రేపు ఆస్పత్రి నుంచి మన్మోహన్ డిశ్చార్జ్?

అన్నీ సక్రమంగా ఉంటే బైపాస్ సర్జరీ చేయించుకున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను శనివారం మధ్యాహ్నం డిశ్చార్జ్ చేస్తామని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. అలాకానీ పక్షంలో మరో రోజు ఆస్పత్రిలోనే ఉంచుతామని ప్రధానికి ఆపరేషన్ చేసిన వైద్య బృందంలోని డాక్టర్ విజయ్ డిసిల్వా వెల్లడించారు.
Source: జాతీయ | 30 Jan 2009 | 10:22 am

పొత్తులపై తెరాస దాగుడుమూతలు

రాష్ట్రంలో పొత్తుల ఏర్పాటుపై తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత దాగుడుమూతలాట బాగానే ఆడుతున్నారు. ఒకవైపు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నేతలతో సీట్ల సర్దుబాటు చర్చలు రహస్యంగా జరుపుతున్నారు. మరోవైపు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవితో మంతనాలు నిర్వహిస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 30 Jan 2009 | 8:22 am

రాందేవ్ వ్యాఖ్యలపై రాష్ట్రంలో దుమారం

ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రంలో దుమారం చెలరేగింది. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గిరి నుంచి సారా వ్యాపారి ఆదికేశవులు నాయుడును తక్షణం తొలగించాలని పలు హిందూ మత సంస్థలు ధర్నాలు, నిరసనలకు శ్రీకారం చుట్టాయి.
Source: ఏపీ న్యూస్ | 30 Jan 2009 | 8:05 am

ఉపహార్ కేసు: అన్సల్ బ్రదర్స్‌కు బెయిల్

ఉపహార్ థియేటర్ అగ్నిప్రమాద కేసులో అన్సల్ సోదరులకు సుప్రీం కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉపహార్ థియేటర్ కేసులో అన్సల్ సోదరులైన సుషీల్, గోపాల్‌లను దోషులుగా తేలడంతో రెండేళ్ళ జైలు శిక్ష విధిస్తూ.. ఢిల్లీ సెషన్స్ తీర్పు ఇచ్చిన విషయం తెల్సిందే.
Source: జాతీయ | 30 Jan 2009 | 7:11 am

నన్ను "పద్మా శ్రీమతి" అంటున్నారు: ఐశ్వర్య కిలకిల

తన భార్య ఐశ్వర్యకు పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు భర్త అభిషేక్ బచ్చన్ మహా సంతోషంగా ఉన్నాడు. అడిగినవారికి, అడగనివారికి సైతం తన భార్య నటన, గొప్పతనాన్ని వివరిస్తూ లెక్చర్లిస్తున్నాడట. బయట సంగతి ఇలా ఉంటే... ఇంట్లో ఐశ్వర్యను "పద్మా శ్రీమతి" అని పిలుస్తున్నాడట.
Source: వినోదం | 30 Jan 2009 | 7:05 am

మహారాష్ట్ర గవర్నర్‌ను కలువనున్న రాజ్‌థాక్రే

మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్‌థాక్రేకు మహారాష్ట్ర గవర్నర్ ఎస్.సి.జమీర్ సమన్లు జారీ చేశారు. తక్షణం తనను వచ్చి కలవాల్సిందిగా ఆదేశించారు. దీంతో రాజ్‌థాక్రే శుక్రవారం మహారాష్ట్ర గవర్నర్‌తో భేటీ కానున్నారు.
Source: జాతీయ | 30 Jan 2009 | 6:59 am

పీఆర్పీతో తెరాస పొత్తు ఖరారు: దేవేందర్

ప్రజారాజ్యం పార్టీ (పీఆర్పీ) - తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ల మధ్య పొత్తు ఖరారైనట్టేనని నవ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు దేవేందర్ గౌడ్ తెలిపారు. ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ. పీఆర్పీ-తెరాసల మధ్య పొత్తు దాదాపు ఖరారైంది. దీనిపై మరి కొన్ని గంటల్లో అధికారిక ప్రకటన వెలువడవచ్చన్నారు.
Source: ఏపీ న్యూస్ | 30 Jan 2009 | 6:10 am

