జమ్మూకాశ్మీర్‌లో ముగిసిన ఎన్నికలు

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో జరిగిన ఏడు దశల ఎన్నికల పోలింగ్ ముగిసింది. బుధవారం జరిగిన ఆఖరి దశ పోలింగ్‌ మాత్రం తక్కువ శాతంలో నమోదైంది. ఈ దశ పోలింగ్‌లో చెదురుముదురు సంఘటనలు చోటు చేసుకున్నాయి. వేర్పాటువాదులు పలు చోట్ల పోలింగ్‌కు ఆటంకం కలిగించారు. ఇలాంటి వారిపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపాయి.
Source: జాతీయ | 24 Dec 2008 | 1:09 pm

డెకాయిట్లను మించిన కాంగ్రెస్ నేతలు: బాబు

రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు డెకాయిట్లను మించి పోయారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రపదజాలంతో ఆరోపించారు. ఇదే విషయాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వ్యక్తం చేసిన విషయం తెల్సిందే.
Source: ఏపీ న్యూస్ | 24 Dec 2008 | 12:45 pm

సీమలో బీడు భూములకు సాగునీరు: వైఎస్

గండికోట రిజర్వాయర్ నుంచి అనుసంధానం చేసిన కాలువల ద్వారా జమ్మలమడుగుతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లోని బీడు భూములకు సాగునీరు అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రకటించారు.
Source: ఏపీ న్యూస్ | 24 Dec 2008 | 12:31 pm

కాకినాడ సెజ్ బాధితులకు హైకోర్టు అండ

రైతుల నుంచి బలవంతంగా భూములను సేకరించరాదని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పరిసర మండలాల్లో పోలీసుల అండతో బలవంతపు భూసేకరణకు ప్రభుత్వం పూనుకుందని గత రెండు రోజులుగా మీడియాలో కథనాలు వస్తున్న విషయం తెల్సిందే. ఇలాంటి బాధితులకు హైకోర్టు అండగా నిలిచింది.
Source: ఏపీ న్యూస్ | 24 Dec 2008 | 12:03 pm

పార్టీ ఆదేశిస్తే.. ఎక్కడనుంచైనా పోటీ: బాలకృష్ణ

పార్టీ అధిష్టానం ఆదేశిస్తే.. ఎక్కడ నుంచైనా ఎవరిపైనైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్ట సినీ నటుడు బాలకృష్ణ ప్రకటించారు. ఒక సినిమా షూటింగ్ నిమిత్తం రాజమండ్రికి బుధవారం వచ్చారు. ఆయనకు విమానాశ్రయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు ఘన స్వాగతం పలికారు.
Source: ఏపీ న్యూస్ | 24 Dec 2008 | 11:56 am

నష్టాల బాటలో సెన్సెక్స్: 118 పాయింట్ల పతనం

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ బుధవారం కూడా నష్టాల బాటలోనే పయనించింది. అంతర్జాతీయ మార్కెట్‌ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడంతో 60 పాయింట్ల పతనమై 9626 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం కూడా ఎక్కువ భాగం నష్టాల్లోనే కొనసాగింది.
Source: Yahoo! Telugu: News | 24 Dec 2008 | 11:29 am

మరిన్ని సాక్ష్యాలు కావాలని షరీఫ్ డిమాండ్

పాక్ సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామ్య పార్టీ అధినేత, మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ముంబయి ఉగ్రవాద దాడుల్లో భారత భద్రతా దళాలకు పట్టుబడిన కసాబ్ విషయంలో మాటమార్చారు. గత వారం కసాబ్ పాకిస్థానీయుడైనని చెప్పిన, ఆయన ప్రస్తుతం
Source: Yahoo! Telugu: News | 24 Dec 2008 | 11:20 am

ఫోర్స్ ఇండియాపై కార్తికేయన్ నిరాసక్తత

ఫోర్స్ ఇండియాలో చేరాలని తాను ఎన్నడూ ఆసక్తి చూపలేదని భారత్‌కు చెందిన ఫార్ములా వన్ డ్రైవర్ నరేన్ కార్తికేయన్ పేర్కొన్నాడు. పార్ములా వన్‌లో డ్రైవింగ్ చేసే సామర్థ్యం భారతీయుల్లో ఎవరికీ లేదని ఫోర్స్ ఇండియా సహ యజమాని విజయ్ మల్యా పేర్కొనడాన్ని...
Source: Yahoo! Telugu: News | 24 Dec 2008 | 11:05 am

26న మార్కెట్‌లోకి మస్కా ఆడియో

రామ్, షీలా జంటాగా నటిస్తున్న చిత్రం "మస్కా". బి.గోపాల్ దర్శకుడు. ఈ సినిమా ఆడియోను డిసెంబరు 25న ఆవిష్కరించనున్నామని నిర్మాత ఎంఎస్ రాజు తెలిపారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో ఈ నెల 26న మార్కెట్‌లోకి వస్తుందని చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Dec 2008 | 11:02 am

