ఫోన్‌లకు స్పందించని చిరు,అల్లు: కేశినేని

ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి, ప్రధాన కార్యదర్శి అల్లు అరవింద్‌లను ఫోన్‌లలో మాట్లాడేందుకు ప్రయత్నించగా వారు స్పందించడం లేదని కృష్ణ జిల్లా పీఆర్పీ నేత కేశినేని నాని ఆరోపించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ తాను ప్రజారాజ్యం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 28 Jan 2009 | 11:58 am

గంభీర్, రైనా అర్థ సెంచరీలు: గెలుపు దిశగా భారత్

గౌతమ్ గంభీర్, సురేష్ రైనాలు అర్థ సెంచరీలు సాధించడంతో దంబుల్లా వన్డేలో భారత్ గెలుపు దిశగా పయనిస్తోంది. శ్రీలంక విధించిన 247 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలో దిగిన భారత్ సచిన్ టెండూల్కర్ (5)వికెట్‌ను త్వరగానే...
Source: Yahoo! Telugu: News | 28 Jan 2009 | 10:53 am

సత్యం కుంభకోణం: సీబీఐ దర్యాప్తుకు వైఎస్ ఓకే

సత్యం కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరిపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గ్రీన్‌‍సిగ్నల్ ఇచ్చారు. ఏడేళ్లకుపైగా ఈ ఐటీ కంపెనీ బ్యాంకు ఖాతాల్లో అవకతవకలకు పాల్పడిందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు వైఎస్ఆర్ వివరించారు.
Source: Yahoo! Telugu: News | 28 Jan 2009 | 10:49 am

దంబుల్లా వన్డే: భారత్ విజయలక్ష్యం 247

దంబుల్లాలో జరుగుతున్న తొలివన్డేలో శ్రీలంక 247 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్‌ముందుంచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టును ఓపెనర్ సనత్ జయసూర్య (107) తన సెంచరీతో ఆదుకున్నాడు. దీంతో నిర్ణీత 50ఓవర్లలో లంక జట్టు...
Source: Yahoo! Telugu: News | 28 Jan 2009 | 10:39 am

కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌: లష్కర్ అగ్రనేత హతం

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కర్ తోయిబా తీవ్రవాద సంస్థకు చెందిన అగ్రనేత అబు హమ్జా హతమయ్యాడు. అలాగే మరో మిలిటెంట్‌ను ప్రాణాలు కోల్పోయాడు. 18 గంటల పాటు సాగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.
Source: జాతీయ | 28 Jan 2009 | 9:51 am

ఓ ఇంటివాడైన 'యువరాజ్యం' అధినేత

సినీ నటుడు, యువరాజ్యం అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం ఓ ఇంటివాడయ్యాడు. తనతో సహజీవనం గడుపుతున్న సినీ నటి రేణూదేశాయ్‌ను ఆయన హిందూ సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నాడు.
Source: ఏపీ న్యూస్ | 28 Jan 2009 | 9:21 am

మిక్స్‌డ్ డబుల్స్ సెమీ ఫైనల్స్‌లో సానియా- భూపతి

భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారులు సానియా మీర్జా, మహేష్ భూపతి ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ సెమీస్‌లోకి అడుగుపెట్టారు. బుధవారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సానియా- భూపతి జోడి కెనాడాకు చెందిన అలెగ్జాండ్రా
Source: Yahoo! Telugu: News | 28 Jan 2009 | 8:44 am

ఏప్రిల్- మేలో సార్వత్రిక ఎన్నికలు: ఎన్నికల సంఘం

వచ్చే లోక్‌సభ ఎన్నికలు ఈ ఏడాది ఏప్రిల్- మే మధ్యకాలంలో జరుగుతాయని ఎన్నికల సంఘం కమిషనర్ ఎస్‌వై ఖురేషి వెల్లడించారు. ఎన్నికల సంఘం తుది తేదీలు ఖరారు చేయాల్సి ఉందన్నారు. అయితే ఈ ఎన్నికలు ఏప్రిల్ 8- మే- 15 మధ్యకాలంలో
Source: Yahoo! Telugu: News | 28 Jan 2009 | 8:43 am

