మంత్రి రేణుకను అదుపు చేయండి: యడ్యూరప్ప

నిజాలు తెలుసుకోకుండా కేంద్ర మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రి రేణుకా చౌదరి తమ ప్రభుత్వంపై నిందారోపణలు చేస్తున్నారని, అందువల్ల ఆమెను అదుపు చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వంపై చేసే ఆరోపణల్లో ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఇలాంటి ఆరోపణలను మంత్రి రేణుకా చౌదరి మానుకోవాలని ఆయన హితవు పలికారు.
Source: జాతీయ | 9 Feb 2009 | 10:25 am

శివాజీ, శ్రద్దాదాస్ జంటగా 18,20 లవ్‌స్టోరీ

శివాజీ, శ్రద్దాదాస్ జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 18, 20 లవ్‌స్టోరీ. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి నెలాఖర్లో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నిర్మాత ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రాన్ని...
Source: Yahoo! Telugu: Entertainment | 9 Feb 2009 | 9:59 am

నాని, మాధవీలతలతో కొత్త చిత్రం ప్రారంభం

అష్టాచెమ్మ ఫేం నాని, నచ్చావులే ఫేం మాధవీలత జంటగా సత్యం బెల్లంకొండ దర్శకుని ఓ చిత్రం శ్రీకారం చుట్టుకుంది. ఈ చిత్రాన్ని జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. ఈ చిత్రానికి శివశంకర్ బాణీలు...
Source: Yahoo! Telugu: Entertainment | 9 Feb 2009 | 9:58 am

స్వాతి, కలమ్‌కామరాజ్‌ల కలవరమాయే మదిలో

కలర్స్ స్వాతి, కలమ్‌కామరాజ్ జంటగా సంగీత నేపథ్యంలో రానున్న చిత్రం కలవరమాయే మదిలో. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ చిత్రంలో విక్రమ్ గోఖలే, భరణి, జయసుధ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Feb 2009 | 9:57 am

నచ్చిన పాత్రతో సిద్ధం అయ్యాను: జగపతిబాబు

సిద్ధం చిత్రం ద్వారా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న హీరో జగపతిబాబుది ఓ ప్రత్యేకమైన ఇమేజ్. హీరోగా గుర్తింపు ఉన్నా మరో హీరో చిత్రంలో చిన్న పాత్రలు పోషించడానికి జగపతిబాబు ఎప్పుడూ సిద్ధం. అలాగే ఫ్యామిలీ హీరోగా కొన్నాళ్ల క్రితం గుర్తింపు...
Source: Yahoo! Telugu: Entertainment | 9 Feb 2009 | 9:55 am

కళ్యాణ్‌ను విమర్శించే నైతిక హక్కు లేదు: ములాయం

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ మాజీ నేత కళ్యాణ్ సింగ్‌ను విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ అభిప్రాయపడ్డారు. బాబ్రీ మసీదు విధ్వంసానికి కళ్యాణ్ సింగ్ పూర్తి బాధ్యత వహిస్తూ.. ఇటీవల ఒక ప్రకటన చేసిన విషయం తెల్సిందే. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది.
Source: జాతీయ | 9 Feb 2009 | 9:34 am

మేటాస్ పనులను రద్దు చేయాలి: తెరాస

అవినీతి కుంభకోణంలో చిక్కుకున్న సత్యం కంప్యూటర్ అనుబంధ సంస్థ మేటాస్‌కు రాష్ట్ర సర్కారు అప్పగించిన పనులన్నింటిని రద్దు చేయాలని తెరాస శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. సోమవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో సత్యం కుంభకోణంపై వాడివేడిగా చర్చ సాగింది.
Source: ఏపీ న్యూస్ | 9 Feb 2009 | 9:21 am

శివాజీ "మస్త్" ట్రైలర్

జీ మోహన్ పిక్చర్స్ నిర్మించిన తెలుగు చిత్రం "మస్త్". శివాజీ, శివబాలాజీ, అర్చన, ముఖుల్ దేవ్, డా. బ్రహ్మానందం, అలీ తదితరులు నటించిన ఈ చిత్రం ఇటీవలే తెరకెక్కింది. ఎస్.వి. కృష్ణారెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో శివాజీ, ఆంచల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆడియో సరిగమ మ్యూజిక్ ద్వారా విడుదలైంది. చిత్రం వివరాలను దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి తెలియజేస్తూ.. కుటుంబకథా చిత్రాలు తీస్తున్న తాను తొలిసారిగా చక్కని యూత్‌ఫుల్ చిత్రాన్ని రూపొందించానన్నారు. అయినా ఈ సినిమా చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిందని చెప్పారు.
Source: వినోదం | 9 Feb 2009 | 7:50 am

