బాపూ బాటే ఉత్తమమైనది..రాహుల్

జాతిపిత మహాత్మా గాంధీ ఎంచుకున్న మార్గమమే ఉత్తమమైనదని కాంగ్రెస్ యువ నాయకుడు రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.
Source: జాతీయ | 31 Jan 2009 | 10:15 am

రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ వైపు: ముఖ్యమంత్రి

రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి అన్నారు. ఆయన శనివారం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు. ఇందుకోసం హెలికాఫ్టర్‌లో జిల్లాకు వచ్చిన ఆయన చిరంజీవి సొంతూరు మొగల్తూరు నుంచి తన యాత్రను ప్రారంభించారు.
Source: ఏపీ న్యూస్ | 31 Jan 2009 | 10:06 am

ఫిబ్రవరి 2న ఐఏఈఏతో ఒప్పందం ఖరారు

అంతర్జాతీయ అణుశక్తి నియంత్రణ సంస్థ (ఐఏఈఏ)తో ఏర్పాటు చేసుకున్న ఒప్పందంపై భారత ఫిబ్రవరి రెండో తేదీన సంతకం చేయనుంది. వియత్నాంలోని ఐఏఈఏ కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమంలో భారత్ తరపున రాయబారి సౌరభ్ కుమార్ సంతకాలు చేస్తారు.
Source: జాతీయ | 31 Jan 2009 | 9:50 am

భాజపా తరపున అనిల్ కుంబ్లే పోటీ!

భారతీయ జనతా పార్టీ తరపున భారత క్రికెట్ లెజండ్ అనిల్ కుంబ్లే ఎన్నికల బరిలోకి దిగనున్నారు. త్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బెంగుళూరు నార్త్ ఎంపీ స్థానం నుంచి కుంబ్లే పోటీ చేయవచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి. వీటిపై భాజపా సీనియర్ నేతలు నోరు మెదపడం లేదు.
Source: జాతీయ | 31 Jan 2009 | 7:49 am

తెదేపాకు ఓటమి భయం: వెంకయ్య నాయుడు

రాష్ట్ర రాజకీయాల్లో అనిశ్చితి నెలకొందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. అలాగే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి ఓటమి భయం పట్టుకుందని ఆయన జోస్యం చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 31 Jan 2009 | 7:16 am

దక్షిణాది "చార్లీచాప్లిన్" నగేష్ కన్నుమూత

ప్రముఖ హాస్యనటుడు నాగేష్ శనివారం తుదిశ్వాస విడిచారు. చెన్నై నగరంలోని ఆయన స్వగృహంలో నాగేష్ కన్నుమూసినట్లు ఆయన కుటుంబీకులు వెల్లడించారు. మరణించేనాటికి నాగేష్‌కు 76 సంవత్సరాలు.
Source: వినోదం | 31 Jan 2009 | 7:15 am

నవీన్ చావ్లా తొలగింపునకు భాజపా డిమాండ్

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ నవీన్ చావ్లాను తక్షణం విధుల నుంచి తొలగించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. ఈ విషయంపై రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ చొరవ చూపించి, ఆయన్ను తొలగించాల్సిందిగా ప్రధానిని ఆదేశించాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి రాజీప్ ప్రతాప్ రూఢీ, విజయ్ మల్హోత్రాలు విజ్ఞప్తి చేశారు.
Source: జాతీయ | 31 Jan 2009 | 6:57 am

సజీవంగా అజ్మల్ అమీర్ కసబ్: మహారాష్ట్ర

ముంబై మారణహోమంలో సజీవంగా పట్టుబడిన పాకిస్థాన్ ఉగ్రవాది అజ్మల్ అమీర్ కసబ్ సజీవంగానే, తమ కస్టడీలో ఉన్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని మహారాష్ట్ర హోం శాఖ మంత్రి జయంత్ పాటిల్ తెలిపారు. కసబ్ మహారాష్ట్ర పోలీసుల కస్టడీలో సురక్షితంగా ఉన్నాడని చెప్పారు.
Source: జాతీయ | 31 Jan 2009 | 6:23 am

ఫిబ్రవరి 12న జగపతిబాబు "సిద్ధం"

