|
విమానంలో మంటలు..ప్రయాణీకులు సురక్షితంశనివారం ఉదయం గం. 6.32లకు గౌహతి నుంచి కోల్‌కత్తాకు బయలుదేరిన విమానంలో కొద్దిసేపటికే మంటలు వ్యాపించడంతో పైలెట్ అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానంలోని సిబ్బందితో సహా 46మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.Source: జాతీయ | 17 Jan 2009 | 1:14 pm ఎన్నికల్లోపే ప్రత్యేక తెలంగాణ: డీఎస్రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో... ప్రత్యేక తెలంగాణపై పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాసరావు ఈ విధంగా స్పందించారు. ఎన్నికల్లోగా తెలంగాణ విషయంపై కాంగ్రెస్ అధిష్ఠానం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని డీఎస్ నమ్మకం వ్యక్తం చేశారు.Source: ఏపీ న్యూస్ | 17 Jan 2009 | 11:58 am సీఐడీ కస్టడీకి రాజు: నాంపల్లి కోర్టు అనుమతిసత్యం కంప్యూటర్స్ సంస్థలో ఆర్థిక కుంభకోణానికి పాల్పడిన బైర్రాజు రామలింగ రాజు సోదరులను నాలుగు రోజుల పాటు సీఐడీ కస్టడీకి స్థానిక నాంపల్లి కోర్టు శనివారం అనుమతి ఇచ్చింది. దీంతో చంచల్‌గూడ జైలులో ఉన్న రామలింగరాజు, అతని సోదరుడు రామరాజు, సత్యం సీఎఫ్‌ఓ వడ్లమాని శ్రీనివాస్‌లను సీఐడీ తమ ఆధీనంలోకి తీసుకుని విచారించనుంది.Source: ఏపీ న్యూస్ | 17 Jan 2009 | 11:55 am 14 మందితో పీఆర్పీ రాష్ట్ర కమిటి వెల్లడికాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తున్న ప్రజారాజ్యం పార్టీ శనివారం 14 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీని ప్రకటించింది. ఇందులో ఐదుగురు ఉపాధ్యక్షుడు, తొమ్మిది మంది ప్రధాన కార్యదర్శులకు చోటు కల్పించింది. అలాగే పార్టీ అధికార ప్రతినిధులుగా ఐదుగురిని నియమించింది.Source: ఏపీ న్యూస్ | 17 Jan 2009 | 11:54 am మహాకూటమికి అంత సీన్‌లేదు: బండారుకాంగ్రెస్ పార్టీని గద్దె దించాలనే ఏకైక లక్ష్యంతో ఆవిర్భవించిన మహాకూటమికి పాలక పార్టీని ఓడించే సత్తా లేదని భాజపా రాష్ట్ర కార్యదర్శి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. కమ్యూనిస్టులు పచ్చి అవకాశవాదులని ధ్వజమెత్తారు.Source: ఏపీ న్యూస్ | 17 Jan 2009 | 9:59 am త్యాగాలకు సిద్ధం కండి: మహాకూటమి పిలుపుతమ నేతలకు మహాకూటమి హెచ్చరికలు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీని గద్దె దించాలనే ఏకైక లక్ష్యంతో ఆవిర్భవించిన మహాకూటమి తమ నేతలు త్యాగాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కూటమి ధర్మానికి అనుగణంగా వచ్చే ఎన్నికల్లో నడుచుకోవాల్సి ఉంటుందని హితవు పలికింది.Source: ఏపీ న్యూస్ | 17 Jan 2009 | 9:58 am రోజాకు టిక్కెట్ ఇస్తే.. ఓడిస్తాం: రామ్మూర్తితెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, సినీ నటి రోజాకు చంద్రగిరి అసెంబ్లీ టిక్కెట్ కేటాయిస్తే ఆమెను ఓడించి తీరుతామని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు హెచ్చరించారు. దీంతో ఖంగుతిన్న రోజా.. అలకపాన్పు ఎక్కారు.Source: ఏపీ న్యూస్ | 17 Jan 2009 | 8:52 am రాజకీయ నేతగా మారిన "మున్నాభాయ్"నిన్నటి వరకు బాలీవుడ్ నటుడిగా ఉన్న 'మున్నభాయ్' (సంజయ్‌దత్) శనివారం పక్కా రాజకీయ నేతగా మారిపోయారు. తాను పోటీ చేయనున్న లక్నో నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహించేందుకు రాజకీయ నేతను తలపించే విధంగా వేషధారణ ధరించారు.Source: జాతీయ | 17 Jan 2009 | 8:46 am భారత్‌కు పాకిస్థాన్ శత్రువు కాదు: ఒమర్భారత్కు పాకిస్థాన్ శత్రుదేశం కాదని జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. అయితే ఆ దేశంలోని కొన్ని వ్యతిరేక శక్తులు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయన్నారు. శుక్రవారం రాత్రి ముంబైలో జరిగిన ఒక సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు.Source: జాతీయ | 17 Jan 2009 | 7:30 am ఓబెరాయ్‌ను సందర్శించనున్న ప్రధానిఉగ్రవాదుల దాడిలో తీవ్రంగా ధ్వంసమైన ట్రైడెంట్ ఓబెరాయ్ హోటల్‌ను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ శనివారం సందర్శించనున్నారు. ఈ నక్షత్ర హోటల్‌లో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను ముంబైకు వస్తున్నారు.Source: జాతీయ | 17 Jan 2009 | 7:26 am మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించం: ప్రధానిదేశంలో మీడియా స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలిగించబోమని ప్రధాని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారు. అయితే ప్రత్యక్ష ప్రసారాల సమయంలో మీడియా తమకు తాముగా కొన్ని హద్దులతో పాటు నియమాలను పాటించాలని ఆయన సూచించారు.Source: జాతీయ | 17 Jan 2009 | 3:34 am జనవరి 17, 2009 కార్యక్రమాలు06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:30 షో రీల్ 09:00 టాలీవుడ్ టైమ్ 10:00 స్టార్‌తో సరదాగా 10:30 ఫన్‌టాస్టిక్ 11:00 రంగుల పల్లకిలో 11:30 న్యూ సినిమా స్పెషల్ 12:00 ఈనాడు సినిమాSource: Yahoo! Telugu: Entertainment | 17 Jan 2009 | 3:12 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 17 Jan 2009 | 3:06 am జార్ఖండ్‌లో రాష్ట్రపతి పాలకు గవర్నర్ సిఫార్సు!రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్న జార్ఖండ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆ రాష్ట్ర గవర్నర్ సిబ్తీ రజే శుక్రవారం సిఫార్సు చేశారు. ఇటీవల రాష్ట్రంలోని తమర్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి, జేఎంఎం చీఫ్ శిబూ సోరేన్ ఓటమి పాలైన విషయం తెల్సిందే.Source: జాతీయ | 17 Jan 2009 | 3:05 am పెద్దల సభకు సినీ నటి రోజా!తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, సినీ నటి రోజాకు ఎమ్మెల్సీ టిక్కెట్ ఇచ్చేందుకు ఆ పార్టీ అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇతర సీనియర్ నేతలతో పాటు చిత్తూరు జిల్లా నాయకులతో మంతనాలు జరిపినట్టు సమాచారం.Source: ఏపీ న్యూస్ | 17 Jan 2009 | 2:56 am ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లు లేనట్టే: మొయిలీవచ్చే నెలలో ప్రారంభంకానున్న పార్లమెంట్ ఆఖరి సమావేశాల్లో ప్రత్యేక తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టే యోచన లేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్పమొయిలీ స్పష్టం చేశారు.Source: ఏపీ న్యూస్ | 17 Jan 2009 | 2:47 am గణతంత్ర దినోత్సవ వేడుకలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లునిరుడు జరిగిన ముంబై మహానగరంలో ఉగ్రవాదుల దాడులను దృష్టిలోవుంచుకుని గణతంత్ర దినోత్సవ వేడుకలకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 26 జనవరిన దేశ రాజధానిలో దాడులు జరిగే అవకాశముందని నిఘా వర్గాలనుంచి సమాచారమందడంతో పటిష్టమైన భద్రత కల్పిస్తున్నారు.Source: జాతీయ | 16 Jan 2009 | 