రామ్ "మస్కా" ట్రైలర్‌

"శత్రువు", "ఒక్కడు", "వర్షం", "నువ్వొస్తానంటే నేనొద్దంటానా" వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో మకర (M) సంక్రాంతి (S) రాజుగా పేరు పొందిన సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ అధినేత, మెగామేకర్ ఎం.ఎస్. రాజు రూపొందించిన భారీ చిత్రం "మస్కా". "సమర సింహారెడ్డి", "నరసింహనాయుడు" వంటి సంక్రాంతి హిట్స్‌ను రూపొందించిన ఎ-వన్ డైరక్టర్ బి. గోపాల్ దర్శకత్వంలో "దేవదాసు" వంటి పొంగల్ హిట్ కొట్టి, "రెడీ"తో రికార్డ్స్ సృష్టించిన రైజింగ్ స్టార్ రామ్ "మస్కా"లో హీరోగా నటించాడు.
Source: వినోదం | 9 Feb 2009 | 7:29 am

"కొంచెం ఇష్టం కొంచెం కష్టం" ట్రైలర్

"బాయ్స్" బాయ్ సిద్ధార్థ, "హ్యాపీడేస్" ఫేం తమన్నా జంటగా నటించి తెరకెక్కిన క్రేజీ మూవీ "కొంచెం ఇష్టం కొంచెం కష్టం". కిషోర్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి నిర్మించారు. చిత్ర నిర్మాణ సారధి డి. సురేష్ బాబు మాట్లాడుతూ.. సిద్ధార్థ ఈ చిత్రంలో కొత్తగా కన్పించాడని, యూత్‌ఫుల్ లవ్ అండ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని చెప్పారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, నాజర్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాకు పాటలకు శ్రోతలు, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందని సురేష్ బాబు అన్నారు.
Source: వినోదం | 9 Feb 2009 | 7:18 am

బాఫ్టా ఉత్తమ చిత్రంగా స్లమ్‌డాగ్ మిలియనీర్

భారతీయ చిత్రంగా నిర్మించబడిన స్లమ్‌డాగ్ మిలియనీర్ లెక్కలేనన్ని రికార్డులను సొంతం చేసుకుంటోంది. ఇప్పిటికే ఆస్కార్ నామినేషన్‌ను సాధించుకున్న ఈ చిత్రం ఆదివారం మరో ఘనతను సొంతం చేసుకుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Feb 2009 | 7:15 am

నేటి నుంచి ప్రణబ్ ముఖర్జీ ఢాకా పర్యటన

కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ సోమవారం నుంచి బంగ్లాదేశ్‌లో పర్యటించనున్నారు. తీవ్రవాదం, వాణిజ్యమే ప్రధాన అజెండాలుగా ఆయన ఢాకా పర్యటన సాగనుంది. బంగ్లాదేశ్‌లో ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం ఏర్పాటయ్యాక, భారత్ ప్రభుత్వం తరపును అగ్రనేత ఢాకాలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ పర్యటనలో ఉగ్రవాదం అణచివేతకు గాను సంయుక్త కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తారు.
Source: జాతీయ | 9 Feb 2009 | 7:14 am

"కింగ్"ను ట్రైలర్లో వీక్షించండి

నాగార్జున, త్రిష, మమతామోహన్‌దాస్ హీరోహీరోయిన్లుగా నటించి తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ "కింగ్". శ్రీనువైట్ల దర్శకత్వంలో కామాక్షి కళామూవీస్ పతాకంపై డి. శివప్రసాద్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబరులో విడుదలై థియేటర్లలో "కింగ్" అనిపించుకునే ఈ మూవీలో, నాగార్జున హీరోయిజం భేష్ అని సినిమా విశ్లేషకులు అంటున్నారు. మూడు పాత్రల్లో నాగార్జున అలరించాడని, త్రిష ఆమె పాత్రకు తగిన న్యాయం చేసిందని వారు పేర్కొంటున్నారు.
Source: వినోదం | 9 Feb 2009 | 6:57 am

