బెంగళూరు పేలుళ్ల దర్యాప్తు పూర్తి: పోలీసులు

బెంగళూరులో గత ఏడాది జులైలో సంభవించిన వరుస బాంబు పేలుళ్ల కేసును పరిష్కరించామని నగర పోలీసులు శనివారం ప్రకటించారు. ఈ కేసుకు సంబంధించి తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేశామని, మరో నలుగురు జమ్ము- కాశ్మీర్
Source: Yahoo! Telugu: News | 7 Feb 2009 | 11:43 am

వన్డే సిరీస్ వైట్‌వాష్‌పై కన్నేసిన టీం ఇండియా

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో తొలిసారి రెండో స్థానంలోకి అడుగుపెట్టి రెట్టించిన ఉత్సాహంతో ఉన్న టీం ఇండియా, శ్రీలంకతో ప్రస్తుతం జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌ను వైట్‌వాష్ చేయడంపై దృష్టి పెట్టింది. సిరీస్ మిగిలిన, ఆఖరి వన్డే మ్యాచ్ ఆదివారం జరుగనుంది.
Source: Yahoo! Telugu: News | 7 Feb 2009 | 11:35 am

మహిళలే ప్రజారాజ్యానికి వెన్నుదన్ను: చిరు

ప్రజారాజ్యం పార్టీకి మహిళలే వెన్నుదన్నుగా నిలవనున్నారని ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Source: Yahoo! Telugu: News | 7 Feb 2009 | 11:28 am

అసెంబ్లీ ఎన్నికల కసరత్తులో ఎన్నికల సంఘం

వచ్చే ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం నిమగ్నమైంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు...
Source: Yahoo! Telugu: News | 7 Feb 2009 | 11:21 am

భారత్ ఎప్పుడూ మెరుగ్గా ఆడలేదు: రణతుంగ

శ్రీలంకను వైట్‌వాష్ చేసే అవకాశాన్ని ముందుంచుకున్న టీం ఇండియా, గతంలో ఎన్నడూ ఇక్కడ మెరుగ్గా ఆడలేదని ఆ జట్టు మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ వ్యాఖ్యానించారు. మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని టీం ఇండియా ప్రదర్శనను పొగడ్తలతో
Source: Yahoo! Telugu: News | 7 Feb 2009 | 11:09 am

విజయవాడ ఆకాశవాణి వజ్రోత్సవాలు

విజయవాడలో గత 60ఏళ్లుగా రేడియో సేవలు అందిస్తోన్న ఆకాశవాణి కేంద్రం శనివారం వజ్రోత్సవాలను జరుపుకోనుంది. ఈ సందర్భంగా ఈ కేంద్రంలో పనిచేస్తున్న సమయంలో విశిష్ట సేవలందించిన ఉద్యోగులు, ఇతర సంబంధీకులను ఆకాశవాణి...
Source: Yahoo! Telugu: News | 7 Feb 2009 | 11:01 am

"నయన"పై నిషేధానికి చెల్లుచీటి..!

హమ్మయ్య..! నయనపై నిషేధం తొలగిపోయిందట. టాలీవుడ్, కోలీవుడ్‌లలో తన హవాను కొనసాగిస్తూ అగ్రహీరోయిన్‌గా ముద్రవేసుకున్న నయనతారపై తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి విధించిన బహిష్కరణ వేటును తొలగించింది. "పయ్యా" అనే తమిళ చిత్రంలో...
Source: వినోదం | 7 Feb 2009 | 10:52 am

అధికారంలోకి వస్తే రామ మందిర నిర్మాణం: బీజేపీ

హిందూ ఓటు బ్యాంకును ఆకర్షించే ప్రయత్నాలను ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ముమ్మరం చేసింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామ మందిరాన్ని పునర్నిర్మిస్తామని బీజేపీ శనివారం హామీ ఇచ్చింది. రామ మందిరం విషయంలో
Source: Yahoo! Telugu: News | 7 Feb 2009 | 10:42 am

రామలింగరాజు సోదరులకు జైలులో ప్రత్యేక హోదా

సత్యం మాజీ ఛైర్మన్ రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజులకు ఎట్టకేలకు చంచల్‌గూడా జైలులో ప్రత్యేక హోదా లభించింది. మిగిలిన ఖైదీల మాదిరిగానే ఇప్పటివరకు సాధారణ బాత్‌రూమ్‌లు ఉపయోగించుకుంటున్న రాజు సోదరులు, రాత్రి
Source: Yahoo! Telugu: News | 7 Feb 2009 | 10:11 am

భారత్‌‍కు మంగళవారంలోగా పాక్ వివరణ: ప్రణబ్

ముంబయి ఉగ్రవాద దాడులకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై పాకిస్థాన్ ప్రభుత్వం మంగళవారంలోగా స్పందిస్తుందని విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. ఈ నివేదికపై ఇప్పటివరకు పాక్ ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక స్పందన
Source: Yahoo! Telugu: News | 7 Feb 2009 | 10:04 am