ఐపీఎస్ అధికారులైన పి. సీతారామాంజనేయులు, ముంబై పోలీసు అధికారి దయానాయక్‌ల జీవితంలో జరిగిన కొన్ని సంఘటన ఆధారంగా "సిద్ధం" అనే చిత్రం రూపొందుతోంది. జగపతిబాబు, సింధుమీనన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి కిరణ్‌కుమార్ నిర్మిస్తున్నారు.
Source: వినోదం | 31 Jan 2009 | 6:04 am

నవీన్ చావ్లాను తొలగించండి: గోపాలస్వామి

కేంద్ర ఎన్నికల సంఘంలోని త్రిసభ్య ప్యానెల్ నుంచి విధుల్లో పక్షపాతం చూపిస్తున్న ఎన్నికల అధికారి నవీన్ చావ్లాను తొలగించాలని ప్రధాన ఎన్నికల అధికారి ఎన్.గోపాలస్వామి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌కు శనివారం లేఖ రాశారు.
Source: జాతీయ | 31 Jan 2009 | 5:37 am

బంకమట్టి ప్రభావం

"నీ ముఖం తళతళ మెరవటానికి కారణమేమిటోయ్..?" అడిగాడు సుందర్ "ఆయుర్వేదిక్ డాక్టర్ ఇచ్చిన...
Source: వినోదం | 31 Jan 2009 | 5:30 am

అప్పుడైనా మర్యాద ఇస్తావా..?

భార్య : వచ్చే జన్మలో కూడా మనమిద్దరం భార్యాభర్తలుగా పుట్టాలండీ..! భర్త : ఆ జన్మలోనైనా..
Source: వినోదం | 31 Jan 2009 | 5:27 am

కాంగ్రెస్‌ను ఇంటికి పంపుతాం: బాలకృష్ణ

అవినీతిపాలన సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీని త్వరలోనే ఇంటికి పంపుతామని తెలుగుదేశం పార్టీ నేత, సినీ నటుడు బాలకృష్ణ జోస్యం చెప్పారు. తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు యువత ముందుండి నడిపించాలని కోరారు.
Source: ఏపీ న్యూస్ | 31 Jan 2009 | 3:44 am

పెద్దల సభకు 11 మంది ఏకగ్రీవ ఎన్నిక

శాసనమండలికి జరిగిన ద్వైవార్షిక ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసిన 11 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని మండలి రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ ఎస్.రాజా సదారామ్ శుక్రవారం వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 31 Jan 2009 | 3:36 am

జనవరి 31, 2009 కార్యక్రమాలు

ఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:30 షో రీల్ 09:00 టాలీవుడ్ టైమ్ 10:00 స్టార్‌తో సరదాగా 10:30 ఫన్‌టాస్టిక్ 11:00 రంగుల పల్లకిలో ...
Source: Yahoo! Telugu: Entertainment | 31 Jan 2009 | 3:19 am

పబ్ సంస్కృతికి మేమూ వ్యతిరేకమే: అన్బుమణి

దేశంలో నానాటికి పెరిగిపోతున్న పబ్ సంస్కృతికి తాను కూడా వ్యతిరేకమని కేంద్ర ఆరోగ్య, కటుంబ సంక్షేమ శాఖామంత్రి అన్బుమణి రాందాస్ అభిప్రాయపడ్డారు. ఈ సంస్కృతిని వ్యతిరేకిస్తూ ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప (భాజపా), రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ (కాంగ్రెస్)లు ప్రకటనలు చేసిన విషయం తెల్సిందే
Source: జాతీయ | 31 Jan 2009 | 3:08 am

ఉగాది కానుకగా "ఆకాశమంత"

ప్రకాష్, ఐశ్వర్య, త్రిష నటిస్తోన్న "ఆకాశమంత" చిత్రం తెలుగు వర్షన్ ఫిలింసిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు బాధ్యతలు చేపట్టిన ఈ చిత్రానికి రాదా మోహన్ దర్శకుడు. దీనికి "ఐ లవ్ మై డాటర్" అనే కాప్షన్ జోడించారు.
Source: వినోదం | 30 Jan 2009 | 2:02 pm

"సిద్ధం" ట్రైలర్‌ను వీక్షించండి

జగపతిబాబు, సింధుమీనన్ హీరోహీరోయిన్లుగా, జె.డి. చక్రవర్తి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న తాజా చిత్రం "సిద్ధం". జగపతిబాబు "హోమం" సినిమా తర్వాత శ్రేయా ప్రొడక్షన్స్ పతాకంపై కోనేరు కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు సూపర్ కాప్ పాత్రను పోషించారు.
Source: వినోదం | 30 Jan 2009 | 1:12 pm

"స్వీట్ హార్ట్" ట్రైలర్ మీ కోసం...

