|
క్రైస్తవ మతస్తులకు రక్షణ కల్పించండి: సుప్రీంరాష్ట్రంలోని క్రైస్తవ మత ప్రజలకు పూర్తి రక్షణ కల్పించాల్సిందిగా ఒరిస్సా ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు సోమవారం ఆదేశించింది. ఉద్రిక్త ప్రాంతాల్లో పారామిలిటరీ బలగాలను మొహరించే పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సమన్వయంగా వ్యవహించాలని కోరారు. గత సెప్టెంబరులో విశ్వహిందూ పరిషత్ నేత లక్ష్మణానంద స్వామి ఆగస్టు 23వ తేదీన హత్యకు గురయ్యాడు.Source: జాతీయ | 5 Jan 2009 | 10:56 am జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ ప్రమాణంజమ్మూకాశ్మీర్ 11వ ముఖ్యమంత్రిగా సోమవారం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి చెందిన ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేశారు. ఒమర్ అబ్దుల్లాచే ఆ రాష్ట్ర గవర్నర్ వోరా ప్రమాణ స్వీకారం చేయించారు.Source: Yahoo! Telugu: News | 5 Jan 2009 | 10:48 am పాక్ చేతికి ముంబయి నేరస్థుల వివరాలు: ప్రణబ్ముంబయిలో దాడికి పాల్పడిన తీవ్రవాదులు పాకిస్థాన్‌కు చెందినవారేననే విషయాన్ని బలపర్చే సాక్షాలను తాము పాకిస్థాన్ ప్రభుత్వానికి అందజేశామని భారత విదేశాంగశాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. పాక్ తీవ్రవాదుల గురించి తాముSource: Yahoo! Telugu: News | 5 Jan 2009 | 8:43 am ఫిబ్రవరిలో ఓట్‌ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలుఫిబ్రవరి రెండో తేదీ నుంచి ఓట్‌ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి వెల్లడించారు. అందువల్ల ఈ నెలాఖరు నాటికి ప్రభుత్వం చేపట్టిన అన్ని అభివృద్ధి పనులను తక్షణం పూర్తి చేయాలని ఆయన అధికారులను అదేశించారు.Source: ఏపీ న్యూస్ | 5 Jan 2009 | 8:02 am డీఎస్ అల్పాహార విందుకు వైఎస్ డుమ్మాప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ధర్మపురి శ్రీనివాస్ సోమవారం ఇచ్చిన అల్పాహార విందుకు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి డుమ్మా కొట్టారు. దీంతో మరోమారు డీఎస్-వైఎస్‌ల మధ్య ఉన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. అయితే ముఖ్యమంత్రి మరో అధికారిక కార్యక్రమం ఉన్నందువల్లే ఈ భేటీకీ హాజరుకాలేక పోయారని ఆయన సన్నిహిత వర్గాలు కప్పిపుచ్చుతున్నాయి.Source: ఏపీ న్యూస్ | 5 Jan 2009 | 7:50 am టాలీవుడ్‌లోనూ నటిస్తాను: జెనీలియాబొమ్మరిల్లు చిత్రం ద్వారా బాలీవుడ్‌లోనూ అవకాశాలు దక్కించుకున్న జెనీలియా తాను కేవలం బాలీవుడ్‌కే పరిమితమైపోనని టాలీవుడ్‌సోనూ నటిస్తానని పేర్కొంది. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో తాను నటించినా తనకు గుర్తింపు ఇచ్చింది మాత్రం...Source: Yahoo! Telugu: Entertainment | 5 Jan 2009 | 7:10 am జేడీ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా సిద్ధంనటుడు జేడీ చక్రవర్తి దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా రూపొందుతున్న చిత్రం సిద్ధం. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో జగపతిబాబు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర విశేషాల గురించి జగపతిబాబు మాట్లాడుతూ ఎన్‌కౌంటర్ చేస్తేనే...Source: Yahoo! Telugu: Entertainment | 5 Jan 2009 | 7:08 am నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్ ఆడియో విడుదలశివాజీ, కావేరీఝూ జంటగా బ్రహ్మానందం కామెడీ విలన్‌గా రూపొందిన నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్ చిత్రం ఆడియో విడుదలైంది. ప్రసాద్‌ల్యాబ్ ప్రివ్యూ థియేటర్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో బ్రహ్మానందం ఆడియో కాసెట్‌ను విడుదల చేయగా అల్లరి నరేష్...Source: Yahoo! Telugu: Entertainment | 5 Jan 2009 | 7:05 am మహిళా సాధికారతే మా లక్ష్యం: వైఎస్సార్రాష్ట్రంలో మహిళా సాధికారత సాధించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు. మహిళలకు ఆర్థికంగా చేయూతనివ్వడమే ధ్యేయంగా ప్రతి మండలానికీ రూ.10 కోట్ల రుణాలు మంజూరు చేయనున్నట్లు వైఎస్ ప్రకటించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ఆదివారం పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.Source: ఏపీ న్యూస్ | 5 Jan 2009 | 7:04 am కోల్‌కతాలో కల్తీ సారాకు 14 మంది మృత్యువాతకోల్కతాలో కల్తీ సారాకు 14 మంది మృత్యువాత పడ్డారు. మరో 29 మంది ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కిడ్డర్‌పూర్ ప్రాంతంలోని హైడ్ రోడ్డులో ఆదివారం ఈ సంఘటన జరిగింది.Source: జాతీయ | 5 Jan 2009 | 6:42 am పాక్‌కు సాక్ష్యాలను అందజేశాం: ప్రణబ్ ముఖర్జీముంబై దాడులకు సంబంధించిన పూర్తి సాక్ష్యాలను పాకిస్థాన్‌కు అందజేసినట్టు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖామంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. ఇకపై పాక్ చర్యలు చేపట్టడమే మిగిలి వుందన్నారు.Source: జాతీయ | 5 Jan 2009 | 6:22 am పూంచ్‌లో కొనసాగుతున్న ఎన్కౌంటర్జమ్మూకాశ్మీర్లోని పూంచ్ సెక్టార్‌లో తీవ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య సాగుతున్న ఎన్‌కౌంటర్ సోమవారం కూడా కొనసాగుతోంది. దీంతో ఈ ఎన్‌కౌంటర్ ఐదోరోజుకు చేరుకుంది. ఈ ఎన్‌కౌంటర్ కారణంగా ఇప్పటివరకు నలుగురు తీవ్రవాదులతో...Source: Yahoo! Telugu: News | 5 Jan 2009 | 5:26 am ఎన్నికల రణక్షేత్రం కానున్న తిరుపతి పుణ్యక్షేత్రంపవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి ఇక రాజకీయ రణక్షేత్రం కానుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతి శాసనసభ స్థానం నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు తలపడనున్నారు. ప్రధానంగా.. ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి పోటీ చేయనున్నట్టు ఇప్పటికే సంకేతాలు వెలువడ్డాయి. ఆయనపై పోటీకి దింపేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, తెదేపాలు తమ అభ్యర్థులను ఖరారు చేసినట్టు సమాచారం.Source: ఏపీ న్యూస్ | 5 Jan 2009 | 5:25 am 'సైకిల్'పై షి'కారు' చేయనున్న తెరాససైకిల్-కారు పొత్తులు దాదాపుగా ఖారారైనట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు సూత్ర ప్రాయంగా వెల్లడించినట్టు సమాచారం. దీనిపై అధికార ప్రకటన వెలువడటమే తరువాయి. ఈ ప్రకటనను వెల్లడించేందుకు కూడా ముహుర్తాన్ని నిర్ణయించారు.Source: ఏపీ న్యూస్ | 5 Jan 2009 | 4:53 am నేడు ముఖ్యమంత్రిగా ఒమర్ ప్రమాణ స్వీకారంజమ్మూకాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనతో ఆ రాష్ట్ర గవర్నర్ ఎన్.ఎన్.