|
ముంబై నక్షత్ర హోటల్లో పాకిస్థానీయులకు ప్రవేశం నిషిద్ధంఉగ్రవాదుల దాడులతో అతలాకుతలమైన ముంబై మహానగరంలోని స్టార్ హోటల్లో పాకిస్థానీయులకు ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్టు ట్రైడెంట్ హోటల్ అధ్యక్షుడు రతన్ కేశ్వాని పేర్కొన్నారు.Source: జాతీయ | 20 Dec 2008 | 2:15 pm అమెరికా తరహా చర్యలు చేపట్టాలి: యశ్వంత్తీవ్రవాదులకు అడ్డాగా మారిన ఆఫ్గనిస్థాన్‌పై అమెరికా వైమానికి దాడులు జరిపిందని, అలాంటి తరహా చర్యలనే పాకిస్థాన్‌పై భారత్ చేపట్టాలని భారతీయ జనతా పార్టీ సూచించింది.Source: జాతీయ | 20 Dec 2008 | 10:43 am తెరాస అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామా!తెలంగాణా రాష్ట్ర సమితికి చెందిన అసమ్మతి ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. మొత్తం 11 మంది ఎమ్మెల్యేలలో ఒకరి తర్వాత ఒకరు రాజీనామా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు అసమ్మతి ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాస రావు చేసిన వ్యాఖ్యలు మరింత బలం చేకూరుతున్నాయి.Source: ఏపీ న్యూస్ | 20 Dec 2008 | 9:54 am ప్రతి పేదవాడికి గూడు కల్పిస్తాం: ముఖ్యమంత్రిరాష్ట్రంలోని ప్రతి పేదవాడికి సొంతింటి కలను సాకారం చేయడమే తమ అంతిమ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ఉద్ఘాటించారు. శనివారం ఆయన అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులోభాగంగా కురుగుంటలో ఇందిరమ్మ విగ్రహాన్ని, ఇందిర ఇళ్ళను ఆయన ప్రారంభించారు.Source: ఏపీ న్యూస్ | 20 Dec 2008 | 9:31 am అవినీతి మంత్రుల భాగోతంపై ప్రభుత్వ ఆరా!మత్య్సు శాఖ ఈఈ సూర్యనారాయణ అవినీతి భాగోతంలో రాష్ట్ర మంత్రుల పాత్రపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఈ అవినీతి అక్టోపస్ వ్యవహారంపై మంత్రివర్గంలో మనస్పర్ధలు నెలకొన్నాయి. ఒక్కో మంత్రి ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.Source: ఏపీ న్యూస్ | 20 Dec 2008 | 8:40 am ఒంటరి పోరుకు ప్రజారాజ్యం సిద్ధం: జోగయ్యవచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేసేందుకు సైతం తమ పార్టీ సిద్ధంగా ఉందని ప్రజారాజ్యం పార్టీ సీనియర్ నేత హరిరామ జోగయ్య స్పష్టం చేశారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా నవీపేట మండలానికి వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ వామపక్షాలతో పొత్తుకు ప్రజారాజ్యం వేచి చూసినప్పటికీ అది ఫలించలేదన్నారు.Source: ఏపీ న్యూస్ | 20 Dec 2008 | 7:59 am తెదేపాను వీడే ప్రసక్తే లేదు: వేణుగోపాలాచారితెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఈయన గత కొంత కాలంగా అధిష్టానంపై అసంతృప్తిగా ఉంటున్నట్టు సమాచారం.Source: ఏపీ న్యూస్ | 20 Dec 2008 | 7:46 am భారత్‌కు యురేనియం సరఫరా: కజకిస్థాన్యురేనియం నిల్వలు పుష్కలంగా ఉన్న దేశాల్లో కజకిస్థాన్ ఒకటి. అయితే భారత్‌కు యురేనియంను సరఫరా చేసేందుకు గతంలో పలు ఆంక్షలు ఉండేవి. భారత్-అమెరికా అణు ఒప్పందం నేపథ్యంలో అణు సరఫరా గ్రూపు (ఎన్ఎస్‌జి) దేశాలు భారత్‌కు అనుకూలంగా కీలక నిర్ణయం తీసుకున్నాయి.Source: జాతీయ | 20 Dec 2008 | 7:23 am నవాజ్ షరీఫ్ వ్యాఖ్యలను స్వాగతించిన సిబాల్ముంబై దాడుల్లో సజీవంగా పట్టుబడిన ఉగ్రవాది అజ్మల్ కసబ్ తమ దేశీయుడేనని మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుండబద్ధలు కొట్టినట్టు ప్రకటించడం పట్ల కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖామంత్రి కపిల్ సిబాల్ వర్షం వ్యక్తం చేశారు. అజ్మల్ పాకిస్థాన్ జాతీయుడే అని పాక్ మాజీ ప్రధాని షరీఫ్ చేసిన ప్రకటనను తాము స్వాగిస్తున్నట్టు చెప్పారు.Source: జాతీయ | 20 Dec 2008 | 5:25 am గెహ్లాట్ మంత్రివర్గంలో 11 మందికి చోటురాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈనెల ఎనిమిదో తేదీన వెలువడిన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుని విజయం సాధించిన విషయం తెల్సిందే. మొత్తం 200 సీట్లున్న రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ 99 సీట్లను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది.Source: జాతీయ | 20 Dec 2008 | 4:54 am అన్ని అవకాశాలను పరిశీలిస్తాం: ప్రణబ్దేశ ప్రయోజనాను కాపాడుకునేందుకు, భవిష్యత్‌లో తలెత్తే ఉపద్రవాల నుంచి ప్రజలను రక్షించుకునేందుకు మన ముందున్న అన్ని అవకాశాలను పరిశీలిస్తామని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. ఒక దేశం ఇచ్చిన వాగ్ధానాన్ని నిలుపుకోలేక పోతే.. ఇంతకు మించిన గత్యంతరం ఏముందని ఆయన ప్రశ్నించారు.Source: జాతీయ | 20 Dec 2008 | 4:38 am ఈ జీవితం ప్రజాసేవకే అంకితం: చిరంజీవిమూడు దశాబ్దాల పాటు గుండెలపై పెట్టుకుని పోషించిన రాష్ట్ర ప్రజానీకానికి తన వంతు సేవ చేయడానికే రాజకీయ రంగ ప్రవేశం చేసినట్టు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి చెప్పుకొచ్చారు. నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం (రెండోరోజు) చౌటుప్పల్‌లో జరిగిన ప్రజా అంకిత సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.Source: ఏపీ న్యూస్ | 20 Dec 2008 | 4:18 am
|