|
సీటీబీటీపై సంతకమా..? నొనో: ప్రణబ్అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ అణు పరీక్షల నిషేధ ఒప్పందం (సిటిబిటి), అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పిటి)లపై సంతకం చేసే ప్రసక్తే లేదని కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. ఆయన ఒక ప్రైవేటు టీవీ ఛానల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.Source: జాతీయ | 18 Jan 2009 | 11:54 am గోవాలో భాజపా పోరాటం: ప్రతాప్ రూఢీవచ్చే పార్లమెంటరీ ఎన్నికల్లో తమ పార్టీ గోవాలో ఒంటరిగానే పోటీ చేస్తుందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజీవ్ ప్రతాప్ రూఢీ స్పష్టం చేశారు. ఆయన ఆదివారం ఆ రాష్ట్ర రాజధాని పనాజీలో మీడియాతో మాట్లాడుతూ వచ్చే పార్లమెంటరీ ఎన్నికల్లో గోవాలో ఒంటరిగా పోటీ చేయనున్నట్టు తెలిపారు.Source: జాతీయ | 18 Jan 2009 | 11:23 am మరిన్ని ఆధారాలు ఇచ్చేందుకు భారత్ సిద్ధంముంబై దాడి కేసులో నిందితులను శిక్షించేందుకు అవసరమైన ఆధారాలు మరికొన్ని పాకిస్థాన్‌కు అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ దాడి కేసులో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్‌కు పలు ఆధారాలను అప్పగించిన విషయం తెల్సిందే.Source: జాతీయ | 18 Jan 2009 | 11:20 am మేటాస్ ప్రాజెక్టులు రద్దు చేయలేం: రోశయ్యసత్యం కంప్యూటర్స్ అనుబంధ సంస్థ మేటాస్‌కు కేటాయించిన పనుల రద్దుపై తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కొణిజేటి రోశయ్య అభిప్రాయపడ్డారు. ఆయన ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ సత్యం సంస్థ కుంభకోణం నేపథ్యంలో దాని అనుబంధ సంస్థపై ప్రభుత్వం పూర్తి వివరణ ఇచ్చిందని తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 18 Jan 2009 | 10:31 am సీఐడీ కస్టడీలో అ'సత్యం' రాజు బ్రదర్స్సత్యం సంస్థ మాజీ అధినేత బైర్రాజు రామలింగరాజు సోదరులను సీబీసీఐడీ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉంటున్న వీరిని ఆదివారం ఉదయం పది గంటలకు సీఐడీ అధికారులు జైలుకు వచ్చి తమ ఆధీనంలోకి తీసుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 18 Jan 2009 | 10:17 am 29 నుంచి బాలకృష్ణ ఎన్నికల ప్రచారంతెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 13వ వర్థంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారులు హరికృష్ణ, బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు.Source: ఏపీ న్యూస్ | 18 Jan 2009 | 10:01 am కాంగ్రెస్ ప్రభుత్వ పతనం ఖాయం: బాబుసరిగ్గా తొంభై రోజుల్లో ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పతనం కావడం ఖాయమని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 18 Jan 2009 | 10:01 am కార్పొరేట్ రంగానికి సత్యం ఓ మచ్చ: ప్రధానిసత్యం కంప్యూటర్స్ సంస్థలో జరిగిన కుంభకోణం దేశ కార్పొరేట్ రంగానికి మాయని మచ్చలాంటిదని ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. అయితే సత్యం దోషులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు. శనివారం ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.Source: జాతీయ | 18 Jan 2009 | 6:08 am రైతన్నకు అండగా ప్రజారాజ్యం: చిరంజీవితాము అధికారంలోకి వస్తే దేశానికి అన్నం పెట్టే రైతులకు ప్రజారాజ్యం పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో శనివారం జరిగిన రైతు సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు.Source: ఏపీ న్యూస్ | 18 Jan 2009 | 6:07 am
|