యువహీరో ఆకాష్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న "స్వీట్ హార్ట్" చిత్రం వాలెంటైన్‌డేనాడు విడుదల కానుంది. ఈ విషయాన్ని ఆకాష్ తెలియజేస్తూ... ఈ సినిమా యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ అని, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుందన్నారు.
Source: వినోదం | 30 Jan 2009 | 12:57 pm

"శ్రీశైలం" ట్రైలర్‌ను వీక్షించండి

శ్రీహరి-కె.ఎస్‌.నాగేశ్వరరావు కాంబినేషన్‌లో వచ్చిన మూడు సినిమాలు హ్యాట్రిక్‌ సాధించిన నేపథ్యంలో.. తాజాగా ఇదే కాంబినేషన్‌లో "శ్రీశైలం" అనే చిత్రం రూపుదిద్దుకుంటోంది. శ్రీహరి, నాగేంద్రబాబు హీరోలుగా కృష్ణంరాజు ప్రధాన పాత్రను పోషిస్తున్నారు.
Source: వినోదం | 30 Jan 2009 | 12:56 pm

"నేను దేవుడ్ని" ట్రైలర్‌

"శివపుత్రుడు", "శేషు" వంటి హిట్ చిత్రాల దర్శకుడు బాల, తాజాగా కాశీలోని అఘోర సన్యాసుల నేపథ్యంలో... తమిళంలో ఓ చిత్రాన్ని రూపొందించారు. దాన్ని తెలుగులో "నేను దేవుడ్ని" అంటూ ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఈ చిత్రంలో ఆర్య, పూజ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.
Source: వినోదం | 30 Jan 2009 | 12:55 pm

"మళ్ళీ మళ్ళీ" ట్రైలర్ మీ కోసం...

స్కంద, కళ్యాణి హీరోహీరోయిన్లుగా, రాజ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం "మళ్ళీ మళ్ళీ". రొమాన్స్, మర్డర్, మిస్టరీ అంశాలతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు రాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Source: వినోదం | 30 Jan 2009 | 12:53 pm

సత్యమేవజయతే చిత్రం ఆడియో విడుదల

జీవిత స్వీయ దర్శకత్వంలో డాక్టర్ రాజశేఖర్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న సత్యమేవజయతే చిత్రం ఆడియో విడుదలైంది. హిందీ చిత్రం ఖాకీకి ఈ చిత్రం రీమేక్ అయినప్పటికీ కథాగమనాన్ని చాలా వరకు మార్చామని ఆడియో విడుదల సందర్భంగా రాజశేఖర్...
Source: Yahoo! Telugu: Entertainment | 30 Jan 2009 | 10:48 am

మల్టీస్టారర్ చిత్రంగా రామ్‌దేవ్

అబ్బాస్, ఆకాష్, సాయికిరణ్, గ్రేసీసింగ్, అర్చనలు హీరోహీరోయిన్‌లుగా ఎస్‌బబీకే ఫిలింస్ పతాకంపై ఎస్‌కే బషీద్ దర్శకుడిగా పరిచయమవుతున్న రామ్‌దేవ్ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. దర్శుకుడు మాట్లాడుతూ, రాజశేఖర్ నటించిన ఎవడైతేనాకేంటి...
Source: Yahoo! Telugu: Entertainment | 30 Jan 2009 | 10:29 am

రేపు ఆస్పత్రి నుంచి మన్మోహన్ డిశ్చార్జ్?

అన్నీ సక్రమంగా ఉంటే బైపాస్ సర్జరీ చేయించుకున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను శనివారం మధ్యాహ్నం డిశ్చార్జ్ చేస్తామని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. అలాకానీ పక్షంలో మరో రోజు ఆస్పత్రిలోనే ఉంచుతామని ప్రధానికి ఆపరేషన్ చేసిన వైద్య బృందంలోని డాక్టర్ విజయ్ డిసిల్వా వెల్లడించారు.
Source: జాతీయ | 30 Jan 2009 | 10:22 am