26న మార్కెట్‌లోకి మస్కా ఆడియో

రామ్, షీలా జంటాగా నటిస్తున్న చిత్రం "మస్కా". బి.గోపాల్ దర్శకుడు. ఈ సినిమా ఆడియోను డిసెంబరు 25న ఆవిష్కరించనున్నామని నిర్మాత ఎంఎస్ రాజు తెలిపారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో ఈ నెల 26న మార్కెట్‌లోకి వస్తుందని చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 24 Dec 2008 | 11:02 am

పాక్ న్యాయ సాయం అర్థిస్తున్న ఉగ్రవాది కసబ్

ముంబైలో జరిగిన దాడుల్లో పట్టుబడిన ఉగ్రవాది అజ్మల్ అమీర్ కసబ్ పాకిస్థాన్ న్యాయ సాయాన్ని అర్థిస్తున్నాడు. ఒక పైపు కసబ్ తమ దేశీయుడు కాదని పాక్ పాలకులు వాదిస్తుంటే కసబ్ మాత్రం పాక్ తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. ఇందులోభాగంగా భారత్‌లో ఉన్న పాకిస్థాన్ రాయబారిని కలుసుకునేలా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాడు.
Source: జాతీయ | 24 Dec 2008 | 10:54 am

మరో ఆరు నెలల్లో కడప జిల్లాకు కృష్ణా జలాలు

మరో ఆరు నెలల్లో కడప జిల్లాకు కృష్ణా జలాలు అందగలవని ముఖ్యమంత్రి వైఎస్ హామీ ఇచ్చారు. కృష్ణా జలాలతో రాయల సీమను సస్యశ్యామలం చేసి, సిరుల సీమగా మారుస్తానని చెప్పారు. రాయలసీమకు జలాలు రప్పించే విషయంలో ఖర్చుకు వెనకాడబోమన్నారు.
Source: Yahoo! Telugu: News | 24 Dec 2008 | 10:51 am

2 వేల ప్రింట్లతో విడుదలకు సిద్ధమైన గజనీ

గీతా ఆర్ట్స్ పతాకంపై రూపొందిన హిందీ "గజనీ" ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 25న విడుదలకు సిద్ధమైంది. 35 దేశాల్లో 2000 ప్రింట్లతో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. చిత్ర సమర్పకుడు అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఇకపై కూడా గీతా ఆర్ట్స్
Source: Yahoo! Telugu: Entertainment | 24 Dec 2008 | 10:42 am

జనవరి 6 వరకు కసాబ్ కస్టడీ పొడిగింపు

ముంబయి ఉగ్రవాద దాడుల కేసులో అరెస్టయిన అజ్మల్ అమీర్ కసాబ్ కస్టడీని జనవరి 6 వరకు పొడిగించారు. ముంబయి పోలీసు క్రైం బ్రాంచ్ కార్యాలయంలో జరిగిన విచారణలో న్యాయమూర్తి కసాబ్ పోలీసు కస్టడీని జనవరి- 6 వరకు పొడిగిస్తూ
Source: Yahoo! Telugu: News | 24 Dec 2008 | 10:01 am

సెజ్ కేసుపై విచారణ జనవరి 20కి వాయిదా

కాకినాడ సెజ్ బాధితులు పెట్టుకున్న ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణను రాష్ట్ర హైకోర్టు జనవరి 20కి వాయిదా వేసింది. మంగళవారం దాఖలైన ఈ పిటిషన్‌పై బుధవారం ఉదయం విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
Source: Yahoo! Telugu: News | 24 Dec 2008 | 9:58 am

సంచలనం సృష్టించిన యూపీ ఇంజనీరు హత్య

ఉత్తరప్రదేశ్‌లో ప్రజాపనుల శాఖకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హత్య బుధవారం సంచలనం సృష్టించింది. స్థానిక అధికార బీఎస్పీ ఎమ్మెల్యే అనుచరులుగా భావిస్తున్న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంజనీరును కొట్టి చంపారు. కాన్పూర్‌కు వంద
Source: Yahoo! Telugu: News | 24 Dec 2008 | 9:50 am

జాతీయ జిమ్నాస్టిక్ కోచ్ గిరిరాజ్ దుర్మరణం

రాజధానిలోని కొత్త పేట వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో జాతీయ జిమ్నాస్టిక్ కోచ్ ఏవీ గిరిరాజ్ దుర్మరణం చెందారు. కొత్త పేట మార్కెట్ ముందు లారీ ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే కన్నుమూశారు.
Source: Yahoo! Telugu: News | 24 Dec 2008 | 9:37 am

లోక్‌సత్తా సంస్థాగత ఎన్నికల ప్రక్రియ షురూ

లోక్‌సత్తా పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. పార్టీలో అధ్యక్ష పదవి కోసం జరుగుతున్న ఎన్నికలకు ఇప్పటివరకు ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు.
Source: Yahoo! Telugu: News | 24 Dec 2008 | 9:33 am

"కొంచెం ఇష్టం కొంచెం కష్టం" లోగో ఆవిష్కరణ

"బాయ్స్" బాయ్ సిద్ధార్థ, "హ్యాపీడేస్" ఫేం తమన్నా జంటగా నటిస్తోన్న చిత్రం "కొంచెం ఇష్టం కొంచెం కష్టం". కిషోర్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నారు. బ్రహ్మానందం, సిద్ధార్థ ఈ సినిమా లోగోను రామానాయుడు స్టూడియోలో...
Source: వినోదం | 24 Dec 2008 | 6:04 am

వాళ్ళెందుకు భయపడతారు?

