నెలాఖరులోగా మొండిమొగుళ్లు పెంకిపెళ్లాలు చిత్రం

రఘుబాబు, శివాజీరాజాలు ప్రధానంగా కుమారి యనమల హర్షిణి రెడ్డి సమర్పణలో మంజునాథ క్రియేషన్స్ పతాకంపై కేవీ రమణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం మొండిమొగుళ్లు పెంకిపెళ్లాలు. ప్రస్తుతం ఈ చిత్రం రీరికార్డింగ్ కార్యక్రమాల్లో ఉంది. అన్ని...
Source: Yahoo! Telugu: Entertainment | 6 Jan 2009 | 12:25 pm

విడుదలైన రోషం ఆడియో

శ్రీకృష్ణ, మమత హీరోహీరోయిన్‌లుగా పెండెం బాలకృష్ణ నిర్మాణంలో సమీ దర్శకత్వంలో రూపొందిన రోషం చిత్రం ఆడియో విడుదలయింది. దీనికి సంబంధించి హైదరాబాద్‌లో ఆడియో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వి సముద్ర, అనిల్‌కృష్ణ...
Source: Yahoo! Telugu: Entertainment | 6 Jan 2009 | 12:12 pm

బెంగాలే నా సొంత ఇల్లు : తస్లీమా

తాను భారతదేశానికో లేదా, బంగ్లాదేశ్‌కో చెందినా... ఆ దేశాల ప్రభుత్వాలు ఎక్కడా ఉండనీయటం లేదనీ... అయితే తాను ఎక్కడ ఉన్నప్పటికీ సొంత ఇల్లు మాత్రం పశ్చిమ బెంగాలేననీ వివాదాస్పద స్రీవాద రచయిత్రి తస్లీమా నస్రీస్ స్పష్టం చేశారు.
Source: జాతీయ | 6 Jan 2009 | 7:27 am

ఆలీబాబా 40 దొంగలు డీవీడీ విడుదల

సైబర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్.. ఆలీబాబా 40 దొంగలు అనే త్రీడీ యానిమేషన్ చిత్రాన్ని రూపొందించింది. గతంలో కిట్టూ, ఘటోత్కచలు వచ్చిన చాలా కాలం తర్వాత తెలుగులో విడుదలైన యానిమేషన్ చిత్రం ఆలీబాబా 40 దొంగలు. ఈ చిత్రానికి...
Source: Yahoo! Telugu: Entertainment | 6 Jan 2009 | 7:24 am

ఉగ్రవాదమే పాక్ విధానం: ప్రధాని మండిపాటు

పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంలో భాగంగా ఉపయోగిస్తోందని భారత్ ప్రధాని మన్మోహన్ సింగ్ మండిపడ్డారు. లష్కరే తోయిబా కార్యకర్తలు ముంబైలో జరిపిన ఘాతుక దాడులకు భారత్ పొరుగుదేశంలోని కొన్ని ప్రభుత్వ సంస్థల మద్దతు ఖాయంగా ఉందని చెప్పారు.
Source: జాతీయ | 6 Jan 2009 | 7:08 am

ఉగ్రవాద నిరోధక వ్యూహంపై ముఖ్యమంత్రుల చర్చ

ఉగ్రవాద సమస్యపై సమగ్రంగా చర్చించేందుకు, దేశవ్యాప్తంగా నిఘా సమాచారాన్ని సమన్వయ ధోరణితో పంచుకునేందుకు పటిష్ట వ్యూహాన్ని రూపొందించేందుకోసం రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంగళవారం న్యూఢిల్లీలో సమావేశం కానున్నారు.
Source: జాతీయ | 6 Jan 2009 | 6:36 am

ప్రపంచ నాస్తిక మహాసభలు విజయవాడలో ప్రారంభం

ప్రపంచంలో నాస్తికులు ఆస్తికులు రెండు వర్గాలుగా వున్నవిషయం విదితమే. ఇందులో నాస్తికులు ఏకంగా ఏకమై నాస్తిక మహాసభలను విజయవాడలో ప్రారంభించారు. ముఖ్యంగా ఆస్తికులకు నిలయమైన మన దేశంలో నాస్తికులకు కూడా చోటుంది.
Source: ఏపీ న్యూస్ | 6 Jan 2009 | 6:03 am

సమ్మెలో 60లక్షల లారీలు: కొనుగోళ్లకు జనం పరుగులు

దేశవ్యాప్తంగా 60 లక్షల రవాణా ట్రక్కులు సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు ప్రారంభించినట్లుగా అఖిల భారత మోటార్ ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో దేశంలో ఆహార పదార్ధాల సంక్షోభం తలెత్తుతుందన్న భయంతో వర్తకులు, ప్రజలు దొరికింది దొరికినట్లుగా కొనివేయడం ప్రారంభించారు.
Source: జాతీయ | 6 Jan 2009 | 5:30 am

