|
సత్యం కుంభకోణంలో వైఎస్ హస్తం: చంద్రబాబుదేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిన సత్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి హస్తం ఉందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆయన నివాసంలో రాఘవులు, నారాయణ (వామపక్షాలు), కేసీఆర్ (తెరాస)లు సమావేశమయ్యారు. వీరు ఎన్నికల భవిష్యత్‌పై చర్చలు జరిపారు.Source: ఏపీ న్యూస్ | 15 Jan 2009 | 11:32 am 28 నుంచి బాలయ్య శ్రీకాకుళం పర్యటనసినీ నటుడు, నందమూరి వంశ వారసుడు బాలకృష్ణ ఈనెల 28వ తేదీ నుంచి ప్రజల వద్దకు వెళ్ళనున్నారు. ప్రజారాజ్యం పార్టీ కారణంగా తెలుగుదేశం పార్టీకి ఏర్పడిన నష్టాన్ని కొంతమేరకైనా పూడ్చేందుకు బాలయ్య శ్రీకాకుళం జిల్లా నుంచి పర్యటన చేపట్టనున్నారు.Source: ఏపీ న్యూస్ | 15 Jan 2009 | 10:51 am తెదేపాను కంగారెత్తిస్తున్న కేసీఆర్ వైఖరితెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె.చంద్రశేఖర రావు అనుసరిస్తున్న వైఖరి పట్ల తెలుగుదేశం పార్టీ నేతలు ఖంగుతింటున్నారు. మహా కూటమిలో చేరిక అంశంపై ఆయన వైపు నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన విడుదల కాలేదు. దీంతో ఆయన ఎపుడు, ఏ క్షణం కప్పదాటు వేస్తారోనని తెదేపా అధినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీ సీనియర్ నేతలు ఆందోళన చెందుతున్నారు.Source: ఏపీ న్యూస్ | 15 Jan 2009 | 9:49 am విశాఖ సముద్ర జలాల నుంచి నౌక కిడ్నాప్విశాఖపట్నం సముద్ర జలాల నుంచి ఫిషింగ్ వెసల్‌ను ఒకటి అపహరణకు గురైంది. ఇందులో 11 మంది ట్రావెల్ ఇంజనీర్లు ఉన్నారు. ఎనిమిది మంది కెన్యా దేశస్థులు కాగా, ముగ్గురు భారతీయ ఇంజనీర్లు ఉన్నారు.Source: ఏపీ న్యూస్ | 15 Jan 2009 | 9:38 am తెరాసలో 'రాములమ్మ' పార్టీ విలీనం!తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఒకనాటి అగ్రనటి విజయశాంతి నెలకొల్పిన తల్లి తెలంగాణా పార్టీని తెలంగాణా రాష్ట్ర సమితిలో విలీనం చేయనున్నారు. ఈ మేరకు తెరాస అధినేత కె.చంద్రశేఖర రావుకు, విజయశాంతికి మధ్య రహస్య ఒప్పందం కుదిరినట్టు చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 15 Jan 2009 | 9:36 am మీడియాపై ఆంక్షలు వద్దు: ప్రతిపక్షాలుదేశ మీడియాపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను భారతీయ జనతా పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రైవేట్ మీడియా ప్రసారాలపై ఆంక్షలు విధించడం సబబు కాదని భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు.Source: జాతీయ | 15 Jan 2009 | 9:20 am అమెరికాలో మరో తెలుగు ఇంజనీర్ హత్యఅమెరికాలో మరో దారుణం జరిగింది. పొట్టకూటి కోసం దేశ సరిహద్దులను దాటి వెళ్లిన మన రాష్ట్రానికి చెందిన మెకానిక్ ఇంజనీర్ అమెరికాలో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ విషయం గురువారం వెలుగులోకి వచ్చింది.Source: ఏపీ న్యూస్ | 15 Jan 2009 | 7:08 am తెలంగాణాకు సోనియా సై: డీఎస్ వర్గాలువచ్చే ఎన్నికల్లో మహా కూటమిని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక తెలంగాణా రాష్ట్రానికి పచ్చ జెండా ఊపవచ్చని తెలుస్తోంది. ఇందుకోసం పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.Source: జాతీయ | 15 Jan 2009 | 6:58 am భారతీయులకు దక్కిన గౌరవం: రెహ్మాన్గోల్డెన్ గ్లోబ్ అవార్డు భారతీయులందరికీ దక్కిన గౌరవంలాంటిదని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్ అన్నారు. ప్రతిష్టాత్మకమైన "గోల్డెన్ గ్లోబ్ అవార్డు"ను కైవసం చేసుకున్న విషయం తెల్సిందే.Source: జాతీయ | 15 Jan 2009 | 6:13 am బలగాలను మొహరిస్తున్న పాక్: ఆర్మీచీఫ్భారత సరిహద్దుల పైపు పాకిస్థాన్ తమ సైన్యాన్ని మొహరిస్తోందని భారత రక్షణ శాఖ చీఫ్ మేజర్ జనరల్ దీపక్ కపూర్ వెల్లడించారు. అయినప్పటికీ తమ బలగాలు మాత్రం ఎలాంటి పరిస్థితులనైనా తిప్పికొట్టేందుకు సర్వ సన్నద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు.Source: జాతీయ | 15 Jan 2009 | 5:21 am విదేశాలకు వెళ్లేందుకు సుప్రీం అనుమతిబాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ విదేశాలకు వెళ్లేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. చిత్ర షూటింగ్ నిమిత్తం ఆయన న్యూయార్క్ వెళ్లవచ్చని తెలిపింది.Source: జాతీయ | 15 Jan 2009 | 4:55 am
|