సత్యం, సాయిమిరా లావాదేవీలను నిలపండి: సుప్రీం

సత్యం కంప్యూటర్స్‌లో జరిగిన కుంభకోణాల నేపథ్యంలో సత్యం అలాగే చెన్నైకి చెందిన పిరమిడ్ సాయిమిరా లావాదేవీలను నిలుపుదలచేయాలని సుప్రీం కోర్టు సెబీ, బీఎస్ఇలను ఆదేశించింది.
Source: జాతీయ | 6 Feb 2009 | 2:02 pm

మాజీ ప్రధాని వాజ్‌పేయికి కృత్రిమ శ్వాస

మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. శ్వాసక్రియలో తలెత్తిన ఇబ్బందుల వల్ల ఆయనకు ఎయిమ్స్ వైద్యులు కృత్రిమంగా శ్వాసను అందిస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచే ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతున్నట్లు వైద్యులు చెప్పారు. దాంతో ఆయనను ఇంటెన్సివ్‌కేర్‌కు తరలించి కృత్రిమ శ్వాసను అందిస్తున్నట్లు ఎయిమ్స్ హృద్రోగ నిపుణులు డాక్టర్ సంపత్‌కుమార్ తెలిపారు. అయితే రక్తపోటు, లివర్, కిడ్నీల పనితీరు బాగానే ఉందని చెప్పారు.
Source: జాతీయ | 6 Feb 2009 | 1:25 pm

మాజీ ప్రధాని పీవీ విగ్రహాన్ని అవిష్కరించిన సీఎం

మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి శుక్రవారం అవిష్కరించారు. 13 లక్షల రూపాయలతో ఖర్చుతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటు చేసిన తొమ్మిదడుగుల పీవీ నరసింహారావు విగ్రహాన్ని బంజారాహిల్స్‌లోని రోడ్‌ నంబర్‌ 10లో ముఖ్యమంత్రి అవిష్కరించారు.
Source: ఏపీ న్యూస్ | 6 Feb 2009 | 12:43 pm

తితిదే గెస్ట్‌హౌస్‌లో అనైతిక కార్యకలాపాలు

హైదరాబాదులోని హిమాయత్ నగర్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) గెస్ట్‌హౌస్‌లో అనైతిక కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు శుక్రవారం వార్తలు వెలువడ్డాయి. పవిత్ర దేవాలయ ప్రాంగణంలో అనైతిక చర్యలకు పాల్పడుతున్న ఈ తతంగాన్నంతా ఓ ప్రైవేట్ ఛానెల్ వెలుగులోకి తీసుకువచ్చింది. దీంతో భారతీయ జనతా పార్టీ, ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు... మరికొన్ని హిందూ ధార్మిక సంస్థలు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టి నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశాయి.
Source: ఏపీ న్యూస్ | 6 Feb 2009 | 12:36 pm

ప్రేమకథా చిత్రంగా రామ్ కొత్త చిత్రం

దేవదాసు, రెడీ వంటి హిట్ చిత్రాల ఫేమ్ రామ్ హీరోగా స్రవంతి మూవీస్ పతాకంపై రూపొందుతున్న కొత్త చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. దాదాపు నలభై రోజుల పాటు జయభేరీ ఎన్‌క్లేవ్‌లోని అపార్ట్‌మెంట్‌లో ఈ షూటింగ్ జరుపనున్నారు. ఎలాంటి...
Source: Yahoo! Telugu: Entertainment | 6 Feb 2009 | 12:07 pm

ప్రేమకథా చిత్రంగా రామ్ కొత్త చిత్రం

దేవదాసు, రెడీ వంటి హిట్ చిత్రాల ఫేమ్ రామ్ హీరోగా స్రవంతి మూవీస్ పతాకంపై రూపొందుతున్న కొత్త చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. దాదాపు నలభై రోజుల పాటు జయభేరీ ఎన్‌క్లేవ్‌లోని అపార్ట్‌మెంట్‌లో ఈ షూటింగ్ జరుపనున్నారు. ఎలాంటి...
Source: Yahoo! Telugu: News | 6 Feb 2009 | 12:07 pm

