|
జమ్మూకాశ్మీర్ ఎన్నికలు: 35 పార్టీలకు శూన్యంజమ్మూకాశ్మీర్ రాష్ట్ర శాసన సభకు ముగిసిన ఎన్నికల్లో 35 పార్టీలు ఒక్క సీటును కూడా గెలుచుకోలేక పోయాయి. మొత్తం 87 స్థానాలు కలిగిన ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఏడు దశల్లో జరిగిన విషయం తెల్సిందే.Source: జాతీయ | 29 Dec 2008 | 10:28 am ప్రజారాజ్యానికి 'చిరంజీవి' సింబల్ చాలు: మెగాస్టార్తమ పార్టీకి ఒకే ఎన్నికల గుర్తు కేటాయించలేక పోయినా, చిరంజీవి అనే సింబల్ చాలని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అభిప్రాయపడ్డారు. అయితే తమకు ప్రజల్లో లభిస్తున్న ఆదరణను చూసి ఉబ్బితబ్బిబ్బులవుతున్నట్టు చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో పీఆర్పీ పార్టీకి చిరంజీవి అనే బ్రాండే (సింబల్) చాలని అన్నారు.Source: ఏపీ న్యూస్ | 29 Dec 2008 | 10:01 am నా మనవడు సతీష్‌కు క్లీన్‌చిట్: మంత్రి కోనేరుబీఫార్మసీ విద్యార్థిని అయేషా హత్య కేసులో తన మనవడు సతీష్‌కు పోలీసులు క్లీన్‌చిట్ ఇచ్చారని మంత్రి కోనేరు రంగారావు స్పష్టం చేశారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌తో కలిసి ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. అయేషా మీరా హత్య కేసులో పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి, తన మనవడు సతీష్‌కు క్లీన్ చిట్ ఇచ్చారని తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 29 Dec 2008 | 9:49 am జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమరే: ఫరూఖ్జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లానే ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ పార్టీ వృద్ధ నేత, ఆయన తండ్రి ఫరూఖ్ అబ్దుల్లా స్పష్టం చేశారు. స్థిరమైన మనస్తత్వంలేని నేతగా పేరుగడించిన ఫరూఖ్ ఆదివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రిగా ఒమర్ ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించారు.Source: జాతీయ | 29 Dec 2008 | 5:57 am పీజేఆర్ ఆత్మ క్షోభిస్తుంది: మర్రి శశిధర్ రెడ్డినాంపల్లిలోని భీమ్‌రావ్ బాడ బస్తీని తొలగించడం దురదృష్టకర సంఘటనగా సనత్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ బస్తీని తొలగించేందుకు గత ప్రభుత్వాలు ఎన్నోసార్లు ప్రయత్నించాయని, దీన్ని తాను పీజేఆర్‌లు చేతులు కలిపి అడ్డుకున్నామని చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 29 Dec 2008 | 5:44 am కరీంనగర్‌లో విపక్ష నేతల అరెస్టులుకరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ మినహా మిగిలిన రాజకీయ పార్టీలకు చెందిన నేతలను పోలీసులు రాత్రికి రాత్రే అరెస్టు చేశారు. గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్న విషయం తెల్సిందే.Source: ఏపీ న్యూస్ | 29 Dec 2008 | 5:35 am ఢిల్లీకి వెళ్లిన ప్రజారాజ్యం అధినేత చిరంజీవిప్రజారాజ్యం పార్టీ అధినేత, సినీ నటుడు చిరంజీవి సోమవారం దేశ రాజధాని న్యూఢిల్లీకి వెళ్లారు. పార్టీకి ఎన్నికల గుర్తు కేటాయించాలని కోరుతూ ఆయన కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతారు. ఇందుకోసం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో చిరంజీవి సమావేశమవుతారు.Source: ఏపీ న్యూస్ | 29 Dec 2008 | 5:24 am పాకిస్థాన్‌కు అల్టిమేటం జారీ చేయలేదు: ప్రణబ్తమ భూభాగంలో ఉన్న ఉగ్రవాద కార్యకలాపాను నిర్మూలించేందుకు పొరుగు దేశం పాకిస్థాన్‌కు ఎలాంటి అల్టిమేటం జారీ చేయలేదని కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. అయితే గతంలో ఆ దేశ పాలకులు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉగ్రవాదులను ఏరివేయాలని మాత్రం సూచించినట్టు ఆయన వివరణ ఇచ్చారు.Source: జాతీయ | 29 Dec 2008 | 4:35 am ప్రధాని పదవి: రాహుల్ వైపే ప్రజలు మొగ్గుభావి ప్రధానిగా కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ వైపే దేశ ప్రజలు అభివర్ణిస్తున్నారు. ఆయన వైపే ఎక్కువ మంది ప్రజలు మొగ్గుచూపుతున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలల్లో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే ప్రధాని పీఠాన్ని రాహుల్ గాంధీ చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.Source: జాతీయ | 29 Dec 2008 | 4:24 am
|