జమ్మూకాశ్మీర్ ఎన్నికలు: అతిపెద్ పార్టీగా ఎన్‌సి

జమ్మకాశ్మీర్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇవ్వలేదు. ఫలితంగా.. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో మరోమారు హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. అయితే కేంద్ర మాజీ మంత్రి ఓమర్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్.సి) 27 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది.
Source: జాతీయ | 28 Dec 2008 | 12:13 pm

భీమ్‌రావ్‌బాడ బస్తీవాసులకు న్యాయం: చంద్రబాబు

గాంధీ భవన్ విస్తరణలో భాగంగా తీవ్ర అన్యాయానికి గురైన భీమ్‌రావ్‌బాడ బస్తీ వాసులకు తమ పార్టీ పూర్తి న్యాయం చేస్తుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ బాధితులందరూ ఆదివారం చంద్రబాబు నాయుడిని కలిసి తమ గోడును విన్నవించుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 28 Dec 2008 | 12:03 pm

బెంగుళూరులో విద్యార్థి కాల్చివేత

కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో భద్రతా దళాలు ఒక విద్యార్థిని కాల్చి చంపాయి. అనుమానాస్పద రీతిలో బ్రిగేడియర్ నివాసంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన మహ్మద్ ముకరం అనే విద్యార్థిని ఆదివారం ఉదయం కాల్చి చంపాయి.
Source: జాతీయ | 28 Dec 2008 | 11:53 am

కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వ ఏర్పాటు: ఒమర్ అబ్దుల్లా

కాంగ్రెస్‌ పార్టీతో కలిసి జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా సూచన ప్రాయంగా వెల్లడించారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్ర శాసనసభకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీ అత్యధిక సీట్లు (26) గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెల్సిందే.
Source: జాతీయ | 28 Dec 2008 | 10:17 am

ఘనంగా కాంగ్రెస్ 123 వ్యవస్థాపక దినోత్సవం

కాంగ్రెస్ పార్టీ 123వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, కేంద్ర మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 28 Dec 2008 | 10:07 am

నెల్లూరు జిల్లాలో 4వ తేదీ నుంచి మెగా పర్యటన

ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి జనవరి నాలుగో తేదీ నుంచి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. నాలుగో తేదీ నుంచి మూడు రోజుల పాటు చిరంజీవి ప్రజా అంకిత యాత్ర సాగుతుంది. ఈ జిల్లా పర్యటన ముగిసిన తర్వాత ప్రకాశం జిల్లా పర్యటన చేపడుతారు.
Source: ఏపీ న్యూస్ | 28 Dec 2008 | 9:33 am

ఏప్రిల్-మే నెలలో లోక్‌సభ ఎన్నికలు: సీఈసీ

వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలలో లోక్‌సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఎన్.గోపాలస్వామి వెల్లడించారు. ఆయన ఆదివారం మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికలు అనేకంగా వచ్చే ఏప్రిల్-మే నెలల్లో జరుగవచ్చన్నారు.
Source: జాతీయ | 28 Dec 2008 | 5:52 am

జమ్మూకాశ్మీర్‌లో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు

జమ్మూకాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం ప్రారంభమైంది. ప్రాథమిక ఫలితాల ట్రెండ్ మేరకు పిడిపి అధిక స్థానాలతో ముందంజలో కొనసాగుతుండగా, భారతీయ జనతా పార్టీ పరిస్థితి కూడా మెరుగ్గా వుంది. అధికార కాంగ్రెస్ పార్టీ పరాజయం దిశగా పయనిస్తోంది.
Source: జాతీయ | 28 Dec 2008 | 5:02 am