యాక్షన్ చిత్రీకరణలో ప్రభాస్ బిల్లా

ప్రభాస్ హీరోగా నటిస్తున్న బిల్లా చిత్రం ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటోంది. గోపీకృష్ణా మూవీస్ పతాకంపై నటుడు కృష్ణంరాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి కంత్రి ఫేం మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.
Source: Yahoo! Telugu: News | 6 Feb 2009 | 12:07 pm

యాక్షన్ చిత్రీకరణలో ప్రభాస్ బిల్లా

ప్రభాస్ హీరోగా నటిస్తున్న బిల్లా చిత్రం ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటోంది. గోపీకృష్ణా మూవీస్ పతాకంపై నటుడు కృష్ణంరాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి కంత్రి ఫేం మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 6 Feb 2009 | 12:07 pm

వారాంతంలో లాభాలతో ముగిసిన సెన్సెక్స్

స్టాక్ మార్కెట్ వారాంతంలో లాభాలతో ముగియడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 210 పాయింట్లు పుంజుకుని 9,312 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 63 పాయింట్లు లాభపడి 2,843 వద్దకు చేరింది. ఉదయం సెన్సెక్స్ 70 పాయింట్ల...
Source: Yahoo! Telugu: News | 6 Feb 2009 | 11:49 am

ముసలి హాన్సికగా చేయడానికైనా రెడీ

సినీ పరిశ్రమకు వచ్చిన ప్రతి తారకు ఏదో ఒక డ్రీమ్ రోల్ ఉండే ఉంటుంది. తమన్నా టైపులో కొందరికి లేకనూ పోవచ్చు. ఇక్కడ తమన్నా విషయం ఏమిటీ... అంటారా...? ఆ మధ్య తమన్నాను "మీ డ్రీమ్ రోల్ ఏదీ అని అడిగితే..." ఇంకా నేను సరిగానే నిలబడలేదు.
Source: వినోదం | 6 Feb 2009 | 11:13 am

వేలానికి సరోజ చిత్రం వ్యాన్

తెలుగు, తమిళ భాషల్లో విజయవంతమైన సరోజ చిత్రంలో ఓ వ్యాన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రంలోని కథానుగుణంగా ఈ వ్యాన్‌లో నలుగురు పాత్రధారులు రాష్ట్రమంతా తిరుగుతారు. అసలీ వ్యాన్‌లో పాటతోనే చిత్రం ప్రారంభమౌతుంది. అలాగే ఇటీవల ఈ...
Source: Yahoo! Telugu: Entertainment | 6 Feb 2009 | 10:34 am

షూటింగ్ పూర్తయిన గాయత్రి చిత్రం

హ్యాపీడేస్ చిత్రం ఫేమ్ గాయత్రిరావు, భూషణ్‍‌లు ప్రధాన పాత్రల్లో సాయేంద్రరెడ్డి దర్శకత్వంలో లక్ష్మీభవానీ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రూపొందుతున్న చిత్రం గాయత్రి. షూటింగ్ కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను...
Source: Yahoo! Telugu: News | 6 Feb 2009 | 10:25 am

షూటింగ్ పూర్తయిన గాయత్రి చిత్రం

హ్యాపీడేస్ చిత్రం ఫేమ్ గాయత్రిరావు, భూషణ్‍‌లు ప్రధాన పాత్రల్లో సాయేంద్రరెడ్డి దర్శకత్వంలో లక్ష్మీభవానీ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రూపొందుతున్న చిత్రం గాయత్రి. షూటింగ్ కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను...
Source: Yahoo! Telugu: Entertainment | 6 Feb 2009 | 10:25 am