సత్యంతో కాంగ్రెస్ కుమ్మక్కు: చంద్రబాబు

రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు సత్యం కంప్యూటర్స్ సంస్థతో కుమ్మక్కైందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం సభలో సత్యం కుంభకోణంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ఈ చర్చలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. సత్యంతో వైఎస్ సర్కారు కుమ్మక్కైందని, అందువల్లే కేసు విచారణ సజావుగా సాగడం లేదని ఆయన ఆరోపించారు.
Source: ఏపీ న్యూస్ | 9 Feb 2009 | 6:51 am

నెలాఖరుకు తొలి జాబితా విడుదల: చిరంజీవి

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ఈనెలాఖరు నాటికి విడుదల చేస్తామని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తెలిపారు. ఐదు రోజుల గుంటూరు జిల్లా పర్యటనను ఆయన సోమవారం నుంచి ప్రారంభించిన విషయం తెల్సిందే. ఈ పర్యటనకు వెళ్లే ముందు ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తమ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీయేనని ఆయన మరోమారు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 9 Feb 2009 | 6:50 am

"భారత్ మహాన్.కామ్" ట్రైలర్‌

ఆకుల రాఘవ దర్శకత్వంలో, జన జాగృతి ఆర్ట్ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన తాజా చిత్రం 'భారత్ మహాన్.కామ్'. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించిందని దర్శకుడు వెల్లడించారు. ఇంకా చిత్ర దర్శకుడు ఆకుల రాఘవ సినిమా గురించి చెబుతూ.. భారతదేశంలో అరవైఏళ్లు జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు చెప్పారు. ఈ చిత్రంలో కథ, కథనం ఆలోచింపజేసేలా ఉంటుందని అన్నారు.
Source: వినోదం | 9 Feb 2009 | 6:43 am

"సత్యమేవజయతే" ట్రైలర్‌

సంజన, నీతుచంద్ర హీరోయిన్లుగా, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎం. సత్యనారాయణరావు ముఖ్యమంత్రిగా నటిస్తోన్న చిత్రం "సత్యమేవజయతే". జీవిత స్వీయ దర్శకత్వంలో, శివానీ శివాత్మిక మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఆడియో శ్రోతల మన్ననలను చూరగొంటుంది. హిందీ చిత్రం ఖాకీకి ఈ చిత్రం రీమేక్ అయినప్పటికీ కథాగమనాన్ని చాలా వరకు మార్చామని రాజశేఖర్ వెల్లడించారు.
Source: వినోదం | 9 Feb 2009 | 6:31 am

నిలకడగా వాజ్‌పేయి ఆరోగ్యం

మాజీప్రధాని వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. సోమవారం ఉదయం గం. 10.30 నిమిషాలకు వాజ్‌పేయిని పరీక్షించిన వైద్యులు... మాజీప్రధాని ఛాతీలో తలెత్తిన ఇన్ఫెక్షన్‌కు తాము చికిత్స చేస్తున్నామన్నామనీ, ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడా ఉందని చెప్పారు.
Source: జాతీయ | 9 Feb 2009 | 6:26 am

"మాక్సిమ్‌"లో లారాదత్త హాట్.. హాట్...!

బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ లారాదత్త "మాక్సిమ్" మ్యాగజైన్‌లో హాట్... హాట్..గా కన్పిస్తోందట. ఇప్పటికే తన అందచందాలను ఆరబోస్తూ.. యువతను మత్తెక్కిస్తున్న ఈ భామ ఫిబ్రవరి "మాక్సిమ్" మ్యాగజైన్‌లో గ్లామర్‌గా దర్శనమిస్తోందట. ప్రస్తుతం "బిల్లు బార్డర్"లో...
Source: వినోదం | 9 Feb 2009 | 6:22 am

రవితేజ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో చిత్రం

గతంలో భద్ర చిత్రంతో హిట్‌కొట్టిన రవితేజ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మరో కొత్త చిత్రం ప్రారంభంకానుంది. నటుడు గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, హిట్ చిత్రాల దర్శకుడు పూరి జగన్నాథ్‌ల కాంబినేషన్‌లో...
Source: Yahoo! Telugu: Entertainment | 9 Feb 2009 | 6:15 am

వారిద్దరికీ తప్పనివేంటి?

