|
ఆరేళ్లూ నేనే ముఖ్యమంత్రి: ఒమర్ అబ్దుల్లాజమ్మూకాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై ఆరేళ్లూ తానే కొనసాగుతానని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు. అయితే తమకు మద్దతు ఇవ్వనున్న కాంగ్రెస్ పార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వనున్నట్టు తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఎన్.సి-కాంగ్రెస్‌ల మధ్య ప్రభుత్వ ఏర్పాటుపైనే ఒప్పందం కుదిరిందన్నారు.Source: జాతీయ | 2 Jan 2009 | 11:57 am 'పవర్ స్టార్' వ్యాఖ్యలకు సంఘ్‌పరివార్ మద్దతుకాంగ్రెస్ పార్టీ నేతలపై యువరాజ్యం అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఘాటు విమర్శలకు భజరంగ్‌దళ్, విశ్వహిందూ పరిషత్ వంటి సంఘ్ పరివార్ శక్తులు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఉగ్రవాదంపై రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి షబ్బీర్ ఆలీ అనుసరిస్తున్న వైఖరిని ఈ పార్టీల నేతలు కూడా ఎండగట్టారు.Source: ఏపీ న్యూస్ | 2 Jan 2009 | 11:44 am 'యువరాజ్యం' అధినేతకు వనపర్తి కోర్టు పిలుపుప్రజారాజ్యం యువజన విభాగం అధ్యక్షుడు (యువరాజ్యం), సినీ నటుడు పవన్ కళ్యాణ్ కోర్టుకు హాజరుకావాలని వనపర్తి కోర్టు జడ్జి ఆదేశించారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఒక ధర్నాలో కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం తెల్సిందే.Source: ఏపీ న్యూస్ | 2 Jan 2009 | 11:30 am అధికారంలోకి వస్తే రూ.50 వేల రుణం మాఫీ: దత్తన్నతమ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మరుక్షణమే రూ.50 వేలు తీసుకున్న ప్రతిరైతుకు రుణం మాఫీ చేయనున్నట్టు భారతీయ జనత పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ చెప్పారు. ఆయన శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ పొత్తుల కోసం వెంపర్లాడటం లేదన్నారు.Source: ఏపీ న్యూస్ | 2 Jan 2009 | 10:41 am తినబోతూ.. రుచి చూడటం ఎందుకు: జేసీమంచి మసాలాతో తయారు చేసిన కూరను ఆరగించే ముందు రుచి చూడటం ఎందుకని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జేసీ.దివాకర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతలతో యువరాజ్యం అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై మంత్రి స్పందనను కోరగా జేసీ పై విధంగా స్పందించారు.Source: ఏపీ న్యూస్ | 2 Jan 2009 | 9:29 am పని చేసే కార్యకర్తలకే పదవులు: కేసీఆర్పార్టీలో పార్టీ కోసం అహర్నిశలు పని చేసే వారికే పార్టీ పదవులు ఇస్తామని తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె.చంద్రశేఖర రావు స్పష్టం చేశారు. ఆ పార్టీ కార్యకవర్గ సమావేశం శుక్రవారం పార్టీ ప్రధానకార్యాలయమైన తెలంగాణా భవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. పార్టీ పదవులను కష్టపడి పని చేసే వారికే కేటాయిస్తామని స్పష్టం చేశారు.Source: ఏపీ న్యూస్ | 2 Jan 2009 | 9:07 am బాలీవుడ్ కొరియోగ్రాఫర్‌తో బ్రిట్నీ డేటింగ్...!హాలీవుడ్ తార, ప్రముఖ పాప్ గాయని బ్రిట్నీ స్పియర్స్ బాలీవుడ్ నృత్యదర్శకుడు సందీప్ సోపార్కర్‌తో ప్రేమాయణంలో పడిందని వార్తలు. బ్రిట్నీ ఇటీవలే రూపొందించిన ఉమనైజర్ వీడియో ఆల్బమ్‌కు సందీప్ నృత్యదర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.Source: వినోదం | 2 Jan 2009 | 7:25 am సర్వ సన్నద్ధంగా త్రివిధ దళాలు: ఏకే.ఆంటోనీదేశ త్రివధ దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఏకే.ఆంటోనీ స్పష్టం చేశారు. శుత్రు దేశం నుంచి ఎదురయ్యే ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు.Source: జాతీయ | 2 Jan 2009 | 7:23 am శత్రు దేశ చర్యలు తిప్పికొడతాం: కమావత్పొరుగు దేశం పాకిస్థాన్ వల్ల తలెత్తే ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కొనేందుకు భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) సిద్ధంగా ఉందని బీఎస్ఎఫ్ చీఫ్ ఎంఎల్.కుమావత్ నొక్కివక్కాణించారు. ప్రస్తుతం ఈ రెండు దేశాల సరిహద్దుల్లో కొన్ని కార్యకలాపాలు సాగుతున్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు.Source: జాతీయ | 2 Jan 2009 | 7:06 am ఉల్ఫా తీవ్రవాదులకు బంగ్లా అండ: తరుణ్ గగోయ్ఉల్ఫా తీవ్రవాదులకు బంగ్లాదేశ్ సాయం చేస్తోందని అస్సోం ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ ఆరోపించారు. ఈ ఉగ్రవాద స్థావరాలను బంగ్లాదేశ్ ప్రభుత్వం ధ్వంసం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అస్సోం రాజధాని గౌహతిలో బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి.Source: జాతీయ | 2 Jan 2009 | 6:43 am పన్ను ఎలా ఊడింది..?"నీ పన్ను ఎలా ఊడింది?" అడిగాడు దానయ్యSource: వినోదం | 2 Jan 2009 | 5:50 am నిద్రకు ఆగలేను"ఎంత ధైర్యం నీకు... మిట్ట మధ్యాహ్నమే దొంగతనానికి పాల్పడతావా?" దొంగని గద్దించాడు పోలీసు...Source: వినోదం | 2 Jan 2009 | 5:48 am మాటలు వద్దు.. చేతల్లో చూపించండి: ప్రణబ్ముంబై మారణహోమంలో పాత్ర ఉన్న ఉగ్రవాదులపై చర్య తీసుకునేందుకు పాకిస్థాన్ చొరవ చూపించాలని కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. ఈ విషయంలో పాకిస్థాన్ పాలకులు ప్రగల్భాలు మాని.. చేతల్లో చూపించాలని ఆయన హితవు పలికారు.Source: జాతీయ | 2 Jan 2009 | 5:14 am గౌహతిలో పేలుళ్లు : 5 మంది మృతిఅస్సోం రాజధాని గౌహతిలో గురువారం సాయంత్రం జరిగిన వరుస బాంబు పేలుడు ఘటనల్లో కనీసం 12 మంది గాయపడ్డారని ప్రాథమిక సమాచారం. నూతన సంవత్సరం తొలిరోజునే రాజధానిలోని బిరుబరి వద్ద ఉన్న రద్దీ మార్కెట్లో గురువారం మధ్యాహ్నం తర్వాత 1.45 గంటలకు తొలి పేలుడు జరగగా, భూతనాథ్ ఏరియాలో 2.15 గంటలకు రెండో పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు. కాగా మూడో పేలుడు భాంగార్ ప్రాంతంలో 5.30 గంటలకు జరిగింది.Source: జాతీయ | 1 Jan 2009 | 1:43 pm
|