మంత్రిగారూ... అందుకోండి నా ప్రేమలేఖ

బీహార్ రోడ్లు, భవనాల శాఖామంత్రి ప్రేమ్ కుమార్‌కు రోజాపూలతో కూడిన ఓ ఘాటైన ప్రేమలేఖ ఒకటి వచ్చిందట. సంగీతా కుమారి అనే పేరుతో వచ్చిన ఆ లెటర్‌లోని వివరాలను చూసి మంత్రిగారు అవాక్కయ్యారట. ప్రేమలేఖలో ఘాటైన ప్రేమ పదాలు కూడా ఉన్నాయట. లేఖ పైభాగాన కొత్త సంవత్సరానికి శుభాకాంక్షలు అని రాసి అడుగు భాగాన "I LOVE YOU" అని రాసి ఉందట.
Source: జాతీయ | 6 Feb 2009 | 10:20 am

బెదిరింపు ఇమెయిల్‌పై హోంశాఖకు ఫిర్యాదు

తనను చంపుతామంటూ ఓ ఉగ్రవాద సంస్థ నుంచి అందుకున్న బెదిరింపు ఇమెయిల్‌పై ప్రతిపక్ష నేత, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ, కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు అందిన అనంతరం దీనికి సంబంధించిన...
Source: Yahoo! Telugu: News | 6 Feb 2009 | 10:10 am

పీటర్సన్‌తో జట్టు బలోపేతం: విజయ్‌మాల్య

ఇంగ్లాండ్ ఆటగాడు కెవిన్ పీటర్సన్‌ను కొనుగోలు చేయడం ద్వారా తమ జట్టు బలోపేతం కానుందని బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ యజమాని విజయ్‌మాల్య పేర్కొన్నారు. జట్టుకు పీటర్సన్ అదనపు బలం అని మాల్య ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
Source: Yahoo! Telugu: News | 6 Feb 2009 | 10:06 am

"అభయ హస్తం" పథకాన్ని ప్రారంభించిన సీఎం

వృద్ధాప్యంలో ఉన్న మహిళలను ఆదుకునేందుకు వీలుగా రూపొందించిన "అభయ హస్తం" పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి శుక్రవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ మాట్లాడుతూ... అభయ హస్తం పథకం ద్వారా 60 ఏళ్లు పైబడిన స్వయం సహాయక బృందాల మహిళలకు (డ్వాక్రా) నెలకు 500 రూపాయల ఫించన్ అందిస్తామని తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 6 Feb 2009 | 9:46 am

పాక్‌పై మరింత ఒత్తిడి పెంచండి: భారత్ విజ్ఞప్తి

తమ భూభాగంనుంచి తీవ్రవాదాన్ని అంతంచేసే దిశగా పాకిస్థాన్‌పై మరింత ఒత్తిడి పెంచాలంటూ ఐక్యరాజ్యసమితికి భారత్ విజ్ఞప్తి చేసింది. ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం సైతం పాకిస్థాన్‌పై ఒత్తిడి తేవాలంటూ కేంద్ర విదేశాంగ...
Source: Yahoo! Telugu: News | 6 Feb 2009 | 9:37 am

నాగపూర్‌‌లో నేడు బీజేపీ సమావేశాలు ప్రారంభం

ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ పార్టీని బలోపేతం చేసే దిశగా బీజేపీ ముందడుగు వేస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ ఓ ఉన్నతస్థాయి సమావేశాన్ని నాగపూర్‌లో నిర్వహించనుంది. మూడురోజులపాటు జరగనున్న ఈ సమావేశాలు శుక్రవారం...
Source: Yahoo! Telugu: News | 6 Feb 2009 | 9:22 am

కేసీఆర్ జన్మదిన సందర్భంగా బహిరంగసభ

ఫిబ్రవరి 17న తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు జన్మదిన సందర్భంగా దబ్బాకలో భారీ స్థాయిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. తెలంగాణా భవన్‌లో నిర్వహిస్తున్న విశ్వశాంతి యాగం ఫిబ్రవరి 16న ముగుయనుంది. రానున్న...
Source: Yahoo! Telugu: News | 6 Feb 2009 | 9:00 am