ప్రవాసాంధ్రుల రక్షణకై సర్కారు ఆందోళన

అమెరికాలోని ప్రవాసాంధ్రులు ఇటీవల తరచూ హత్యలుకు గురవుతుండడంపై రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా ప్రవాసాంధ్రుల రక్షణకు సంబంధించి చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వం అమెరికా కాన్సోలేట్‌ను కోరింది.
Source: Yahoo! Telugu: News | 7 Feb 2009 | 9:59 am

అన్ని పాత్రలూ చేయాల్సిందే: నిఖిత

సినిమాల్లో కొనసాగాలంటే గ్యాప్ రాకుండా చూసుకోవాలని అందుకోసం అన్ని రకాల పాత్రలు చేయాలి నిఖిత చెబుతోంది. గతంలో తాను హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించినా ప్రస్తుతం ఐటం సాంగ్‌లకు కూడా సిద్ధమేనని నిఖిత చెప్పింది.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Feb 2009 | 8:03 am

గ్లామర్‌కే అధిక ప్రాధాన్యం: అతిధి శర్మ

సినిమానటినైన తాను గ్లామర్‌కే అధిక ప్రాధాన్యం ఇస్తానని నటి అతిధి శర్మ చెబుతోంది. ఉదయ్‌కిరణ్‌తో గుండెఝల్లుమంది చిత్రంలో నటించిన అతిధి తెలుగు చిత్రసీమలోనే కొనసాగుతానంటూ చెబుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Feb 2009 | 8:02 am

డబ్బింగ్ జరుపుకుంటున్న ఆకాశరామన్న

అల్లరి నరేష్, శివాజీ, రాజీవ్ కనకాల హీరోలుగా మీరాజాస్మిన్, గౌరీపండిట్‌లు హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ఆకాశరామన్న. ఫ్లాష్‌న్యూస్ ఫేం అశోక్ దర్శకత్వంలో మన్యం రమేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు...
Source: Yahoo! Telugu: Entertainment | 7 Feb 2009 | 7:57 am

సురేష్‌గోపీ చిత్రం షూటింగ్ 80శాతం పూర్తి

తెలుగులో సురేష్‌గోపీ నటిస్తోన్న చిత్రం షూటింగ్ 80శాతం పూర్తయ్యింది. టాలీ టు హాలీ అనే కొత్త సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో అజయ్, సునీల్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. పూర్తి సస్పెన్ష్ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలోనే...
Source: Yahoo! Telugu: Entertainment | 7 Feb 2009 | 7:55 am

అనిల్ అంబానీ చేతిలో "కైట్స్"

రాకేష్ రోషన్ నిర్మిస్తున్న "కైట్స్" చిత్రం హక్కులను అనిల్ అంబానీకి చెందిన బిగ్ పిక్చర్స్ సంస్థ 110 కోట్లరూపాయలు చెల్లించి కొనుగోలు చేసింది.
Source: వినోదం | 7 Feb 2009 | 7:17 am

వాజ్‌పేయి ఆరోగ్యం క్షీణత: వెంటిలేటర్ అమరిక

భారతీయ జనతా పార్టీ నేత, భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఎయిమ్స్ వైద్యులు ఆయనకు వెంటిలేటర్ (కృత్రిమ శ్వాస)ను అమర్చారు. శ్వాసకు సంబంధించిన ఇన్ఫెక్షన్ అధికం కావడంతో వెంటిలేటర్‌ను అమర్చక తప్పలేదని ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు.
Source: జాతీయ | 7 Feb 2009 | 7:11 am

శోభనం రోజే విడాకులా..?

"శోభనం రోజే మీ ఆవిడ విడాకులిచ్చిందా...! ఎందుకు సార్" సినిమా హీరోని అడిగాడో విలేకరి "రిస్క్ చేయడమెందుకని...
Source: వినోదం | 7 Feb 2009 | 7:00 am

మీ కోసమే మొక్కుకున్నా...!

"నాకు ఐదు రోజులు సెలవు కావాలి సార్!" అడిగాడు ఉద్యోగి "ఎందుకూ...?" అడిగాడు బాస్...
Source: వినోదం | 7 Feb 2009 | 6:59 am

ప్రేమికులకు నచ్చే కొంచెం ఇష్టం కొంచెం కష్టం

సిద్దార్థ, తమన్నా జంటగా కిషోర్ కుమార్ దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మించిన చిత్రం కొంచెం ఇష్టం కొంచెం కష్టం. ఇప్పటికే నువ్వొస్తానంటే నేవద్దంటానా, బొమ్మరిల్లు చిత్రాల్లో లవ్లీ బాయ్ గెటప్‌లో అలరించిన సిద్దార్థ మరోమారు...
Source: Yahoo! Telugu: Entertainment | 7 Feb 2009 | 6:41 am

