|
పరువు తీసిన ఎమ్మెల్యే: మాయా ఆవేదనతన పుట్టిన రోజు పేరుతో చందాలు వసూలు చేయడాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా హత్య కేసులో పట్టుబడిన ఎమ్మెల్యే తన పరువు, ప్రతిష్టలను బజారుకీడ్చారని ఆమె వాపోయారు. మాయావతి పుట్టిన రోజును పురస్కరించుని ఎమ్మెల్యే శేఖర్ చందాలకు శ్రీకారం చుట్టిన విషయం తెల్సిందే.Source: జాతీయ | 25 Dec 2008 | 12:20 pm బాలయ్య మాటలను వక్రీకరించిన మీడియా: తెదేపాసినీ నటుడు బాలకృష్ణ మాటలను మీడియా వక్రీకరించిందని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కె.ఎర్రన్నాయుడు అభిప్రాయపడ్డారు. కాకినాడలో సెజ్ బాధితులకు అండగా నిలిచేందుకు ఆయన బుధవారం బాధిత ప్రాంతాల్లో పర్యటించారు.Source: ఏపీ న్యూస్ | 25 Dec 2008 | 11:56 am 27న హైదరాబాద్‌కు రానున్న రాష్ట్రపతిఈనెల 27వ తేదీన రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ హైదరాబాద్‌కు రానున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా జంట నగరాల్లో గట్టి భద్రతను కల్పిస్తున్నారు. ముఖ్యంగా నగరంలోని కొన్నిచోట్ల ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈమేరకు నగర పోలీస్ కమిషనర్ బి.ప్రసాదరావు ఉత్తర్వులు జారీ చేశారు.Source: ఏపీ న్యూస్ | 25 Dec 2008 | 11:12 am యువరాజ్యం అధినేత పర్యటన వాయిదాయువరాజ్యం అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ తన రాజకీయ తొలి పర్యటనను వాయిదా వేసుకున్నారు. ప్రజారాజ్యం పార్టీ యువజన విభాగం (యువరాజ్యం) అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ నియమితులైన విషయం తెల్సిందే.Source: ఏపీ న్యూస్ | 25 Dec 2008 | 8:14 am ప్రజారాజ్యం తీర్థం పుచ్చుకోనున్న కళాతెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీనియర్ నేత, ఉణుకూరు శాసనసభ్యుడు కిమిడి కళా వెంకట్రావు ప్రజారాజ్యం పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు ఆయన సన్నిహితులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సమాచారం. ఇందుకోసం ఈనెల 29వ తేదీని ముహుర్తంగా నిర్ణయించుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 25 Dec 2008 | 7:52 am చంద్రయాన్-2 డిజైన్ సిద్ధం: మాధవన్ నాయర్భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 డిజైనింగ్ పూర్తయిందని బుధవారం ప్రకటించింది. దీన్ని వచ్చే 2012లో కక్ష్యలోకి ప్రవేశపెడుతామని ఇస్రో తెలిపింది. చంద్రయాన్-2 డిజైన్ పూర్తయింది. వచ్చే 2012లో కక్ష్యలోకి ప్రవేశపెడతామని భావిస్తున్నట్టు ఇస్రో ఛైర్మన్ జి.మాధవన్ నాయర్ తెలిపారు.Source: జాతీయ | 25 Dec 2008 | 5:47 am జమ్మూకాశ్మీర్‌లో ముగిసిన ఎన్నికలుజమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో జరిగిన ఏడు దశల ఎన్నికల పోలింగ్ ముగిసింది. బుధవారం జరిగిన ఆఖరి దశ పోలింగ్ మాత్రం తక్కువ శాతంలో నమోదైంది. ఈ దశ పోలింగ్‌లో చెదురుముదురు సంఘటనలు చోటు చేసుకున్నాయి. వేర్పాటువాదులు పలు చోట్ల పోలింగ్‌కు ఆటంకం కలిగించారు. ఇలాంటి వారిపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపాయి.Source: జాతీయ | 24 Dec 2008 | 1:09 pm
|