బెదిరింపు లేఖపై ప్రభుత్వానికి తెలిపిన అద్వానీ

భారతీయ జనతా పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి ఎల్‌కె అద్వానీ తనను హతమారుస్తామంటూ వచ్చిన బెదిరింపు లేఖ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారు. అద్వానీ వ్యక్తిగత వెబ్‌సైట్‌లో పొందు పరచిన ఈ లేఖ పాకిస్తాన్ ఆధారిత తీవ్రవాద సంస్థనుంచి వచ్చినట్లు తెలుస్తోంది.
Source: జాతీయ | 6 Feb 2009 | 8:26 am

ఐపీఎల్ వేలం: ఇంగ్లాండ్ ఆటగాళ్లకు క్రేజ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్ సందర్భంగా నిర్వహిస్తున్న వేలంలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు అత్యధిక ధర పలికారు. ఒక్కొక్కరికి 1,550,000 డాలర్లకు బిడ్ వేయడం ద్వారా ఇంగ్లాండ్ ఆటగాళ్లైన కెవిన్ పీటర్సన్, ఆండ్రూ ఫ్లింటాఫ్‌లను ఫ్రాంఛైజీలు...
Source: Yahoo! Telugu: News | 6 Feb 2009 | 8:13 am

పూర్వ వైభవం కోసం భాజపా తహతహ

వచ్చే ఎన్నికలలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు అనుసరించాల్సిన మార్గాలపై భారతీయ జనతా పార్టీ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నాగపూర్‌లో జాతీయ కార్యవర్గ సమావేశాలను ప్రారంభించింది. కాగా ఏప్రిల్- మే నెలల్లో జరుగనున్న ఎన్నికల వేళ భాజపా తలపెడుతున్న అతి పెద్ద సమావేశం ఇదే.
Source: జాతీయ | 6 Feb 2009 | 7:52 am

ఆడవాళ్లు చేసిన ఉప్మా

"ఉప్మాలో ఇంత పొడవాటి వెంట్రుక వచ్చింది. అంటే దీనర్ధం" కోపంగా అడిగాడు కస్టమర్ "ఆమాత్రం తెలీదా సార్‌...!
Source: వినోదం | 6 Feb 2009 | 7:00 am

స్కూటర్‌పైన వెళ్లారు

"నాకు మతిమరుపు అంటుంటావు కదా...! చూడు ఈ రోజు ఆపీసుకు పట్టుకెళ్లిన సైకిల్‌‌ని మర్చిపోకుండా తీసుకొచ్చాను" గొప్పగా చెప్పాడు భర్త..
Source: వినోదం | 6 Feb 2009 | 6:58 am

తెరాసపై విరుచుకుపడిన మందాడి

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) మీడియాను తప్పుదారి పట్టిస్తోందంటూ.. ఆ పార్టీ అసమ్మతి నేత మందాడి సత్యనారాయణ దుయ్యబట్టారు. తన శాసన సభ్యత్వ అనర్హతపై విధించిన స్టేను హైకోర్టు ఎత్తివేసిందంటూ వివిధ వార్తా ఛానళ్లలో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. పనీపాటాలేని తెరాస మీడియాలో దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుందని ఒక ప్రైవేట్ వార్తా సంస్థకు వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 6 Feb 2009 | 6:50 am

సీఎంచే ప్రారంభం కానున్న "అభయ హస్తం"

స్వయం సహాయక మహిళలు (డ్వాక్రా) మహిళలకు నెలవారీ పెన్షన్‌ను అందించే "అభయ హస్తం" పథకాన్ని శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించనున్నారు. డ్వాక్రా సంఘాల్లోని అరవై సంవత్సరాలు దాటిన మహిళలకు ఈ పథకం వర్తించనుంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్‌లో అభయ హస్తం పథకానికి సీఎం శ్రీకారం చుట్టనున్నారు. అ తరువాత ఫిబ్రవరి 7, 8 తేదీలలో వివిధ జిల్లాలలో మంత్రులు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు.
Source: ఏపీ న్యూస్ | 6 Feb 2009 | 6:33 am

