ఉగ్రవాదంపై ప్రజల మద్దతు కావాలి: అద్వానీ

ఉగ్రవాదంపై ప్రభుత్వం జరుపుతున్న పోరుకు దేశ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మద్దతు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ అగ్రనేత, ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎల్కే.అద్వానీ పిలుపునిచ్చారు. గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఆయన తన నివాసంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
Source: జాతీయ | 26 Jan 2009 | 10:46 am

ఉగ్రవాదం పోరులో రాష్ట్రం ముందంజ: తివారీ

ఉగ్రవాదంపై సాగిస్తున్న పోరులో ఇతర రాష్ట్రాల కంటే మన రాష్ట్రం ముందంజలో ఉందని గవర్నర్ ఎన్.డి.తివారీ అన్నారు. 60వ గణతంత్ర వేడుకల సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో ఆయన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. అలాగే అమరవీరులకు అంజలి ఘటించారు.
Source: ఏపీ న్యూస్ | 26 Jan 2009 | 7:57 am

సుదర్శన్ లేఖ కాంగ్రెస్ సృష్టే: రాఘవులు

తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి కె.హరీష్ రావుకు మావోయిస్టు ఖైదీ సుదర్శన్ లేఖ రాయడమనేది కాంగ్రెస్ పార్టీ సృష్టేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు ఆరోపించారు.
Source: ఏపీ న్యూస్ | 26 Jan 2009 | 7:44 am

అసరమైతే కేసీఆర్‌పై తిరుగుబాటు: సుదర్శన్ లేఖ

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తప్పటడుగులు వేసే తెరాస అధినేత కేసీఆర్‌ను సైతం ఎదిరించాలని మావోయిస్టు ఖైదీ సుదర్శన్ పిలుపునిచ్చాడు. ఈ మేరకు తెరాస ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే హరీష్ రావు‌కు ఆయన ఒక లేఖ రాశారు.
Source: ఏపీ న్యూస్ | 26 Jan 2009 | 7:17 am

మిలిబాండ్ వ్యాఖ్యలపై ఆనంద్ శర్మ ఆగ్రహం

ఉగ్రవాదానికి, జమ్మూకాశ్మీర్ అంశానికి ముడిపెడుతూ బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ మిలిబాండ్ చేసిన వ్యాఖ్యల పట్ల కేంద్ర విదేశాంగ సహాయమంత్రి ఆనంద్ శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Source: జాతీయ | 26 Jan 2009 | 7:04 am

పలువురుకి పద్మ పౌర పురస్కారాలు

గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ 133 మందికి ‘పద్మ’ పౌర పురస్కారాలను ప్రకటించారు. వీరిలో పదిమందికి దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌.. 30 మందికి పద్మభూషణ్‌.. 93 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు.
Source: జాతీయ | 26 Jan 2009 | 6:53 am

గౌరవ వందనం స్వీకరించిన మంత్రి ఆంటోనీ

భారతదేశ చరిత్రలో మరో అరుదైన ఘట్టం నెలకొంది. దేశంలోనే తొలిసారిగా గణతంత్ర వేడుకల్లో ప్రధాని పాల్గొనలేక పోయారు. దీంతో ఆయన విధులను కేంద్ర రక్షణ మంత్రి ఏకే.ఆంటోనీ నిర్వహించారు.
Source: జాతీయ | 26 Jan 2009 | 6:40 am

21 నుంచి భాజపా సంకల్ప యాత్ర

భారతీయ జనతా పార్టీ వచ్చే నెల 21వ తేదీ నుంచి సంకల్ప యాత్రలను నిర్వహించనుంది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు గాను ఈయాత్రలను నిర్వహిస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 26 Jan 2009 | 5:59 am

జనవరి 26, 2009 కార్యక్రమాలు

ఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 విజయం 14:30 జై హనుమాన్ 15:00 ప్రేమ మందిరం ...
Source: Yahoo! Telugu: Entertainment | 26 Jan 2009 | 5:26 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 26 Jan 2009 | 5:23 am

ప్రజలను మభ్యపెడుతున్న వైఎస్: బాబు

అసత్య ప్రచారాలతో ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి మభ్యపెడుతున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాలో రెండవ విడత ‘మీ కోసం’ యాత్రను చంద్రబాబు పొందూరు నుంచి ఆదివారం ప్రారంభించారు.
Source: ఏపీ న్యూస్ | 26 Jan 2009 | 5:11 am

దేశ వ్యాప్తంగా త్రివర్ణ పతాక రెపరెపలు

అరవైవ గణతంత్ర వేడుకలు సోమవారం దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా.. త్రివర్ణ పతాకాన్ని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఎగురవేశారు. ఎందరో త్యాగధనులు, మహానుభావుల త్యాగఫలితమే ఈ 'గణతంత్ర రాజ్యం' ఏర్పడినది. 'గణతంత్ర రాజ్యం' అంటే ప్రజలే ప్రభుత్వము, ప్రభుత్వమే ప్రజలు.
Source: జాతీయ | 26 Jan 2009 | 4:15 am

గౌతమబుద్ధ చిత్రం సమాజానికి ప్రేరణ

గౌతమబుద్ధ చిత్రం సమాజానికి ఎంతగానో ప్రేరణనిస్తుందని బౌద్ధమత గురువు దలైలామా వ్యాఖ్యానించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 2007 సంవత్సరానికి ప్రకటించిన నంది అవార్డుల్లో గౌతమ బుద్ధకు స్పెషల్ జ్యూరీ అవార్డు రావడం విశేషంగా చెప్పారు. ఈ సందర్భంగా
Source: Yahoo! Telugu: Entertainment | 25 Jan 2009 | 12:38 pm

మహాకూటమిలోనే కొనసాగుతాం: హరీష్ రావు

మహాకూటమిలోనే తాము కొనసాగుతామని తెలంగాణా రాష్ట్ర సమితి నేత, ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. ఆయన ఆదివారం మెదక్‌లో మీడియాతో మట్లాడుతూ తెలగుదేశం, సీపీఐ, సీపీఎం పార్టీలతో ఏర్పాటైన మహాకూటమిలో తెరాస కొనసాగుతుందన్నారు. సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయని అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 25 Jan 2009 | 12:06 pm