3:08 pm రాష్ట్ర తీరప్రాంతాలలో 15 మెరైన్ పోలీసు స్టేషన్లుఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తీర ప్రాంతాల భద్రతను పటిష్ట పరిచేందుకుగాను రాష్ట్ర పోలీసు శాఖ నడుంబిగించింది. కోస్తా తీర ప్రాంతంలోని తొమ్మిది జిల్లాల్లోనూ 15 మెరైన్ పోలీసు స్టేషన్‌లను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర పోలీసు శాఖ ప్రతిపాదించిందిSource: ఏపీ న్యూస్ | 16 Jan 2009 | 2:26 pm తెలంగాణకు కాంగ్రెస్ నోతెలంగాణపై పార్లమెంటులో బిల్లుపెడితే అన్ని రాష్ట్రాలనుంచి కాంగ్రెస్‌కు వ్యతిరేకత ఎదురవుతుందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ వీరప్ప మొయిలీ పేర్కొన్నారు. తెలంగాణాను ఇవ్వడం అంటే తేనె తుట్టెను కదిలించినట్టేనని ఆయన అభిప్రాయపడ్డారుSource: ఏపీ న్యూస్ | 16 Jan 2009 | 2:05 pm ఫిబ్రవరి 6న రానున్న బంగారుబాబుజగపతిబాబు హీరోగా డా. దాసరి నారాయణరావు కథ, స్క్రీన్‌ప్లేతో జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బంగారుబాబు. సౌభాగ్య మీడియా లిమిటెడ్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రస్తుతం...Source: Yahoo! Telugu: News | 16 Jan 2009 | 1:54 pm ఫిబ్రవరి 6న రానున్న బంగారుబాబుజగపతిబాబు హీరోగా డా. దాసరి నారాయణరావు కథ, స్క్రీన్‌ప్లేతో జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బంగారుబాబు. సౌభాగ్య మీడియా లిమిటెడ్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రస్తుతం...Source: Yahoo! Telugu: Entertainment | 16 Jan 2009 | 1:54 pm సత్యం ఉద్యోగులను కాపాడేందుకు ప్రాధాన్యతఏడు వేల కోట్ల రూపాయల భారీ అకౌంటింగ్ కుంభకోణంలో మునిగిన సత్యం కంప్యూటర్ సర్వీసెస్‌ను కష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం అన్నిరకాలుగా ప్రయత్నిస్తోంది.Source: Yahoo! Telugu: News | 16 Jan 2009 | 1:41 pm సిడ్నీ నుంచి మహేష్ భూపతి జోడి నిష్క్రమణసిడ్నీ ఇంటర్నేషనల్ నుంచి భారత అగ్రశ్రేణి డబుల్స్ క్రీడాకారుడు మహేష్ భూపతి, అతని భాగస్వామి మార్క్ నౌల్స్ జోడి నిష్క్రమించింది. శుక్రవారం జరిగిన డబుల్స్ సెమీస్‌లో వారు పరాజయం పాలైయ్యారు. మూడో సీడ్ భారత్- బహమాస్ జోడిSource: Yahoo! Telugu: News | 16 Jan 2009 | 1:16 pm యూపీపై విజయం: రంజీ ట్రోఫీ ముంబయి కైవసంఉత్తరప్రదేశ్తో జరిగిన ఐదు రోజుల ఫైనల్స్‌లో ముంబయి జట్టు 243 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి రంజీ ట్రోఫీని కైవసం చేసుకుంది. రంజీ ట్రోఫీని ముంబయి జట్టు గెలుచుకోవడం ఇది 38వసారి. టీం ఇండియా మాస్టర్ బ్యాట్స్‌మెన్ సచిన్Source: Yahoo! Telugu: News | 16 Jan 2009 | 1:07 pm న్యూజీలాండ్‌లో భారత పర్యటన పొడిగింపున్యూజీలాండ్లో టీం ఇండియా పర్యటనను పొడిగింపుకు ఇరుదేశాల బోర్డులు ఆమోదముద్ర వేశాయి. ఈ టూర్‌లో టీం ఇండియా ఒక అదనపు టెస్ట్ మ్యాచ్‌తోపాటు, రెండో ట్వంటీ- 20 మ్యాచ్ కూడా ఆడుతుంది. ఈ మేరకు చేసిన మార్పులుSource: Yahoo! Telugu: News | 16 Jan 2009 | 12:50 pm భారత్- శ్రీలంక మధ్య ఐదు వన్డేల సిరీస్ ఖారారుశ్రీలంకలో టీం ఇండియా ఐదు వన్డేలు, ఒక ట్వంటీ- 20 మ్యాచ్ ఆడనుంది. ఈ నెలలోనే శ్రీలంకలో భారత జట్టు పర్యటిస్తోంది. గురువారం శ్రీలంక బోర్డు వెల్లడించిన వివరాల ప్రకారం.. భారత జట్టు పర్యటన జనవరి 26న ప్రారంభం అవుతుంది.Source: Yahoo! Telugu: News | 16 Jan 2009 | 12:42 pm
|