2014 నాటికి చిన్నపార్టీలు మాయం: భాజపా

వచ్చే 2014 నాటికి రాష్ట్రంలో కలగూరగంప పార్టీలేవీ మిగలబోవని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. వచ్చే నెల నాలుగో తేదీ ఆ పార్టీ తరపున నిర్వహించనున్న సంకల్పయాత్రకు కృష్ణ జిల్లా విజయవాడలో స్థలాన్ని పరిశీలించారు.
Source: ఏపీ న్యూస్ | 30 Jan 2009 | 6:09 am

గాయాలు లేవన్నారు..!

"ప్రమాదంలో గాయాలేమీ తగల్లేదన చెప్పి బ్యాండేజ్‌లతో కనిపిస్తున్నావేంరా...?" అడిగాడు విష్ణు "ఏం చేయనురా..
Source: వినోదం | 30 Jan 2009 | 5:59 am

నిద్ర మాత్రలు వేసుకుంటాగా..!

"ప్రతిపక్షాలను కూల్చేదాకా నిద్రపోనని చెప్పారు.. మరెలా చేస్తారు సార్...!" ఆరా తీశాడు పర్సనల్ అసిస్టెంట్...
Source: వినోదం | 30 Jan 2009 | 5:56 am

అసెంబ్లీ చరిత్రలో మరో రికార్డు నెలకొల్పనున్న రోశయ్య

రాష్ట్ర శాసన సభ, ఇటు శాసనమండలి ఈ రెండింటిలో సభ్యుడిగా లేకుండా కె.రోశయ్య ఈసారి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు హాజరై రాష్ట్ర ఆర్ధిక మంత్రి హోదాలో ఆయన తొలిసారిగా ఓట్‌‌ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
Source: ఏపీ న్యూస్ | 30 Jan 2009 | 5:47 am

జాతీయ స్థాయి పొత్తులకు కాంగ్రెస్ విముఖత

వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం జాతీయ స్థాయిలో పొత్తులు కుదుర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ విముఖత చూపిస్తోంది. స్థానిక స్థితిగతులకు అనుగుణంగానే సీట్ల సర్దుబాటు చేసుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. అంతేగానీ, జాతీయ స్థాయిలో పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన ఏదీ లేనట్టు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చేసిన ప్రసంగంలో స్పష్టమైంది.
Source: జాతీయ | 30 Jan 2009 | 3:45 am

కర్ణాటకకు మహారాష్ట్ర ఏటీఎస్ బృందం

శ్రీరామ్ సేన అధ్యక్షుడు ప్రమోద్ ముథాలిక్‌కు మాలేగావ్ పేలుళ్లతో సంబంధం ఉన్నట్టు మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక బృందం (ఏటీఎస్) భావిస్తోంది. ఈ పేలుళ్ళలో ముథాలిక్ పాత్రను నిరూపించే కీలకమైన సాక్ష్యాలతో ఏటీఎస్ బృందం త్వరలోనే బెంగుళూరుకు చేరుకోనుంది. ఈ విషయాన్ని ఏటీఎస్ కొత్త చీఫ్ రఘువంశీ తెలిపారు.
Source: జాతీయ | 30 Jan 2009 | 3:27 am

పార్లమెంట్‌‌కు మరింత కట్టుదిట్టమైన భద్రత

పార్లమెంటులో నిఘా స్థాయిని మరింత పెంచబోతున్నారు. ఇందుకోసం 300 అత్యాధునిక హైటెక్‌ కెమెరాలను ఉన్నతస్థాయి భద్రతను అవసరమైన ప్రాంతాలలో ఏర్పాటు చేస్తారు.
Source: జాతీయ | 29 Jan 2009 | 3:07 pm

ఐష్‌ను ఎన్నికల బరిలోకి దింపేందుకు ఎస్పీ యత్నం

రాబోయే లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ తరపున ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ను బరిలోకి దింపాలని సమాజ్‌వాదీ పార్టీ భావిస్తోంది.
Source: జాతీయ | 29 Jan 2009 | 3:07 pm