|
నిఘా నీడలో కొత్త సంవత్సర వేడుకలునూతన సంవత్సర వేడుకలు నిఘా నీడలో జరుగనున్నాయి. ముంబై మారణహోమం తర్వాత ఉగ్రవాదులు కొత్త సంవత్సర వేడుకల్లో విధ్వంసానికి పాల్పడే అవకాశం నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోనూ హై అలెర్ట్ ప్రకటించారు.Source: జాతీయ | 31 Dec 2008 | 12:11 pm నాలుగు నగరాల్లో ఎన్.ఎస్.జి కేంద్రాలు: చిదంబరందేశంలో నాలుగు ప్రధాన నగరాల్లో ప్రాథమికంగా జాతీయ భద్రతా కమెండో (ఎన్.ఎస్.జి) కేంద్రాలను నెలకొల్పనున్నట్టు కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం తెలిపారు. ఆయన బుధవారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తీవ్రవాదం/ఉగ్రవాదం మన ముందున్న అతిపెద్ద సవాల్ అని వ్యాఖ్యానించారు.Source: జాతీయ | 31 Dec 2008 | 10:43 am పీఆర్పీ ఆఫీసు ముందు యువజన కాంగ్రెస్ నిరసనప్రజారాజ్యం పార్టీ కార్యాలయం ఎదుట యువజన కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ఆ పార్టీ యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ నేతలపై చేసిన ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపాయి. వీటిపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.Source: ఏపీ న్యూస్ | 31 Dec 2008 | 10:23 am ఫహీమ్-షాబుద్దీన్‌ల పోలీసు కస్టడీ పెంపుఉగ్రవాదులతో సంబంధం ఉందని అనుమానించి అరెస్టు చేసిన ఫహీమ్ అన్సారీ, షాబుద్దీన్‌లను పోలీసులు బుధవారం కోర్టులో హాజరుపరిచారు. వారిద్దరికి వచ్చే 12వ తేదీ వరకు కస్టడీని పొడగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.Source: జాతీయ | 31 Dec 2008 | 10:15 am ప్రతిపక్షంలో కూర్చొంటాం: ముఫ్తీ మహమ్మద్జమ్మూకాశ్మీర్ రాష్ట్ర శాసన సభ ప్రతిపక్ష స్థానం పీపుల్స్ పార్టీ ముఫ్తీ మహమ్మద్ ప్రభుత్వం ఏర్పాటు కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు జమ్మూకాశ్మీర్ రాష్ట్ర శాసన సభలో ప్రతిపక్ష స్థానంలో కూర్చొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధినేత ముఫ్తీ మహమ్మద్ స్పష్టం చేశారు.Source: జాతీయ | 31 Dec 2008 | 8:56 am ప్రజారాజ్యం అధినేతను కలిసిన శత్రుఘ్నసిన్హాప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, బాలీవుడ్ నటుడు శత్రుఘ్నసిన్హా బుధవారం హైదరాబాద్‌లో కలిశారు. భాజపా-ప్రరాపాల మధ్య పొత్తు పెట్టుకునే అంశంపై వీరిద్దరు చర్చించినట్టు సమాచారం. వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం భాజాపా రాష్ట్రంలో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తోంది.Source: ఏపీ న్యూస్ | 31 Dec 2008 | 7:54 am దోపిడీ దొంగలకు బుద్ధి చెప్పండి: పవన్ కళ్యాణ్ప్రజాసేవ ముసుగులో రాష్ట్రాన్ని దోచుకుతింటున్న కాంగ్రెస్ దోపిడీ దొంగల (పాలకులు)కు వచ్చే ఎన్నికల్లో తగినరీతిలో బుద్ధి చెప్పాలని ప్రజారాజ్యం యువజన విభాగమైన యువరాజ్యం అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు.Source: ఏపీ న్యూస్ | 31 Dec 2008 | 6:19 am ఐఎన్ఎస్ విరాట్ పేల్చివేతకు లష్కర్ కుట్రభారత నౌకాదళానికి వెన్నెముకలాంటి యుద్ధ నౌక ఐఎన్ఎస్ విరాట్‌ను పేల్చి వేసేందుకు ఉగ్రవాద సంస్థ లష్కర్-ఇ-తోయిబా సంస్థ కుట్ర పన్నినట్టు అమెరికా నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఈ నౌకకు గట్టి బందోబస్తును కల్పించారు. నౌకా, వైమానికి, కోస్ట్‌గార్డ్, కేరళ పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు.Source: జాతీయ | 31 Dec 2008 | 6:18 am యాసిడ్ దాడి: బీటెక్ విద్యార్థిని స్వప్నిక మృతియాసిడ్ దాడి కేసులో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన బీటెక్ విద్యార్థిని స్వప్నిక మృతి చెందింది. బుధవారం తెల్లవారు జామున 5.20 గంటలకు తుది శ్వాస విడిచినట్టు ఆస్పత్రి వైద్యులు ధృవీకరించారు. ఆమె మృతదేహాన్ని స్వస్థలమైన వరంగల్‌కు తరలించనున్నారు.Source: ఏపీ న్యూస్ | 31 Dec 2008 | 6:17 am
|