ఉగ్రవాద వ్యతిరేక దినంగా జనవరి 1

నవంబర్ నెల 26న జరిగిన ముంబైదాడుల ఘటనలతో దేశం అట్టుడికిన విషయం విదితమే. ఆ నేపధ్యంలో ఇకపై ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీని ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటించలని కేరళ కేథలిక్ సంఘం నిర్ణయించింది.
Source: జాతీయ | 30 Dec 2008 | 12:30 pm

పాక్ రెండు నాల్కల ధోరణి విడనాడాలి: ప్రణబ్

పాకిస్థాన్ అనుసరిస్తున్న రెండు నాల్కల ధోరణిని విడనాడాలని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ మరోసారి హితవుపలికారు. పొరుగు దేశం పాకిస్థాన్‌లో వేళ్ళూనుకున్న తీవ్రవాదం నుంచి అంతర్జాతీయ సమాజ దృష్టిని మళ్లించేందుకే ఆ దేశం ఇలాంటి ఆరోపణలు చేస్తోందని ఆయన ఆరోపించారు.
Source: జాతీయ | 30 Dec 2008 | 12:18 pm

నిబంధనల లోబడి రోడ్‌షోలు అసాధ్యం

రాజకీయ పార్టీల నిర్వహించే రోడ్‌షోలపై హైకోర్టు విధించిన మధ్యంతర స్టేను తొలగించడం పట్ల మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. స్టే తొలగించినప్పటికీ నిబంధనలకు లోబడి వీటిని నిర్వహించాలని హైకోర్టు పేర్కొనడం పట్ల పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతం హైకోర్టుకు డిజిపి సమర్పించిన మార్గదర్శకాల మేరకు రోడ్‌షోలను నిర్వహించడం అసాధ్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Source: ఏపీ న్యూస్ | 30 Dec 2008 | 11:54 am

ఎన్‌సికి కాంగ్రెస్ మద్దతు: ఒమర్ అబ్దుల్లా

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ తమకు మద్దతు ప్రకటించిందని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ఈ విషయాన్ని కూడా కాంగ్రెస్ అధిష్టానం స్పష్టం చేసింది. కాగా, ఆయన మంగళవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ఒమర్ అబ్దుల్లా సమావేశమయ్యారు.
Source: జాతీయ | 30 Dec 2008 | 11:32 am

బాలకృష్ణ ఇంట్లో కాల్పులపై పునర్విచారణ!!

గతంలో సినీ నటుడు బాలకృష్ణ నివాసంలో జరిగిన తుపాకీ కాల్పుల కేసును కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ తిరగతోడింది. ఇందులోభాగంగా ఈ కాల్పులపై పునర్విచారణ జరుపనున్నారు. ఈ మేరకు అనుమతి కోరుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసినట్టు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ప్రసాదరావు వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 30 Dec 2008 | 10:25 am

మరింత విషమించిన స్వప్నిక ఆరోగ్య పరిస్థితి

యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడిన బీటెక్ విద్యార్థిని స్వప్నిక ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ప్రస్తుతం శ్వాస పీల్చుకోవడం చాలా కష్టంగా ఉందని డాక్టర్లు చెప్పారు. అందువల్ల వెంటిలేషన్ ద్వారా కృత్రిమ శ్వాసను అందిస్తున్నారు. యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్వప్నిక ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు.
Source: ఏపీ న్యూస్ | 30 Dec 2008 | 10:14 am

ప్రతిపక్షంలో కూర్చొంటాం: ముఫ్తీ మహమ్మద్

జమ్మూకాశ్మీర్ రాష్ట్ర శాసన సభ ప్రతిపక్ష స్థానం పీపుల్స్ పార్టీ ముఫ్తీ మహమ్మద్ ప్రభుత్వం ఏర్పాటు కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు జమ్మూకాశ్మీర్ రాష్ట్ర శాసన సభలో ప్రతిపక్ష స్థానంలో కూర్చొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధినేత ముఫ్తీ మహమ్మద్ స్పష్టం చేశారు.
Source: జాతీయ | 30 Dec 2008 | 10:04 am

"మర్మయోగి"లో సుస్మితా సేన్..!?

కోలీవుడ్ అగ్రహీరో పద్మభూషణ్ కమల్ హాసన్ చారిత్రాత్మక చిత్రం "మర్మయోగి"లో బాలీవుడ్ సెక్సీతార, మాజీ ప్రపంచ సుందరి సుస్మితా సేన్ కీలక పాత్రను పోషించనుందని కోడంబాక్కం వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఇటీవల "దశావతారం" సినిమాను వీక్షించేందుకు...
Source: వినోదం | 30 Dec 2008 | 6:49 am

ప్రేక్షకులు 'కింగ్' అంటారా...?

అగ్రహీరోల చిత్రాలు విడుదల తక్కువగా ఉన్న ఈ ఏడాదిలో చివరిగా వచ్చిన చిత్రం నాగార్జున "కింగ్". 'ఢీ', 'రెడీ' వంటి చిత్రాలను మైండ్‌గేమ్‌తో ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఎలా తీయవచ్చో నిరూపించిన శ్రీనువైట్ల, 'కింగ్'లోనూ ఆ ప్రయత్నం చేశారు. మొదటి నుంచి నాగార్జున చెబుతున్నట్లు...
Source: వినోదం | 30 Dec 2008 | 6:36 am

రాజకీయ పార్టీలకు ఊరట: రోడ్‌షోలపై స్టే ఎత్తివేత

ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలకు ఊరట కలిగించే వార్త. గతంలో రోడ్‌షోలపై హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేసింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
Source: ఏపీ న్యూస్ | 30 Dec 2008 | 5:55 am

కాంగ్రెస్‌ నుంచి స్పష్టమైన హామీ: ఒమర్

ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ నుంచి స్పష్టమైన హామీని పొందినట్టు నేషనర్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సానుకూల హామీ వచ్చిందన్నారు. అందువల్లే ఢిల్లీకి వచ్చినట్టు, లేకపోతే ఇక్కడకు వచ్చేవాడిని కాదన్నారు.
Source: జాతీయ | 30 Dec 2008 | 5:40 am

సైలెంట్‌గా వుండండి

కొత్తగా విమానమెక్కిన శేఖర్ ఆనందంతో... విమానమంతా కలియదిరుగుతూ...
Source: వినోదం | 30 Dec 2008 | 5:29 am

చాలా దూరం వచ్చేశా

లేడీస్ సీట్లో కూర్చొన్న రాము, రాధ రాగానే లేచి సీటు ఇవ్వబోయాడు...
Source: వినోదం | 30 Dec 2008 | 5:27 am

కర్ణాటకలో పూర్తి మెజారిటీ సాధించిన భాజపా

కర్ణాటకలో ఎనిమిది నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ ఆరు సీట్లను గెలుచుకుంది. దీంతో 224 సీట్లు కలిగిన శాసనసభలో 116 స్థానాలతో సంపూర్ణ మెజారిటీని సాధించింది. కర్ణాటక అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 113 సీట్లు అవసరం.
Source: జాతీయ | 30 Dec 2008 | 5:20 am