వోహ్రా ప్రమాణం స్వీకారం చేయించనున్నారు. ఒమర్‌తో పాటు మరో ఆరుగురు మంత్రులు కూడా ప్రమాణం చేసే అవకాశాలు ఉన్నాయి.Source: జాతీయ | 5 Jan 2009 | 4:53 am ఐటీ సంస్థలకు ఈ మెయిల్ బెదిరింపులుకర్ణాటక రాజధాని బెంగుళూరులోని ప్రముఖ ఐటీ సంస్థలకు తీవ్రవాద సంస్థల పేరుతో బెదిరింపు ఈ మెయిల్‌లు వచ్చినట్టు పోలీసులు పేర్కొన్నారు. ముంబయి దాడుల్లో పాల్గొన్నవారి కంటే ఎక్కువ సంఖ్యలో తీవ్రవాదులు ఈ దాడులు జరిపేందుకుSource: Yahoo! Telugu: News | 5 Jan 2009 | 3:42 am ఆసుపత్రిలో చేరిన మాజీ రాష్ట్రపతి కలాంచర్మ సంబంధమైన ఇన్పెక్షన్ కారణంగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలా ఆసుపత్రిలో చేరారు. సైన్స్ కాంగ్రెస్ ప్రారంభోత్సవం కోసం ప్రస్తుతం షిల్లాంగ్‌లో ఉన్న కలాం స్థానిక ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రిలో చేరారు.Source: Yahoo! Telugu: News | 5 Jan 2009 | 3:32 am బుల్లితెరపై నేటి కార్యక్రమాలుఈటీవీ 06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 విజయం 14:30 జై హనుమాన్ 15:00 ప్రేమ మందిరం ...Source: Yahoo! Telugu: Entertainment | 5 Jan 2009 | 3:24 am మీ రోజుSource: Yahoo! Telugu: News | 5 Jan 2009 | 3:22 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 5 Jan 2009 | 3:22 am జమ్మూకాశ్మీర్ సీఎంగా నేడు ఒమర్ ప్రమాణంజమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ శాసనసభాపక్ష నేతగా ఎంపికైన ఒమర్‌అబ్ధుల్లా సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జమ్మూ వర్శిటీలోని జనరల్ జొరావర్ స్టేడియం ఒమర్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి వేదికకానుంది.Source: Yahoo! Telugu: News | 5 Jan 2009 | 3:16 am ప్రజాబలం ముందు ధనబలం దిగదుడుపే: చిరుప్రజారాజ్యం పార్టీకి ఉన్న ప్రజాబలం ముందు ధన, కండబలాలు దిగదుడుపేనని ఆ పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆయన ఆదివారం నుంచి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పర్యటనను చేపట్టిన విషయం తెల్సిందే. ముందుగా సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రజా అంకిత సభలో ప్రసంగించాడు.Source: ఏపీ న్యూస్ | 4 Jan 2009 | 12:42 pm తెదేపాతో ఎన్నికల దోస్తీ ఖరారు కాలేదు: తెరాసప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీతో ఎన్నికల పొత్తు ఇంకా ఖరారు కాలేదని తెలంగాణా రాష్ట్ర సమితి స్పష్టం చేసింది. ఈ దిశగా చర్చలు సాగుతున్నాయని ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీష్ రావు వెల్లడించారు. తెలుగుదేశం, సి.పి.ఎం, సి.పి.ఐలతో ఏర్పాటైన కూటమితో తెలంగాణ రాష్ట సమితి పొత్తు దాదాపుగా ఖరారైందని మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే.Source: ఏపీ న్యూస్ | 4 Jan 2009 | 12:14 pm యూపీఏ వైఫల్యాలపై 16నుంచి బీజేపీ జనాందోళనలుయూపీఏ సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ జనవరి 16నుంచి నెలరోజుల పాటు జనాందోళనలను నిర్వహించనున్నట్టు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు వెంకయ్యనాయుడు ప్రకటించారు. ఉగ్రవాదంపై యూపీఏ సర్కారు మెతక వైఖరి, వ్యవసాయంపై నిర్లక్ష్యం...Source: Yahoo! Telugu: News | 4 Jan 2009 | 11:55 am మంత్రుల పనితీరు సరిగాలేదు: మొయిలీతొలగించిన మంత్రుల పనితీరు సరిగ్గా లేదని అందువల్లే వారిని తొలగించినట్టు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ అభిప్రాయపడ్డారు. ఇటీవల ముగిసిన జడ్పీటీసీ ఎన్నికల్లో సొంత పార్టీ ఓటమిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని ఆషామాషీగా తీసుకోరాదని ఆయన నేతలకు హెచ్చరించారు.Source: ఏపీ న్యూస్ | 4 Jan 2009 | 11:29 am
|