ఈ జీవితం ప్రజాసేవకే అంకితం: చిరంజీవి

మూడు దశాబ్దాల పాటు గుండెలపై పెట్టుకుని పోషించిన రాష్ట్ర ప్రజానీకానికి తన వంతు సేవ చేయడానికే రాజకీయ రంగ ప్రవేశం చేసినట్టు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి చెప్పుకొచ్చారు. నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం (రెండోరోజు) చౌటుప్పల్‌లో జరిగిన ప్రజా అంకిత సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
Source: ఏపీ న్యూస్ | 19 Dec 2008 | 12:11 pm

ఎస్సీ వర్గీకరణకు ముఖ్యమంత్రి వైఎస్ హామీ

ఎస్సీ కులాల వారిని గ్రూపులుగా (వర్గీకరణ) విభజించేందుకు కృషి చేస్తానని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చినట్టు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వెల్లడించింది. ఎస్సీ వర్గీకరణపై ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద సామూహిక ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న కార్యకర్తలకు సంఘీభావం తెలుపుతూ మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి శుక్రవారం ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించింది.
Source: ఏపీ న్యూస్ | 19 Dec 2008 | 12:10 pm

హుస్సేన్ సాగర్ ప్రక్షాళన పనులకు మోక్షం

రాష్ట్ర రాజధానికే తలమానికమైన హుస్సేన్ సాగర్‌ ప్రక్షాళన పనులకు ఎట్టేకలకు మోక్షం లభించింది. సాగర్‌ నీటి ప్రక్షాళనలో కీలకమైన ఎస్టీపీల నిర్మాణ టెండర్లు ఖరారయ్యాయి. ముందుగా పికెట్‌ నాలాపై మురుగునీటి శుద్ధి కర్మాగార నిర్మాణ పనులు కొనసాగుతుండగా, ఖైరతాబాద్‌ ఫ్లై ఓవర్‌ పక్కనున్న 20 ఎంఎల్‌డీ కర్మాగారం సామర్థ్యం పెంపు పనులకు కాంట్రాక్టర్‌ ఎంపిక పూర్తయింది.
Source: ఏపీ న్యూస్ | 19 Dec 2008 | 12:06 pm

తెదేపాకు మరో ఇద్దరు సీనియర్ల గుడ్‌బై!?

ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత కె.వేణుగోపాల్ చారితో పాటు మరో నేత కళా వెంకట్రావు పార్టీకి గుడ్‌బై చెప్పనున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి.
Source: ఏపీ న్యూస్ | 19 Dec 2008 | 9:59 am

యాసిడ్ అమ్మకాలపై వివరణ కోరిన హైకోర్టు

యాసిడ్‌ అమ్మకాలపై రాష్ట్ర హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై కోర్టు కూడా వేగంగా స్పందించింది. యాసిడ్ (ద్రావకాలు) అమ్మకాలపై కేంద్ర, రాష్ట ప్రభుత్వాలను వివరణ కోరింది. యాసిడ్‌ అమ్మకాలను నియంత్రించాలని కోరుతూ దాఖలైన పిటీషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
Source: ఏపీ న్యూస్ | 19 Dec 2008 | 9:59 am

వరాహం కోమాలోంచి బయట పడింది

భక్త వరాహం కోమాలోంచి బయటపడి అటూ ఇటూ కాసేపు తిరిగింది. పాలు పెడితే తాగింది. ఆ వరాహం గోదావరి నదిలో స్నానమాచరించిన తర్వాత పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతంలో ఉన్న వేంకటేశ్వరుని ఆలయంలో 48 గంటలకు పైగా ప్రదక్షిణలు చేసిన తర్వాత కోమాలోకి వెళ్ళిన
Source: ఏపీ న్యూస్ | 19 Dec 2008 | 4:48 am

కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు

సోమవారం జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీచేసిన నారదాసు లక్ష్మణరావు 12,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈవిజయం నా ఒక్కడిది కాదు. తెలంగాణ ప్రజల విజయంగా ఆయన అభివర్ణించారు
Source: ఏపీ న్యూస్ | 19 Dec 2008 | 3:46 am

అంతులే వ్యాఖ్యలపై సోనియా సీరియస్

మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక బృందం (ఏటీఎస్) చీఫ్ హేమంత్ కర్కరే మృతిపై కేంద్ర మైనారిటీ శాఖామంత్రి అంతులే చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సీరియస్‌గా స్పందించారు. అవసరమైతే ఆయనపై చర్య తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం సోనియా అధ్యక్షతన జరిగింది.
Source: జాతీయ | 18 Dec 2008 | 1:13 pm

ముగిసిన భార్గవి-ప్రవీణ్ అంత్యక్రియలు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సినీనటి భార్గవి, ప్రవీణ్ కుమార్ అంత్యక్రియలు గురువారం వారివారి స్వస్థలాల్లో పూర్తయ్యాయి. హైదరాబాద్‌లోని తన ఇంటిలో హత్యకు గురైన సినీనటి భార్గవి మృతదేహాన్ని స్వస్థలం గుంటూరుకు తీసుకొచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 18 Dec 2008 | 1:12 pm

పాలకుల నిర్లక్ష్యమే సమస్యలకు కారణం: చిరు

దీర్ఘకాలికంగా ప్రజా సమస్యలు.. సమస్యలుగానే మిగిలి పోవడానికి పాలకులే కారణమని ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి ఆరోపించారు. ఆయా ప్రభుత్వాల హయాంలలో జరిగిన, జరుగుతున్న అవినీతిలో కొంతశాతం నిధులను ప్రజా సమస్య పరిష్కారానికి మళ్లిస్తే సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 18 Dec 2008 | 12:14 pm