విజయవాడ ఆకాశవాణి వజ్రోత్సవాలు

ఆకాశవాణి (రేడియో) విజయవాడ కేంద్రం ఏర్పడి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించనున్నారు. టెలివిజన్ల నుండి, ప్రైవేటు రేడియో ఛానళ్ల నుండి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొంటూ.. ఇప్పటికీ విజయవాడ ఆకాశవాణి కేంద్రం తన ప్రత్యేకతను నిరూపించుకుంటోంది.
Source: ఏపీ న్యూస్ | 7 Feb 2009 | 6:22 am

దేశపౌరులందరికీ యూఐఎన్ కార్డులు: కేంద్రమంత్రి

రాబోయే ఐదు సంవత్సరాలలో దేశంలోని పౌరులందరికీ ప్రత్యేకమైన విశిష్ట గుర్తింపు సంఖ్య(యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్)లను కేటాయించడం జరుగుతుందని కేంద్ర సహాయ మంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ వెల్లడించారు.
Source: జాతీయ | 7 Feb 2009 | 6:06 am

సీఎం తలచుకుంటే తెలంగాణ వస్తది: వెంకటస్వామి

తెలంగాణ ఏర్పాటుపై అన్ని రాజకీయ పార్టీలు సుముఖంగా ఉన్నప్పటకీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తలుచుకుంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, లోక్‌సభ ఉపనాయకుడు పార్లమెంటు సభ్యుడు జి.వెంకటస్వామి అభిప్రాయపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 7 Feb 2009 | 5:05 am

మా ప్రధాని మన్మోహనే: సోనియా

రాబోయే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధాని అభ్యర్థి విషయమై నెలకొన్న ఊహాగానాలకు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందిస్తూ డాక్టర్ మన్మోహనే మా తదుపరి ప్రధాన మంత్రి అభ్యర్థి అని ఆమె స్పష్టం చేశారు.
Source: జాతీయ | 7 Feb 2009 | 4:58 am

అభయహస్తానికి చట్టబద్ధత కల్పిస్తాం: వైఎస్

మహిళలకు ఎంతగానో ఉపయోగపడే ఈ పథకానికి చట్టబద్ధత కల్పిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వెల్లడించారు. వచ్చే సోమవారం దీనికి సంబంధించి అసెంబ్లీలో బిల్లును కూడా ప్రవేశపెడతామని తెలిపారు. ప్రపంచంలోనే ఇంత గొప్ప పథకం మరెక్కడా లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 7 Feb 2009 | 4:12 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 7 Feb 2009 | 3:22 am

ఫిబ్రవరి 07, 2009 కార్యక్రమాలు

ఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:30 షో రీల్ 09:00 టాలీవుడ్ టైమ్ 10:00 స్టార్‌తో సరదాగా 10:30 ఫన్‌టాస్టిక్ 11:00 రంగుల పల్లకిలో 11:30 న్యూ సినిమా స్పెషల్ 12:00 ఈనాడు సినిమా
Source: Yahoo! Telugu: Entertainment | 7 Feb 2009 | 3:17 am

సత్యం, సాయిమిరా లావాదేవీలను నిలపండి: సుప్రీం

సత్యం కంప్యూటర్స్‌లో జరిగిన కుంభకోణాల నేపథ్యంలో సత్యం అలాగే చెన్నైకి చెందిన పిరమిడ్ సాయిమిరా లావాదేవీలను నిలుపుదలచేయాలని సుప్రీం కోర్టు సెబీ, బీఎస్ఇలను ఆదేశించింది.
Source: జాతీయ | 6 Feb 2009 | 2:02 pm

చేజెర్ల కపోతేశ్వర ఆలయానికి వెళ్దాం రండి

మన దేశంలో అత్యంత ప్రాచీనమైన ఆలయాల్లో కపోతేశ్వర ఆలయం ఒకటి. ఇది మన రాష్ట్రంలోని చేజెర్లలో ఉంది. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం నాలుగో శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్రకారులు చెపుతారు. ఈ ఆలయంలోని ప్రత్యేకత అంతా శివలింగమే.
Source: వినోదం | 6 Feb 2009 | 1:57 pm

మాజీ ప్రధాని వాజ్‌పేయికి కృత్రిమ శ్వాస

మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. శ్వాసక్రియలో తలెత్తిన ఇబ్బందుల వల్ల ఆయనకు ఎయిమ్స్ వైద్యులు కృత్రిమంగా శ్వాసను అందిస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచే ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతున్నట్లు వైద్యులు చెప్పారు. దాంతో ఆయనను ఇంటెన్సివ్‌కేర్‌కు తరలించి కృత్రిమ శ్వాసను అందిస్తున్నట్లు ఎయిమ్స్ హృద్రోగ నిపుణులు డాక్టర్ సంపత్‌కుమార్ తెలిపారు. అయితే రక్తపోటు, లివర్, కిడ్నీల పనితీరు బాగానే ఉందని చెప్పారు.
Source: జాతీయ | 6 Feb 2009 | 1:25 pm