26/11 దాడుల వెనక ఐఎస్ఐ హస్తం ఉంది: భారత్

ముంబయి ఉగ్రవాద దాడుల వెనుక పాకిస్తాన్ ఐఎస్ఐ హస్తం ఉందని భారత్ ఆరోపించింది. దాడులకు సంబంధించిన వ్యూహరచన, కార్యాచరణ అంతా పాక్ భూభాగంపైనుండే జరిగిందని విదేశాంగ కార్యదర్శి శివ్ షాంజర్ మీనన్ పేర్కొన్నారు.
Source: జాతీయ | 6 Feb 2009 | 6:24 am

ముఖ్యమంత్రి కావాలనే కోరిక నాకు లేదు: బాలయ్య

అర్హత ఉన్న వారికే ముఖ్యమంత్రి పదవి దక్కుంతుందని, అయితే సీఎం కావాలనే కోరిక తనలో లేదని తెలుగుదేశం పార్టీ నేత, సినీనటుడు నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశాడు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడి నుంచి తాను పోటీ చేయాలో పార్టీ అధిష్టానమే నిర్ణయిస్తుందని వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 6 Feb 2009 | 5:41 am

భారత్ జాలర్లును అరెస్టు చేసిన పాక్ అధికారులు

కరాచీ పోర్టుకు సమీపంలో భారతదేశానికి చెందిన 50 మంది మత్య్యకారులను పాకిస్తాన్ పోర్ట్ అధికారులు అరెస్టు చేశారు. వారు ప్రయాణిస్తున్న 9 పడవలను సీజ్ చేశారు. 9 పడవల్లో చేపల వేటను సాగిస్తున్న భారత మత్య్యకారులను తాము అదుపులోకి తీసుకున్నామనీ, శుక్రవారం వారిని మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టి తదుపరి దర్యాప్తు సాగిస్తామని పాక్ అధికారులు వెల్లడించారు.
Source: జాతీయ | 6 Feb 2009 | 5:36 am

ఉగ్రవాదులకు ప్రత్యేక జైళ్లు: సుప్రీం సూచన

దేశంలోని అన్ని రాష్ట్రాలు, ఉగ్రవాదులకు ప్రత్యేక జైళ్లను కేటాయించాలని సుప్రీం కోర్టు సూచించింది. ఖైదీలు అధికంగా జైళ్లను విస్తృతపరిచి తద్వారా భద్రతకు ఎలాంటి ముప్పు కలుగకుండా చూసుకోవాలని తెలిపింది. ఛీఫ్ జస్టిస్ కేజీ బాలక్రిష్ణన్, జస్టిస్ పి సథాశివం నేతృత్వంలోని బెంచ్ వెల్లడించింది.
Source: జాతీయ | 6 Feb 2009 | 5:19 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 6 Feb 2009 | 3:40 am

ఫిబ్రవరి 06, 2009 కార్యక్రమాలు

ఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 నా అభిరుచి 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 బాలచందర్ కథాంజలి 14:30 శ్రీ కృష్ణ లీలలు 15:00 ప్రేమ మందిరం
Source: Yahoo! Telugu: Entertainment | 6 Feb 2009 | 3:40 am

యుద్దాన్ని వెంటనే ఆపండి..చిదంబరం

శ్రీలంక సైన్యం, ఎల్‌టీటీఇకి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలని కేంద్ర హోం శాఖామంత్రి చిదంబరం శ్రీలంక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Source: జాతీయ | 5 Feb 2009 | 1:24 pm

రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి

లోక్‌సభ ఎన్నికలతోబాటు అసెంబ్లీ ఎన్నికలుకూడా ఒకేసారి జరిగే అవకాశాలున్నాయని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. రమాకాంత్ రెడ్డి తెలిపారు. రాబోయే ఎన్నికలను మూడు విడతలుగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం గురువారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది
Source: ఏపీ న్యూస్ | 5 Feb 2009 | 12:50 pm