సోమవారం ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ తీసుకుంటుండగా, రన్‌వేపై హెలీకాఫ్టర్ ల్యాండ్ అయిన సంఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఏర్పాటు చేసిన అధికారిక బృందం దర్యాప్తు ప్రారంభించింది. హెలీకాఫ్టర్‌ను చూసిన ఎయిర్ ఇండియా పైలెట్ అప్రమత్తంగా వ్యవహరించి, ఎమర్జెన్సీ బ్రేకులతో విమానాన్ని ఆపాడు.
Source: జాతీయ | 10 Feb 2009 | 7:24 am

తెల్ల కార్డుంటే రూ. 20కే సూపర్‌ఫైన్ బియ్యం

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏదో ఒక రూపంలో ప్రజా ఆకర్షణ పథకాలను ప్రవేశపెడుతున్న ప్రభుత్వం తాజాగా మరో పథకాన్ని ప్రజలముందుకు తెచ్చింది. బహిరంగ మార్కెట్‌లో సూపర్‌ఫైన్ బియ్యం ధరకు రెక్కలొచ్చి కిలో రూ. 30ని మించిపోయిన తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టడం విశేషం.
Source: ఏపీ న్యూస్ | 10 Feb 2009 | 7:12 am

కసబ్‌ హత్యకు దావూద్‌తో ఐఎస్ఐ ఒప్పందం

ముంబై మారణహోమంలో సజీవంగా పట్టుబడిన ఏకైక ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను హత్య చేయాలని అంతర్జాతీయ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను పాకిస్థాన్ అంతర్గగత భద్రతా నిఘా విభాగం (ఐఎస్ఐ) కోరినట్టు భారత పరిశోధన, అధ్యయన (రా) విభాగం వెల్లడించింది. గుజరాత్ రాష్ట్రంలోని భుజ్‌లో రా అధికారులు ఇంటర్నెట్ సంభాషణలు పరిశీలించినపుడు ఈ కుట్ర వెలుగులోకి వచ్చింది.
Source: జాతీయ | 10 Feb 2009 | 7:05 am

భీంరావ్‌బాడపై చర్చతో వేడెక్కిన అసెంబ్లీ

భీంరావ్‌బాడ తొలగింపుకు సంబంధించి వాడీవేడిగా సాగిన చర్చతో మంగళవారంనాటి అసెంబ్లీ సమావేశాలు వేడెక్కాయి. భీంరావ్‌బాడ తొలగింపు విషయంలో ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలు మండిపడితే తాము చేసింది ఖచ్చితంగా సరైనదేనంటూ ప్రభుత్వం సమర్ధించుకునే ప్రయత్నం చేసింది.
Source: ఏపీ న్యూస్ | 10 Feb 2009 | 6:55 am

క్షమాపణ చెప్పి తీరాల్సిందే : చంద్రబాబు

కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం రోజున భీంరావ్‌వాడలో నివసిస్తున పేదల ఇళ్లను కూల్చివేసిన రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పి తీరాలని ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. ఇళ్లు కూల్చిన ప్రాంతంలోనే బాధితులకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని ఆయన అన్నారు. అసెంబ్లీ సమావేశాలలో ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ప్రభుత్వం కట్టించిన ఇంద్ర భవనంలో పండుగ చేసుకోకుండా, పేదలు ఇందిరాపార్క్ వద్ద నడిరోడ్డుపై సంక్రాంతి రోజున వంటలు ఎందుకు చేసున్నారని ప్రశ్నించారు.
Source: ఏపీ న్యూస్ | 10 Feb 2009 | 6:53 am

రాజకీయం వ్యాపారం కాదు: 'చిరు' చురకలు

రాజకీయమంటే వ్యాపారం కాదని, వ్యసనం కాదని, విలాసం అంతకన్నా కాదని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి పేర్కొన్నారు. చిరంజీవికి రాజకీయాలంటే ఏం తెలుసు, ఆయన సచివాలయం ముఖమైనా చూశారా అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి విరుచుకుపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 10 Feb 2009 | 6:32 am

బీహార్‌లో నక్సల్ దాడి: 10 మంది పోలీసుల మృతి

బీహార్‌లోని నవదా జిల్లాలో సోమవారం నక్సల్ జరిపిన అనూహ్య దాడిలో పది మంది పోలీసులు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. అంతేకాకుండా అనేక ఆయుధాలను నక్సల్స్ లూఠీ చేశారు. సుమారు 200 మంది సీపీఐ మావోయిస్టు దళ సభ్యులు అత్యాధునిక ఆయుధాలతో పోలీసు బృందంపై దాడి చేశాయి.
Source: జాతీయ | 10 Feb 2009 | 5:36 am

మాజీ రాష్ట్రపతి కలాం హత్యకు తీవ్రవాదుల కుట్ర

హర్కత్ -ఉల్- జీహాదీ -ఎ- ఇస్లామీ (హుజీ)కి చెందిన ఆరుగురు తీవ్రవాదులు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంను హత్య చేసేందుకు కుట్ర పన్నారు. అబ్దుల్ కలాం 2001లో రాష్ట్రపతిగా ఉన్న సమయంలో పాట్నాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన హత్యకు కుట్రపన్నినట్లు సోమవారం ఒక ఢిల్లీ కోర్టులో ప్రభుత్వ తరపు న్యాయవాది పేర్కొన్నారు.
Source: జాతీయ | 10 Feb 2009 | 5:17 am

మెరుగుపడుతున్న వాజ్‌పేయి ఆరోగ్యం: వైద్యులు

ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయి ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు తెలిపారు. ఆయన ఊపరితిత్తుల పనితీరు మెరుగవుతున్న సూచనలు కనిపిస్తున్నాయని ఎయిమ్స్ వైద్యులు చెప్పారు. వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి ఆశాజనకంగా ఉంది. క్రమంగా కోలుకుంటున్నారని ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యుడు సంపత్ కుమార్ తెలిపారు. ఊపరితిత్తులు శుభ్రపరిచిన రక్తంలో ఆక్సిజన్ స్థాయి (ఆక్సీజనేషన్) కూడా బాగా ఉందన్నారు.
Source: జాతీయ | 10 Feb 2009 | 5:15 am