|
పవిత్ర గంగా స్నానమాచరించిన భక్తులుమకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారంనాడు లక్షలమంది అలహాబాద్‌లోని సంగమ్, గంగాసాగర్, శుక్రతాల్ తదితర గంగా నది పరీవాహక పుణ్య క్షేత్రాల వద్ద స్నానమాచరించారు.Source: జాతీయ | 14 Jan 2009 | 11:46 am మోడీ భావిభారత ప్రధాని: అంబానీగుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ భావిభారత ప్రధాని అవుతారని కార్పొరేట్ దిగ్గజాలు అనిల్ అంబానీ, సునిల్ భారతి మిట్టల్ జోస్యం చెప్పారు. గుజరాత్‌లో జరుగుతున్న అభివృద్ధి అనూహ్యమనీ, రాష్ట్ర ఉన్నతికి కారణమైన ముఖ్యమంత్రి నరేంద్రమోడి ఖచ్చితంగా ఏదో ఒకరోజున దేశం పగ్గాలు చేపడతారన్నారు.Source: జాతీయ | 14 Jan 2009 | 10:51 am రూ.15కోసం కన్నతల్లినే హతమార్చిన కసాయితాడిచెట్టులా ఎదిగిన కొడుకు కన్నతల్లికి చేదోడు వాదోడుగా ఉండాల్సిందిపోయి... కేవలం 15 రూపాయలు ఇవ్వలేదని కన్నతల్లినే కడతేర్చాడు. ఈ ఉదంతం ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగింది.Source: జాతీయ | 14 Jan 2009 | 9:22 am తీవ్రవాదుల ఆటలు సాగవు: ఆర్మీ చీఫ్ఇకపై ఉగ్రవాదుల దుశ్చర్యలు భారత భూభాగంలో ఎంతమాత్రం సాగవనీ, వారు ఎక్కడున్నా కూకటి వేళ్లతో పెకలించి వేస్తామనీ భారత సైనికదళ అధికారి దీపక్ కపూర్ తెలిపారు. ఉగ్రవాదులు ఏ రూపంలో దాడిని చేయటానికి పన్నాగాలు పన్నినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనే సత్తా భారతదేశానికి ఉందన్నారు.Source: జాతీయ | 14 Jan 2009 | 9:05 am తమిళనాడులో నూతన సంవత్సరం..నేడేతమిళులకు నేటినుంచే నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇదివరకు ప్రతి ఏటా సూర్యమానం ప్రకారం ఏప్రిల్ నెల మధ్యలో చైత్ర మాసం తొలిరోజున తమిళ సంవత్సరాది పండుగను ఘనంగా జరుపుకునేవారుSource: జాతీయ | 14 Jan 2009 | 5:49 am వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తాం: అద్వానిభారతీయ జనతా పార్టీ తరపున ప్రధానమంత్రి అభ్యర్ధి ఎల్.కే. అద్వానీ మంగళవారం కుటీరపరిశ్రమలు, వ్యవసాయాన్ని తాము అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.Source: జాతీయ | 13 Jan 2009 | 3:25 pm భారత్ పాక్‌ల మధ్య శాంతి నెలకొంటుంది: ఫరూక్ అబ్దుల్లాభారత్, పాకిస్తాన్‌ల మధ్య శాంతి ప్రక్రియ ప్రారంభం కాగలదని జమ్మూ...కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నూతన అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా మంగళవారం ఆశాభావం వ్యక్తం చేశారు. భారత,పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం ప్రబలే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.Source: జాతీయ | 13 Jan 2009 | 2:54 pm అయప్ప భక్తుల ఇక్కట్లుబుధవారం జనవరి 14న శబరిమలలో జ్యోతి దర్శనం కోసం అయ్యప్ప భక్తులు ప్రతి సంవత్సరం శబరిమలకు చేరుకోవడం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ ఏడాది కూడా అనేక మంది భక్తులు వివిధ రాష్ట్రలనుంచి శబరిమలకు చేరుకున్నారు.Source: జాతీయ | 13 Jan 2009 | 1:47 pm
|