నిత్యావసర సరుకులు వందరూపాయలకే...ప్రరాప

నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి వస్తే వంటింటి సరుకులు కేవలం రూ 100లకే అందిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చిరంజీవి ఎన్నికల హామీని ప్రకటించారు
Source: ఏపీ న్యూస్ | 6 Jan 2009 | 5:29 am

టీడీపీ, వామపక్షాలతోనే పొత్తు.. కేసీఆర్

రాష్ట్రంలో రాబోయే ఎన్నికలకు పార్టీలన్నీ ఏకం కావడానికి ముహూర్తం దగ్గరపడుతుండటం గమనార్హం. దీంతో మహాకూటమిని ఏర్పాటు చేసుకోవడానికి నాయకులు సిద్దమవుతున్నారు. ఇదివరకే టీడీపీ, వామపక్షాలు జట్టుకట్టిన విషయం విదితమే.
Source: ఏపీ న్యూస్ | 6 Jan 2009 | 4:44 am

జేడీ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా సిద్ధం

నటుడు జేడీ చక్రవర్తి దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా రూపొందుతున్న చిత్రం సిద్ధం. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో జగపతిబాబు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర విశేషాల గురించి జగపతిబాబు మాట్లాడుతూ ఎన్‌‍కౌంటర్ చేస్తేనే...
Source: Yahoo! Telugu: Entertainment | 6 Jan 2009 | 3:34 am

జనవరి 06, 2009 కార్యక్రమాలు

06.00 ఆరాధన 06.30 అన్నదాత 07.00 ఈటీవి న్యూస్ 07.30 ప్రియమైన నీకు 08.00 టాలీవుడ్ టైమ్ 09.00 చలనచిత్రం 12.00 అభిరుచి 12.30 భారతి 13.00 స్టార్ మహిళ 14.00 బాలచందర్ కథాంజలి
Source: Yahoo! Telugu: Entertainment | 6 Jan 2009 | 3:21 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 6 Jan 2009 | 3:19 am

పాక్ మెడలు వంచాలి: అద్వానీ సూచన

ముంబై మారణహోమాంలో పాకిస్థాన్‌ భూభాగానికి చెందిన ఉగ్రవాదులను నిర్థారించే సరైన ఆధారాలు ఉన్నాయని భారతీయ జనతా పార్టీ అగ్రనే ఎల్కే.అద్వానీ స్పష్టం చేశారు. వీటి సహాయంతో పాక్ మెడలు వంచాలని ఆయన సూచించారు. భారత్ పర్యటనకు స్పెయిన్ ఉప ప్రధాని మరియా థెరిసా ఫెర్నాండ్జ్ డీ లా వెగా తొలిసారి వచ్చారు.
Source: జాతీయ | 5 Jan 2009 | 3:01 pm

క్రైస్తవ మతస్తులకు రక్షణ కల్పించండి: సుప్రీం

రాష్ట్రంలోని క్రైస్తవ మత ప్రజలకు పూర్తి రక్షణ కల్పించాల్సిందిగా ఒరిస్సా ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు సోమవారం ఆదేశించింది. ఉద్రిక్త ప్రాంతాల్లో పారామిలిటరీ బలగాలను మొహరించే పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సమన్వయంగా వ్యవహించాలని కోరారు. గత సెప్టెంబరులో విశ్వహిందూ పరిషత్ నేత లక్ష్మణానంద స్వామి ఆగస్టు 23వ తేదీన హత్యకు గురయ్యాడు.
Source: జాతీయ | 5 Jan 2009 | 3:00 pm

ఫిబ్రవరిలో ఓట్‌ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు

ఫిబ్రవరి రెండో తేదీ నుంచి ఓట్‌ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి వెల్లడించారు. అందువల్ల ఈ నెలాఖరు నాటికి ప్రభుత్వం చేపట్టిన అన్ని అభివృద్ధి పనులను తక్షణం పూర్తి చేయాలని ఆయన అధికారులను అదేశించారు.
Source: ఏపీ న్యూస్ | 5 Jan 2009 | 2:56 pm

డీఎస్ అల్పాహార విందుకు వైఎస్ డుమ్మా

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ధర్మపురి శ్రీనివాస్ సోమవారం ఇచ్చిన అల్పాహార విందుకు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి డుమ్మా కొట్టారు. దీంతో మరోమారు డీఎస్-వైఎస్‌ల మధ్య ఉన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. అయితే ముఖ్యమంత్రి మరో అధికారిక కార్యక్రమం ఉన్నందువల్లే ఈ భేటీకీ హాజరుకాలేక పోయారని ఆయన సన్నిహిత వర్గాలు కప్పిపుచ్చుతున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 5 Jan 2009 | 2:56 pm

