ప్రజాబలం ముందు ధనబలం దిగదుడుపే: చిరు

ప్రజారాజ్యం పార్టీకి ఉన్న ప్రజాబలం ముందు ధన, కండబలాలు దిగదుడుపేనని ఆ పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆయన ఆదివారం నుంచి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పర్యటనను చేపట్టిన విషయం తెల్సిందే. ముందుగా సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రజా అంకిత సభలో ప్రసంగించాడు.
Source: ఏపీ న్యూస్ | 4 Jan 2009 | 12:42 pm

తెదేపాతో ఎన్నికల దోస్తీ ఖరారు కాలేదు: తెరాస

ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీతో ఎన్నికల పొత్తు ఇంకా ఖరారు కాలేదని తెలంగాణా రాష్ట్ర సమితి స్పష్టం చేసింది. ఈ దిశగా చర్చలు సాగుతున్నాయని ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీష్ రావు వెల్లడించారు. తెలుగుదేశం, సి.పి.ఎం, సి.పి.ఐలతో ఏర్పాటైన కూటమితో తెలంగాణ రాష్ట సమితి పొత్తు దాదాపుగా ఖరారైందని మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే.
Source: ఏపీ న్యూస్ | 4 Jan 2009 | 12:14 pm

మంత్రుల పనితీరు సరిగాలేదు: మొయిలీ

తొలగించిన మంత్రుల పనితీరు సరిగ్గా లేదని అందువల్లే వారిని తొలగించినట్టు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ అభిప్రాయపడ్డారు. ఇటీవల ముగిసిన జడ్పీటీసీ ఎన్నికల్లో సొంత పార్టీ ఓటమిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని ఆషామాషీగా తీసుకోరాదని ఆయన నేతలకు హెచ్చరించారు.
Source: ఏపీ న్యూస్ | 4 Jan 2009 | 11:29 am

దేశద్రోహి కాక చిరు దేశ భక్తుడా? : మంత్రి పొన్నాల

భారతదేశంలో జీవిస్తూ, ఇక్కడి స్వేచ్ఛా వాయువులు పీల్చుతూ బ్రిటీష్ పాలనను గొప్పదిగా అభివర్ణించిన ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి దేశద్రోహి అని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖామంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. ఆదివారం వరంగల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 4 Jan 2009 | 8:35 am

ఎంతకైనా తెగిస్తాం.. ఖబడ్దార్: ప్రధాని హెచ్చరిక

దేశ రక్షణలో భాగంగా అవసరమైతే ఎంతకైనా తెగించేందుకు వెనుకాడబోమని ప్రధాని మన్మోహన్ సింగ్ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్‌ ఉద్ధేశించి చేసినవే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. షిల్లాంగ్‌లో శనివారం 96వ ఇండియన్‌ సైన్స్ కాంగ్రెస్‌‌ను ఆయన ప్రారంభించారు.
Source: జాతీయ | 4 Jan 2009 | 7:33 am

ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం చేయాలి: అబ్దుల్ కలాం

స్వదశంలోనే కాకుండా విదేశాల్లో ఉండే ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయాలని మాజీ రాష్టపతి అబ్దుల్ కలాం పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా ఉగ్రవాద దాడులు పెరగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హమీర్‌పూర్‌లో పాఠశాలల విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో కలామ్‌ పాల్గొన్నారు.
Source: జాతీయ | 4 Jan 2009 | 6:26 am

ఆధారాలతో అమెరికాకు హోంమంత్రి చిదంబరం

ముంబైపై దాడుల్లో పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థల ప్రమేయాన్ని నిరూపించే సాక్ష్యాలతో కేంద్ర హోమంత్రి చిదంబరం అమెరికాకు వెళ్లనున్నారు.
Source: జాతీయ | 4 Jan 2009 | 6:07 am

నెల్లూరు జిల్లాలో ప్రారంభమైన చిరు పర్యటన

ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తన నెల్లూరు జిల్లా పర్యటనను ఆదివారం నుంచి ప్రారంభించారు. ఈ పర్యటన మూడు రోజుల పాటు సాగుతుంది. సినీ నటనకు స్వస్తి చెప్పి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన తర్వాత ఆయన ఈ జిల్లాకు తొలిసారి వచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 4 Jan 2009 | 5:45 am

యుద్ధం సమస్యకు పరిష్కారం కాదు: ప్రధాని

దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో తీవ్రవాదం ఒకటని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. దీన్ని తుదముట్టించేందుకు పొరుగుదేశం పాకిస్థాన్‌తో యుద్ధం చేయడం వల్ల సమస్యకు పరిష్కార మార్గం లభించదని ఆయన అన్నారు.
Source: జాతీయ | 3 Jan 2009 | 1:20 pm

కాంగ్రెస్‌కు వంద రోజుల్లో మరణశాసనం: బాబు

మరో వంద రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనం లిఖించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. ఆయన శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ తాజాగా జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వచ్చే ఎన్నికల ఫలితాలు శుభసూచకమన్నారు.
Source: ఏపీ న్యూస్ | 3 Jan 2009 | 1:19 pm

డబ్బుకోసం కాదు...గౌరవంకోసం...

సైనిక దళాలు చేసిన కొన్ని డిమాండ్‌లపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ నూతన సంవత్సర కానుకగా వారి కోరికలను మన్నించి వేతనాల పెంపు బిల్లును ఆమోదించిన విషయం విదితమే. కాని వేతనాల కోసం ప్రభుత్వంతో సైనికాధిపతులు జరిపిన పోరాటం డబ్బుకోసం కాదని ఇతర సర్వీసులతో సమానార్హత, గౌరవం కోసమేనని మాజీ నావికా దళాధిపతి అడ్మిరల్ విష్ణు భగవత్ పేర్కొన్నారు.
Source: జాతీయ | 3 Jan 2009 | 1:18 pm