"నేను జోక్స్ చెబితే మీరు ఫకఫకా నవ్వేస్తారు కదా..! మరి పత్రికల వాళ్ళు మాత్రం నేను పంపిన జోక్స్‌ను తిరిగి పంపించేస్తున్నారు ఎందుకని..?" భర్తను అడిగింది భార్య...
Source: వినోదం | 24 Dec 2008 | 5:40 am

ఆ రాత్రే దొంగలు పడ్డారు..!

"మీ కంపెనీకి వాచ్‌మెన్ కావాలని ప్రకటన ఇచ్చారు కదా..! రెస్పాన్స్ ఎలా వుంది..?"
Source: వినోదం | 24 Dec 2008 | 5:38 am

ముంబై 'అమరు'లకు అశోకచక్రకు సిఫార్సు

ముంబైపై ఉగ్రవాదుల దాడిని తిప్పికొడుతూ వీరమరణం పొందిన 12 మంది పోలీసు సిబ్బందికి 'అశోకచక్ర' పతకాలను ప్రదానం చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ మేరకు సిఫార్సు లేఖను కేంద్ర హోం శాఖకు పంపినట్టు ముంబై పోలీసు కమిషనర్ హాసన్ గఫూర్ మంగళవారం తెలిపారు.
Source: జాతీయ | 24 Dec 2008 | 5:22 am

ముంబైపై దాడి: పాకిస్థాన్‌కు భారత్ డెడ్‌లైన్!

ముంబైపై ఉగ్రవాదులు విసిరిన పంజాకు భారత్ తీవ్రంగానే స్పందిస్తోంది. పొరుగు దేశం పాకిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది. ముంబైపై దాడులకు తెగబడిన ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకునేందుకు పాకిస్థాన్‌కు ఖచ్చితంగా నెల రోజుల గడువు విధించినట్టు అమెరికా నిఘా వ్యవహారాల ప్రచురణ సంస్థ స్ట్రాట్‌ఫర్ వెల్లడించింది.
Source: జాతీయ | 24 Dec 2008 | 4:57 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 24 Dec 2008 | 3:41 am

డిసెంబరు 24, 2008 కార్యక్రమాలు

06:00 ఆరాధన 06:30 అన్నదాత 07:00 ఈటీవీ న్యూస్ 07:30 ప్రియమైన నీకు 08:00 టాలీవుడ్ టైమ్ 09:00 ఈనాడు సినిమా 12:00 అభిరుచి 12:30 భారతీ 13:00 స్టార్ మహిళ 14:00 విజయం 14:30 జై హనుమాన్ 15:00 ప్రేమ మందిరం
Source: Yahoo! Telugu: Entertainment | 24 Dec 2008 | 3:41 am

కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం లోగో ఆవిష్కరణ

సిద్ధార్థ, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం "కొంచెం ఇష్టం కొంచెం కష్టం". కిషోర్ కుమార్ దర్శకుడు. ఆయనకు ఇదే తొలి చిత్రం. నల్లమలుపు బుజ్జి నిర్మాత. ఈ సినిమా లోగో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం రాత్రి రామానాయుడు స్టూడియోలో జరిగింది
Source: Yahoo! Telugu: Entertainment | 23 Dec 2008 | 1:15 pm

సత్యమేవజయతే పాట చిత్రీకరణ

రాజశేఖర్, సంజన, నీతుచంద్ర హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "సత్యమేవజయతే". సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎం.సత్యనారాయణ ఈ చిత్రంలో ముఖ్యమంత్రిగా నటిస్తుండటం గమనార్హం. జీవిత రాజశేఖర్ దర్శకత్వంలో శివానీ
Source: Yahoo! Telugu: Entertainment | 23 Dec 2008 | 1:15 pm

అజయ్ హీరోగా సారాయి వీర్రాజు

విలన్‌గా పలు చిత్రాల్లో నటించి, మంచి నటుడిగా గుర్తింపు పొందిన అజయ్ "సారాయి వీర్రాజు"తో హీరోగా మారుతున్నాడు. రాజమౌళి దగ్గర పనిచేసిన డీఎస్ కణ్ణన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం పోస్టర్లు, బ్యానర్లను
Source: Yahoo! Telugu: Entertainment | 23 Dec 2008 | 1:15 pm