కోల్‌కతాలో కల్తీ సారాకు 14 మంది మృత్యువాత

కోల్‌కతాలో కల్తీ సారాకు 14 మంది మృత్యువాత పడ్డారు. మరో 29 మంది ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కిడ్డర్‌పూర్ ప్రాంతంలోని హైడ్ రోడ్డులో ఆదివారం ఈ సంఘటన జరిగింది.
Source: జాతీయ | 5 Jan 2009 | 2:53 pm

పాక్‌కు సాక్ష్యాలను అందజేశాం: ప్రణబ్ ముఖర్జీ

ముంబై దాడులకు సంబంధించిన పూర్తి సాక్ష్యాలను పాకిస్థాన్‌కు అందజేసినట్టు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖామంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. ఇకపై పాక్ చర్యలు చేపట్టడమే మిగిలి వుందన్నారు.
Source: జాతీయ | 5 Jan 2009 | 2:52 pm

మహిళా సాధికారతే మా లక్ష్యం: వైఎస్సార్

రాష్ట్రంలో మహిళా సాధికారత సాధించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు. మహిళలకు ఆర్థికంగా చేయూతనివ్వడమే ధ్యేయంగా ప్రతి మండలానికీ రూ.10 కోట్ల రుణాలు మంజూరు చేయనున్నట్లు వైఎస్‌ ప్రకటించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ఆదివారం పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
Source: ఏపీ న్యూస్ | 5 Jan 2009 | 2:50 pm

ఎన్నికల రణక్షేత్రం కానున్న తిరుపతి పుణ్యక్షేత్రం

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి ఇక రాజకీయ రణక్షేత్రం కానుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతి శాసనసభ స్థానం నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు తలపడనున్నారు. ప్రధానంగా.. ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి పోటీ చేయనున్నట్టు ఇప్పటికే సంకేతాలు వెలువడ్డాయి. ఆయనపై పోటీకి దింపేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, తెదేపాలు తమ అభ్యర్థులను ఖరారు చేసినట్టు సమాచారం.
Source: ఏపీ న్యూస్ | 5 Jan 2009 | 2:46 pm

'సైకిల్‌'పై షి'కారు' చేయనున్న తెరాస

సైకిల్-కారు పొత్తులు దాదాపుగా ఖారారైనట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు సూత్ర ప్రాయంగా వెల్లడించినట్టు సమాచారం. దీనిపై అధికార ప్రకటన వెలువడటమే తరువాయి. ఈ ప్రకటనను వెల్లడించేందుకు కూడా ముహుర్తాన్ని నిర్ణయించారు.
Source: ఏపీ న్యూస్ | 5 Jan 2009 | 2:44 pm

నేడు ముఖ్యమంత్రిగా ఒమర్ ప్రమాణ స్వీకారం

జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనతో ఆ రాష్ట్ర గవర్నర్ ఎన్.ఎన్.వోహ్రా ప్రమాణం స్వీకారం చేయించనున్నారు. ఒమర్‌తో పాటు మరో ఆరుగురు మంత్రులు కూడా ప్రమాణం చేసే అవకాశాలు ఉన్నాయి.
Source: జాతీయ | 5 Jan 2009 | 2:43 pm

ప్రజాబలం ముందు ధనబలం దిగదుడుపే: చిరు

ప్రజారాజ్యం పార్టీకి ఉన్న ప్రజాబలం ముందు ధన, కండబలాలు దిగదుడుపేనని ఆ పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆయన ఆదివారం నుంచి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పర్యటనను చేపట్టిన విషయం తెల్సిందే. ముందుగా సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రజా అంకిత సభలో ప్రసంగించాడు.
Source: ఏపీ న్యూస్ | 5 Jan 2009 | 2:42 pm

తెదేపాతో ఎన్నికల దోస్తీ ఖరారు కాలేదు: తెరాస

ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీతో ఎన్నికల పొత్తు ఇంకా ఖరారు కాలేదని తెలంగాణా రాష్ట్ర సమితి స్పష్టం చేసింది. ఈ దిశగా చర్చలు సాగుతున్నాయని ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీష్ రావు వెల్లడించారు. తెలుగుదేశం, సి.పి.ఎం, సి.పి.ఐలతో ఏర్పాటైన కూటమితో తెలంగాణ రాష్ట సమితి పొత్తు దాదాపుగా ఖరారైందని మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే.
Source: ఏపీ న్యూస్ | 5 Jan 2009 | 2:42 pm

ఎంతకైనా తెగిస్తాం.. ఖబడ్దార్: ప్రధాని హెచ్చరిక

దేశ రక్షణలో భాగంగా అవసరమైతే ఎంతకైనా తెగించేందుకు వెనుకాడబోమని ప్రధాని మన్మోహన్ సింగ్ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్‌ ఉద్ధేశించి చేసినవే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. షిల్లాంగ్‌లో శనివారం 96వ ఇండియన్‌ సైన్స్ కాంగ్రెస్‌‌ను ఆయన ప్రారంభించారు.
Source: జాతీయ | 5 Jan 2009 | 2:38 pm