రోడ్‌ షోలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

రాష్ట్రంలో రోడ్‌షోలను మళ్లీ నిర్వహించుకునేందుకు అనుమతి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రోడ్‌షోలకు అవసరమైన జనాన్ని సమీకరించుకోవచ్చని హైకోర్టు బుధవారం పేర్కొంది. అంతేకాకుండా రోడ్‌షోలపై రాష్ట్ర డిజిపి అందజేసిన మార్గదర్శకాలను కూడా సడలించింది. ఫలితంగా రాష్ట్రంలో రోడ్‌షో రాజకీయాలు మళ్లీ వేడెక్కనున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 7 Jan 2009 | 11:56 am

"సత్యం"పై సీబీసీఐడీ విచారణ : వైఎస్సార్

సత్యం కంప్యూటర్స్‌లో జరిగిన అవతవకలపై సీపీసీఐడీ విచారణ జరిపించనున్నట్లు ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేర్కొన్నారు. షేర్ హోల్డర్ల తరపున క్రిమినల్ కేసు పెట్టేందుకు అవకాశాలున్నాయా అన్న కోణంలో పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 7 Jan 2009 | 11:37 am

లారీ ఆపరేటర్ల సమ్మెకు రాజకీయ రంగు

గత మూడు రోజులుగా సాగుతున్న లారీ ఆపరేటర్ల సమ్మెకు రాజకీయ రంగు పులుముకుంది. లారీ యజమానులకు వామపక్ష పార్టీలు, భారతీయ జనతా పార్టీలు మద్దతు ప్రకటించాయి. దీనిపై ఆల్ ఇండియా మోటర్ ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ (ఏఐఎంటిసి) ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ రమేష్ అగర్వాల్ బుధవారం మాట్లాడుతూ బుధవారం ఉదయం సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్‌ను కలిశామన్నారు.
Source: జాతీయ | 7 Jan 2009 | 10:58 am

తెరాసాకు ఒంటరిగా పోటీ చేసే సత్తా లేదా?

ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటే లక్ష్యంగా ఆవిర్భవించిన పార్టీ తెలంగాణా రాష్ట్ర సమితి. ఈ పార్టీ అధినేత తెలుగుదేశం మాజీ నాయకుడు. ఇటీవలి కాలంలో తెలంగాణా ఉద్యమానికి ఊపిరి పోసిన వ్యక్తి. తన స్వార్థ ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి. ఇందుకు నిదర్శనమే.. తాజాగా తెలుగుదేశంతో చేతులు కలపడం.
Source: ఏపీ న్యూస్ | 7 Jan 2009 | 9:58 am

శ్రీరామ్, పృథ్వీరాజ్ హీరోలుగా పోలీస్ - పోలీస్

ఒకరికి ఒకరు ఫేం శ్రీరామ్, పృథ్వీరాజ్ హీరోలగా కమిలినీ ముఖర్జీ, బుజ్జిగాడు చిత్రం ఫేం సంజన హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం పోలీస్ - పోలీస్. పినాంకిల్ పిక్చర్స్ పతాకంపై చందు నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా మనమోహన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Jan 2009 | 9:38 am

కృష్ణభగవాన్, వేణుమాధవ్‌లతో టిక్..టిక్..టిక్

కృష్ణభగవాన్, వేణుమాధవ్, ప్రేమ, అమృత, సైరాభాను, నర్సింగ్ యాదవ్ ముఖ్య తారాగణంగా తెరకెక్కుతున్న చిత్రం టిక్..టిక్..టిక్. యువర్ టైమ్ స్టార్ నౌ అనేది ఈ చిత్రానికి శీర్షిక. ఈ చిత్రం ద్వారా అరుణకాంత్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Jan 2009 | 9:34 am

ముంబై విధ్వంసం: అమెరికా దొంగాట!

ముంబై మారణహోమంలో అమెరికా రెండు నాల్కల ధోరణి అనుసరిస్తోంది. ఒక పక్క భారత్‌కు అన్ని విధాలుగా సహకరిస్తామని బాహాటంగా ప్రకటిస్తూనే.. మరోవైపు పాక్‌కు అనుకూలంగా వ్యవహరించడం సమస్య నీరుగారి పోయేలా చేస్తోంది. దీనివల్ల ఇటు భారత్‌లను తమ చెప్పు చేతల్లో పెట్టుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది.
Source: జాతీయ | 7 Jan 2009 | 9:32 am

రాష్ట్రాల బాధ్యత ముఖ్యమంత్రులదే: చిదంబరం

రాష్ట్రాల బాధ్యత ఆయా ముఖ్యమంత్రులదేనని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. దేశ రాజధానిలో మంగళవారం జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి చిదంబరం ఈ వ్యాఖ్యలను మరోమారు పునరుద్ఘాటించారు.
Source: జాతీయ | 7 Jan 2009 | 5:11 am

ఫలించని పొత్తులు... ఒంటరి సమరమే: చిరు

భావసారూప్యత కలిగిన పార్టీలతో పొత్తులు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా అది సాధ్యం కాలేదని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి స్పష్టం చేశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే ఎన్నికల సమరంలోకి దిగుతామని ఆయన ప్రకటించారు.
Source: ఏపీ న్యూస్ | 7 Jan 2009 | 5:01 am

జనవరి 07, 2009 కార్యక్రమాలు

06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 విజయం 14:30 జై హనుమాన్ 15:00 ప్రేమ మందిరం
Source: Yahoo! Telugu: Entertainment | 7 Jan 2009 | 3:07 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 7 Jan 2009 | 3:03 am

లారీల సమ్మె... స్థంభించిన నిత్యావసర సరుకుల రవాణా

తమ కోరికలు నెరవేర్చాలని కోరుతూ సోమవారం నుండి సమ్మె ప్రారంభించిన లారీ యజమానులు ఈ రోజుకూడా సమ్మెకొనసాగించారు. దీంతో నిత్యావసర సరుకుల రవాణా ఎక్కడికక్కడ స్తంభించింది. తత్ఫలితంగా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 6 Jan 2009 | 2:59 pm

నెలాఖరులోగా మొండిమొగుళ్లు పెంకిపెళ్లాలు చిత్రం

రఘుబాబు, శివాజీరాజాలు ప్రధానంగా కుమారి యనమల హర్షిణి రెడ్డి సమర్పణలో మంజునాథ క్రియేషన్స్ పతాకంపై కేవీ రమణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం మొండిమొగుళ్లు పెంకిపెళ్లాలు. ప్రస్తుతం ఈ చిత్రం రీరికార్డింగ్ కార్యక్రమాల్లో ఉంది. అన్ని...
Source: Yahoo! Telugu: Entertainment | 6 Jan 2009 | 12:25 pm