శ్రీలంక తమిళుల భద్రతపై హామీ కోరిన ప్రణబ్

శ్రీలంకలోని ప్రజాస్వామ్య వ్యవస్థ తమిళ పౌరుల భద్రతపై హామీ ఇవ్వాలని విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ కోరారు. ప్రణబ్ ముఖర్జీ మంగళవారం శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన లంక పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు మహింద
Source: Yahoo! Telugu: News | 28 Jan 2009 | 8:43 am

లష్కరే తోయిబా అగ్రనేత అబు హంజా హతం

లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థకు చెందిన అగ్రనేత అబు హంజాను భద్రతా దళాలు బుధవారం హతమార్చాయి. ఉత్తర కాశ్మీర్‌లోని సోపారా జిల్లాలో భద్రతా దళాలకు, తీవ్రవాదులకు మధ్య జరుగుతున్న ఎన్‌‍కౌంటర్‌లో హంజా మృతి చెందినట్లు
Source: Yahoo! Telugu: News | 28 Jan 2009 | 8:40 am

ఏప్రిల్-మే నెలల్లో సాధారణ ఎన్నికలు: ఈసీ

లోక్‌సభ సాధారణ ఎన్నికలు ఏచ్చే ఏప్రిల్ , మే నెలల్లో జరుగవచ్చని కేంద్ర ఎన్నికల సంఘ అధికారి ఎస్.వై.ఖురేషి సూచన ప్రాయంగా వెల్లడించారు. అయితే తుది తేదీల ఖరారుపై ఎన్నికల సంఘం చర్చలు జరుపలేదన్నారు. అనేకంగా ఏప్రిల్ ఎనిమిది, మే 15వ తేదీ మధ్యలో నిర్వహించే అవకాశం ఉందన్నారు.
Source: జాతీయ | 28 Jan 2009 | 7:39 am

ఐపీఎల్ కోసం ఈసీబీ, బీసీసీఐ మధ్య ఒప్పందం

కెవిన్ పీటర్సన్, ఆండ్ర్యూ ఫ్లింటాఫ్‌లతోపాటు ఇంగ్లాండ్ అగ్రశ్రేణి ఆటగాళ్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడేందుకు వీలుగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ), బీసీసీఐ రెండేళ్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీంతో ఈ ఏడాది, వచ్చే సీజన్‌లో
Source: Yahoo! Telugu: News | 28 Jan 2009 | 7:27 am

మాలిక్ తొలగింపు: యూనిస్ ఖాన్‌కు పాక్ కెప్టెన్సీ

పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి షోయబ్ మాలిక్‌ను పీసీబీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) తొలగించింది. ఆ బాధ్యతలను సీనియర్ ఆటగాడు యూనిస్ ఖాన్‌కు అప్పగించింది. ఇటీవల స్వదేశంలో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ను పాకిస్థాన్ 2-1 తేడాతో
Source: Yahoo! Telugu: News | 28 Jan 2009 | 7:26 am

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం: 5గురు మృతి

ప్రకాశం జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో ఎనిమిదిమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మృతులు, క్షతగాత్రులందరూ మహిళలే కావడం గమనార్హం.
Source: Yahoo! Telugu: News | 28 Jan 2009 | 7:25 am

తెరాసకు లేఖ రాసింది మేమే: మావోయిస్టులు

తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి హరీశ్‌ రావుకు లేఖ రాసింది తామేనని నిర్భంధంలో ఉన్న మావోయిస్టులు నల్ల రాజిరెడ్డి, శ్రీరాముల శ్రీనివాస్‌ అలియాస్‌ సుదర్శన్‌ స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 28 Jan 2009 | 6:22 am

అసంతృప్తిని పక్కన పెట్టండి: చిరంజీవి పిలుపు

పదవుల పందేరంలో నెలకొన్న అసంతృప్తులను పక్కన పెట్టి అవినీతిమయమైన కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి పిలుపునిచ్చారు. ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి తారస్థాయికి చేరిందని అందువల్ల ఇదే సరైన తరుణమన్నారు.
Source: ఏపీ న్యూస్ | 28 Jan 2009 | 5:49 am

నేడు ఐసియు నుంచి ప్రధాని తరలింపు

బైపాస్ సర్జరీ చేయించుకుని ఐసియు కేర్ యూనిట్‌లో ఉంటున్న ప్రధాని మన్మోహన్ సింగ్‌ను బుధవారం ఆ వార్డు నుంచి బయటకు తరలించనున్నట్టు ప్రధాని వ్యక్తిగత వైద్యుడు కె.శ్రీనాథ్ రెడ్డి తెలిపారు.
Source: జాతీయ | 28 Jan 2009 | 5:26 am

సమాజ్‌వాదీ పైవు శత్రుఘ్న సిన్హా చూపు!

