|
పాకిస్థాన్‌కు సరిపడ ఆధారాలిచ్చాం: ప్రణబ్ముంబైపై ఉగ్రవాదుల దాడికి సంబంధించి పాకిస్థాన్‌కు అవసరమైన, సరిపడా ఆధారాలను సమర్పించామని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. అయినప్పటికీ పాక్ పాలకులు మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు.Source: జాతీయ | 21 Dec 2008 | 9:08 am ఉగ్రవాదుల గుర్తింపుకు సాయం: ఇంటర్పోల్ముంబైపై దాడి చేసిన ఉగ్రవాదులను గుర్తించేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తమ వంతు కృషి చేస్తామని ఇంటర్‌పోల్ అధినేత రోనాల్డ్ నోబెల్ వెల్లడించారు. ప్రస్తుతం భారత్‌కు వచ్చిన ఆయన శనివారం కేంద్ర హోమంత్రి పి.చిదంబరంతో సమావేశమయ్యారు.Source: జాతీయ | 21 Dec 2008 | 8:56 am తెరాస రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలుతెలంగాణా పార్టీకి చెందిన ఐదుగురు అసమ్మతి ఎమ్మెల్యేలు తమ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖలను సభాపతి కె.సురేష్ రెడ్డికి ఆదివారం సమర్పించారు.Source: ఏపీ న్యూస్ | 21 Dec 2008 | 8:49 am వచ్చే ఏప్రిల్ వరకు సైన్యానికి సెలవులు రద్దు!ముంబై మారణహోమంపై కేంద్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ దాడులకు పాక్ కేంద్రంగా రూపకల్పన సాగినట్టు నిఘా వర్గాలు తేల్చాయి. దీంతో అంతర్జాతీయ సమాజం మూలంగా పాక్‌పై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. అయితే పాక్ పాలకులు అనుసరిస్తున్న వైఖరికి ఎవరికీ మింగుడుపడటం లేదు.Source: జాతీయ | 21 Dec 2008 | 8:03 am గోవాలో కొత్త సంవత్సర బీచ్ పార్టీలు నిషేధందేశ వాణిజ్య రాజధాని ముంబైపై ఉగ్రవాదుల మారణహోమం ప్రభావం నూతన సంవత్సర సంబరాలపై కూడా పడింది. దేశంలో అతి సుందరమైన బీచ్‌గా పేరొందిన గోవా బీచ్‌లో నూతన సంవత్సర వేడుకలు అత్యంత వైభంగా జరుగుతాయి. అయితే ఈ దఫా బీచ్ పార్టీలపై గోవా ప్రభుత్వం నిషేధం విధించింది.Source: జాతీయ | 21 Dec 2008 | 7:31 am ప్రజారాజ్యంలో చేరిన వంగవీటి రాధాకృష్ణ జిల్లా కేంద్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీకి విజయవాడలో పట్టుగొమ్మలాంటి వంగవీటి రాధా పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆయన మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆదివారం ఆయన మెగాస్టార్ సమక్షంలో ప్రరాపా తీర్థం పుచ్చుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 21 Dec 2008 | 6:50 am సంపాదనకు లైసెన్సుగా రాజకీయాలు: చిరంజీవిదేశంలో తెల్లదొరల పాలన ముగిసినా.. స్వయం పాలన వచ్చినా మన జీవితాల్లో మాత్రం మార్పు రాలేదు. ధనార్జనే ధ్యేయంగా నేతలు అధికారంలోకి వస్తున్నారు. తమ సంపాదనకు ఒక లైసెన్సుగా రాజకీయలను వాడుకుంటున్నారు. అలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజారాజ్యం పార్టీ అధినేత, సినీ నటుడు చిరంజీవి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.Source: ఏపీ న్యూస్ | 21 Dec 2008 | 6:34 am ముంబై నక్షత్ర హోటల్లో పాకిస్థానీయులకు ప్రవేశం నిషిద్ధంఉగ్రవాదుల దాడులతో అతలాకుతలమైన ముంబై మహానగరంలోని స్టార్ హోటల్లో పాకిస్థానీయులకు ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్టు ట్రైడెంట్ హోటల్ అధ్యక్షుడు రతన్ కేశ్వాని పేర్కొన్నారు.Source: జాతీయ | 20 Dec 2008 | 2:15 pm
|