"సన్యాసికీ, సంసారికీ తప్పనివేంటో చెప్పుకో చూద్దాం...!" అడిగాడు సుబ్బు "అది కూడా తెలియదా... సన్యాసికి గోచీ, సంసారికి పేచీ..!" నవ్వుతూ చెప్పాడు రాజు.
Source: వినోదం | 9 Feb 2009 | 6:04 am

రిపేరొచ్చిన చోటల్లా...!

"బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది?" కండక్టర్‌ని అడిగాడు ప్రయాణీకుడు "రిపేరొచ్చిన చోటల్లా... ఆగిపోతుంది...! " తాపీగా బదులిచ్చాడు కండక్టర్.
Source: వినోదం | 9 Feb 2009 | 5:57 am

జెండా మోసే యువతకు పెద్దపీట: రాహుల్

నిస్వార్థంతో ఎండనక, వాననక పార్టీని వెన్నంటి, జెండాలు మోసే యువతకు పెద్దపీట వేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, అమేథీ ఎంపీ రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగిన కాంగ్రెస్ డిసిసి చీఫ్‌ల సదస్సులో అధిష్టానానికి సూచించారు. పార్టీ కోసం రక్తం, చెమట ధారపోస్తూ, రేయింబవుళ్ళు శ్రమిస్తున్న యువతకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కడం లేదని ఆయన వాపోయారు.
Source: జాతీయ | 9 Feb 2009 | 5:09 am

నేడు శాసనమండలి ఎన్నికల ఫలితాలు

రాష్ట్ర శాసన మండలిలో ఖాళీగా ఉన్న నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు సోమవారం వెల్లడికానున్నాయి. ఫలితాలు ఎవరికి అనుకూలంగా రానున్నాయో అన్న గుబులు కాంగ్రెస్‌ కన్న మహా కూటమిలో ఎక్కువగా కనిపిస్తున్నది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒంటరి పోరాటం చేస్తే విపక్షాలు మహా కూటమిగా తమ అభ్యర్థులను రంగంలోకి దించాయి.
Source: ఏపీ న్యూస్ | 9 Feb 2009 | 4:02 am

అఫ్జల్‌కు వంద రోజుల్లో ఉరిశిక్ష: అద్వానీ

వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తే పార్లమెంట్‌పై దాడి కేసులో ముద్దాయిగా తేలిన అఫ్జల్‌ గురుకు వంద రోజుల్లో ఉరిశిక్షను అమలు చేస్తామని ఆ పార్టీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ వెల్లడించారు. కేంద్రంలోని యూపీఏ సర్కారు అంతిమదశకు చేరుకుందని ఇప్పటికైనా సుప్రీంకోర్టు తీర్పును శిరసావహించి అఫ్జల్‌ గురుకు ఉరిశిక్షను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
Source: జాతీయ | 9 Feb 2009 | 4:02 am

నేటి నుంచి పీఆర్పీ అధినేత గుం"టూరు"

ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి సోమవారం నుంచి గుంటూరు జిల్లా పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. మొత్తం ఐదు రోజుల పాటు సాగే ఈ పర్యటన కోసం జిల్లా పీఆర్పీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఆయన జిల్లాలో తొలిసారి పర్యటిస్తున్న నేపథ్యంలో పార్టీ వర్గాలు ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశాయి.
Source: ఏపీ న్యూస్ | 9 Feb 2009 | 4:01 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 9 Feb 2009 | 3:52 am

ఫిబ్రవరి 09, 2009 కార్యక్రమాలు

ఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 విజయం 14:30 జై హనుమాన్ 15:00 ప్రేమ మందిరం ...
Source: Yahoo! Telugu: Entertainment | 9 Feb 2009 | 3:50 am

ప్రరాపలో వైశ్యులకు సముచిత స్థానం: చిరు

రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ప్రజారాజ్యంపార్టీ తరపున ఆర్య వైశ్యులకు సముచిత స్థానం కల్పిస్తామని ప్రజారాజ్యంపార్టీ అధ్యక్షుడు చిరంజీవి చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 8 Feb 2009 | 1:40 pm