బాలీవుడ్ సీనియర్ నటుడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు శత్రుఘ్న సిన్హా సమాజ్‌వాదీ పార్టీ వైపు దృష్టి సారించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున టిక్కెట్ దక్కడం సందేహాస్పందంగా మారడంతో ఆయన ఎస్పీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Source: జాతీయ | 28 Jan 2009 | 5:20 am

ముగిసిన పెద్దల సభ నామినేషన్ల ఘట్టం

శాసన మండలి ఎన్నికల్లో భాగంగా శాసన సభ్యుల కోటా ద్వారా జరుగనున్న ఎన్నికల నామినేషన్ల దాఖలు ఘట్టం మంగళవారంతో ముగిసింది. మొత్తం 11 స్థానాలకు గాను అంతే సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో వీరంతా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం లాంఛన ప్రాయమే అవుతుంది.
Source: ఏపీ న్యూస్ | 28 Jan 2009 | 4:01 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 28 Jan 2009 | 3:53 am

జనవరి 28, 2009 కార్యక్రమాలు

ఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 విజయం 14:30 జై హనుమాన్ 15:00 ప్రేమ మందిరం ...
Source: Yahoo! Telugu: Entertainment | 28 Jan 2009 | 3:51 am

శ్రీరామ సేనపై నిషేధం విధించ లేదు: యడ్యూరప్ప

మంగళూరులోని ఒక పబ్‌పై దాడి చేసిన యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన శ్రీరామ్ సేన సంస్థపై నిషేధం విధించేది లేదని కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప స్పష్టం చేశారు. శ్రీరామ్ సేనను నిషేధించే అంశానికి కాలమే సమాధానం చెపుతుందని వేదాంత ధోరణిలో సమాధానం ఇచ్చారు.
Source: జాతీయ | 28 Jan 2009 | 3:44 am

హైదరాబాద్ కర్మన్ ఘాట్లో విద్యార్థిని శ్వేత హత్య

హైదరాబాద్ నగర శివారులోని కర్మన్ ఘాట్‌లో శ్వేతా రెడ్డి (21) అనే డిగ్రీ చదువుతున్న విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. ఈమె తన అక్క ఇంట్లో ఉంటూ ప్రగతి కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది.
Source: ఏపీ న్యూస్ | 27 Jan 2009 | 3:35 pm

పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గిస్తాం: సోనియా

పెట్రోలియం ఉత్పత్తుల ధరలను త్వరలో తగ్గించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచనప్రాయంగా తెలిపారు. రాయబలేరీలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు.
Source: జాతీయ | 27 Jan 2009 | 2:46 pm

నిధుల స్వాహాలో తెదేపా ఫస్ట్: వైఎస్

రాష్ట్రంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం, స్వాహా చేయడంలో తెలుగుదేశం తమ్ముళ్లు అగ్రస్థానంలో ఉన్నారని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ఆరోపించారు. గత తొమ్మిదేళ్ల తెలుగుదేశం పాలనలో పచ్చా చొక్కాల కార్యకర్తలు ప్రజా ధనాన్ని స్వాహా చేశారని విమర్శించారు.
Source: ఏపీ న్యూస్ | 27 Jan 2009 | 12:38 pm

మంగళూరు సంఘటనపై కేంద్రం సీరియస్

కర్ణాటక రాష్ట్రం, మంగళూరులోని ఓ పబ్‌‌లో సేద తీరుతున్న యువతులపై శ్రీరామ్ సేన కార్యకర్తలు దాడి చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోంది. సంఘటనపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని కేంద్రం ఆదేశించింది. అలాగే భారతీయ జనతా పార్టీతో సహా, అన్ని రాజకీయ పక్షాలు దాడి సంఘటను తీవ్రంగా ఖండించాయి.
Source: జాతీయ | 27 Jan 2009 | 12:35 pm