గౌహతిలో పేలుళ్లు : 5 మంది మృతిఅస్సోం రాజధాని గౌహతిలో గురువారం సాయంత్రం జరిగిన వరుస బాంబు పేలుడు ఘటనల్లో కనీసం 12 మంది గాయపడ్డారని ప్రాథమిక సమాచారం. నూతన సంవత్సరం తొలిరోజునే రాజధానిలోని బిరుబరి వద్ద ఉన్న రద్దీ మార్కెట్లో గురువారం మధ్యాహ్నం తర్వాత 1.45 గంటలకు తొలి పేలుడు జరగగా, భూతనాథ్ ఏరియాలో 2.15 గంటలకు రెండో పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు. కాగా మూడో పేలుడు భాంగార్ ప్రాంతంలో 5.30 గంటలకు జరిగింది.Source: జాతీయ | 1 Jan 2009 | 1:43 pm దిగ్విజయ్‌సింగ్‌కు లోకాయుక్త క్లీన్చిట్మధ్యప్రదేశ్ మాజీ ముఖ్కమంత్రి దిగ్విజయ్‌సింగ్‌తోబాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీమంత్రులకు లోకాయుక్త క్లీన్‌చిట్ ఇచ్చింది. దిగ్విజయ్‌తో సహా పలువురు కాంగ్రెస్ నేతలపై అవినీతి ఆరోపణలు, ఇతర అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో లోకాయుక్త విచారణ చేపట్టింది.Source: జాతీయ | 1 Jan 2009 | 11:37 am పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో తప్పులేదు: చిరంజీవికాంగ్రెస్ పార్టీ నేతలను ఉద్ధేశించి యువరాజ్యం అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేమి లేదని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి వ్యాఖ్యానించారు. పవన్ ఉన్న విషయాలనే అన్నారని ఇందులో తప్పు పట్టాల్సిందేమీ లేదని ఆయన పేర్కొన్నారు.Source: Yahoo! Telugu: News | 1 Jan 2009 | 11:33 am మీ రోజుSource: Yahoo! Telugu: News | 1 Jan 2009 | 11:23 am స్టాక్‌మార్కెట్‌లో లాభాలు: సెన్సెక్స్ వృద్ధినూతన సంవత్సర వేళ స్టాక్‌మార్కెట్ లాభాలతో ముగిసి మదుపుదార్లకు ఊరట కలిగింది. దీంతో గురువారం స్టాక్‌మార్కెట్‌లో లావాదేవీలు ముగిసే సమయానికి సెన్సెక్స్ 256 పాయింట్ల వృద్ధితో 9,903 పాయింట్ల వద్ద ముగిసింది. దీంతోపాటు నిప్టీ...Source: Yahoo! Telugu: News | 1 Jan 2009 | 11:22 am పీఆర్‌పీ గూటికి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలుతెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి గురువారం చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ గూటికి చేరారు. టీడీపీలో తాము కొనసాగలేని పరిస్థితి ఏర్పడిన కారణంగానే తాము పార్టీ మార్చినట్టు వారు పేర్కొన్నారు.Source: Yahoo! Telugu: News | 1 Jan 2009 | 11:22 am కుటుంబ కలహాలు: భర్తపై భార్య యాసిడ్ దాడికుటుంబంలో చోటు చేసుకున్న కలహాల నేపథ్యంలో ఓ ఇల్లాలు తన భర్తపై యాసిడ్ దాడి జరిపింది. భార్య జరిపిన ఈ యాసిడ్ దాడి కారణంగా సదరు భర్త తీవ్ర గాయల మధ్య ఆస్పత్రిలో ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడుతున్నాడు.Source: Yahoo! Telugu: News | 1 Jan 2009 | 11:22 am సైనికాధికారుల వేతనాల పెంపు: కేంద్రం నిర్ణయంనూతన సంవత్సర వేళ సైన్యానికి కేంద్ర ప్రభుత్వం ఓ నజరానా అందించింది. ఆరవ వేతన సంఘం సిఫారసుల మేరకు సైనికాధికారుల వేతనాలను భారీగా పెంచేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.Source: Yahoo! Telugu: News | 1 Jan 2009 | 11:20 am మలితరం రాకెట్‌ను రూపొందిస్తున్న ఇస్రోగత సంవత్సరం చంద్రయాన్1 ప్రాజెక్టుతో యావత్ ప్రపంచం అభినందనలు అందుకున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ -ఇస్రో- శాస్త్రజ్ఞులు ప్రస్తుతం మలి తరం అధునాతన రాకెట్ రూపకల్పనలో నిమగ్నమయ్యారు. భారీ ఉపగ్రహాలను రోదసిలో ప్రవేశపెట్టేందుకు తోడ్పడే జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్ 3ని అభివృద్ధి చేయడానికి గాను ఇస్రో 2009లో వరుస పరీక్షలను నిర్వహించనుంది. ఇది 2010-11లో ప్రయోగానికి సిద్ధమవుతుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.Source: జాతీయ | 1 Jan 2009 | 11:04 am విద్యుత్ కోత వ్యవసాయానికి మాత్రం వద్దు..