కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు: అమర్ సింగ్

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు చేసుకుని పోటీ చేయనున్నట్టు సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీఎస్పీని దెబ్బకొట్టడమే తమ ప్రథమ కర్తవ్యమన్నారు. ఆయన శుక్రవారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్-ఎస్పీలు కలిసి పోటీ చేస్తాయని చెప్పారు.
Source: జాతీయ | 16 Jan 2009 | 11:31 am

"నా స్టైలే వేరు" అంటోన్న రాజశేఖర్

డా. రాజశేఖర్, భూమిక కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రానికి "నా స్టైలే వేరు" పేరును ఖరారు చేశారు. దిషిర ప్రొడక్షన్ పతాకంపై మాగంటి గోపినాథ్ నిర్మిస్తుండగా, జి. రామ్‌ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ... వైవిధ్యమైన కథ, కథనాలే...
Source: వినోదం | 16 Jan 2009 | 11:31 am

మహాకూటమి కాదు.. "మాయా"కూటమి: చిరు

రాష్ట్రంలో రాజకీయ శక్తుల పునరేకీకరణలో భాగంగా నాలుగు పార్టీలు కలిసి ఏర్పాటు చేసిన కూటమి మహా కూటమి కాదని మాయా కూటమి అని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అభిప్రాయపడ్డారు. ఆయన శుక్రవారం పీఆర్పీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో పీఆర్పీ ప్రజలతోనే పొత్తుపెట్టుకుని ముందుకు సాగుతుందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 16 Jan 2009 | 10:19 am

తెరాసలో రాములమ్మ పార్టీ విలీనం!

సినీ నటి విజయశాంతి స్థాపించిన తల్లి తెలంగాణా పార్టీని తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీలో విలీనం చేశారు. శుక్రవారం కేసీఆర్, విజయశాంతిల మధ్య జరిగిన సమావేశానంతరం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
Source: ఏపీ న్యూస్ | 16 Jan 2009 | 9:40 am

రేపటి నుంచి చిరు ఉత్తరాంధ్ర పర్యటన

ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు చిరంజీవి శనివారం నుంచి ఉత్తరాంధ్ర పర్యటన చేపట్టనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లా రాజాంలో తొలుత పర్యటిస్తారు. అక్కడ ప్రజారాజ్యం నిర్వాహకులు ఏర్పాటు చేసిన రైతు సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు.
Source: ఏపీ న్యూస్ | 16 Jan 2009 | 9:39 am

కుప్పం నుంచి పోటీ చేస్తా...: ఆదికేశవులు

కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే కుప్పం నియోజక వర్గం నుండి పోటీ చేస్తానని టీటీడీ ఛైర్మన్, ఎంపీ ఆదికేశవుల నాయుడు శుక్రవారం ప్రకటించారు. పదవిలో ఉన్నా లేకపోయినా... కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం తీవ్రంగా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 16 Jan 2009 | 9:38 am

ఫిబ్రవరి 6న రానున్న బంగారుబాబు

జగపతిబాబు హీరోగా డా. దాసరి నారాయణరావు కథ, స్క్రీన్‌ప్లేతో జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బంగారుబాబు. సౌభాగ్య మీడియా లిమిటెడ్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రస్తుతం...
Source: Yahoo! Telugu: Entertainment | 16 Jan 2009 | 8:18 am

జయ దర్శకత్వంలో అల్లరి నరేష్ చిత్రం

ప్రేమలో పావనీ కళ్యాణ్, సవాల్ చిత్రాల ద్వారా ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న మహిళా దర్శకురాలు బి. జయ దర్శక్తత్వంలో అల్లరి నరేష్ హీరోగా కొత్త చిత్రం రూపొందనుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 16 Jan 2009 | 8:17 am

వెంకీకి నంది రావడం సంతోషం: రామానాయుడు

తన కుమారుడు హీరో వెంకటేష్‌కు ఉత్తమ నటుడిగా నంది అవార్డు రావడం సంతోషాన్ని కల్గిస్తోందని ప్రముఖ నిర్మాత డా. డి. రామానాయుడు పేర్కొన్నారు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రానికిగాను 2007 ఉత్తమ నటుడి అవార్డు వెంకటేష్‌కు...
Source: Yahoo! Telugu: Entertainment | 16 Jan 2009 | 8:17 am

జాతీయ దర్యాప్తు సంస్థ డైరక్టర్‌గా ఆర్.వి.రాజు

ముంబైపై ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ తొలి డైరక్టర్‌ జనరల్‌గా ఆర్.వి.రాజు నియమితులయ్యారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్ర డైరక్టర్ ఆఫ్ జనరల్ (విజిలెన్స్)గా విధులు నిర్వహిస్తున్న ఈయన 1975 ఐపీఎస్ కేడర్‌కు చెందిన అధికారి.
Source: జాతీయ | 16 Jan 2009 | 6:57 am