సీఎంరాబోయే రోజుల్లో వ్యవసాయానికి మాత్రం విద్యుత్ కోత విధించవద్దని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంధన శాఖాధికారులకు ఆదేశాలు జారీచేశారు. రిలయన్స్ గ్యాస్‌తో సంబంధం లేకుండా రాష్ట్ర అవసరాలకు సరిపడా విద్యుత్ సరఫరా చేయాలనిSource: ఏపీ న్యూస్ | 1 Jan 2009 | 10:28 am ప్రజలకు సీఎం శుభాకాంక్షలుఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరానికి సంపూర్ణ సంక్షేమ నామ సంవత్సరంగా కొనియాడారు.Source: ఏపీ న్యూస్ | 1 Jan 2009 | 9:46 am భారత సైనికాధికారులకు వేతన పెంపుభారత సాయుధ బలగాలకు చెందిన 12 వేలమంది సైనికాధికారులకు ప్రధాని మన్మోహన్ నూతన సంవత్సర కానుకగా వేతనాల పెంపు బిల్లును ఆమోదించారు. నెలల తరబడి కొనసాగిన అనిశ్చితి తర్వాత భారతీయ ఆర్మికి చెందిన లెఫ్టినెంట్ కల్నల్స్‌కు వారి సరిసమాన స్థాయి కలిగిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, నేవీ అధికారులను అత్యధిక వేతన కేటగిరీలో ఉంచుతున్నట్లుగా రక్షణ మంత్రిత్వ వర్గాలు తెలిపాయి.Source: జాతీయ | 1 Jan 2009 | 9:33 am ప్రధాన నగరాల్లో ఎన్.ఎస్.జి కేంద్రాలు: చిదంబరందేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో జాతీయ భద్రతా కమెండో (ఎన్ఎస్‌జీ) కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం పేర్కొన్నారు. వీటితోపాటు దశలవారీగా మరిన్ని ఎన్ఎస్‌జీ కేంద్రాలను రానున్న రోజుల్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు.Source: Yahoo! Telugu: News | 1 Jan 2009 | 7:08 am భారత్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తాం: హసీనాభారత్తో తాము సత్సంబంధాలు కొనసాగిస్తామని, ఈ అంశాన్ని తమ ప్రభుత్వ ఎజెండాలో ఒక ప్రధానాంశంగా చేర్చనున్నామని బంగ్లాదేశ్‌కు కాబోయే ప్రధాని షేక్ హసీనా స్పష్టం చేశారు. అదేసమయంలో తమదేశంలో ఉగ్రవాద చర్యలకు తాము ఏమాత్రం...Source: Yahoo! Telugu: News | 1 Jan 2009 | 6:44 am కెప్టెన్‌గా మాలిక్‌ను కొనసాగించాలి: హక్వచ్చే సీజన్‌కు సైతం పాకిస్ధాన్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా షోయబ్ మాలిక్‌ను కొనసాగించాలని మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ పేర్కొన్నాడు. అలా కొనసాగిస్తేనే అతని సత్తా ఏమిటో తెలుస్తుందని హక్ అన్నాడు. మాలిక్ కెప్టెన్సీ గడువు ముగిసిన నేపధ్యంలో...Source: Yahoo! Telugu: News | 1 Jan 2009 | 6:30 am ఆసీస్ సిరీస్ కెరీర్‌లోనే ఉత్తమమైంది: కలిస్ఆస్ట్రేలియాతో ప్రస్తుతం జరుగుతోన్న టెస్ట్ సిరీస్ కెరీర్‌లోనే ఉత్తమమైందని దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ జాక్వస్ కలిస్ వ్యాఖ్యానించాడు. గతంలోనూ ఆస్ట్రేలియాపై తాను రాణించినా ప్రస్తుత సిరీస్ కలకాలం గుర్తుండిపోతుందని కలిస్ పేర్కొన్నాడు.Source: Yahoo! Telugu: News | 1 Jan 2009 | 6:22 am భర్తపై భార్య యాసిడ్తోదాడికట్టుకున్న భర్తపై భార్య యాసిడ్‌తో దాడిచేసిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా చాగల్లులో చోటు చేసుకుంది. జనవరి 1 నూతనసంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ ఆనందడోలికల్లో తేలియాడుతున్నారు.Source: ఏపీ న్యూస్ | 1 Jan 2009 | 6:05 am దేవాలయాలు కిటకిటలాడుతున్నాయినూతనసంవత్సరం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయాలతోబాటు చిన్నచిన్న దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి. ఇవేకాక రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక స్థలాల్లో కూడా సందడి నెలకొందిSource: ఏపీ న్యూస్ | 1 Jan 2009 | 5:21 am డబ్బు గుంజుకోవడానికే "చిరు" రాజకీయ ప్రవేశం..!డబ్బు సంపాదించేందుకే ప్రజారాజ్యం అధినేత చిరంజీవి రాజకీయాల్లోకి రంగప్రవేశం చేశారని సినీనటులు రాజశేఖర్ దంపతులు ధ్వజమెత్తారు. హింసాత్మక చర్యలకు పూనుకోవడం, మాటలతో రెచ్చగొట్టడాన్నే ప్రజారాజ్యం పార్టీ వృత్తిగా పెట్టుకుందని వారు దుయ్యబట్టారు.Source: ఏపీ న్యూస్ | 31 Dec 2008 | 1:49 pm
|