ఫిబ్రవరి 4న మహాకూటమి "మహా గర్జన"

రాష్ట్రంలో తాజాగా ఆవిర్భవించిన మహాకూటమి తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. వచ్చే నాలుగో తేదీన మహా గర్జన పేరుతో బల ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించింది. మహాగర్జనకు వేదికగా భువనగిరి, వరంగల్, నల్గొండ ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 16 Jan 2009 | 6:33 am

ఫ్యాక్షన్ నేపధ్యంలో మస్కా

ఫ్యాక్షన్ కథాంశాలు కనుమరుగవుతున్న తరుణంలో బి. గోపాల్ మార్క్ యాక్షన్‌తో, ఎం.ఎస్.రాజు తరహా ప్రేమ కథతో తెరకెక్కిన చిత్రం మస్కా. సంక్రాంతి పండుగ సందర్భంగా తెరమీదకు వచ్చిన ఈ చిత్రంలో రామ్, హన్సిక, షీలాలు హీరోహీరోయిన్లుగా...
Source: Yahoo! Telugu: Entertainment | 16 Jan 2009 | 6:26 am

గుజరాత్ తీరంలో 17 మంది పాక్ జాలర్ల అరెస్టు

గుజరాత్ సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన 17 మంది పాకిస్థాన్ జాలర్లను భారత కోస్తా గస్తీదళం గురువాం అరెస్టు చేసింది. వీరు ఉపయోగించిన రెండు పడవలను కూడా స్వాధీనం చేసుకుంది.
Source: జాతీయ | 16 Jan 2009 | 6:14 am

లెక్కల్లో పూర్ అనుకుంటా..!

"మగ పెళ్ళివారు లెక్కల్లో పూర్ అనుకుంటా" అంది సుహాసిని.. "ఎందుకలా అంటున్నావ్..?' అడిగాడు గిరీష్.. "ఏం లేదండీ.. వాళ్ళిచ్చిన లిస్ట్‌లో...
Source: వినోదం | 16 Jan 2009 | 6:09 am

పెళ్ళికి ముందు మల్లెతీగలా..!

"ప్రేమించి పెళ్ళి చేసుకున్నావుగా.. ఎలా ఉందిరా లైఫ్...?" అడిగాడు వినోద్.. "ఏం చెప్పను రా... నా బాధ... పెళ్ళికి ముందు మల్లెతీగలా ఉండేది, పెళ్ళయ్యాక...
Source: వినోదం | 16 Jan 2009 | 6:08 am

ప్రకటనల పేరుతో ప్రజాధనం ఖర్చు: చిరు

ప్రకటనల పేరుతో ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంలా ప్రభుత్వం ఖర్చు చేస్తోందని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ధ్వజమెత్తారు. ప్రకటనలకు ఖర్చు చేస్తున్న డబ్బుతో పలు సంక్షేమ పనులను పూర్తి చేయవచ్చని ఆయన చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 16 Jan 2009 | 4:37 am

వచ్చే ఎన్నికల్లో విజయం మాదే: డీఎస్

రాష్ట్రంలో ఎన్ని మహాకూటములు ఏర్పాటైనా.. వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ జోస్యం చెప్పారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన ఆయన గురువారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 16 Jan 2009 | 4:27 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 16 Jan 2009 | 3:27 am

జనవరి 16, 2009 కార్యక్రమాలు

ఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 నా అభిరుచి 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 బాలచందర్ కథాంజలి 14:30 శ్రీ కృష్ణ లీలలు 15:00 ప్రేమ మందిరం...
Source: Yahoo! Telugu: Entertainment | 16 Jan 2009 | 3:22 am

ఫిబ్రవరి 12 నుంచి పార్లమెంట్ సమావేశాలు

వచ్చే నెల 12వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగనున్నాయి. అదే రోజున రాజ్యసభ కూడా సమావేశమవుతుంది. ప్రస్తుత 14వ లోక్‌సభకు ఇవి ఆఖరి సమావేశాలు కావడం గమనార్హం. దీనిపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వాయిలార్ రవి గురువారం మీడియాతో మాట్లాడుతూ వచ్చే నెల 12వ తేదీ నుంచి పార్లమెంట్‌ను సమావేశపరచాలని నిర్ణయించామన్నారు.
Source: జాతీయ | 16 Jan 2009 | 2:50 am

సరే.. పాక్‌లోనే విచారించండి: ప్రణబ్

ముంబై మారణహోమం నేపథ్యంలో భారత్ కోరిన దోషులను పాకిస్థాన్ అప్పగించక పోయినా ఫర్వాలేదని కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. అయితే తాము కోరిన దోషులను మాత్రం ఖచ్చితంగా పట్టుకుని, పాక్‌లోనే నిష్పక్షిపాతంగా విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
Source: జాతీయ | 16 Jan 2009 | 2:39 am